7201. నిన్నూ నన్నూ కలిపిందదేగా..మన జీవన వేణువైన రాగం..
7202. నే పిలిచి ప్రయోజనమేముందిక..నీ జ్ఞాపకాలలో నువ్వున్నాక..
7203. రానురానూ శిలనైపోతున్నా..ప్రేమ ఉలి తగలనందుకే..
7204. నీ కవితకి అనువాదమవ్వాలనుంది..నన్ను ఊహగా రాస్తావంటే..
7205. ముందు నడకే కాలానిది..నన్నలా జ్ఞాపకాలలో విడిచేస్తూ..
7206. పసి ప్రాయమది..నిత్యం పాలనవ్వులతో వర్ధిల్లేది..
7207. గంపెడు భావాలయ్యాయి..గుప్పెడక్షరాలే కదాని మనసు అనుకోగానే..
7208. మధువునే నేను..నువ్వు తాగిచూడలేదంతే..
7209. కలత పడనింక..కలవరాన్ని కాదనుకున్నాగా..
7210. పలుకెప్పుడో చిన్నబోయింది..నీ మౌనం బాణంలా గుచ్చి..
7211. వాస్తవాన్నందుకే ఇష్టపడుతున్నా..కల నిజమైందని..
7212. నీ చిరునవ్వే సాక్షి..ఈరోజు వెన్నెల కురిసిందనడానికి..
7213. శిలగా మారింది హృది..ఎన్ని దెబ్బలు తట్టుకుందనో మరి..
7214. జ్ఞాపకమెందుకయ్యానో..నన్ను కాదనుకుని నువ్వు దాటెళ్ళినందుకేగా..
7215. కథలెన్ని రాసేసావో..ఒక్క కలా నిజం కాకపోయినా..
7216. నా మాటలు ముత్యాలేగా..నీ మనసుకి నచ్చి నవ్వుతున్నావంటే..
7217. రహస్యమందుకే అయ్యా మనసులో..కాస్త చోటిచ్చి పిలిచావని..
7218. అదే కలకలం..కలలో నువ్వు నాకు అపరిచితమైనట్టు..
7219. మదిలో మెదిలిన అక్షరమే..కవనమై కళ్ళెదుట నిలిచింది..
7220. అనురాగమలా గెలిచింది..ప్రేమ పదిలమయ్యి..
7221. అధర్మానికి అలుపు రాదు..నిజాయితీ నిద్రిస్తున్నంత సేపూ..
7222. కన్నులు రెండేగా..కలలు అనంతమై నిన్ను చూపిస్తున్నా..
7223. మనసు పులకిస్తోంది..ఋతుపవనాలిచ్చిన గిలిగింతలకి..
7224. చరణమందుకే కలిపాను..నీ పల్లవిలో నా పేరుందని..
7225. కళకళలాడుతున్నావందుకే..కలలో కళలన్నీ నేర్చేసినట్టు..
7226. కలతయ్యింది వాస్తవం..కల ముగిసినందుకే..
7227. నీ వలపుల నుడి..నాకు నెలవైన గుడి..
7228. ప్రతీక్షణ విషాదమే..కాలమలా కదిలిపోతుంటే..
7229. వైశాఖం వర్షిస్తోంది..నీ మదికి పండుగ తేవాలనే..
7230. మనసునాపలేకపోయా..నిన్ననుసరిస్తూ తానొస్తుంటే..
7231. కల నిజమైంది..నీ కవితగా నన్ను చేరిందనే..
7232. నువ్వొస్తూనే అలజడి..ఎన్ని హృదయాల పండగో మరి..
7233. మాటలన్నీ మూట కట్టేసా..నీ ఎదుట కుమ్మరించాలని..
7234. మారాకేసింది మనసు..నీ వలపు చివుర్లు తొడుక్కొని..
7235. చురకత్తుల్లా నీ చూపులు..ఆకులాంటి మనసుల్ని కోసేస్తూ..
