Wednesday, 12 September 2018

4701 - 4800

4701. మనసద్దం పగిలింది..కన్నీటిలో నీ జ్ఞాపకాలు కొట్టుకుపోగానే..
4702. ఎన్ని అధికమాసాలుంటేనేమి..నిన్ను దూరం చేసిందిగా కాలం..
4703. నేస్తమై నే రానా..నీ గుండెతడిని తీసుకోడానికి..
4704. నీ మాటొచ్చి మంత్రమేసిందేమో..నా మౌనం పాటయ్యిందిప్పుడు..
4705. గాయం లోతుగా అయినట్టుంది..మనసందుకే ఖాళీ అయింది..
4706. మనసంతా సరిగమలే..నా పగటికలల్లో నువ్వు కనిపించినప్పుడల్లా..
4707. ఊపిరిగా తోడుండు తనకు..నిశ్వాసగానైనా నిన్ను వదులుకోదు..
4708. పొరబడుతున్నా నాలో నేనే..నీలో ప్రేమ నాదోకాదోనని..
4709. ప్రశ్నించవద్దనుకున్నా..నీ సమాధానం ఊహించగలను కాబట్టి..
4710. ఆకాశం ముసిరేది అప్పుడప్పుడే..జల్లు కురిసాక సంతోషమే..
4711. కలతల కలలే మిగిలినవి..కాటుకలు కన్నీళ్ళ పరమైనందుకిప్పుడు..
4712. నిట్టూర్పులే ఓదార్పులు నీకిప్పుడు..గుండె గదినందుకే మూసేయకు..
4713. ఎదలో ప్రతిష్టించాలనుకున్నా నిన్నే..క్షణాల్లో ముక్కలు చేస్తావని తెలీక..
4714. నేనే ఓ సంతోషం..సంబరాలతో పనేముంది నీకిక..
4715. ప్రతిపదముగా నిన్ను..ఏ రీతిగా పొగిడినా నిజమేగా..
4716. నా నవ్వులో సంగీతమిప్పుడు..పండగ మొదలైందని నువ్వన్నందుకు..
4717. తమవైపు చూసుకునేదెందరు..పరనిందతోనే పొద్దుపోతుంటే..
4718. చేయి చాచినప్పుడే అనుకున్నా..వానొచ్చి గుండెపై వాలుద్దని..
4719. కలందుకే మూగబోయింది..మనసు బరువై మాట కరువైనందుకు..
4720. ఎంత మధువని తాగుతావో..జ్ఞాపకాలే ఓదార్పని నిట్టూర్చుతూ..
4721. చూపులు దాటేస్తున్నా..కళ్ళు కలిస్తే కధలు మొదలవుతాయనే..
4722. నీ మనసు బంగారం..అందుకే వచ్చి చేరిపోయానందులో..
4723. మునుపు లేని వెలుతురు..నీ అక్షరంలోని నేనులా..
4724. గండికొట్టినట్టు కన్నీళ్ళు..ఎంత ఆవేదన గుండెల్లో మిగిలుందో..
4725. ముసురేసింది ఆకాశం..నా మనసుకి మల్లే శూన్యమైపోతూ..
4726. మనసుకి తప్పలేదు కాఠిన్యం..తను సున్నితమైతే లోకువవుతుందని..
4727. బంధమదే..మనసు బరువెక్కినా జీవితాన్ని సంభాళించడం..
4728. మనసు తలపోసినప్పుడే అనుకున్నా..నువ్వూ నన్ను వెతుకుతూంటావని..
4729. కట్టిపెట్టేసా కథలన్నీ..కలలన్నీ నిజమయ్యే రోజుందో లేదోనని..
4730. నా అక్షరాల్లో నువ్వు..కాదనలేని ప్రేమకవితకి భాష్యముగా..
4731. పరిమళాన్నందుకే వెంటేసుకొచ్చా..నీకో హాయిని అంటించి పోవాలని..
4732. మౌనం దూరమయ్యింది..నీతో మాట కలిపిన కొన్నిక్షణాల్లోనే..
4733. గుండె గుప్పెడంతే..ఆవేశమెందుకో అంతులేనంత..
