3401. ఒంటరి విలాపానికి రాగమొకటి_శృతితప్పిన పాటకీ పల్లవున్నట్లు..
3402. ఆ జీవితమంతే_మనసును తర్జుమా చేసుకోడంలోనే ముగిసిపోతూ..
3403. కన్నీరై తొణికింది ప్రేమ_నీలో నేనున్నానని గుర్తించగానే..
3404. మరుజన్మకైనా సిద్ధమే_నన్నే కోరుకుని మరీ పుడతావంటే..
3405. కన్నీటికి కాలం తీరకుంది_కలం కక్కుతూ కదులుతున్నా..
3406. నీ పదనిసలు వింటూనే ఉన్నా_గుసగుసగా నువ్వు పాడుతున్నా..
3407. చూపు గుచ్చుకుంటే గమనించా_వెంటెంటొస్తుంది నీడవై నువ్వేనని..
3408. క్షణానికో మాయే మనసంటే_మౌనంగా ఉంటూనే ప్రకంపిస్తూ..
3409. అడుగులో అడుగేసినప్పుడే అనుకున్నా_నాపై మనసుపడుంటావని..
3410. నీ జ్ఞాపకాలు_నా ఆశను బ్రతికిస్తున్న ఊపిరులు..
3411. నీలో సగమైనప్పుడే తెలుసుగా_నీ హృదయసంద్రానికి అలనయ్యింది నేనని..
3412. తప్పటడుగులు సరైనాయి_లక్ష్యం దిశగా నువ్వు నడిపించగానే..
3413. హేమంతం కురిసిన సవ్వళ్ళవి_నేలజారి ముత్యాలుగా మారుతూ..
3414. అడుగులు తడబడ్డాయి_ఏడడుగుల మాటలు నువ్వెత్తగానే..
3415. నీ అందచందాల ఆకర్షణలు_నా కలానికందని ఉపమానాలు..
3416. రాతిరి కోసమే ఎదురుచూపులు_పగటి నిద్రలో కలలు కరువైనాయని..
3417. మనోసంద్రాన్ని అడిగి చూడు_ప్రవహిస్తుంది ఉప్పగానో కాదోనని..
3418. ఎదురుచూపులెప్పుడూ వసంతంలోకే_శిశిరమై రాలినా తిరిగి జన్మించేందుకు..
3419. శ్వాసల కదలికల్లో నీవు_నాలో చైతన్యాన్ని నింపేస్తూ..
3420. చెలిమి చిరునవ్వింది_నీ జీవన స్వరాలన్నిటా చేరికయ్యిందని..
3421. నా హృదయాన్ని శృతిచేసా_నీలో రాగోదయాన్ని తిలకించాలని..
3422. అంతమైతే బాగుండు అవినీతి_జీవితంపై కంపరం పుట్టేలోగా..
3423. పాటలన్నింటా నిన్నే దాచా_మనసంతా గుర్తిస్తావని..
3424. నవలనైనప్పుడే అనుకున్నా_నన్ను తప్పక చదివి తీరతావని..
3425. బరువెన్నటికీ తెలీదు_తల్లిదండ్రుల కలలను మోస్తున్న ఆ భుజాలకు
3426. కాంతి నశించలేదా కన్నుల్లో_కన్నపేగు చేతుల్లో ఊరేగుంటున్నందుకు
3427. పుత్రోత్సాహం వెల్లువయ్యిందా దంపతులకు_మరోజన్మకూ చాలినట్లు..
3428. పెదవిప్పకనే గుట్టు విప్పుతావు_మోహం ముదిరితే నేనేమవుతానో..
3429. నీ విరహంతోనే నిట్టూర్పు_తలపులు తల్లడిల్లిన ప్రతిసారీ..
3430. నీ నవ్వులకెన్నడో లొంగిపోయా_ఆనందాన్ని కన్నీటితో పోల్చమాకలా..
3431. నక్షత్రాలెన్ని రాలిపడ్డాయో_నా నవ్వుకు నీరాజనాలు పట్టాలని..
3432. సంతోషం వర్షిస్తూనే ఉందింకా_అలుపెరుగని నీ కలవరింతలా..
3433. నిరీక్షించనంటూ నా భావాలు_అక్షరమై నిన్ను చేరాలనుందంటూ..
