3701. వేకువై నేనొచ్చేసా_తలెత్తి నువ్వు నింగినే ఆరాధిస్తున్నావని..
3702. సమరంలో ఇద్దరం చెరిసగమనుకున్నా_ముక్కలేరక ముందరి ఇతిహాసంలో..
3703. నా పెదవులకి తీపంటింది_ముద్దుల చెక్కిళ్ళలోని నునుసిగ్గులకే..
3704. గిచ్చి గిచ్చి చంపుతావెందుకు_నీలో నేను చలించలేదంటూ..
3705. మార్గం సుగమమైంది_నీ జ్ఞాపకాల తోడు నడుస్తున్నందుకే..
3706. ఒంటరితనమిప్పుడు మక్కువయ్యింది_దిగులు దాటి జ్ఞాపకాన్ని హత్తుకోగానే..
3707. జ్ఞాపకాల ఝూంకారాలు_జాజుల చుట్టూ మూగిన తన్మయంలా..
3708. నీ చేయందుకున్నా_జ్వలిస్తున్న హృదయాన్ని చల్లర్చుకొనేందుకే
3709. శోకానికి ప్రతినిధేగా ఆమె_రేయంతా రోదనతో రగులుతున్నాక..
3710. ఆమె మనసు ఖరీదు_అతడన్న ఆ మూడుముక్కలు..
3711. ఊపకలా నీ ఊహలతో_సొగసిక్కడ కందిపోతుంది..
3712. మౌనం అలా బద్దలయ్యింది_కొన్ని మాటలొచ్చి అనునయించాక..
3713. నీ మనసప్పుడే చదివేసా_ఏ గ్రంధాలయానికో చేర్చెస్తావని..
3714. రోహిణిపైనే చందురుని చూపు_కృత్రికనై పక్కనున్నా నేనందుకే..
3715. కలుపుతో పనేముంది నాకిక_కలగలుసేలా నవ్వుతూ నువ్వుండగా..
3716. కళ్ళు మూసుకొని ఎదురుచూస్తున్నా_కలగా వస్తానని మాటిచ్చావని..
3717. అనుభూతులన్నీ అక్షరాలేగా_రాసేదాకా మనసాగనంటుంటే..
3718. పల్లవి దగ్గరే ఆగిపోతున్నా_చరణాలు కదిపేందుకు నీ తోడివ్వలేదనే..
3719. అక్షరాల పరుగులు_ఏ పదాన్ని రమ్మని పిలుస్తావోనని..
3720. నేనో తుంటరి జాబిల్లినే_నీ రాత్రిని వెలిగించాలనుకుంటే..
3721. ప్రపంచం కంపించిందక్కడ_ఆ నవ్వులో ఆనందాన్ని వెతుక్కుంటే..
3722. సజీవినని గుర్తించా_నీ స్వరం సంజీవినై మనసంటగానే..
3723. నిస్తేజంలో నేను_ఏడిస్తే జ్ఞాపకముగా విడిపోతావని భయపడుతూ..
3724. అభిమానాన్ని కురిపించా_నీలో మహాగ్ని వెన్నగా కరిగిపోవాలనే..
3725. నీ చూపుకో గమ్మత్తున్నట్లుంది_ప్రేమికను జాబిలిగా చూపిస్తుందంటే....
3726. ఆనందం అందని ద్రాక్షయ్యింది_మనోవనం పూర్తిగా వాడిపోయాక..
3727. ఓడిపోయానెప్పుడో_నీ చూపుల కోలాటంలో కన్నులు వాల్చేసి..
3728. మధుమాసమని మురిసిపోయా_అర్ధరాత్రి గుబులు సెగలు తనువంటేవరకూ..
3729. విహంగమై ఎగిరింది మనసు_ఆకాశానికి రమ్మని ప్రేమ సైగచేయగానే..
3730. క్షణానికో అనుభూతి_మన ఆనందాలను స్మృతిలోని తెచ్చుకుంటుంటే
3731. మనసు దుమారాన్ని కనిపెట్టేసా_నీ పచ్చని చెక్కిళ్ళ రంగుని చూసే..
3732. హరివిల్లుకి అలకొచ్చిందట_తనని మించిన రంగులు నీ తనువులో తిలకించి..
3733. కాలం గరళమై కాటేసింది_జీవితాన్ని ఆస్వాదించే లోపుగానే..
