4501. మనసు మనలేనంటోంది..నీలో లీనమవ్వాలని తపిస్తూ..
4502. నిద్దురపోయిందెప్పుడని మనసు..రేయింబవళ్ళు నిన్నే ధ్యానిస్తూ..
4503. మనసుని మళ్ళించాలనుకున్నా..నిన్ను దాటి రానంటూ మొండికేస్తుంటే..
4504. నాలో మధువు కురిసినట్టుంది..నీ మనసు హర్షించినందుకే..
4505. ఎటుచూసినా ప్రేమమయం..ప్రేమలోకం పిలుస్తున్నట్లుంది..
4506. మనసంతా మధువనం..రాథ ప్రేమ నన్నావహించినందుకే..
4507. ప్రేమ వరించిన తరుణమిది..ఆనందం నాది కాక మరెవరిది..
4508. మన ప్రేమకథెప్పటికీ ముగిసిపోదు..కల కాదని నువ్వు నమ్మితే..
4509. ప్రేమలేఖలు కొత్తేం కాదు..నువ్వు మొదటిసారి నాకు రాసావంతే..
4510. ప్రేమతో పులకిస్తున్నా..నీ మనసెంత గారడి చేసిందాని..
4511. అడుగులు ఆగేదేముందిప్పుడు..ప్రేమగా నువ్వు వేలుపట్టాక..
4512. నువ్వే నా ప్రేమని కనిపెట్టేసా..కన్నులు నీతో కలబడ్డప్పుడే..
4513. కథలెన్ని నేర్పుతావో కళ్ళకు..ప్రేమను వివరంగా వర్ణిస్తూ..
4514. విచ్చిన గులాబీల సాక్షి..నా మనసు పరిమళిస్తుంది నీ ప్రేమనే..
4515. అంతు చిక్కేదేముంది ప్రేమ..మనమో బంధంలో పట్టుబడ్డాక..
4516. ప్రేమగా చేరిన నువ్వే..ఋతువులరంగుతో మారిపోవుగా రేపు..
4517. అభావమొక్కటి మిగిలింది..మాటలు కరువయ్యాక..
4518. నాన్న ఓర్పు తెలిసింది..నాలో మార్పు మొదలయ్యాక..
4519. జ్ఞాపకమే జీవితమైంది..గతాన్ని ప్రేమిస్తున్నందుకు..
4520. అక్షరాలే ఆత్మీయమయ్యాయి..అశ్రువులు ఆపుకున్నప్పుడల్లా..
4521. ప్రణయం పరుగందుకుంది..పరువం పాటవ్వగానే..
4522. అశ్రువులు అనంతమే..అక్షరాలు అలసిపోవన్నట్టు..
4523. రైతుకల నిజమవలేదు..శాశ్వతనిదురకు చేరువయినందుకేమో..
4524. ఊసులాడ్డం నేర్చాలి మనసులు..ఊహలతో పనేముందిలెమ్మంటూ..
4525. వైశాఖం రేపిన మోహమే..ఈ జన్మకిప్పుడు గుర్తుకొచ్చింది..
4526. ఆనందం కరిగినట్టుంది..భాష్పాలుగా రెప్పలంటింది..
4527. అరక్షణమే నీ మౌనం..నాలో అలుకను రెట్టింపు చేస్తూ..
4528. కలవరమంతా కన్నులదే..ఊసులాడుకున్నది మనసులైనా..
4529. వినబడాలిగా నీ పిలుపులు..తీయాలంటే నే తలుపులు..
4530. పరిమళమంతా పూలదే..కాస్త నీ మనసుకంటిందంతే..
4531. నీ మనసుకెప్పుడో బంధీనయ్యా..కలవరమిచ్చే కలగా రావాలంతే..
4532. వేసవిలో వింజామర..నా విరహాన్నారబెట్టే నీ తలపు..
4533. కదిలిపోయిన క్షణాలు..పగటి కలలు ఎలానూ మనకున్నాయంటూ..
4534. జాబిలున్నదొక్కటే..నీ తలపుల్లో అనేకమైంది నేనే..
