Wednesday, 13 September 2017

3601 to 3700

3601. ఏడడుగులు ఇప్పటివి కాదనుకున్నా_గతజన్మ బంధముందని తెలిసి..
3602. మౌనలిపికి అర్ధం తెలిసింది_నీ చూపులను అనువదించుకోగానే..
3603. ప్రేమసిరాతో రాసిన లేఖలవి_అనురాగాన్ని పరిమళిస్తూ ప్రవహించాయంటే..
3604. కన్నులపండుగయ్యింది వేకువ_నిశీధి యాతనలో రేయంతా గడిపినందుకు..
3605. అలా కల్పించానో కధ_నువ్విచ్చిన కలలోని మాధుర్యంతోనే..
3606. పునీతనై ఎదురుచూస్తున్నా_నీ విరహాగ్నిలో మెరుగైన పరసువేదినై..
3607. సహనం లేదంటూ వెక్కిరింపులు_పలకరింపుకందనంత దూరంలో నువ్వుంటూ..
3608. మనసుకదో సాంత్వన_అనుబంధంలో బంధీ అయినా చాలనుకుంటూ..
3609. ఊపిరాగింది ఒక్కసారిగా_నీ వలపు దూరమైన అనుభూతిలా..
3610. అక్షరానికి తప్పలేదు_అమ్మలా అన్నీ తనలో దాచుకోవడం..
3611. సిగనంటిందో పరిమళం గమ్మత్తుగా_మధుమాసంలో మల్లెపూలు మెండుగా..
3612. అలుకలను శాశ్వతం చేసేసా_అనునయంతో బంధం బలపడుతుందని..
3613. అనుభవానికాశ పడుతున్నా_అనుభూతులు నా సొంతమవుతాయని..
3614. పరిమళం గుప్పుమంది వేసవికి_మల్లెల కాలాన్ని గుర్తుచేద్దామని..
3615. కాలమెంతకని లేపనాలు పూస్తుంది_రోజుకో గాయాన్ని రేపుకొస్తుంటే..
3616. మధుమేహంపై మక్కువయ్యింది_నీపై వలపు మకరందమనిపిస్తుంటే..
3617. ఎంత మునకలేసినా తీరకుంది_తపన ముందు తడవడమెంత చిన్నమాట
3618. హృదయంలోకి తొంగిచూడవెందుకో ఒక్కసారైనా_నాలోనే నిన్ను దాచేసానంటున్నా..
3619. లోకంతో పనేముందిలే మనకు_నేలరాలినా చిగురించడం మొదలెట్టాక..
3620. మనసంతా పున్నాగ పరిమళమే_నీ తలపులతో నేనుంటే..
3621. అలుకలెన్ని దాచుకొనుంచావో_కావ్యం రాసేందుకు నాకర్పిద్దామని..
3622. మానసవీణ తమకాలు నేర్చింది_గమకాలు మరవొద్దన్ని నేనంటుంటే..
3623. మనసో మెలకువే_నిరంతరం నీ తలపులున్నా నిదురపోనంటూ..
3624. ఏ రాగమో గుర్తించలేకపోయా_నవరాగాన్ని మించిన అనురాగమందిస్తుంటే..
3625. వేసవి వెనుదిరిగింది_నీ వలపొచ్చి జల్లుగా కురిసిందని..
3626. కవి కలానికెన్ని నిప్పులో_అక్రమాన్ని ఎండగట్టే సమయంలో..
3627.కాటుకతో నలుపయ్యింది కన్ను_నీ విరహంతో నేనేడ్చినందుకే..
3628. చిలిపినవ్వుతో నన్నాకట్టావెందుకో_నా చూపుల గిచ్చుళ్ళు నచ్చలేదంటూనే..
3629. ఇష్టసఖినై చేరుకున్నా_పదేపదే కృతిగా నన్ను పాడావనే..
3630. గేయమయ్యిందో జ్ఞాపకం_గాయాన్నలా నిమురుకోగానే..
3631. నే రాధనవలేనా_వేణువుకి మది పరవశించి పులకలంటగానే..
3632. ఒంటరితనాన్ని వీడిన క్షణాలు_నాజత కోరి నువ్వొచ్చినందుకే..