4734. నా మాటలన్నీ పాటలే..నీకు నర్తించడం తెలియాలంతే..
4735. గమ్యమేదో తెలిసేదెలానో..ప్రయాణమంతా మలుపులతో సాగుతుంటే..
4736. సరికొత్త పులకలిప్పుడు నాలో..ఊహలు మొలకెత్తినందుకేమో ఎదలో..
4737. అదో బంధమని తెలిసిందిన్నాళ్ళకి..మనసులు కలిసిన చానాళ్ళకి..
4738. ఆవేదన దాచుకున్న మనసది..ఆనందాన్ని పంచడం తెలీనట్టుంది..
4739. ఉప్పెనంతా గుండెల్లోనే దాచుకున్నా..కళ్ళకు వరదొస్తే ఓదార్చేదెవరని..
4740. మనసు తేలిపోతుంది..నీ ఊహాల్లో చోటు నాకిచ్చావనే..
4741. పరవశిస్తూనే నేనుంటున్నా..నువ్వు సహచరివైన ఒక్క కారణానికి..
4742. నీ ఓదార్పునే పేర్చుకుంటున్నా..నా గాయాల అనునయానికి..
4743. నీ స్మృతులెంత మెత్తనివో..గులాబీలై నాలో పరిమళిస్తూ..
4744. కొన్ని జ్ఞాపకాలు..శ్రావణ మేఘాల్లా కన్నుల్లో కురుస్తుంటాయంతే..
4745. ప్రేమకిప్పుడో నిర్వచనం దొరికింది..ఎదలోని రూపం కావ్యమవ్వగానే..
4746. నేనంటే నువ్వే..అందుకే నీ చూపుకి ఆనలేదంతే..
4747. వేసావుగా వల..కలలతో కనులకి పనేముందీ పూట..
4748. ఊరుతూనే ఉంది మకరందం..నీ పిలుపు తీయందనాలకి..
4749. అలమటిస్తోంది నిశ్శబ్దం..నా మౌనంలో తాను ఇమడలేనని..
4750. కలలను ప్రేమిస్తానిక..నీ ఊహాల్లోనైనా నాకు చేయ్యూపావంటే..
4751. సంతోషమంతా సంగీతమైంది..జల్లొకటి ఆకాశం దాటి కురవగానే..
4752. గుండె నిండుకిందిప్పుడు..నీరెండిన కళ్ళలోకి నువ్వలా చూడకు..
4753. కలవరించి అలసిపోతున్నా..నిద్ర రాకుంటే కలనైనా ఏమొస్తావని..
4754. నా హృదయంలో సంగీతమిప్పుడు..నీ మాటల్ని ఆలకిస్తున్నందుకు..
4755. వర్తమానాన్ని విడిపించుకుంటున్నా..గతంలోనే జీవించాననిపిస్తుంటే..
4756. జీవితాన్ని గెలవాలనుకున్నా..నా ఆశల్లో అతిశయాన్ని గుర్తించక..
4757. ఆరనిజ్యోతిగా నువ్వు..నాలో తప్పిపోయిన ధైర్యాన్ని వెలికితీస్తూ..
4758. మనసుకి మరణమే ఇక..జ్ఞాపకాలు వలసపోయి నేనొంటరైతే..
4759. ఆగింది నా నడక..నన్ను దాటి నువ్వు దూరమైనందుకే..
4760. ఏకాంతానికని ఎదురుచూస్తున్నా..మనసు మౌనవిస్తానంటుంటే..
4761. పాదాల పయనం నీవైపు..గమ్యమై చేయిచాచి నిలుచున్నావుగా..
4762. వేణువంటే నాకిష్టమే..మన నవ్వులు తర్జుమా చేస్తున్నానందుకే..
4763. ఎన్నిదారుల్లో తిరిగితేనేమి మనసు..గమ్యంగా నిన్నే చేరుతుందిగా..
4764. ఎక్కడ పూస్తేనేమి పూలు..నాలో పరిమళాన్నైతే నింపేస్తున్నాయిగా..
4765. అర్హత కోల్పోయావ్ నువ్విప్పుడు..ప్రేమను ఎగతాళి చేసినందుకు..
4766. నీలోనూ ఓ పరిమళముందిగా..కొత్తగా పూలను వెతకడమెందుకో..