4535. కలలన్నిటా నేనే..నువ్వు నాపై మనసుపడాలంతే..
4536. పచ్చదనం కనుమరుగైంది..పరుగాపని మనుషుల గమనానికి చోటిచ్చి..
4537. నెలవంకనై నేనుండిపోయా..నా నవ్వును కంటూ నువ్వున్నందుకే..
4538. మౌనంలో దాచుకున్న మాట..పెదవంచు దాటలేనంది గుట్టుగా..
4539. మదిలో మొదలైన సెగలు..మాట దాచిన మౌనాలవేగా..
4540. ఇంకొంచెం మనసు కావాలి.....ప్రేమను చిత్రించాలంటే..
4541. ఇంత తడిలేని తనమా ....కురవమన్నా నిశ్చలమైయున్న కన్నుల్లో..
4542. ముగింపెక్కడ కలలకు...ఈ రేయి తెల్లవారనివ్వనని నువ్వంటుంటే..
4543. చెలిమి చేసా అక్షరాలతో..చింతలు తీరినవిదిగో చిటికెలో..
4544. మనసుకి మగతొచ్చింది..నీ కన్నుల్లో ప్రేమను చూసినందుకేమో..
4545. నిన్నల్లో పూసిన మరుమల్లె కొమ్మ..జ్ఞాపకమై జార్చింది కన్నుల్లో చెమ్మ..
4546. అమ్మను మరచిందెప్పుడని..పాటగా పాడుతున్నా ఇప్పుడంతే..
4547. ఊహించని మలుపే..వలపు గెలిచి మనం ఏకమయ్యామంటే..
4548. విషాదానికి అలవాటు పడిపోయా..ప్రేమిస్తే గుబులు తప్పదన్నట్టు..
4549. వెలుతురెన్నడో దూరమయ్యింది..చీకటిని నాకొదిలి..
4550. ప్రేమలాహిరిగా జీవితం..ఒకరికొకరమై మనమున్నప్పుడు..
4551. హేమంతం ముందే వచ్చింది..నీ కలలో నేనొచ్చినట్టు..
4552. అక్షరాలు చల్లానందుకే నీపై..కొన్ని కవితలు ఆలకిస్తావని..
4553. కొన్ని కలల తీరంతే..నిజం కాలేనని మొరాయిస్తుంటాయి..
4554. స్వార్ధమైంది ఇంటిపేరు..మానవత్వాన్ని విడిచేసాక వాళ్ళు..
4555. రేగిందిలా గాయం..నీ మౌనం కత్తిలా గుచ్చుతుంటే..
4556. నా నవ్వులే శుభముహూర్తాలు..నీ ఎదలో పండుగలన్నింటికీ..
4557. తనలో సగం నేను..నీలి మేఘమే తానైతే..
4558. హృదయస్పందన నీదే..నా ఆరాధన నీకు చేరువవ్వాలంతే..
4559. కథగా రాసుకోనూ..నీ కన్నుల్లో నన్నే కొలువుంచుకుంటే..
4560. విరసంతో విసుగేముంది..సరసమై తను నా చెంతున్నప్పుడు..
4561. మనసంతా నా నువ్వే..వసంతాన్ని నే వరించినప్పుడు..
4562. కన్నీరు గ్రహపాటు..మనసులు కలవనందుకే..
4563. గుండె బరువు తెలుస్తోంది..కనులు వర్షిస్తున్న ఆవేదనలో..
4564. కన్నీటి పాఠాలు నేర్చుకుంటున్నా..ఆత్మీయత కరువైనప్పటి సంది..
4565. అజ్ఞాతవాసంలో ఉండాలనుకున్నా..నీ కలలకు పట్టుబడిపోతానని తెలీక..
4566. మనసుని దాటిన జ్ఞాపకం..అక్షరమై కాగితాన్ని అలంకరిస్తూ..
4567. నేనొక చమురు దీపం..నువ్వెలిగిస్తే చాలు కార్తీకమవుతానంతే..
