Monday, 2 September 2019

6901 - 7000

6901. మనసు దూరమయ్యింది..కొన్ని మతిమరుపులు తలకు పట్టించుకొని..
6902. పున్నమినై నేనొచ్చెస్తా..రోజూ నా నవ్వుల్లో తడుస్తానంటే..
6903. నేనెప్పటికీ నీ సొంతమే..బలహీనమయ్యేది కాదుగా ప్రేమంటే..
6904. తలరాతని ఊహించలేకపోయా..మధ్యలోనే ముంచేసిపోతావని..
6905. మధ్యలో ఆపలేనీ పాటని..చరణం నువ్వందుకుంటావనే ఆశతో..
6906. తీపి కలలే ఇప్పుడన్నీ..ఋతువు మారిన సందడి తెలుపుతున్నట్టుగా..
6907. పరవశాలు పూసినప్పుడే అనుకున్నా..నేనాలపించిన గానం వినుంటావని..
6908.పరవశానికి పుట్టిల్లు లేదనుకున్నా..నీ ఎదలో చేరేవరకూ..
6909. జీవితానికాధారాలు..మరపించే కొన్ని జ్ఞాపకాలు..
6910. కన్నీరొలికినప్పుడనుకున్నా..కలలోనూ విషాదమే వెంటాడుతుందని..
6911. మౌనం వరమయ్యింది..నీ మాటలకు దూరమై శోకించినప్పుడు..
6912. కొన్ని పరవశాలంతే..పెదవులపై నవ్వులను ఎదలో దాచేస్తుంటాయి..
6913. మౌనానికి నీరసమొచ్చింది..మాటందుకొనేవారు లేకనేమో..
6914. భారమలా దిగిపోయిందంతే..నా వేదన సగం నువ్వందుకున్నావని..
6915. మనసంటని భావాలెన్నో..కదిలే మేఘాలుగా ఎటో తరలిపోతూ..
6916. లెక్కకందని భావాలు నావి..ఆకాశంలో తారలుగా మెరుస్తున్నవి..
6917. అపురూపమయ్యింది మనసు..అక్షరాలుగా రాసుకున్న నిన్ను చదువుకుంటూ..
6918. అలలు అడ్డుపడకుంటే చాలు..జీవితం గమ్యం చేరొచ్చునేమో..
6919. అక్షరాలు కాసినైతేనేమి..భావాలైతే బోలెడున్నాయిగా..
6920. భావాల పంట పండాల్సిందే..అక్షరాలు అలవోకగా మొలకెత్తాయంటే..
6921. ఎన్ని కళలు దాచుకోవాలో..ఆదర్శగృహిణిగా మెప్పు పొందాలంటే..
6922. ఆమెకెవరూ సాటి రారు..అందుకే వెలుగిచ్చి ఇంటిదీపమయ్యింది..
6923. కొనఊపిరికందిన శ్వాసలా..నాకో వరప్రసాదమైతే నువ్వేగా..
6924. అంతరంగాన్నెందుకు ఆరడి పెడతావో..కాసేపైనా విశ్రాంతినివ్వకుండా..
6925. కలలు చేసుకున్న అదృష్టం..ఆ కన్నుల్లో చోటున్నందుకు..
6926. నా ఆనందమింక పదిలమే..కొలువయ్యింది నీలోనే కనుక..
6927. ఆశకో హద్దు లేకపోయింది..గమ్యమన్నది కృత నిశ్చయమైనందుకు..
6928. అనుసరిస్తున్న తడికన్నులు..ప్రేమను కురిసేందుకు సిద్దంగానేమో..
6929. నీ ప్రేమే బదులయ్యింది..నాకున్న అనేక ప్రశ్నలకు..
6930. కలలెన్నాళ్ళుగా బంధీ అయినవో..కన్నుల దిగ్బంధం బాగుందంటూ..
6931. ప్రభవించిన ప్రభాతానికి తెలియాలి..నీ తలపునెందుకు మోసుకొచ్చిందో..