4767. వేకువదెంత సంబరమో..వెలుగురెక్కలు విప్పుకోవాలని..
4768. భావుకలుగా మారుతున్న కిలకిలలు..పక్షులు పాడుతున్న నవరాగాలు..
4769. ఆ మనసో బండరాయి..పూలబాణం తాకిడికీ పులకించలేదందుకే..
4770. ప్రేమనొదిలేసుకుంటున్నా..నా మనసునెలాగూ నువ్వు గుర్తించవని..
4771. రేయి అందం తెలిసింది..వేకువ కాగానే నక్షత్రాలు గల్లంతవుతుంటే..
4772. ఏడురంగుల ఇంద్రజాలమిది..ఆకాశంలో పూసి మనసుని కవ్విస్తూ..
4773. మనసందుకే పారేసుకున్నా..పిల్లగానే నన్ను ఆదరిస్తావని..
4774. నీ చూపెంత సున్నితమో..మనసు గాయమైనా తీపిగానే అనిపిస్తుంది..
4775. నీ ఊసులతోనే పొద్దుపుచ్చుతున్నా..కాలమెంత వేగవంతమవుతున్నా..
4776. తనిక రాడేమో..నా రాత్రులిక విషాదానికి నిలయాలు..
4777. మండిస్తున్న జ్ఞాపకాలు..పగటికలల్లా పదే పదే వచ్చిపోతూ..
4778. ఆనందమెప్పుడో కరిగిపోయింది..మనసందుకే తేలికైనట్టుంది..
4779. ఎంతానందమో అక్షరానికి..అలుకను రాసేందుకు పరుగెత్తుకొని వస్తుంది..
4780. కన్నీటికీ ఋతువుంటే బాగుండు..కాలంకాని కాలమెల్లా కురిసిపోకుండా..
4781. వరదల్లే రావాలనే ఉంది..నువ్వు మునిగిపోతావని ఆలోచిస్తున్నానంతే..
4782. జన్మలన్నిటికీ నీ తోడు..కలగా మారానని  కలవరపడతావెందుకూ..
4783. కష్టమవుతుంది మదికి..నా ఇష్టానికి పరీక్ష పెడుతున్నప్పుడల్లా..
4784. నా జీవితం వెలుగుతోంది..నీ అనురాగకిరణాల వల్లనేగా..
4785. నీ ప్రేమంతా నాదనుకుంటా..నా సంతోషం నీవైనప్పుడు..
4786. వేకువదేగా నీకు..నిత్యం నా పిలుపు మేలుకొలుపు..
4787. కొన్ని అనుభవాలు అపహాస్యాలు..జీవితాన్ని అబద్దం చేసేస్తూ..
4788. మనసు తడిచిపోతుంది..జ్ఞాపకాలు వెల్లువవుతుంటే..
4789. రోజుకో చిలిపి కవిత..నిన్ను తలుచుకు రాస్తున్నా నేనంతే..
4790. కలలెన్ని కనేసానో..తన ప్రేమంతా అబద్దమని తెలీక..
4761. జీవితమందుకే దారి తప్పేది..వర్తమానాన్ని గతానికి తోడ్కుపోతుంటే..
4762. మనసెప్పుడో సొంతం చేసుకున్నా..నీ క్షణాలన్నీ రాసిచ్చేసావని..
4763. సద్దుమణిగిందో విశేషం..నా ఆశలు ఆకాశంలోకి చూస్తుండగానే..
4764. అశాంతిని విడిచేయాలందుకే..కలగానైనా నీకు నేను మిగిలున్నందుకు..
4765. నీ ప్రేమను ఆమోదిస్తున్నా..మౌనంగానైనా నన్ను భరిస్తున్నావని..
4766. నా చిరునవ్వులు జాజిపువ్వులు..నీ మనసుకందుకేగా పులకింతలు..
4767. అలుకను పూసుకున్నానందుకే..నీలో నవ్వులు మొలకెత్తేందుకే..
4768. చెలిమొక్కటే నా అలంకారం..మనసు పరిమళమందుకే నీకు పంచా..
4769. కోటి మాటలు వినబడ్డాయందుకే..నీవొక్కసారి నన్ను చూసినందుకే..