3633. నీ చెలిమే పండగయ్యింది_కలల్ని నెమరేసుకొనే మనసుకి..
3634. కొన్ని అబద్దాలంతే_పదేపదే పదుగురి నోట్లలో నాని నిజమనిపిస్తాయి..
3635. జీవితాన్ని ప్రేమించడం తెలుసనుకుంటా_శిశిరాన్ని స్నేహంగా రాసావందుకే.
3636. మల్లెలే సాక్షి_తలపుల్లో విరబూస్తానన్న నీ మాటలకి..
3637. మనసుపొరలెన్నని తవ్వుతావో_నిన్ను నాలో వెతుక్కొనే ఆరాటంలో..
3638. నీ ప్రేమలేఖ నేనందుకున్నా_నువ్వు మెచ్చిన తారను కనుకనే
3639. ఎటుచూసినా నువ్వేనంటూ మది_తలపుల్లోనే నీతో ఊసులాడుతూ..
3640. నా నవ్వులంతే_నీ నిష్క్రమణతోనే మోమును వీడిపోతూ..
3641. జ్ఞాపకాలజావళిలోనే నేనున్నా_నా మనసు మెరిసి చానాళ్ళయిందని..
3642. విరహానికి పరిమళమబ్బింది_నీ స్మృతులు చందనానికి కరిగినందుకు
3643. పదాలకెప్పుడూ పరుగులే_నిన్ను రాస్తున్న భావంలోనికి రమ్మంటే..
3644. జ్ఞాపకాలను మోయక తప్పలేదు_నన్ను నడిపిస్తున్నవి అవేనని..
3645. నా అదృష్టానికి విస్తుపోతున్నారంతా_మనసుతో రాస్తున్నావని తెలిసి..
3646. బాల్యం తిరిగొచ్చినట్లుంది_కలలో మిత్రులు చేసిన సందడికి..
3647. జీవితమే నువ్వవుతావనుకోలేదు_నీ నవ్వును మెచ్చిన మరుక్షణం..
3648. మెత్తగా కురుస్తున్న కౌముది_నీ అక్షరాలకు భంగమవరాదని..
3649. వసంతం వెంటపడ్డావెందుకో_శిశిరమింకా సెలవీయకుండానే..
3650. మౌనాన్ని ప్రశ్నిస్తూ నేను_మరణానికెంత దూరంలో ఉన్నానని..
3651. ఫలించింది జీవితం_ప్రేమ తోడై అనురాగం మిన్నంటగానే..
3652. మరణానికి థైర్యమొచ్చిందట_నాలో చిరునవ్వుల ఆహ్వానాన్ని తిలకించి..
3653. నీ వలపు వీచినప్పుడనుకున్నా_నా హృదయగవాక్షం తెరిచుందని..
3654. నీ మనసేదో దాచిందనుకున్నా_మౌనవించి నన్నొంటరిని చేస్తుంటే..
3655. మనసు మరచినట్లుంది నన్ను_నీ జ్ఞాపకాలనే నెమరేసుకుంటూ..
3656.  పరవశం పరుచుకుందక్కడ_మనసు మధువనంలో నువ్వడుగేయగానే..
3657. మనోమందిరంలో నేనుండిపోతా_పరవశించు పారిజాతాలతో పూజిస్తానంటే..
3658. మధువనం శూన్యమయ్యింది_మనోమందిరం దాటి నువ్వు సాగిపోయాక..
3659. రేగిపోకలా తుంటరిగా_రాతిరయ్యిందని కవ్వించేలా..
3660. ఊహల ముసుగు తీసేసినందుకేమో_వాస్తవం వెక్కిరింతై వెంటాడుతోంది..
3661. విగతం_నా వాస్తవాన్ని నువ్వూహించిన విథం..
3662. నవ్వుకి దూరమైపోయానలా_మరణాన్ని దగ్గరగా ఊహించినందుకేమో..
3663. మరణం అనివార్యం_మౌనమో మకుటమై అలంకరించినా..
3664. మూగనోములెక్కడివిలే పెదవికి_ముగ్ధవై ఎదురుగా నువ్వుంటే..
3665. మనసుపొరల్లో ఎన్నో ఆలోచనలు_రాస్తే పుస్తకమొకటి నిండుతుందేమో..