7236. అంగలేసినా అలసిపోలేదందుకే..విజేతనై నిలవాలని..
7237. అపురూపాలే నీ చూపులు..నన్ను అనుసరిస్తున్నన్ని రోజులూ..
7238. అంతుపట్టని రోగాలే ఇప్పుడన్నీ..ప్రకృతి సమతుల్యం లోపించాక..
7239. మనసు తడుస్తున్నది నిజమే..నీ ఆర్ద్రతను తాగినట్టుంది..
7240. అపరిమితమవుతూ కాలం..మన ఇష్టాలు నిజం చేసుకోమని..
7241. కాలం చెల్లని అనుభూతులు..మదిలో పదిలం చేసాననే..
7242. గతమైతేనేమి జ్ఞాపకాలు..భవిష్యత్తులో నడిపిస్తున్నవవేగా..
7243. అరిగిపోదు అనురాగమెప్పుడూ..ఆపుడప్పుడూ అలసినట్టనిపించినా..
7244. నా కన్నులు కనకాంబరాలే..మెత్తని నీ ప్రేమనాలకిస్తూ..
7245. దారి తప్పుతున్నా ప్రతిసారీ..కలలో కనిపించిన నిన్ను వెతకలేక..
7246. ఆశించడం మంచిదయ్యింది..నీ మనసిలా నన్ను చేరింది..
7247. అజ్ఞాత శిలగా మిగిలిపోయా..నీ ప్రేమ ఉలి తగలనందుకే..
7248. చిలిపి తమకంలో తడిచిపోతున్నా..నువ్వు గుర్తొచ్చిన ప్రతిసారీ..
7249. గాయపరిచి మాయమయ్యావెందుకో..నన్నో కావ్యంగా మలుస్తావనుకుంటే..
7250. నేనెప్పుడో నిశ్శబ్దమయ్యా..నీ వలపుకి దూరం చేసినందుకు..
7251. నీ తలపుతోనే ఉషస్సు..ఊహలకు రెప్పలు విచ్చినట్టు..
7252. పల్లవి పాడుతూ మనసు..నీ హృదయానికి స్పందిస్తూ..
7253. నీ కవిత కెరటమై తాకింది..నా నవ్వులే తీరమని భావించి..
7254. నీ భావనకే పులకిస్తున్నా..నన్ను ఆహ్వానించేందుకు కవితవయ్యావని..
7255. పరువాన్ని పదిలం చేసేసా..నీ చూపులకే అప్పగించాలని..
7256. చరణాలు కలిపినప్పుడే అనుకున్నా..అనురాగంలో జత కలిసుంటావని..
7257. వివశమైన తారలెన్నో..నీ భావాల జాబిల్లికి దగ్గరవ్వాలని..
7258. పదమై కలుద్దామనుకున్నా..ఒక వాక్యంగా మనమవుతామని..
7259. నీ పలుకులనే ఆలకిస్తున్నా..చిలుకలు అనుసరించేలా ఉన్నాయని..
7260. ఆహ్లాదమంటేనేమో అనుకున్నా..నీ మాటలు వినక మునుపు..
7261. తాళాన్ని నేనే..నీ శృతిని సమంగా అనుసరిస్తూ..
7262. గుండెకి గండి పడింది..కన్నీటిని ఆపే ఆనకట్టేయాలిక..
7263. వెదురుపుల్లే కదా అనుకున్నా..వేణువిన్ని రాగాలు దాచుకుందని తెలీక..
7264. ప్రేమ అడుగంటిపోయింది..ద్వేషం పైకెగెసినందుకే..
7265. కష్టమో కొలిక్కొచ్చింది..ఇష్టాన్ని వ్యక్తీకరించగానే..
7266. వెన్నెల్లో విరహం..నిన్న మందారమని పాడుకున్న గీతం..
7267. నీ ప్రతిస్పందనే..నేనిన్నాళ్ళూ కోరుకున్న బదులు వాక్యమిది..
