Tuesday, 17 November 2015

ఏక్ తారలు : 00201 నుండి 00300 వరకు

220. ఎన్ని అనుభూతులో_నీకూ నాకూ మధ్య నడిచే భావాల పొందులో..
221. జీవన వికాసం మొదలయ్యింది_నిన్నో గ్రంధంగా చదువుతుంటే..
222. 
చెక్కిలిగిలి చిందేసినట్లు_చిరుతడితో చెమరించే తన చూపులలో
223. సొట్టబుగ్గలకు కెంపులు_చెలి వదనాన్ని మందారం చేస్తూ..
224. నీ పిలుపులేగా ఆలాపన_మనసైన నా మౌనాలకి.. 
225. జ్ఞాపకాల సుడులలో చిక్కుకున్నా_మనసు తూనీగై నిన్నసరిస్తుంటే..
226. నన్నలరించబోతున్న రేపొకటి_పగటి కలగా నిత్యం నన్నూరిస్తూ..
227. కలువనై వేచుంటాలే_నీ రాకతో నాలో వెలుగొస్తుందంటే..
228. పున్నమి నీవల్లేనని గుర్తుపట్టా_అమాసనాడు వెన్నెలవుతుంటే..
229. వెన్నెల విప్పారింది_నిశీధిలో నీ చూపుల కిరణాలకే..
230. రవళిస్తా నీకై రాగమై_తిమిరాన్ని ఆమడదూరం వెళ్ళగొడుతూ..
231. నక్షత్రాలలో చేరిపోయా_కావ్యకన్యగా చుక్కల్లో నన్ను గుర్తుపడతావనే..
232. మరులు కురిపిస్తున్న సందడి_నీ ఉషోదయపు కలవరింతలో నర్తిస్తూ..
233. స్మృతుల కానుక అందింది_నా నిన్ను స్మరించినందుకే..
234. జాబిలమ్మ నేనేగా నీ రాతిరికి_నువ్వే ఆకాశానివైతే
235. మబ్బులవీధిలోనే విహరించమన్నా_అనుబంధాన్నలా చిలకరించాలనే..
236. తొలకరినై విచ్చేసా_ముత్యమై మెరిసే అదృష్టం నాకుందనే..
237. ప్రతినిత్యమూ పున్నమి కాదా_వెన్నెలవానలా నువ్వు చిందేస్తుంటే..
238.  వాకిట నిలుచుని చూస్తున్నా_నిశీధికి వెలుగులింకా తేలేదేమని..
239.  నిద్దుర కరువైన కళ్ళు_మదిలో దొంగలా చొరబడినందుకే..
240. పుష్యరాగాలను పలికించా కన్నుల్లో_నీ చూపులు వెలిగించాలనే..
241. కంటిలిపి చదవడం నేర్చావుగా_చూపుతో కౌగిలిస్తూనే
242. ఆరాధన అర్ధమవుతోంది_మౌనంలో నీ రాధనై నే మురిసిపోతుంటే..
243. నయగారమూ ఒలికిపోతుందేమో_నీవంత తీయగా పాడుతుంటే
244. కనుగొన్నానిప్పుడే కార్తీకాన్ని_కన్నీరుగా మారిన నీ కన్నుల్లో..
245. అకాలంలో ఆమనొచ్చినప్పుడే అనుకున్నా_నువ్వే పంపుంటావని..
246. నీ చూపులు చొరవిచ్చినందుకే_నా చూపుల అల్లిక తేలికైంది..
247. కురిసిన తేనెజల్లులట_హృదయాన్ని అదృశ్యంగా తడపాలని..
248. తిరిగి ఊపిరి పోసుకున్న జీవనం_నీ శ్వాసలోని గంధాలు పూసుకొని..
249. మొలకెత్తిన భావాలెన్నో నాలో_మధుమాసమంటి చిరునవ్వులో చేరినందుకేమో..
250. నీ అంతరంగం నేనయ్యానప్పుడే_మంగళవాద్యాలు మిన్నంటి మ్రోగినప్పుడే..!
251. వశమైపోయా నేనే_ప్రకృతికి పులకించి తలవంచిన పసిపాపనై..
252. ఏకాంతంలో సాధన చేయమంది అమ్మ_ప్రకృతిని మించిన గురువులేదని..
253. దిక్కులు చూసి ఓడిన చూపనుకుంటా_తనలో తానే చూసుకుంటూ
254. ఎండమావులైన ఆనందాలు_కనికరం లేని నీలో వెతుక్కున్నందుకు..