3734. చెమ్మగిల్లిన చూపు_నా చెక్కిలి తడిమిన నీ ఆర్ద్రతకి..
3735. పున్నమివెన్నెల పుచ్చపువ్వయ్యింది_మన ప్రేమను చూపులకు రాసుకుందేమో
3736. ఎన్ని పీడకలలు వదిలించుకుందో_వేకువకి తెరిచిన ఆ వాలుకన్ను..
3737. పువ్వులకెన్ని కాంతులో_నా నవ్వులను కలబోసుకు రాలగానే..
3738. చెక్కిళ్ళ నునుపు దగ్గరే నిలిచిపోతావెందుకో_అద్దంలో చూసుకోవాలనుందంటూ
3739. తలపుల తపనలు నీకెందుకులే_ఒడ్డున గవ్వలతో పొద్దుపుచ్చేవాడివి..
3740. కొన్నిజన్మల పొరపాటేనిది_నిన్ను నాకు దూరం చేసిందిలా..
3741. నా మనసెందుకు సొమ్మసిల్లిందో_నీక్కాస్త ప్రేమను పంచాలనొచ్చి..
3742. ఎన్ని క్షణాల తడబాటో నాది_నువ్వు పలకరించేందుకు వచ్చినప్పుడల్లా..
3743. నా చూపులకెన్ని వెలుగులో_నీ రూపు కంటపడినప్పుడల్లా
3744. క్షణాలుగా కరిగించేసా యుగాలన్నీ_నీ చెలిమినొక్కసారి కలగనగానే..
3745. నా పెదవికెందుకిన్ని ఆలాపనలో_నీలో తన్మయత్వాన్ని తడిమినప్పుడల్లా..
3746. మనసుకో సాంత్వన చేకూరింది_మంత్రాలవ్వగానే నీ మాటలిలా..
3747. ప్రతిపదమూ నీతోనే మొదలు_అక్షరానికో అల్లరి గుర్తొస్తుంటే..
3748. ముందే కూసిన కోయిలనుకుంట_నీలో పల్లవిస్తున్న చెలి..
3749. ఏకతాళమేస్తూ నీ ముచ్చట్లు_నాచే చిలిపి రాతలు రాయిస్తూ..
3750. గెలుపు మంత్రం నేర్చేసుకున్నా_ఓటమిని వేరుచేసి పంపేందుకే..
3751. మనసు దాచేసా_తపన రేగి విరహం రాగంలోకి దిగుతుందనే..
3752. నేనో మోహినినే_నువ్వేసే మంత్రాలకు ఇట్టే వశమవుతూ..
3753. మాటిచ్చింది నిజమే_నీ మనసు నా చెంత మల్లెలంత పదిలమే..
3754. నెమరింతలతోనే చలి కాసుకుంటున్నా_నీ ఊపిరులు దూరమైనప్పటినుండీ..
3755. కాటుక నవనీతమే_కలదిరిగే స్వప్నాలకు కన్నులు అలసిపోతుంటే..
3756. ప్రతిపదమూ నీతోనే మొదలు_ప్రణయాన్ని పల్లవిగా కూర్చుకునేప్పుడల్లా..
3757. కొంటెగా కవ్విస్తోంది తొలికిరణం_నీ ఊహలకన్నా ముందే తడిమాననుకుంటూ..
3758. జరిగిన కధ_మనసులో నేనున్నది నిజమే కదా..
3759. రేపటి ఉషస్సు నీవేగా_ఈ రేయొకటి కదిలిపోగానే..
3760. ఉచ్ఛ్వాసనిశ్వాసల్లో ప్రేమ_తనే ప్రాణమని నా మనసంటుంటే..
3761. నేనుంటే చాలుగా_వేరే కీర్తులు..ప్రతిష్ఠలు నీకెందుకు..
3762. ఆనందం నిజమే_కన్నులు మసకబారి అశ్రువులు జారితే..
3763. నన్ను ప్రేమించమని అడిగావెందుకో_మదిలో ఆవేదనలా మరిగిస్తూనే..
3764. ప్రాణం పోయినా ఫరవాలేదనిపిస్తుంది_నీ హృదయస్పందన ఆలకించాక..
3765. ఊసులెవరితో పంచుకున్నావో_నేనే లోకమంటూ అబద్ధాలతో నమ్మిస్తూ..
3766. కలనే హత్తుకు నిద్దరోతున్నా_రేయంతా నీతో నేనుండాలనే..