3433. రంగులీనడం గుర్తించనేలేదు_జ్ఞాపకాల్లోనే జీవితమయ్యాక..
3434. ఒంటరి ఆనందాలై నా భావాలు_చూపుల్లో తారలుగా వెలిగిపోతూ..
3435. మనసంతా కన్నులతో నింపుకున్నా_నీ కవనాన్ని చూసి ఆస్వాదించాలనే..
3436. గుండెకందుకే గాయమయ్యింది_నీ వాస్తవంలోకి రమ్మనే పిలుపందలేదని
3437. ఎన్ననుభూతులని అక్షరాలయ్యాయో_మనిషితనాన్ని ఆవిష్కరించేందుకు..
3438. ఎన్ని భావాలు సజీవమయ్యాయో_ కలాన్ని కవనంగా కదిలించగానే..
3439. నీ ఊహలో ఒదిగినప్పుడే అనుకున్నా_కవనంగా రాయబోయేది నన్నేనని..
3440. కల్పనలవుతూ మన కలయికలు_వాస్తవం కాలేని జీవితంలో..
3441. నా హృదయం పాటందుకుంది_నీ జ్ఞాపకాలను హత్తుకుంటుంటే..
3442. అనుభూతులు కురిసే వేళయ్యింది_మనసెలా దాచుకోవాలో మేను..
3443. నేనిష్టపడిన సంపదలు_నీ చిరునవ్వులు..కొన్ని పలకరింపులు..
3444. నీ తలపులు వెల్లువలే_నా మది ప్రవహిస్తున్నవేళ..
3445. ఆముద్రితమే నేనెప్పుడూ_నువ్వొచ్చి సంతకం చేయనిదే
3446. కొన్ని కలలెప్పటికీ పూర్తి కావాలనిపించవు_పగలొచ్చి తొందరపెడుతున్నా..
3447. కలే బాగుంది_వాస్తవంలో నువ్వు పరాయివని తెలిసాక..
3448. ప్రేమంటే నువ్వేననుకుంటా_ఎక్కడో వెతుక్కున్నా జాడ తెలియక..
3449. హృదయమెందుకు రోదిస్తుందో_నాకోసం నువ్వున్నావని మనసంటున్నా..
3450. వలపో సుస్వరమైంది_నీ మది పలికిన యుగళగీతిలో..
3451. మరణం దూరమయ్యింది_తలపున నువ్వున్నందుకు నా చేరువకాలేక..
3452. అలగా అనుకున్నా ఇన్నాళ్ళూ_కలగా కరిగిపోతావని ఊహించలేనప్పుడు..
3453. చీకటినై పిలుస్తున్నా_ఆరుద్రవై ఎర్రగా నా చెంత వెలుగుతావని..
3454. క్షణాల పూలు రాలుతున్నాయి_నిన్ను కలవబోయే వసంతం దగ్గరవుతుంటే..
3455. ఎర్రబడింది నవ్వుతున్న ఆమని_ఏమని నీ చిలిపిదనం తడుముకుందో..
3456. వెల్లువగా నేనొచ్చా నిన్నంటాలని_ఉక్కిరిబిక్కిరికే మునిగిపోతావని తెలీక..
3457. వినబడిందో మాట_నీ మది పరిమళం నన్నంటేలా..
3458. నిరుపమానమే నీ వ్యక్తిత్వం_నన్నో ప్రహేళికగా నిలబెడుతూ..
3459. కాలమెంత నిశ్చలమో_కన్నీరెంత పారినా తాను పదిలమేనని..
3460. ఆగడం తెలీదు కాలానికి_అనుసరించే వేగం మనకుండదని..
3461. ఊయలూగిన మనసేగా నీది_చెలిగా నన్ను ముద్రించుకున్నాక..
3462. గుండెకెప్పుడూ నిబ్బరమే_ఎన్నిసార్లు కుంగినా మరల ఓర్చుకుంటూ..
3463. నా ప్రతిబింబమే వింతగా_వర్తమానంలో నిన్నుగా చూపిస్తూ..
3464. వింజామరలే నా రెప్పలు_నీ చూపుకు సాంత్వనయ్యేవేళ..
3465. మనసుతో వినిపించానా మాట_కవితగా నిన్నల్లుకోవచ్చని భావించి..
3466. వెన్ను కరిగింది వెన్నలా_చుట్టబెట్టింది నీ చేతులనగానే..