255. అస్తిత్వం చేజారిన అంతరంగం_కలలో ఆనందాన్ని వెతుక్కుంటూ..
256. వేడుకైన వసంతాలు_శిశిరాన్ని దాటి నువ్వొచ్చినందుకే..
257. అలుకలను లెక్కెందుకు చేస్తున్నావో_వందకు మించి నిందలేయలేదుగా..
258. నటించడం రాదుగా నీకు_ఆమె అభినేత్రిగా ఆరితేరిపోయినా..
259. అంతరంగంలో నిర్వేదం_నిర్లక్ష్యంగా నన్ను దాటి నువ్వెళ్తుంటే..
260. కెంపుగా మారానందుకే_నువ్వు బంగారమైతే నేనిమిడిపోవచ్చని..

261. నన్నంటుకున్న నీ ఆలోచనలు_ఊహల్లో పువ్వులై విరబూస్తూ.
262. నీ ఊసులెప్పుడూ బంగారాలే_వెండివెన్నెల్లో నేనాలకిస్తుంటే..
263. వజ్రమంటి మనసుని వరించానందుకే_నన్ను బంగారమన్నావని..
264. వెండిపోగుల్లా నీ ఊహలు_నాలో మెరుపులీను తళుకులవుతూ..
265. కంచుకంఠమని వెలివేస్తావెందుకో_కోయిలనై నీలో కూస్తూనే ఉన్నా..
266. పలుకు ముత్యాలే నేడు బంగారమయ్యాయి_నీ పిలుపులకి కలవరిస్తుంటే.. 
267. నిద్దురలేచే కోరికలు నాలో_నీ తలపు బంగారమవుతుంటే..
268. నిద్దురపోనివ్వని రాతిరొకటి_కలలనును కవ్వించి రెచ్చగొడుతూ..
269. ప్రియమైపోయావప్పుడే_నన్ను ప్రియతమాని పిలిచినప్పుడే..
270. కలతను కౌగిలించిన కల ఒకటి_ఆనందాన్ని ఆమడదూరాలకి నెట్టేస్తూ..
271. మాటకి గాయమైందట_మౌనంతో కోసి గొంతునొక్కావు మరి..
272. నీ మౌనపు వలువ కప్పినందుకేమో_హేమంతపుచలి జారుకుంది..
273. నిద్రిస్తోందక్షరం నిశీధిలో_తట్టిలేపే కలం కొరకు ఎదురుచూడలేకనే..
274. అక్షరమై ప్రవహిస్తున్నా_నీ జ్ఞాపకాలు కెరటాలై నిద్రలేపినప్పుడల్లా..
275. జీవితానికర్ధం చెప్పిన ఆకు_శిశిరమొస్తే రాలక తప్పదని..
276. మనసును దోచుకున్న తారలు_అక్షరాల్లో వెల్లువవుతూ..
277. మనసు పరిమళించినపుడే తెలిసింది_నీ ఊహను కప్పుకున్నందుకని..
278. నేను హేమంతాన్నే_నీ వియోగంలో దిగులుగా ఘనీభవించి..
279. నీ కన్నుల్లో వసంతాలేగా_నా పిలుపు మదిని మీటినప్పుడల్లా
280. మదిలో కొలువైన నువ్వు_గుడిలో శిలైన దేవుడిలా..
281. నిద్దుర నటిస్తున్న నయనాలు_నీవు కలలోకొస్తే కవ్వించాలని..
282. జాబిల్లి ఇష్టమంటే ఏమోననుకున్నా_నువ్వలా బుగ్గ గిల్లుతావని తెలీక..
283. వెన్నెల స్నానాలు చేసినట్లుంది_నీ చూపు తొలకరికి తడిచిపోతుంటే..
284. ఎన్ని పున్నములు దాటాలో_నీ మనసు మజిలీ చేరేలోపు నేను..
285. గాజులచప్పుళ్ళ వీణానాదాలు_వెన్నెల్లో నీ తలపుకు తాళమేస్తుంటే..
286. పున్నమి పగపట్టిన భావం_నీవు లేని నా వెన్నెల విహారం..

287. వెన్నెలైనా చీకటితోనే సమానముగా_నీవు లేని నా పున్నమి రేయి..
288. శరత్వెన్నెల్లా కొన్ని అనుభూతులు_వెన్నలా మనసును హత్తుకుంటూ..
