Wednesday, 12 September 2018

4401 - 4500

4401. జీవితాన్ని ప్రేమించాలందుకే..ఆశలు తీర్చుకోవాలనుకుంటే..
4402. నిరలంకారమైతేనేమి నేను..నాలో ఆశలకో అందముందిగా..
4403. ఆశల సంగతిప్పుడెందుకులే..మదిలో సంతకం నువ్వప్పుడే చేసేసావుగా..
4404. నాలో ఆశలు పురి విప్పినందుకేమో..ఈ ఉదయమెంతో ఆహ్లాదమైంది..
4405. ఆశల్ని రాయాలని సంకల్పించా..కలం కదలడమే మిగిలిందిక..
4406. కవితగా దిద్దాలనుకున్నా ఆశని..ప్రపంచమెటూ దూరమయ్యిందిగా..
4407. నాదో ప్రపంచాన్ని సృష్టించుకున్నా..హృదయానికి ఏకవచనం నువ్వయ్యాక..
4408. నేనెప్పుడూ అలౌకికాన్నే..నీ ఆశలు నాలో ఒంపి పోయావుగా..
4409. నీవొస్తావన్న ఆశలోనే బ్రతుకుతున్నానిలా..నాలో జీవం అడుగంటుతున్నా..
4410. కొన్ని జీవితాలంతే..నిరాశను పెనవేసుకున్నట్టు నిట్టూర్పులవుతాయి..
4411. నిరాశను నిద్దురలేపలేదందుకే..గెలుపుని వరించాలనే ఉరకలేస్తూ..
4412. కురిసిపోలేనా వెన్నెలనై..నీలో కొత్త ఆశలు చిగురిస్తాయంటే..
4413. నీ కవనంలో నేను..చోటిస్తే చిరు ఆశనైనా తీర్చుకోలేనా..
4414. దురాశైతే లేదుగా..నీ స్వప్నంలోకి రావాలనుకున్నా ఆకాశమై..
4415. నా ఆశలు నిలబెడతావనుకున్నా..మనసంతా అల్లుకున్నావనే..
4416. పండుగొచ్చినట్టుందిప్పుడే..నా ఆశలు నెరవేరే సమయమయ్యిందిగా..
4417. నా చిగురాశల్లో పరవశాలు..పులకింతలు పదివేలైనందుకే..
4418. ఎంతకని తడవాలో నే తమకంలో..నీ ఆశలు నన్ను ముంచెత్తుతుంటే..
4419. నిన్న లేని ఆనందం నాలో..నీ ఆశల్లో నాకు చోటిచ్చావని..
4420. నాదో చిన్న ఆశే  అనుకున్నా..కలగా నువ్వొచ్చి  కలవరం రేపేవరకూ..
4421. నిద్దురపొద్దులు నీపరం చేసా..నాలో ఆశలకు మూటకట్టి..
4422. పరవశాలు దిద్దుకోవాలనుకోలేదు..ఆశలు శూన్యంలోకి విసిరేసాక..
4423. మౌనంగా కదులుతూ కాలం..నా ఆశలను గమనిస్తోందేమో..
4424. అనంతమవుతూ కథలు..నా ఆశలు  ఒక్కొక్కటిగా రాస్తుంటే..
4425. కన్నుల్లో నీలినీడలు..నిరాశకెందుకు చోటిచ్చావని ప్రశ్నిస్తున్నట్టు..
4426.. మనసుపొరల్లో మరువాలు..నీ ఆశనై  ఒక్కమారు పరిమళించాలని..
4427. ప్రవహిస్తున్న నదిలా  నాలో పరవశాలు..నీలో ఆశ నేనయ్యానని..
4428. కలతలకిప్పుడు చోటే లేదు..నాలో  చిగురాశలు మొదలయ్యాయిగా..
4429. నా ఊపిరిగా నీవు..నా ఆశను గమనించి చేరినట్టున్నావు..
4430. పరధ్యానాన్ని వదిలేసా..నాలో ఆశల పూలు వికసించాక..
4431. మనసున ఊగుతున్న పూలు..ఏ పరిమళాలను వెదజల్లేందుకో..
4432. అక్షరాలు మూడైతేనేమి..మనసు పదానికెంతో అర్ధముందిగా..
4433. మనసు గతి ఇంతేనేమో..నిత్యం నీ తలపులతో పోరాడుతూ..
4434. మనసుగదిలో చీకటి ముసురుతోంది..అక్కడే  భయం పొంచి ఉందో..
4435. మనసులో విడిపోయినందుకేమో..కలవాలనే ఆసక్తి లేదిప్పుడు..
4436. మనసు చేసే మాయలేగా అన్నీ..వాస్తవంతో పనేముందిప్పుడు..
4437. మనసు నిగ్గు తేలిందిప్పుడు..నీ అభినందనలో తడిచినందుకు..
4438. విషాదం  నాదనుకున్నా..మనసు చేసిన మాయని తెలుసుకోక..
4439.. మనసులో మధురభావం..నా కన్నులు దాచాలనుకోలేదు..
4440. మనసు మనసుకో మర్మం..ఆర తీసే తీరికెవ్వరికీ లేదిప్పుడు
4441. మనసు కదిలే వేళయ్యింది..మల్లెలను ప్రేరేపించాలిప్పుడు..
4442. మనసంటే ఏమోననుకున్నా..నాది పోయాక నీలో వెతుక్కుంటూ..