3767. అదే నేను_అక్షరాలతో ముస్తాబవుతున్నానంతే..
3768. ఊతమిచ్చినందుకు సంబరపడ్డా_నా హృదయాన్ని చక్కగా లాలించావని..
3769. పులకరింతలు నీవల్లనే అనుకున్నా_తొలిసారి తనువుకిన్ని చెమరింతలు..
3770. వాడెప్పటికీ చావడు_దినదిన గండాన్ని నాకు ప్రసాదిస్తూ..
3771. నువ్వో వసంతాగమనం._నాలో సరికొత్త ఊహలను మొలకెత్తిస్తూ..
3772. పున్నమిలా నీ పరిచయం_అమాసంటిన నా జీవితంలో..
3773. నీ మనసంతా నేనే కావాలనుకున్నా_గుప్పెడుందన్నావనే ఆలోచిస్తున్నా..
3774. నా మనసిప్పుడు తేలికయ్యింది_నీ గుండె గల్లంతయ్యిందనగానే..
3775. గమ్యానికెలా చేరగలనో_ప్రతిసారీ దారితప్పుతుంటే..
3776. నిత్యసందడే_నన్ను కొలిచే నీ పూజలతో
3777. కలతలతో కన్నీరిక్కడ_ఊపిరాడని సమస్యల వలయానికి చిక్కాక..
3778. నిరీక్షించడం మానేసా నీకై_కొన్ని నిజాలు రుచించకనే..
3779. వేరే సంతోషమేముంది_ఆ నలుగురిలో నన్నూ చేర్చుకున్నాక..
3780. కలలకెప్పుడూ తొందరే_నిరీక్షణా భారాన్ని కన్నీటిగా రాల్చేందుకు..
3781. కాటుకలు ఎర్రబడ్డాయ్_కన్నీటిలో కరిగినందుకేమో..
3782. తలపుగానే నువ్వు_తపనకు తొందరెందుకంటూ..
3783. కంటిపాపలనెప్పుడు గమనించావో_నాలో నీలాలలా జారిపోతుంటేను..
3784. చెలిమి చేసింది నాతోననుకున్నా_నీ చూపునాకట్టింది కనుపాపలనుకోలా..
3785. నా ఊపిరిలో చేరినప్పుడే అనుకున్నా_జీవితంలో సగం నీకెచ్చేయాలని..
3786. రెప్పేయడం మానుకున్నా_మాటికి కనుపాపలు బెదురుతున్నాయనే..
3787. వసంతానికీ వేదన తప్పదుగా_శిశిరాన్నే తలచుకు రోదిస్తుంటే..
3788. మనసుని దాచాలనుకున్నా అందుకే_కన్నులైతే చదివేస్తావనే..
3789. నీ మనసు పూలతేరేగా_నా వలపు తడిమినప్పుడు..
3790. ఇంద్రజాలమిప్పుడు కనిపెట్టేసా_నీ మనసు మంత్రమై మోగిందని..
3791. పసిడి చూపుకి లొంగుతావనుకోలా_వెండివెన్నెల వన్నెల రువ్వుతున్నా..
3792. చూపులు కలసిన శుభవేళిదేగా_మనసు సిగ్గుతో పండుతుందంటే..
3793. నీ ఆనందాన్ని మోయాలనుకున్నా_ప్రేమ పల్లకినై ఎదురొచ్చానందుకే..
3794. ఎంత రహస్యంగా విప్పిచెప్పాలో_నాలో నిండింది నువ్వేనని..
3795. మనోహ్లాదం_నీ పండుగ నేనని కనుగొనగానే..
3796. అడుగడుక్కీ నీవే_ప్రతి మలుపులో నాకై ఎదురుచూస్తూ..
3797. హృదయమాలపించు గీతమే ప్రేమ_నా కలములో కవితయ్యిందంతే..
3798. కాలం కదలమంటుంది తనతో_అనివార్యమైన మార్పును ఆహ్వానించమంటూ..
3799. ఈ క్షణాన్ని మోహిస్తున్నా_నిన్నందించి ఆప్తమయ్యిందని..
3800. ప్రేమలో అలుపెందుకో_పగలే వెన్నెల కాసినన్ని అనుభూతులవుతుంటే..

3773. నీ మనసంతా నేనే కావాలనుకున్నా_గుప్పెడుందన్నావనే

No comments:
Post a Comment