289. అక్షరాలు మాట్లాడినట్లుంది_వెన్నెల్లో నీ ప్రేమలేఖను చదువుతూంటే..
290. ఎంత రాసిన తరగని వెన్నెల_అమాసని ఇట్టే వెలుతురు చేస్తూ..
291. క్షణాలకి సెగ పెట్టావెందుకో_జ్ఞాపకాల్ని చంచలం చేసేస్తూ..
292.
 చిలుకలు నవ్వుకుంటున్నాయి_తన పలుకులు నువ్వు వల్లిస్తున్నావని..
293. నీ పులకరింత తడిమినట్లుంది_మనసు గంధమై పరిమళిస్తోంది..
294. ఇష్టాలన్నీ విడిచినట్లయ్యింది_నా నుంచీ నువ్వు దూరమయ్యాక..
295. వేకువెక్కడుంది నా మనసుకి_అమాసలు నీడల్లే వెంటాడుతుంటే..
296. నిశ్శబ్ద తారకల దొంగచూపులు_నేనెదురుచూసే వేకువ ఎవ్వరిదోనని... 
297. విరహించిన మేఘంలా నేను_వేకువ మంచునలా  కమ్మేస్తుంటే..  
298. ఆనందం వీచికైంది_నీ ఆలాపనకు తాళమెయ్యాలని..
299. నష్టాన్ని పూడ్చలేనంది మది_తనను కాదని నువ్వెళ్ళిపోయాక..
300. రోజాలను రప్పించా_నీ గులాబీ వర్ణాన్ని చూపించాలని..

ఏక్ తారలు : 00101 నుండి 00200 వరకు

101. ఆకాశం అంచున నిలబడ్డా_ఆమాసకు అలవై నన్ను తాకుతావనే..
102. వసంతరాత్రుల అలలు_ఆనందాన్ని గగనానికి ఎగురవేస్తూ..
103. చంద్రకిరణాలలో వెతుకుతున్నా_రహస్యసందేశమేదో అలలా పంపుతుందని..
104. పాటలపల్లకిలో విచ్చేసా_తరంగంతో మాయచేసి నిన్ను తీసుకుపోదామని..
105. చిన్నారి కలలన్నీ అలలైనాయి_అల్లిబిల్లిగా నిన్ను అలరించాలనే..
106. అలలై ఎగిసింది పరిమళం_నీ గంధాన్ని మోసుకొచ్చిందేమో గాలి..
107. నిండుపున్నమి గుర్తుకొస్తోంది_అలలైన నీ నవ్వులను చూసి..
108. పెదవిప్పిన పసినవ్వులు_అలలా ఎగిసి  మనసును ఓలలాడిస్తూ..
109. నిన్నటిభావాలే నాలో_నేడు అలలై ఏక్తారలో ప్రవహిస్తూ..
110. చిలిపి ఊహల కెరటాలు_నిన్ను మానసికంగా మరింత దగ్గరచేస్తూ..
111. కిన్నెరవీణను మీటుతున్నా_అలైన ఆనందాన్ని అనువదించాలనే..
112. అలలన్నింటినీ అక్షరబద్దం చేసేసా_నా భావాలలో ఉరకలెత్తాలని..
113. కలగలిసిన భావాలేగా మనవి_అలలతీరంలో ఒక్కటవుతూ..
114. సరసపు పుప్పొడులెన్నో_తరంగమైన నీ నవ్వులో రాలి పడుతూ..
115. వెన్నెల్లో కలవంకలా నేను_నీ ప్రేమ తరంగంలో ఉప్పొంగుతూ..
116. పెదవంచున విరహం నేనేగా_వేదన అలై పొంగుతుంటే
117. వసంత కాలపు సౌందర్యం_కెరటమై నిన్ను ప్రేమలో ముంచేందుకే..
118. కెరటానికి ఎదురీదితేనేమి_మధురోహల నా పయనం సఫలమయ్యిందిగా..
119. వెన్నెలకీ లోకువయ్యా_నీ ప్రేమ అలలకి లొంగిపోయానని..
120. స్వాప్నిక జగత్తుకే అంకితమయ్యా_ఆనందం కెరటమయ్యేదక్కడేనని..
121. కెరటమై ఎగిసింది కేరింత_నీ తలపులను ఆవాహన చేసినంతనే..