4568. ఊసుకందని ఊహలివి..మనసునూయల ఊపేస్తూ..
4569. జీవితం అపహాస్యమయ్యింది..మాతృత్వానికర్ధం మారిందనే..
4570. అమ్మతనమెక్కడ మిగిలింది..ఆడపిల్లని గర్భంలోనే చంపుకున్నాక..
4571. మాతృత్వమో అపురూపం..అమ్మలకదో పండుగందుకే..
4572. ముగించలేననిపిస్తోంది జీవితం..అతను ఆనతి ఇవ్వందే
4573. ఈరోజు విరహమైతేనేమి..రేపంతా నీతోనేగా..
4574. శిధిలాలుగా మారిన జ్ఞాపకాలు..ముక్కలవడమిదే తొలిసారి మరి..
4575. ఊసులు కన్నులకొదిలేసా..మన మనసులు కలిస్తే చాలనుకుని..
4576. తన గారడీ అదంతే..మత్తివ్వకుండానే తెలివి తప్పేలా..
4577. ఎన్ని పేజీలని తిరగేయాలో..చదివిందే చదివి విసుగొస్తుంటే..
4578. నీ తలపు పదిలమే..నిరీక్షణలో ఎందరొచ్చి నన్ను పలకరించినా..
4579. చివరిపేజీ చించేయకలా..మనం కలిసే రోజు ముందుండగా..
4580. కలనైనా నిన్ను వీడలేదెన్నడూ..మహానటినని దెప్పి పొడుస్తావే..
4581. భావాలకెందుకో కలవరం..నీ అక్షరంలో అందాన్ని వర్ణిస్తే..
4582. నువ్వో అపురూపం..జీవితాంతం నా తోడవ్వాలే కానీ..
4583. గులాబిపువ్వై నవ్వాలనుంది..నీ అక్షరంలా నేను పరిమళించాక..
4584. నీ తలపులోనే ప్రతీక్షణం..ఏ క్షణం ఊపిరాగితేనేముంది..
4585. నువ్వూనేనూ..మనల్ని కాదనేదెవరూ..
4586. కనిపించనీకు కంట కన్నీరు..నీ ధ్యాసలోనేలే నేనెప్పుడూ..
4587. నాలో ఆనందం..ప్రకృతిలో మౌనంగా తపస్సు చేస్తుంటే..
4588. కర్పూరమే నేను..నువ్వెప్పుడు హారతి కమ్మన్నా సిద్ధమే..
4589. ప్రతిజన్మకీ నేనేగా..నువ్వో బొట్టుగా నన్ను అలంకరిస్తావంటే..
4590. రెప్పలు మూసే ఉంచలా..కొన్ని కలలను రాసుకోవలిప్పుడు..
4591. వేయి సన్నాయిలు వినిపించాలనుకున్నా..ఒక్కసారి నవ్వి ఊరుకున్నానందుకే..
4592. మనసు ఘనీభవించింది..కన్నీరిప్పుడు కలలోని మాటగా మిగిలింది..
4593. గతంలోనే నే బతుకుతున్నా..వాస్తవంలో నువ్వు దూరమయ్యావని..
4594. నీ మాటే ఓ మంత్రదండం..నాలో మౌనాన్ని మాయం చేసినప్పుడు..
4595. అలగడమింకా పూర్తికాలేదు..నా పిచ్చి అనునయంతో తీరేలాలేదు..
4596. నిన్నటివే నా భావాలు..ఈనాడు నువ్వు గమనించావంతే..
4597. నా పేరిప్పుడు నచ్చింది..పలుకుతున్న నీలో ఆనందాన్ని చూడగానే..
4598. మనోవ్యథ మరుగునపడ్డది..మరలొచ్చిన స్నేహానికి..
4599. తనే సంతోషాన్ని కౌగిలించుకున్నాడో..నన్నీ బాధల్లో బందీచేసి..
4600. నా మనోవనమెంత పరిమళమో..నీ తలపులంటిన భాగ్యానికి..

No comments:
Post a Comment