Monday, 2 September 2019

7301 -

7301. మదిలో భావాల ముడి వేసేసా..అక్షరాలో చోట కలిసుంటాయని..
7302. నేల జారుతోంది వెన్నెలంతా..ఎన్ని మనసులు తడపాలనో..
7303. కలలోకొచ్చెస్తాలే..నీ కనులకు కానుకవ్వాలనుందీ రేయి..
7304. అక్షరానిదే ఆనందం..అమరమై నిలిచిపోతుందని ఎప్పటికీ..
7305. నడతను నేర్పుతుంది కాలం..మున్ముందు అడుగు తడబడరాదనే..
7306. హృదయస్పందనల వెల్లువలు..నీ జ్ఞాపకాల మృదుస్పర్శలు..
7307. కన్నులపండుగ నాదేగా..నువ్వెదురైన రోజులల్లా..
7308. కనకాంబరమవనా కనుపాపల్లో..సుతిమెత్తగా దాచుకుంటావంటే..
7309. కథనం మొదలైందిక..కొత్త పూలతో నన్ను పోల్చుకోవాలిక..
7310. ఒంటరయ్యా నేనిక్కడ..నా ప్రాణం నీలో కలిసినప్పుడే..
7311. నిద్దుర కరువైన రాతిరది..ముద్దుల చప్పుళ్ళతో మోగిందని..
7312. ఆగి చూస్తుంది నిన్ననుకున్నా..నేడొచ్చి రేపట్లోకి ప్రయాణిస్తున్నా..
7313. చూపులతో ఒడిసిపట్టకలా..తొందరలో వాడిపోగలనలా..
7314. ముద్దులతోనే పూరిస్తుంటావు..నేనలమటించే క్షణాలన్నింటినీ..
7315. స్మృతులను చేజార్చుకున్నా..మనశ్శాంతి కరువవుతుందని..
7316. మరుపు మందేసేది కాలమే..కొన్నాళ్ళు వేచి చూడాలంతే..
7317. నిదురకు దూరమయ్యా..కలలు కనలేని యాతనలో నేను..
7318. గుండె గాయమయ్యింది..ఓదార్చాలని చూస్తున్నానందుకే..
7319. నీ తలపులెప్పటికీ మధురాలే..నాలో ఉత్సాహాన్నిలా పెంచుతూ..
7320. గతంలోంచీ నడిచొచ్చేసా..ఈ జ్ఞాపకాలతో నేను ఇమడలేనని..
7321. మనసు మెరుస్తూనే ఉంది..నీ భావంలో నన్నుంచావని..
7322. రెప్పలు మూయనప్పుడే అనుకున్నా..నా పెదవుల్ని తడిమేస్తున్నావని..
7323. మనసు ముసురేసినందుకే బాగుంది..నేనో నెమలినై ఆడాలనుంది..
7324. గెలిచినట్టే ప్రేమ..ఒక్క బంధం ఇద్దర్ని ముడేసిందంటే..
7325. అగుపిస్తూనే గమ్యం..అడుగులెందుకో ఆలశ్యం..
7326. చీకటైతే ఊహల చప్పుడు..కలల కోసం తొందరేమోనది..
7327. మనసెందుకో లొంగనంటుంది..గమ్మత్తులో ఉన్నట్టుందిప్పుడు..
7328. పదాలు పేర్చానలా..నీ పేరున కవిత్వమై కనిపించిందలా..
7329. తెలుగు తీపి తెలుస్తోంది..మాటలన్నీ తేనెలై జాలువారినందుకే..
7330. ప్రేమే అది..అప్రమేయమై అనంతమయ్యిందంటే..
7331. నువ్వేసిన వల నిజమే..నే కలవరింతలు నేర్చానంటే..
7332. మనసంతా సందడే..ప్రతిరోజూ నీ రాకతో పండగవుతుంటే..
7333. ముచ్చట మధ్యలోనే ఆగింది..మౌనం మనసుని ముసిరేయగానే..
7334. భావాల అత్తర్లవి..పగలూ రేయీ పరిమళిస్తూనే ఉంటాయవి..
7335. గమనించనేలేదసలు..నీ ఊసులు అత్తరు గుత్తులవుతున్నట్లు..
7336. గమ్యం తెలిసుంటే చాలనుకుంటా..జీవిత గమనమో సులభమవగలదు..
7337. ఊహకు కందని అక్షరాలివి..అరచేతిలో నువ్వు దాచినవి..
7338. బాల్యమో తీరని దాహం..తలచేకొద్దీ ఊరే జ్ఞాపకాలతో..
7339. పరవశం నిజమే..మన పరిచయం పరిథి దాటినందుకు..
7340. నిద్దట్లో కలవరించా..కలగా వస్తావన్న ఆశ నిజమవుతుందని..
7341. అలలా వచ్చినా చాలనుకున్నా..రెప్పలఒడ్డులో నే నిలబడుంటా
7342. సప్తసంద్రాల ఆవల ఉన్నావనుకున్నా..సప్తస్వరాల్లా మనం కలిసేవరకూ..
7343. సర్వారాధనీయం కమనీయం..రమణీయలోలుని లీలావిలాసం..
7344. వెనుదిరిగిన స్వప్నాలవి..రేయంతా నువ్వు నిద్రించేలా లేవని..
7345. మోహనవంశీ రాగాలాపనది..రాధ గుండెల్లో సదా మోగుతుండేది..
7346. కదం తొక్కుతున్న కలమది..అలవోకగా కావ్యాలను రాసేస్తుంది..
7347. గుండె కావేరే..కలలు నిజమైతే..
7348. గట్టు తెగేలా కన్నీరు..ఉప్పెనయ్యే సూచనలెందుకో మరి..
7349. జ్ఞాపకం స్రవిస్తుంది మనసులో..కన్నీరై కనిపిస్తుంది కలంలో..
7350. కన్నీరు కలమయ్యింది..గుండెతడిని రాసుకుంటూ..
7351. మనసుకి సంచలనమే మరి..నన్ను వీడి నిన్ను చేరిందంటే..
7352. మనసు బరువు హెచ్చుతోంది..నువ్వు దగ్గరైన ప్రతిసారీ..
7353. కవనంగా లిఖిస్తా..నీ మనసు నా సొంతమన్నావంటే..
7354. రేయి పగలబడి నవ్వుతుంది..మన స్వరాలు ఆలకించినట్టుంది..
7355. నిజం కనుమరుగయ్యింది..కలలకు పరిమితమయ్యి..
7356. రసోదయమై రవళించు..ఓసారి పులకరించాలనుంది..
7357. కన్నులకెప్పుడూ మక్కువే..కలలన్నిటా నువ్వొస్తావంటే..
7358. 

I’m protected online with Avast Free Antivirus. Get it here — it’s free forever.