122. అలలైన ఆవేదన మధురమేగా_నీ విరహం ప్రేమగా నన్నలరిస్తే
123. నీరవంలో అలలసవ్వడి_నా కలలను మాట్లాడినట్లుగా..
124. బహుళరాగాల కెరటాలు_భావసంద్రానికి చేరువయ్యానని..
125. పూలజాతరే మనసంతా_నీ స్మృతులు అలలై నన్నలముకుంటే..
126. అనురాగం శృతి మించింది_నీ ప్రేమ అలలకు వెల్లువవుతూ..
127. వాయులీనమై వినబడుతోంది_అలలసంగీతం మనసుని హత్తుకుపోతూ..
128. వెచ్చనైన కన్నీరు_నీ తలపుల అలలలో వేడి తగిలిందనే..
129. తీరానికెప్పుడూ గుబులే_కెరటాన్ని కాసేపైనా బంధించలేకపోయానని..
130. ప్రేమ కెరటం ఉప్పొంగుతోంది_సంద్రమైన నీలో కలిసినందుకే..
131. మెట్టెలసవ్వడి మురిసింది_అనుబంధతరంగాలకి సాక్ష్యమయ్యానని..
132. నిన్నలా లేను నేనెందుకో_నీ భావాల తరంగాలకు మత్తిల్లినందుకు..
133. కెరటమే ఆదర్శం నాకు_లక్ష్యాన్ని ముందుకు ఉరికించేందుకు..
134. చుక్కలకెందుకో విరహం_అలలు ఆకాశాన్ని అంటబోతుంటే..
135. తరంగాలలో తేలినట్లుంది_నీ మౌనాన్ని అనుభూతిస్తుంటే..
136. పాలవెన్నెలకు పరవశిస్తున్నా_కెరటాల హోరుకు జతచేసి ఆలకిస్తూనే
137. జోలపాటను మరచిన రాతిరి_జాబిల్లీ అలల ముద్దాటను తిలకిస్తూ..
138. వెలవెలబోయిన మోము_కెరటమైన కన్నీటికి కనులు తడిచి..
139. కురిసిన మధువులెన్నో_ప్రేమ కెరటాలకు జల్లుగా మారి..
140. ముప్పొద్దులా ముచ్చట్లే_మనసును తరంగాలకు అంకితమిచ్చినట్లు
141. 
తొలిముద్దులో తెలియని తమకం_ఆనందం తరంగమై తనువును మీటిందనే..

142. మధుమాస గీతికలే అన్నీ_తరంగమైన ఆనందం వెల్లువవుతుంటే..
143. సంతోషాన్ని సాగనంపేసా_కెరటమై దుఃఖం ముంచెత్తుతుంటే..
144. ఆమని కోయిలా నేను_నీ చిరునవ్వుల అలలకు బదులిస్తూ..
145. తరంగమై వినబడ్డ నీ పిలుపు_ప్రేమగీతంలో మేళవించావని
146. అలకనందగా మారిపోయా_అలల కేరింతలతో మదిని సాగుచేస్తూ..
147. కాటుకు పిట్టల కూతలు_కెరటాలై మనసుకు భీతిగొలుపుతూ..
148. తొలిసంధ్యల కాంతులు_అలలపై మెరుపులా మదిని కవ్విస్తూ..
149. నిత్యవసంతమేగా మదికి_పాటలపల్లవిలో అలనై నన్ను పాడితే..
150. అరవిరిసిన పువ్వుల సోయగంలో నిలిచా_మధువులు అలలై పొంగుతుంటే..
151. కలహంసల అడుగుల వొయ్యారాలు_కెరటాల సౌందర్యాన్ని మరపిస్తూ..
152. లావన్య సిరులలో తరంగాలు_ప్రేమభావంలో తడిచి ముద్దయినందుకే
153.  రాతిరికి రంగులు మార్చేసా_అలలలో ఇంద్రధనస్సును చేర్చేసి..
154. వర్షమంటే తనకి ఇష్టమంట_తన వ్యసనాలతో నన్నేడిపిస్తూ..
155. మదిలోని భావాలే_అక్షరాల్లోని అలంకారాలు..
156. కన్నులకేగా పారవశ్యాలు_నువ్వు రాగముగా పలికింది నన్నైనా..
157. తనని దాచేసా రెప్పల్లోనే_కాటుకను కాచుకు కూర్చుంటాడనే..
158. నీవో గడుసరి_పలకరించినా ఉరిమి చూసే రాకాసి..