6932. కలలన్నిటా నీ చెలిమే..కన్నీటినందుకే దరికి రానివ్వలేదు..
6933. తారగా నేను అనేకమవలేనా..నువ్వు ఆకాశమైనప్పుడు..
6934. నా మనసుకేమయిందో తెలిసింది..నీ మాయలో పడ్డప్పుడే..
6935. మనసంతా చెమ్మవాసన..ఆత్మ రోదిస్తుందేమో..
6936. కొన్ని జ్ఞాపకాల ప్రవాహాలు..నిశ్చలమైన నన్ను తడిపేందుకేమో..
6937. అక్షరాలతో అతుకేసుకుంటున్నా..పిగిలిన మనసు గాయాలన్నింటికీ..
6938. కాలానికవతల నిలబడిపోయా..నువ్వు దూరమైన విచారం తీరలేదింకా..
6940. తానో సంభాషణనే..మన చూపులకో అర్ధాన్ని కల్పిస్తూ..
6941. కలలన్నీ నీ పరమే..కథగా మలచి దాచుకుంటావని..
6942. వసంతం మొదలైందలా..నా నవ్వుల్లో రంగులు నీకంటగానే..
6943. నీ పిలుపులోని గమ్మత్తది..మనసుకి ఊయలేసి ఊపినట్టుంది..
6944. మౌనరాగం తీపయ్యింది..మాటల్లోని మాధుర్యానికి..
6945. ఎన్ని ఊసులని కలలకిస్తావో..ఒక్కసారైన నీ పెదవి కదపకుండానే..
6946. నీ మనసెన్నడో ఆలకించా..ప్రతిపదమూ నన్నే పాడుతుంటావని..
6947. చూపు మసకబారింది..ఎంత తుడిచినా మనసుతడి చెరగకపోతుంటే..
6948. గమనం ముందుకు సాగనంది..నీ మౌనం నన్నిలా వేధిస్తుంటే..
6949. అదే ఎదురుచూపు..నాలో ఆనందం నువ్వొస్తే మొదలవుతుందని..
6950. అతిప్రేమ వికటించినట్టుంది..మనసందుకే విరిగిపోయింది..
6951. గోరువెచ్చగా నేనవుతున్నా..గోగుపూలతో నన్ను పోలుస్తున్నావనే..
6952. హెచ్చుస్థాయి రాగాలు..నీ ఆనందాన్ని అందుకోవాలనే ప్రయత్నంలో..
6953. కనుమరుగవుతున్న మాటలు..మౌనాన్ని మోహించినందుకేమో మరి..
6954. మనసు తడిచిపోతుంది..ఆలోచనల తీవ్రత ఎక్కువవుతున్న కొద్దీ..
6955. పున్నమంత పండుగేగా నీకు..నే కల్లోకొచ్చిన ప్రతిసారీ..
6956. మౌనంలో మునిగిపోతున్నా..అంతరంగం తేలికవుతుందనే..
6957. ఎదచాటు చేసావెందుకో..ఎదురొస్తానని నేనంటే..
6958. ద్వేషం ప్రేమయ్యింది..మనసంత నీ ఇష్టాన్ని గమనించి..
6959. ఎన్ని పాటలు దాచుకున్నానో..నా పల్లవిని రాసావని..
6960. సంబరమనిపించే సమయమిదే..నీపై మోహం కమ్ముకొస్తుంటే..
6961. నిండు జాబిలి నేనవనా..రాత్రులన్నీ పున్నమిగా నువ్వు కావాలంటే..
6962. గుండె గడపకు తోరణం..నువ్వు పండగైనందుకేగా 
6963. అందాలొలికే ఆనందమదే..నా నవ్వులు నీవల్ల కనుకే..
6964. నీ పాట పూర్తయ్యింది..నా పల్లవి కలిసినందుకేగా
6965. హృది జేగంటై మోగింది..నన్ను నీ ఎదలోకి పిలిచావని..
6966. వేల పరమాన్నాలు తిన్నట్టుంది..నీ మాటలకి తీపవుతుంటే..
