3501. నీ మౌనంపై మనసుపడేదెలా_నాలో స్వరాలు వెల్లువవుతుంటే..
3502. అలల రాగాలతో పులకింతలు_తీరానికి సరికొత్త కదలికలు..
3503. నవ్వులు పంచుకుందామనే నేనొచ్చా_నీలో పున్నములు పిలుపివ్వగానే..
3504. సంతోషమలా చిందింది_నీ నవ్వులు నాలో నిండగానే..
3505. కన్నీటిపై అనురక్తి పెరిగింది_మనసుని తేలిక చేస్తున్నాయనే..
3506. ఊహల్లోనే మది ఊయలూగుతూ_నీ మాటల మంత్రాలకే..
3507. నీ జ్ఞాపకాలే గెలిచాయి_నన్ను బ్రతికించే ప్రయత్నంలో..
3508. నీలో నన్ను కనుగొన్నా అప్పుడు_నీ మనసు పట్టుకోగానే
3509. వేలుగా కురుస్తున్న సంతోషాలు_కొన్నినవ్వులు కాజేసే సంకల్పంలో..
3510. కన్నుల్లోకొచ్చి చేరిపోయా_నా రూపును బొమ్మగా దాచుకుంటావనే..
3511. అక్షరాలు ముందడుగేసాయి_భావాల సాయంతో బంధానికి ఊపిరిద్దామని..
3512. తపస్సలా గెలిచింది_చూపుల దుమారానికి కల నిజమయ్యి..
3513. ఆ రూపంపైనే మనసయ్యింది_కళ్ళు గుట్టుగా నవ్వుకున్నాక..
3514. అరమూతలేసేసా కన్నులకు_నీ రూపునలా లాలించాలని..
3515. ఆ కంటికెప్పుడూ వరదలే_చెప్పా చేయకుండా విచ్చేసే ఆవేదనలతో..
3516. పగటికలలు నిత్యమయ్యాయి_రాత్రుళ్ళు నీ ధ్యాసల్లో కరిగిపోతుంటే..
3517. మౌనం పరిమళిస్తుంటుంది_నా కళ్ళతో నువ్వూసులాడే క్షణాలలో..
3518. మాఘమాసమంటే మక్కువే_మల్లెలతో కేరింతలాడొచ్చని..
3519. గ్రీష్మమైతేనేమి_ఆమెప్పటికీ జీవితంలో మల్లెలకు నోచుకోలేదుగా
3520. ఊసులెన్నని మాల కడతావో_మల్లెలకీ మాఘానికీ ఇంకా సమయముందంటూ..
3521. ఒక రాతిరలా గడిచింది_మల్లెలు కురవని ఏకాంతంలో..
3522. నా కలం కదులుతోంది_నీ రాతకు బదులివ్వాలనుకోగానే 3502. అలల రాగాలతో పులకింతలు_తీరానికి సరికొత్త కదలికలు..

3523. ముగ్గులేసుకుంటూ మది_అరుదైన నీ భావాల్లో నన్నుంచినప్పుడల్లా..
3524. వెన్నెలకి వాచిపోయుందా జీవితం_అమాసల్లో మగ్గిమగ్గి కమిలిపోయి..
3525. ఆకాశమంటిన ఆవేశం_తనలో ఒక వికృతిని కనుగొన్నాక..
3526. రాగాతిశయమెక్కువే ఆ గాలికి_వెదురు తాకగానే సంగీతమవుతుందని..
3527. ఓడిపోయానిలా_నీ చూపులో భావాన్ని పట్టుకోవాలని ప్రయత్నించి..
3528. నిర్వేదాన్ని మోయలేనంటూ మది_గతం గాయమై గుచ్చుకుంటుంటే
3529. ఆకారానికే దాసోహం కొందరు_మనసుకో ఊసనేదే లేకుండా..
3530. భావాలు బహుదూరం పోయాయి_మదిలో నిరాశకు చోటివ్వగానే..
3531. ఎన్ని చుక్కలని కలగలపాలో_నా భావాలతో ముగ్గేయాలంటే..
3532. మెరుగు కోల్పోతున్న మంచితనం_ఆరాధన అబద్దాలతో సాగుతున్నాక..
3533. అపాయం చేయకుంటే చాలనుకున్నా_ఆరాధనంతా కల్లలైనా..