159. అనుంగు భావమయ్యానప్పుడే_నీ కలికి తీపిలో చేరిపోయాక..
160. అందం అతిశయిస్తోంది_నువ్విచ్చిన చనువనుకుంటా..
161. ఎగిసిందొక రవళి_నీ పిలుపు మౌనానికి బదులివ్వాలని..
162. కన్నుల్లోనే సెలయేళ్ళు_తగలని నీ శ్వాసను తడుముకుంటూ..
163. వెన్నెల్లోనూ మంటలే_తీరని వేదన తప్పదన్నట్లు..
164. నా అల్లరి తరిగిపోయింది_నీ మౌనానికి మద్దతిస్తూ..

165. వేరే గమనమెందుకో నీకు_నన్నే అనుసరిస్తూ వచ్చేసాక..
166. నీ మౌనఘోషైతే వినబడుతోందిలే_నా వలపును రెచ్చగొట్టి..
167. విషాదాలకు వీడ్కోలిక_పరిధిలేని ప్రేమ నీదని తెలిసాక..
168. ఒడ్డుకు చేర్చని చిరునవ్వు_నీ వియోగమొకటి నన్ను బాధిస్తుంటే..
169. నవ్వులకే మనసిచ్చావేమో_వలపు పొంగింది నా హృదిలోనైతే..
170. నవ్వుల నయగారమే నేనైపోయా_నువు చేసిన చిలిపి గారానికి పట్టుబడి..
171. అనుభూతిగా కొలువుండమన్నా_శిలవై నాలో మిగిలిపోతావనుకోలా..
172. ఎంత కన్నీరు దాచుకుందో ఉల్లి_తడమగానే నాకు కాస్త పంచిస్తూ..
173. మధువనమే మనసయ్యిందిలే_బృందావనానికి నీ ఆహ్వానమందగానే..
174. నిత్య వసంతమేగా నీకిక_నేనే కోయిలనై నీవెంటుంటే..
175. మౌనరాగమే మనసంతా_మావి చిన్నెలు నాకంటుకుంటే..
176. శూన్యానికీ విలువొచ్చింది_నీతో కలిసి ఆగినందుకే..
177. విషాదాన్ని వెళ్ళగొట్టేశా_వెన్నెలొచ్చి కౌగిలిలోకి రమ్మంటుంటే
178. నిశ్శబ్దంలో నిలబడిపోయా_ఊహలకి ఉలి కదలికలా నువ్వొస్తావని..
179. అనుభూతులన్నీ ఎడారి పాలే_ఆమె భావాలు అతనికి లేకుంటే..
180. అధరాల తీపినే గమనిస్తున్నా_తేనె తాగిన రంగును గుర్తించకున్నా..
181. సారంగి నాదమే వినబడుతోంది_సప్తపదులింకా సగమన్న వేయకుండానే
182. చీకటికీ వెలుగొచ్చింది_మల్లల మనసుతో నువ్వు స్పందిస్తుంటే..
183. ఊహలసందడి మొదలయ్యింది_నీ ఊసులలో వలపును స్వీకరించి..
184. ఒయారానికీ ఊపొచ్చింది_ఊరించే వలపులో నిన్ను చూడగానే
185. కనుసైగ చేసినప్పుడే కనుగొన్నా_నీ కలలోకి ఆహ్వానమందిందని..
186. పడగెత్తుతున్న కలలు_నిజం చేసుకోమని పదేపదే ప్రేరేపిస్తూ..
187. ఆనందాలకంతు లేదు_నా ఆశలకు అధిపతి నీవయ్యాక..
188. నేనె ప్రణయమైపోతున్నా_నీ పిలుపు వినిపించిన వెంటనే..
189. నీ కన్నులనంటిన వెలుగు నేనేగా_ప్రేమ రసామృతం నీ చూపుదైతే..
190. నువ్వక్కడా..నేనిక్కడ_మనసేమో మనలేక మధ్యలో మరణిస్తూ..
191. నా చూపు సీతాకోకవుతోంది_నీ నవ్వులను పువ్వులుగా భ్రమించుకొని..
192. తలపుల్లోనూ వలపు తకధిములే_నీ ప్రణయమే ప్రియమవుతోంటే..
193. కలలో ఊసులకెన్ని భావాలో_నిన్ను తలుచుకు నిద్దురపోతే..