7268. వలపు సెగలు రేగెనిక్కడ..నీ తలపుల రాయబారానికట..
7269. కొండెక్కింది జీవితం..వ్యామోహం మితిమీరిందనే..
7270.చూపునందుకే వాల్చేసా..నా సిగ్గు నీకు మెరుపవ్వాలని
7271. నిజాలైన కలలు..నీ క్షణాలు నాకు రాసిచ్చాక..
7272. అదే పల్లకి..నీ ఊహలతో నిత్యం ఊరేగిస్తున్నట్టు..
7273. అదృష్టం లేని జీవితాలవి..ఆనందానికి ఎన్నడూ నోచుకోక..
7274. అలవాటైన అశ్రువులే..మనసు గాయపడినప్పుడల్లా బయటకొస్తూ..
7275. తనివి తీరింది లేదు..కాలం కదలికలు ఆపనందుకే..
7276. అందమంతా నాదే..నిన్ను అలరించిందంటే..
7277. ఎదురు కాకుంటేనేమిలే..నీ భ్రమలో నేనెప్పటికీ నిజాన్నేగా..
7278. నిరాశ నాకెందుకు..నా రాశికి నువ్వు సరిపోయినప్పుడు..
7279. నిన్నటి స్వప్నం నిజమయ్యింది..వంటబట్టిన నీ వలపు నాదైనట్టు..
7280. సమయాన్ని వెచ్చించాననుకున్నా..చిల్లర మాత్రం మిగులుతుందనుకోలా..
7281. కాలం విలువ పెరిగింది..తన వేగాన్ని అనుసరిస్తూ విజయమొందానని..
7282. కాలమూ..కాసులూ ఒకటే..విలువిచ్చినంత వరకే అక్కరకొస్తాయి..
7283. కలలు నిత్యమే..నన్ను కలవరిస్తున్నందుకు..
7284. రేరాణివి నీవేలే..చీకటైన ప్రతిసారీ..
7285. అరవిందనై నవ్వుతున్నా..జాబిలివై నన్ను దరి చేర్చావని..
7286. పగటి నిద్రకు సిద్ధమయ్యా..కలలోనైనా నన్ను కౌగిలిస్తావని..
7287. పులకిస్తున్నా పందిరిలో..మల్లెలరాతిరి సిద్ధమయ్యిందని..
7288. కలనైతేనేమి..నీ జతగా జీవితాంతం నేనుంటుంటే..
7289. ఊపిరెప్పుడో ఆగింది..నీ మాటలు కరువైన సంధి..
7290. పరువం ఝల్లుమన్నది నిజమే..నీ యుగళానికి మత్తిల్లినట్టుంది..
7291. నిన్నటి కలలే..రేపటికి నిజమవ్వాలని నా ఆశలు..
7292. అంబరం ఒదిగిపోయిందలా..నా గుండెలో ప్రేమగా రూపెత్తి..
7293. వేకువ కావడం తప్పదు..నిశీధెంత భయం రేపుతున్నా..
7294. వలపు కెరటమయ్యింది..తీరంలో ఉన్నది నువ్వని తెలిసే..
7295. పచ్చని ఆకయ్యింది కాగితం..నీ కవిత్వాన్ని కోరి..
7296. నీ జ్ఞాపకాలు కోయిలలే..ఇన్ని పాటలుగా నే అనుకరించినందుకు..
7297. అన్నీ అలతి పదాలే..కొన్ని అక్షరాల సంగమాలు..
7298. శరీరానికి గాయమవడం గుర్తులేదు..మనసు మరణించినట్టు తెలుస్తున్నా..
7299. సమయం మించిపోయింది..కొన్ని స్వప్నాలు సగంలోనే ఆగినట్టు..
7300. కదిలే కాలానికే తెలియాలి..ఆగలేని తొందర అదేంటోనని..
No comments:
Post a Comment