3534. కీర్తి కిరీటం కావాలందరికీ_పలకరింపులోని పంచదార కంటే..
3535. పన్నీటి అత్తరెంత చల్లుతావో_అభిషేకం చేయాలనుంది నాకంటూ..
3536. మనసెందుకు మత్తెక్కిందో_మల్లెలు చేరింది నా సిగనైతే..
3537. నీ నిరీక్షణలోనే ఆవిరవుతున్నా_క్షణాలు గ్రీష్మాన్ని తలపిస్తుంటే..
3538. ఎన్ని సొబగులద్దావో అక్షరాలకు_నీ విరహాన్ని చేరేసేందుకు..
3539. కాంక్షలన్నీ దాచుకున్నా_నీ ఆంక్షలు తీరాక బయటపెడదామని..
3540. నా చూపుల హారతులు_తలపుల్లో ఆరాధించిన నీకే..
3541. కాలమంతే_నేను వెనుకబడ్డా తాను ముందుకెళ్ళిపోతూ..
3542. నువ్వంతే_నీ మనసులో నన్ను దాచేస్తూ..
3543.మాటల్లో మానవత్వం_అంతరంగంలో అనంతమైన ఆవేదన దాచుకుంటూ..
3544. పదేపదే ఛస్తూ వనిత_ఆ ఒక్కసారి తలొంచిన నేరానికి..
3545. మౌనం మోగింది మువ్వలా_నువ్వలా అక్షరమై పలకరించగా..
3546. వసంతం వలపుగా ఎదురయ్యింది_క్షణాల నిరీక్షణకు బదులుగా
3547. మూడుకాసులకు ఆశపడ్డందుకేమో_అలంకారమొక్కటీ మిగిలింది..
3548. నీరవం బరువయ్యింది_ఎదురుచూపులకు మనసు మసకవ్వగానే
3549. మూడుముక్కలాటగా జీవితం_మూణాళ్ళ ముచ్చటైనా తీరకుండానే..
3550. ఆకర్షణ పరిపాటయ్యింది_ఆత్మీయత వెగటవ్వగానే..
3551. చెక్కిట చారికలే మిగిలాయి_ఇన్నాళ్ళ అనుబంధానికి ఆనవాళ్ళుగా..
3552. కన్నుల్లో దాచుకున్నప్పుడే అనుకున్నా_నీ సంతోషమంతా నేనేనని..
3553. రాత్రులు వెన్నెలే_నీ అనురాగం కురిసిన ప్రేమవెల్లువకి..
3554. జ్ఞాపకాల సమూహాలు_నేడు అక్షరాలుగా కాగితాన్ని అలంకరిస్తూ..
3555. వసంతాన్ని వెనక్కు రమ్మంటున్నా_కలకోయిలగా కూజితం నేనివ్వాలని..
3556. అభినేత్రులే అందరూ_ముఖపుస్తమో రంగస్థలముగా మారాక..
3557. మనసుకెందుకో వైరాగ్యం_నీ వయసు సైగ చేసి పిలుస్తున్నా..
3558. మట్టిలో మాణిక్యాలే అన్నీ_సానబెట్టే విద్యే తెలియకుందెవరికీ
3559. అలగానే మిగిలిపోతున్నా_తీరాన్ని చేరినా నిలబడలేని అశక్తతలో..
3560. అలుక అలంకారమనుకున్నా_మదిలో నువ్వు మధనపడతావని తెలీక..
3561. అనునయించి అలసిపోతావెందుకో_నన్ను జాగ్రత్త పడమని బోధిస్తూనే..
3562. ఆమె కన్నులు కలువమొగ్గలేమో_పోటీపడలేక పువ్వులు విచ్చుకుపోతూ..
3563. తెల్లారడం గమనించలేదు_నీ తలపుల విహారంలో మైమరచిపోతూ..
3564. మనసొక్కటేగా_చెరో తీరంలో మనముంటున్నా..
3565. నిద్దురపొద్దులందుకే మరచింది మది_నీ ఊహలొచ్చి కవ్విస్తుండగానే
3566. ఆకతాయిగా కొన్నినవ్వులు_నీ చూపుల్లోంచి నన్ను గుచ్చుతూ..
3567. పిచ్చంటున్నారు_నాలోని నీతో నవ్వుకుంటున్న ప్రతిసారీ..