194. నా అధరలదెంత అదృష్టమో_అమృతాన్ని గ్రోలే ఆనందం తనదవుతుంటే..
195. నవ్వుల పండుగ నేడే వచ్చినట్లుంది_నీ పెదవుల్లో నేను తప్పిపోతుంటే..
196. నా చెలిమి చిగురిస్తూనే ఉంది_నా కలిమిలో నువ్వు తోడై ఉన్నందుకు..
197. వేరే ఆమనెందుకనుకున్నా_నీ చెలిమిలో సరికొత్త వసంతమవుతుంటే..
198. శిశిరాన్ని కలలోనే దర్శిస్తున్నా_వసంతంలా నువ్వు నా వెంటుంటే..
199. తొలివేకువ నక్షత్రమై నేనొచ్చా_నీకో అందమైన అనుభూతినివ్వాలనే..
200. అవాస్తవంగా మిగిలిపోవాలంతే_కొన్నినిజాలతో బ్రతకలేమనుకుంటే..

ఏక్ తారలు : 00001 నుండి 00100 వరకు

1. నీ చెలిమి చేతికందింది_సెలయేరై నన్ను చేరినందుకే..
2. మాటలైన భావాలెన్న_పెదవిని దాటి ముత్యాలై ప్రవహిస్తూ
3. జీవితం జారిపోయింది_కుండతో పోల్చి మోయాలనుకొని పొరబడ్డందుకేమో..
4. రవళిస్తున్నా రాగాలను_నీ అనురాగం పల్లవిని జోడించిందనే..
5. ఆనందమై వచ్చేసా_నీ పిలుపు తరంగమై వినబడగానే
6. ఆనందాన్ని రాల్చేసా_భాష్పాల భాష్యం నిన్ను చేరుతుందనే.
7. జలపాతమై ఉరకలెత్తేసా_మదిలో నువ్వు తుళ్ళింతలాడుతుంటే
8. నేటి సంతోషం ఆవిరయ్యింది_నిన్నటి వియోగం గుర్తుకొచ్చి.
9. ఈ క్షణమే పుట్టినట్లుంది_నీ మాటలు మైమరపిస్తుంటే..
10. నవ్వులతో కవ్విస్తావెందుకో_చూపులకే నే చిత్తరువునై నిలుచుంటే.
11. కన్నులతో గాలాలెందుకో_చూపులకి చిక్కుకున్నానని తెలిసినందుకా..
12. పులకరింతకే పరిమళిస్తున్నా_నీ ఊసులను పూసుకున్నందుకు..
13. ఆనందం చీకటిపాలు_విశృంఖల నాగరికతలో..
14. పదిమందిలో సజీవమేగా_మరణించినా గుర్తున్నామంటే..
15. వశమయ్యింది మనసప్పుడే_నీ మీద ప్రేమైనప్పుడే..
16. మంచిపన్లు చేయడం నేర్పానందుకే_నువ్వెప్పుడూ సజీవమై ఉండాలనే
17. కురుస్తూనే ఉంది గతం_ఆనందాన్ని లెక్కిస్తున్నప్పటి నుండీ
18. పలుకులు గారాలు కురవాలనే_ఊసులకు ఉరకలు నేర్పాను..
19. నిన్నలు వెంటాడుతున్నవి_రేపటికని నేను ఉరకలేసినప్పుడల్లా
20. ఒయారాన్ని ఊసులకు ఒప్పజెప్పా_నీ మనసును ఊయలూపమనే
21. కాలానికి గాయమయ్యింది_మనసు కోతలకు గురవ్వుతుంటే..
22. కాలామెంత పరుగులో_వెంట పడేకొద్దీ వేగిరపడుతూ..
23. ఆసన్నమైన మృత్యువడుగుతోంది_బ్రతికి సాధించిందేమిటని..
24. కన్నుల్లో విరులను పూయించా_నీ ఆహ్వానం అందిందనే
25. నిన్ను గెలిస్తే చాలనుకున్నా_నా గెలుపు నువ్వేనని..
26. నిద్దురకీ లోకువైపోయా_రాతిరంతా నిన్ను జపించాననే..
27. కలలకెప్పుడూ కరువేగా_నిద్దురే నన్ను దరిచేరనంటుంటే..
28. ఓటమెందుకో బెదిరిపోతోంది_నా గెలుపు నువ్వని కనిపెట్టినందుకేమో..