4770. జ్ఞాపకాలెప్పటికీ నావెంటే..నీ చెలిమి ఎప్పటికీ వీడలేనందుకే..
4771. క్షణాలెంతకీ ఆగవు..కలలెన్ని నిజయయ్యేందుకు సమయమడుగుతున్నా..
4772. కలలందుకే రాసుకుంటున్నా..కొన్ని కవితలకు ప్రేరణిచ్చాయని..
4773. నమ్మకమనే నదిలా మనముండాలి..నిరంతరం పచ్చగా ప్రవహించాలంటే..
4774. కొన్ని క్షణాలంతే..నిరీక్షకే పరీక్ష పెడుతుంటాయి..
4775. అద్భుతం వెంట పరుగెడతావెందుకో..అపురూపాలు నిన్ననుసరిస్తుంటే..
4776. మధురాలను కలబోసుకోమంది ఆశ..అనునయాలు సేదతీర్చాయని..
4777. ఎన్ని మాటలు ముక్కలు చేసావో..నేనీ మౌనానికి చేరువయ్యానంటే..
4778. సిరి గంధాలెన్ని పూసుకున్నానో..వసంతాన్ని కౌగిట రప్పించేందుకు..
4779. ప్రేమనంతా చదివేసుకున్నా..నీ కళ్ళలోకి ఒక్కసారి చూడగానే..
4780. హాయివాన మొదలయ్యిందిప్పుడే..నీ మనసు నాకు తెలిసిందని..
4781. జ్ఞాపకాలు వ్యసనమైనందుకేమో..జీవితాన్ని అనుభవించలేకున్నా..
4782. విరక్తప్పుడే తీరిపోయింది..మనసులొకటై రక్తి మార్గాన్ని వెతుక్కోగానే..
4783. శ్రావణం చిన్నబోయింది..శిశిరాన్ని నువ్వారాధిస్తుంటే..
4784. కలకండలా నువ్వు..విరహంలోనూ తీపినే పంచుతుంటావు నాకు..
4785. అదే ఆనందం ప్రతిసారీ..స్వేచ్ఛను అనుభవిస్తున్న కలొచ్చినప్పుడల్లా.. 
4786. జాజిపూల గంధంలా అనిపిస్తోంది..నీ తలపుల సువాసనే అయ్యుంటుంది..
4787. నీ రాకతో నాలో సంతోషాలు..మృదుభావాల నా కవితల్లో చూడు..
4788. కొన్ని కలలకంతుండదు..పగలైనా పదే పదే కన్నులను తడుముతుంటాయి..
4789. ఆకాశమై నవ్వుకున్నానందుకే..వానవిల్లుగా నన్నంటుకుంటావని..
4790. ఎంత పరిమళాన్ని పూసుకుంటావో..తెల్లారినా కలలను వీడనంటూ..
4791. నీ జీవితం..నాకు ఆహ్వానం పలుకుతున్న ప్రేమగీతం..
4792. మనసయ్యిందప్పుడే..వెన్నెలరాత్రి నీ ప్రేమను విప్పినప్పుడే..
4793. నిర్వేదమెందుకో నీలో..మన ప్రేమలో అపశృతులు వెతుక్కుంటూ..
4794. పక్షిలా ఎగరడం నా నైజమది..గాయమైన రెక్కలు నీక్కనిపించలేదంతే..
4795. కాలమాగినా చేసేదేముంది..నువ్వందనంత దూరమెళ్ళాక..
4796. గుండె గుబులు తీరదెప్పటికీ..నీ చిరునవ్వులు దాచేస్తున్నకొద్దీ..
4797. అలసిపోక తప్పదుగా..జీవితపు అలలతో ఉరకలెత్తి పరుగులెత్తి..
4798. రేపటిని కలగంటూ ఉండు..నిన్నటి కల నిజమవ్వొచ్చు..
4799. ఊపిరిలో చలనమొచ్చింది..నీ తలపొక్కటి మెరవగానే..
4800. వెలిసిపోతూ కొన్ని జ్ఞాపకాలు..నీకు దూరమై పుష్కరమైంది మరి..

No comments:

Post a Comment