3568. ఆరుద్రలా వెంటబడ్డావెందుకో_నా బుగ్గల్లో ఎరుపునలా పెంచేస్తూ..
3569. చెలియలకట్టేయలేకున్నా_కన్నీరు హృదయాన్ని దాటి వెల్లువైనందుకే..
3570. ఆలింగనంలోనూ అలసిపోతున్నా_తాపం తీర్చే హృదయం తోడయ్యిందనే..
3571. వెనుదిరిగి వీడ్కోలిస్తున్నా_కొన్ని క్షణాలను ఆగమని చెప్పలేకనే..
3572. మనసు వేదనలో తడుస్తోంది_కన్నీటి వర్షం మొదలవ్వగానే..
3573. మౌనగీతాలిక మనకన్నీ_పలకరింపులుండవని తెలిసాక..
3574. అశాంతిలేని బంధం_నిన్నూ నన్నూ కలిపిన స్నేహం..
3575. తపనెప్పుడూ నాదేగా_ఉన్న ఒక్క మనసూ నీకిచ్చినందుకు..
3576. చెలిమి కురవడం బాగుంది_మనసు మోడైన ప్రతిసారీ..
3577. క్షణాలకు మాటలొస్తే బాగుండేది_నా నిరీక్షణకు బదులిచ్చేది..
3578. వసంతమాపలేని వైరాగ్యమొకటి_శిశిరమై పెదవుల్లో నవ్వుల్ని రాల్చింది..
3579. అలుపెరుగనివి కన్నులే_నీ స్వప్నాలతో పరవశించిన రాతిరిలో..
3580. అమాసవైతేనేమిలే_దీపావళిగా నాలో నువ్వెలుగుతానంటే..
3581. విరహానికి వేకువయ్యింది_కాలం పొరలిప్పుతూ నిన్ను చూపగానే..
3582. వేకువైనా చిమ్మ చీకటే నీకు_పున్నమితో నన్ను పోల్చకుంటే..
3583. చీరకెన్ని చుక్కలో_నేలరాలిన నింగి తారలు అమ్మను తాకాలనుకోగానే..
3584. ఈ క్షణం యుగంతో సమానమే నాకు_నీ జత లేనందుకు
3585. నా ప్రాణం నీకిచ్చా_నీ ఊపిరి నేననగానే..
3586. నా నవ్వులన్నీ విడిచేసా_నీ జ్ఞాపకాల్లోనైనా తోడుంటాయని..
3587. హృదయం బరువెక్కింది_నిరీక్షణలో నవ్వడం నేను మరచిపోగానే..
3588. క్షణాలకు ప్రయాసలే_నీ నిరీక్షణలో కదల్లేక కదులుతూ..
3589. శిరీషపువ్వునేమో గతజన్మలో_నరాలు కోసే నేర్పు నాకుందంటే..
3590. నీ రూపాన్ని వర్ణించేందుకే_కలం పట్టిన చేయి కాగితం కోరింది..
3591. నీకు ఇష్టమన్నావనే_నీకు నేను దూరమయ్యా బలవంతంగా..
3592. నీరవం చప్పుడయ్యింది_నీ చేయి నా చేయి కలిసి చెలిమవ్వగానే..
3593. పరుగాపని వెల్లువనే నేను_తీరమై నువ్వలా కవ్విస్తుంటే..
3594. తీయగా గుచ్చినప్పుడే అనుకున్నా_ముల్లంత నేర్పు ప్రేమకుందని..
3595. చదవక మిగిలిన పుటలెన్నో_ప్రేమంటూ కానరాని ఆ పుస్తకములో..
3596. తీయని స్వప్నాలే ప్రతిరేయి_నిన్ను తడిమి నావైపొస్తుంటేనవి..
3597. నేనో కలాన్ని_నిన్నో ఆయుధంగా ప్రయోగించే వేళలో..
3598. నా పేరుకో అందమంటింది_నువ్వక్షరాలుగా మలచి చూపగానే..
3599. లెక్కలు మర్చిపోతున్న మనుషులు_నమ్మిన జాతకాన్ని అనుసరిస్తూ..
3600. ప్రాణం లేని బొమ్మనే_నువ్వు దూరమయ్యావంటే
No comments:
Post a Comment