3467. చూపుల దారాలే అల్లికలు_మనసులు ముడిపడ్డ ముహూర్తంలో..
3468. నాకు నేనుగా మిగిలిపోయా_నువ్విడిచిన శిశిరాల సాక్షిగా
3469. అక్కడో హృదయం మరుగుతోంది_ఎన్నివెతల కలగలపును వడగొట్టేందుకో..
3470. వలపు నివేదనందింది_నీ హృదయాన్ని ప్రియమారా అర్పించగానే..
3471. గోరింట చిన్నబుచ్చుకుంది_కల్తీప్రేమతో తనను పోల్చి వెక్కిరిస్తుంటే..
3472. ఆవేదన మరకై మిగిలింది_చెంపల నునుపుకు దిష్టితీసినట్లు..
3473. పెదవంచు నవ్వులు దాచేసా_నీ మౌనానికి స్పందించమన్నావనే..
3474. కవిత్వాన్ని ప్రేమిస్తున్నా_నీ వచనంతో ఊపిరి తొణుకుతుంటే..
3475. ఎదురుగా ఆకర్షిస్తూ నువ్వు_మధుమాసానికై ఎదురుచూస్తుంటే నేను..
3476. రాలుగాయివే రాతిరికి_వలపు శోధనలో శ్వాసను కదిలిస్తూ..
3477. సరిగమలు శృతి తప్పాయి_నాలో తమకానికి గమకాలు కూర్చలేక..
3478. వాస్తవమై నిలబడిపోయా_నీ కలలకు రూపం నేనయ్యి..
3479. నడకాపేసిన క్షణాలు_నీ వియోగంలో మనసు బరువెక్కిందంటూ..
3480. రేయంతా వలపుజాతర_నిదురపట్టని నీ తలపు సంబరంలో..
3481. అనుక్షణం తరుగుతోంది తెంపరితనం_నన్నల్లుకున్న నీ తలపులతో..
3482. అలుపెరుగని ఆనందాలే_మనసైన ఆలింగనంలో..
3483. నీరవమూ సంగీతమే_తన పలుకులను నే నేమరేసేవేళ..
3484. మూతబడనంటూ రెప్పలు_ఈ జన్మలో తప్పక కలుస్తామనుకుంటూ..
3485. చేయందుకొనే చెలిమి కావాలి_చెరలు విడిపించాలనుకొనే ఆర్తిలో..
3486. రాయంచగానే మిగిలిపోతా_రాగాలతో రమ్మన్నావనే..
3487. ఊహలకు రెక్కలు వెతుకుతున్నా_నిన్ను చేరాలనే సంకల్పంతోనే..
3488. భారంగా కదులుతున్న నిశ్వాసలు_మదిలోంచీ నువ్వు జారిపోతావనే..
3489. నీ కలనేగా_రేయనకా పగలనకా నీలో విహరిస్తున్నానంటే..
3490. సంతకం చేసింది మది_నీ మధురానుభూతుల కావ్యానికి..
3491. కలకలమంటూ నేనున్నా_కధలా నిన్నల్లుకోమనగానే..
3492. కదలనంటూ కాలం_ఒంటరితనపు అలసటలో నేనున్నందుకే..
3493. ఒక మది ఘనీభవించింది_కొన్ని నగ్నత్వాల్ని నిర్వచించలేకనే..
3494. కాలమెందుకు భంగపడ్డదో_ఒంటరితనానికి చిక్కింది నేనైతే..
3495. వీరమరణం పొందిన ఆత్మలెన్నో_మన దేశాన్ని ముందుకిలా నడిపిస్తూ..
3496. ఎటుచూసినా రాజకీయమే_ప్రజాస్వామ్యానికి దుర్గంధం పులిమేస్తూ
3497. దేశమెటు పోతుందో_శ్రామిక జీవులంతా ఒకొక్కరుగా మట్టిలోకొరుగుతుంటే..
3498. నా కమ్మలు ఘొల్లుమన్నాయి_తన పెదవుల గిలిగింతలకి..
3499. ఆలాపనప్పుడే మొదలెట్టా_నీ కవితలో నేనో పదమవగానే..
3500. నిన్ను కనిపెట్టా_నన్ను నేను వెతుక్కునే ప్రయత్నంలో..

No comments:
Post a Comment