29. ఏకాంతమెక్కడ మిగిలింది_ఇందరు కాంతలు కాంతిలా చుట్టుముట్టాక
30. నీరంలో మెరవమన్నా_చూపుల వెలుగు చప్పుడైనా వినబడాలనే
31. కనికట్టు చేసి లాగేస్తున్నావుగా_నిద్దురకు నీళ్ళివ్వమంటూ
32. విరులకందుకే పరిమళమిచ్చా_నిన్ను వెంటనే ఆకట్టుకోమనే
33. పలుకుల పదునుకి కందిపోతున్నా_సుతారంగా మీటావని గ్రహించుకున్నాక
34. పున్నాగుపువ్వునైనా కాకపోతిననుకున్నా_ఒక్కమారైనా నిన్నల్లి మెప్పించేందుకు..
35. శృతి కానందుకే మిగిలున్నా_నీలో లయమై లీనమయ్యేందుకే
36. మృదుపాణివని గ్రహించా_కొత్తరాగాలను నాలో నువ్వు కనిపెట్టినందుకే
37. దీపావళిని గమనించా_నీ మోము వెలుతురులోనే
38. నీ అడుగులెంత వేగిరమో_నా పిలుపులకే స్పందిస్తూ..
39. కార్తీక పున్నమి వెన్నెలవ్వాలనుకున్నా_నీ మనసులో..
40. నీ పదములెంత లాలిత్యమో_నన్ను ఓలలాడిస్తూ..
41. నా కన్నులకెంత కలవరమో_నీ మనసు నొచ్చుకుంటుంటే..
42. గిరగిరా తిరిగినట్లుంది ఆనందం_నువ్వలా వెన్నెల్లో ముంచుతుంటే..
43. చూపు తత్తరపడుతోంది_కన్నుల్లో నువ్వు కలదిరిగినందుకేమో
44. మలయమారుతంలో కలిసానందుకే_నిన్నోమారు గాలిలో విహరింపజేయాలని..
45. నీ మనసెంత నవనీతమో_నా పలకరింపులో
46. ముభావమూ ముగ్ధమైపోదా_నువ్వలా మోజులు కురిపిస్తుంటే
47. జాజులను పరచి ఉంచా_నీ పాదాలకు తివాచీ కావాలనే
48. కాలపు గిచ్చుళ్ళు_కార్తీకపు చల్లదనానికి నీ వియోగం తోడై..
49. వెన్నెలకెంత వేడో_నీ సరాగాన్ని జత చేసి నే పాడుతుంటే..
50. ఒయారం వలసొచ్చినట్లుంది_కిన్నెరసాని ఒంపులన్నీ నీలో కనబడుతుంటే..
51. శూన్యమూ శబ్దిస్తోంది_నువ్వు ఆస్వాదించే గీతం తానైనందుకే
52. కొన్ని ప్రణయాలు విషాదమవుతాయి_విరహంగా మిగిలి వేదనవుతూ..
53. పరిమళిస్తున్న భావకవనం_మదిని మీటేకొద్దీ ఆనందం గుభాళిస్తూ
54. విధిని వెక్కిరించలేకున్నా_రాతల్లోనైన మనసుని సజీవం చేస్తోందని..
55. అనురాగం అంబరమయ్యింది_ఆనందం కెరటమై హృదిని ముంచేస్తుంటే..
56. సైకతంలో గవ్వనై పడి ఉన్నా_కెరటాలు సైతం పట్టించుకోలేదని..
57. ఊసుల సందడి మొదలైంది_అలవై నీవు వలలేస్తుంటే..
58. అద్భుతం నేలకు జారింది_కెరటమై నువ్వు చేయి చాచి పిలిచావనే..
59. నింగిని వీడిన జాబిల్లి_నీ పిలుపు తరంగాలకు..
60. బంధం మురిసిపోయింది_అందాన్ని అలవై అలవోకగా చుట్టావని..
61. తారలకెన్ని తొందరలో_జాబిల్లిని అలల నీడలో చూసేందుకు..
62. తీరముతో సంబంధమే అలలకు_ఎదురెళ్ళి దోబూచులాడుతూ...
63. సినీతారను కాదుగా_నీ కలలో అలనై వచ్చేందుకు..
64. చూపులతో నిర్దేశనం చేసాను_తరంగమై నువ్వు తారాడుతున్నావని..
65. కలలో జారిన జ్ఞాపకాలు_అలలై నిన్ను చేరే వీలుందక్కడేనని..