6967. సన్నజాజులకెందుకో తుళ్ళింతలు..పరిమళాన్ని పూసుకుంది తనువుకైతే..
6968. వసంతం వరించినట్టేలే..వరాలందించేందుకు నువ్వొచ్చావంటే..
6969. మౌనరాగమదంతే..మూగ మనసునీ పల్లవిస్తూ..
6970. నిజమయ్యాయిగా కలలు..వాస్తవాన్నందుకే ప్రేమిస్తున్నా..
6971. మౌనమూ లోకువయినందుకేమో..కన్నీరందుకే ఆగలేకుంది..
6972. ఎదురుచూపునే ప్రేమనుకున్నా..ఏదో రోజు నువ్వొచ్చి పండగవుతావని..
6973. నీరెండలో హాయుంది..నీ జ్ఞాపకాల నీడను తలపించినందుకు..
6974. జీవితాన్నందుకే ప్రేమిస్తున్నా..నీ రాతను నిజం చేయాలని..
6975. పున్నమంటే పండగే..నీ పూజకు శుభమూర్తమదే మరి.,
6976. వేసవికాలమొచ్చేసిందిగా..మల్లె మనసందుకే పరిమళిస్తుంది..
6977. మధుమాసమలా మొదలయ్యింది..నీతో మాటలు కలపగానే..
6978. మది మూగతనం తెలుస్తోంది..నీలాలు కమ్మగా ఊరినప్పుడు..
6979. ఒకటికి పదిసార్లు తడుముకున్నా..గుండెలోంచీ జారిపోలేదు కదాని..
6980. అపురూపాలు పెరగాలి..విరహాలు మధురమవ్వాలంటే..
6981. ఏ చేదుపాట గుర్తొచ్చిందో..మనసంతా కన్నీరై కురుస్తోంది..
6982. మాటల్ని దాచేస్తుంది మౌనం..నా నవ్వులు నువ్వాలకించాలనే..
6983. జీవితమాధుర్యం..నువ్వనే నాకిష్టమైన మాటలకే..
6984. నీటికి మెరవడమే తెలుసనుకుంటా..కన్నుల్లోనూ కమ్మగా వెలిగిపోతుంది..
6985. మాయలెన్ని చేసేస్తావో..పెదవినలా పండిస్తూనే..
6986. మంచితనమదేగా..తప్పులెన్ని వేధించకపోవడం..
6987. పగటికల అనుకుంటున్నా..మెలకువలో మనసుంటున్నప్పుడల్లా..
6988. అపురూపమే నేను..నా నవ్వులందుకేగా దోచాయి నిన్ను..
6989. గుండె గుప్పెడేగా అనుకున్నా..మనసు దాటి ప్రవహించేదాకా..
6990. మనసందుకే నీ సొంతం..ఏకాంతాన్ని వెతికి తెచ్చిచ్చావని..
6991. ఉపాసనెక్కువే నీ మనసుకి..అందుకే నన్ను ఆరాధిస్తుంది..
6992. వేసవైతేనేమి..భావాల మల్లెలతో నాకు చల్లదనమందిందిగా..
6993. మల్లెలు నవ్వింది నిజమే..నీ అనుభూతిని చూడాలని..
6994. హృదయం రంగస్థలం..నీ కదలికల ప్రదర్శనకు సాక్షిగా..
6995. నీలమవుతూ నా కన్నులు..నీ కలలు నింపుకున్నందుకే..
6996. కాటుక కరిగితేనేముందిలే...కురిసింది ఆనందభాష్పాలైతే..
6997. ఆనందభాష్పాలైన ఆశలు..అనుకోగానే తీరినందుకే..
6998. మెత్తని కత్తిలా గుచ్చుతావెందుకో..నొప్పి ఉండదని సముదాయిస్తూ..
6999. నువ్వు నా జావళి..నీకందుకే నే రాగమయ్యా..
7000. ఎటెళ్ళిందో ఈ క్షణం..నీ నిరీక్షణ భరించలేనంటూ..

No comments:

Post a Comment