3666. గుండెను తడిమిన జ్ఞాపకమొకటి_విషాదమై కన్నుల్లో నిండిందలా..
3667. ప్రేమలా నవ్వింది_నీ తలపొకటి హృదయాన నర్తించగానే..
3668. నీ మనోగతం_నా గుండెసవ్వడిని ఆపేసిన సుస్వరం..
3669. మనసిక్కడ ఊగింది_నీ రాకతో పరిమళాన్ని గుర్తించి..
3670. అతిశయానికో సమయముంది_అక్షరాలతో మాయ మొదలెడతావెందుకో..
3671. ధ్యానించి అలిస్తేనేముందిలే_నా మనసైతే నిన్ను చేరిందిగా
3672. సుమాలకెంత పరవశమో_నా మనసు దారంలో తమకు చోటిస్తే..
3673. ఆరాధనను అర్ధం చేసుకున్నా_నీ రాధ నేనన్నావని..
3674. మమేకమవుతూ మనసులు_చూపులు కలసిన ఆ శుభవేళలో..
3675. ఉత్తుంగమవుతూ భావాలు_గుండెకు ఆర్ద్రతను పంచిస్తూ..
3676. కలలను లెక్కించడం మానేసా_రాత్రులు నిద్దుర కరువవుతుంటే
3677. నలుగురినీ నవ్విస్తే చాలనుకున్నా_మోసేందుకా మాత్రం సరిపోతారని...
3678. మనసు వెచ్చబడింది_కలలో నీవిచ్చిన మధుర సాంత్వనకి..
3679. నాలో చైతన్యం_నీ భావాలకు పరుగులెత్తిన మానసం..
3680. వెన్నెల్లో అందమంతా నాదే_నీ జ్ఞాపకాలతో నిల్చున్నానంటే..
3681. జ్ఞాపకాల సుళ్ళు ఎదలో_ముసురుపట్టిన ఆకాశాన్ని చూడగానే..
3682. వాలుచూపులోని నవ్వుల్ని కనిపెట్టా_నాపై వాలేందుకు సిద్ధపడ్డాయని..
3683. వేకువ కొత్తగా నవ్వినట్లుంది_వాకిట్లో వలపొచ్చి ముగ్గేస్తుంటే..
3684. అక్షరం_అనుభవాలకు పురుడు పోసుకున్న హృదిభావం..
3685. తనువుని చాలించి పోయాను_ప్రేమని సమాధి చేస్తావనే..
3686. మనసు దాటిన చూపు_నీ మౌనాన్ని అవలోకించేందుకే..
3687. శిశిరానికి నేలరాలిన సుమాలు_దైవాన్నిక చేరలేని సాయంత్రంలో..
3688. ప్రేమ చిగురించిందలా_మరణంలో సైతం పచ్చనే తానంటూ...
3689. రెక్కలు కత్తిరించడమేగా_ఆమె ఆశను పంజరంలో బంధించడం..
3690.నీ సమక్షంలో_నా కన్నీరూ..ఆనందం సాటిది..
3691. నీ అంతరంగం_నాలో చైతన్యానికో సంప్రీతి నిర్వచనం..
3692.  అరణ్యరోదనే ఆమె వేదన_చట్టమెదురుగానే పెదవి విప్పినా
3693. లెక్కకు రాని అవమానాలెన్నో_గొంతు చీల్చుకున్న పోరాటంలో
3694. మహిళా బిల్లులట_చట్టసభల్లోని ఆధిపత్యాల ఛలోక్తులు..
3695. హృదయంలో ప్రేమ మొలకెత్తింది_నీ అనురాగం అభయమియ్యగానే.. 
3696. మౌనమొక్కటే మిగిలింది_కొన్ని జ్ఞాపకాలు నీడల్లో కరిగిపోయాక..
3697. స్మృతులెప్పుడూ శాశ్వతమే_కలలగూడు కూలిపోయినా..
3698. నీలో అభివ్యక్తి_నాలో వ్యక్తిత్వాన్ని తిరిగి నిలబెట్టేలా..
3699. ఊపిరి ఒంటరయ్యిందిక_నీ శ్వాసలు నాకు దూరమయ్యాక..
3700. రాగం_నాలో గొంతుదాటి ప్రవహించు హృదయ నాదం..

No comments:

Post a Comment