66. కలవరపెడుతున్న నీ భావాలు_కెరటాలై నన్ను నిలువెల్లా ముంచేస్తూ..
67. రేయి గడిచింది నీ ధ్యానములో_కన్నీరు అలలై పొంగుతు ఉంటే..
68. పగటికలలను పొలిమేరకంపాను_రాతిరి కలలో కెరటమై నువ్వొస్తావనే..
69. కన్నులు తెరిచిన మనసు_కెరటమై నిన్ను చేరాలనే..
70. పగలు వగలై కురిసాయి_రాతిరి దాచుకున్న అలల చెమరింపుతో..  
71. నిద్దుర మరచిన కన్నులు_నీ జ్ఞాపకాల అలలకు కొట్టుకుపోతూ..
72. ఆరుకాలాలూ ఏకమైన భావన_సంతోషం అలలై ఎదను మీటుతుంటే..
73. అరవిరిసిన నవ్వుల తరంగాలు_మధుమాసమైన నిన్నూహిస్తుంటే..
74. చెమరింపు స్పృశించా నా నయనాలతో_నీ మది కెరటాన్ని చేరలేననే..
75. నీలిమబ్బు సోయగం_అలను తనవైపు ఆకర్షించుకుంటూ..
76. తరంగాలైన సప్తస్వరాలు_నవరాగాలతో మదిని అలరిస్తూ..
77. మౌనాన్నెప్పుడో సాగనంపేసా_నీ ఊసుల కెరటంలో తేలిపోతూ..
78. మేఘాన్ని తాకాలనుకుందొక అల_సముద్రంతో కలిసినట్లు కనిపించిందనే..
79. తాపంలో తీర్చేసా తగువు_వలపు అలలో నువ్వు ఊగుతూ ఉంటే..
80. ఆనందం పరుగు తీస్తోంది_నీలిమబ్బుల అలలకు ముచ్చట పడినందుకే..
81. అలలన్నీ అలుకలైపోయే_దరహాసాల నా దోబూచులాటలకి..
82. జలతారు మెరుపులేవో నా కన్నుల్లో_మధురభావాలు అలలై పెనవేసుకుంటే..
83. దిక్కులు చూస్తున్నావెందుకో_కెరటమై ముందుకు సాగమనంటుంటే..
84. జాబిలి కోసం ఎదురు చూస్తున్నా_తారనై తరంగమాడాలనే..
85. నువ్వు గుర్తొస్తే చాలుగా_వెల్లువవును భావతరంగాలు నాలో..
86. మదిలో గోదరి అలై పొంగింది_భావావేశానికి సమయమయ్యిందనుకుంటా..
87. తరంగమైంది దుఃఖం_ఎంతసేపూ లోపాలనే గుర్తిస్తుంటే లోకం..
88. కడలి హృదయపు అలలోనుండి పిలుపు_మేఘాన్ని వేంచేయమంటూ..
89. తరంగమవుతూ నీ తలపులు_మనసును మధురం చేసేస్తూ..
90. కెరటమై ఒక్కమారొచ్చినా చాలనుకున్నా_ఆనందానికి సాగిల పడదామని..
91. కలవరించింది నన్నేననుకున్నా_చిలిపి అలనై కలలోకి రమ్మన్నావని..
92. నవపల్లవాలకు మౌనమెందుకో_తరంగమై చిరుగాలి ఊసులాడుతుంటే..
93. కెరటానికెప్పుడూ కంగారే_నా ఆనందమంతా తనలో ఇముడ్చుకోవాలని..
94. చెలిని అనుకరించింది అల_అలుకల్లో తనని మించి చూపుతానంటూ..
95. నీలో విరహాగ్ని కెరటమయ్యిందేమో_తన పరిమళాన్ని నాకు పూసేస్తూ..
96. చెలియలకట్ట దాటిన అలలు_భావతీరాన్ని ముంచెత్తాలని..
97. నా చూపు నిన్ను వరించింది_తరంగమై నువ్వు అల్లుకున్నావనే..
98. జలతరంగాల లయలు_నాకిష్టమైన పాటలను పాడుతుంటే తాను ఆస్వాదిస్తూ..
99. ఉత్తుంగమైంది మానసం_అలలు ఉవ్వెత్తున పలకరించి పిలిచినందుకే...
100. అలసిపోయిన తరంగమనుకుంటా_మంద్రంగా వీస్తూనే మత్తెక్కిస్తూ..