4443. మనసుకెప్పుడో మాటిచ్చా..నిశ్శబ్దాన్ని తన దరి చేరనివ్వనని..
4444. మనసులో  మోగిన సన్నాయిలు..ఇన్నిరాగాలు నీ సమక్షానికివ్వాలని..
4445. మనసులో  ముసుగేయలేదు నేనెప్పుడూ..మౌనాన్ని వరించినట్టనిపిస్తూ..
4446. మనసు పాడిన మౌనగీతం..శోకం  ప్రవహిస్తున్న సంకేతం..
4447. అపశకునమెందుకో మనసులో..నీకు దూరం జరిగి నేనొంటరైనట్టు..
4448. మనసులో పచ్చదనం..చెట్లు చిరునవ్వులు ఊపినందుకేమో..
4449. దృశ్యకావ్యం నేనవనా..మనసులో నువ్వు చిత్రిస్తానంటే..
4450. కలలు కంటుంది కనులనుకున్నా..నీకు మనసివ్వక మునుపు..
4451. మనసులో జ్ఞాపకాల మూట..ఏకాంతాన్ని ధరించాలనుకున్నప్పుడల్లా..
4452. మనసు మెలిపెడతావెందుకో..ఊహల్లోకి రమ్మని పిలవగానే..
4453. అద్భుతమే నీ మనసు..నన్ను వరించి చీకటిని తరిమేసిందిగా..
4454.  మనసెందుకో వివశమైంది..నాలో వలపు రెక్కలు విప్పినందుకేమో..
4455. సంచలనమే మనసులో..కొన్ని ఊహలు పాడిన పల్లవులకు..
4456. కొన్ని కలలింకా మొదలవ్వలేదు..మనసు సహకరించనందుకే..
4457. అవిశ్రాంతమే  నా మనసు..నిత్యం నీ తలపులతో..
4458. మనసు గిచ్చిపోతావెందుకో..నాలో మెత్తదనమంతా  నీకేనన్నా..
4459. కొరివి పెట్టేసా మనసుకి..వద్దన్నా నిన్నే వాటేస్తుందని..
4460. చిరునవ్వు శృతి మించుతోంది..మనసు నీ జ్ఞాపకాన్ని తడిమినట్టుంది..
4461. నిశ్శబ్దాన్ని వినాల్సొస్తోంది..మనసెప్పుడు పగిలిపోతుందోనని..
4462. కష్టమొక్కటే మిగిలిందిప్పుడు..మనసున నువ్వు కనుమరుగవ్వగానే..
4463. మనసిచ్చావనుకున్నా..నీ ప్రతి మాటలో నన్నుంచుతుంటే..
4464. మనసు పరిమళమో ఇంద్రజాలం..నన్ను నీ మాయలోకి నెడుతుంది..
4465. మనసున వసంతం..నా చిరునామా నీదవ్వగానే..
4466. పారిజాతంపైన మనసు పడ్డా..నిన్ను అర్చించేందుకు మేలైనవని..
4467. అలలుగా కదులుతున్న భావాలు..మనసు సంద్రమైంది  కాబోలు..
4468. మనసో బొమ్మైంది నీ చేతుల్లో..నీ భావాలకి స్పందిస్తూ.,
4469. బంధీనైపోయా నీలో..మనసులో దాగుండమన్నావనే..
4470. మనసున వెన్నెల..నీ రాక నాకో పున్నమే మరి..
4471. కన్నీరెంత కుమ్మరించాలో..నీ మన్సులో తడి పుట్టించేందుకు..
4472. నా మనసో  మరకతమైంది..నీకిచ్చాక అందంగా అమిరి..
4473. వందనం చేసా నీ మనసుకు..నాలో నందనవనాలు సృష్టించావని..
4474. నీ మదిలో మునకలేయాలనుంది..నాకోసం నదివవుతావంటే..
4475. దారి తప్పిన వసంతం..ఏకమైన మన మనసుల్లో దాగిందిప్పుడు..
4476. ఎక్కడెక్కడో వెతుకుతున్నా..నీ మనసు పాడుతున్నది నన్నని  తెలీక..
4477. ఎన్ని కలలు రాసివ్వాలో..తొలిసారి నా మదిని మీటినందుకు నువ్వు..
4478. విషాదంలో నా మనసు..ఆశలు చేజారిన క్షణాలు తలపోస్తూ..
4479. ఎన్ని భావాలో నీకోసం..నా మనసు నీకంకితమైంది మరి..
4480. నీ రూపమే మనసంతా..కలలెన్నిసార్లు నెమరేసినా..
4481. ఎప్పుడు పాషాణమయ్యావో తెలీదు..నీ మనసిప్పట్లో కరగదేమో..
4482. కన్నుల్లో తడి లేదనుకుంటా వాళ్ళకి..మనసుకే తోలు కప్పుకున్నారో..
4483. గంధమై పరిమళించాలనుంది..నీ మనసు  నాతో ఏకమవుతానంటే..
4484. నిద్దట్లోనూ నిరాశలే..నీ మౌనం మనసుని మెలిపెడుతుంటే..
4485. ఓ కల్పన మనసుని తొందరపెడుతుంది..విరహాన్ని జయిద్దాం రమ్మంటూ..
4486. ఒంటరితనం దగ్గరయ్యింది..నా మనసుని నువ్వు తిరస్కరించాక..
4487. విషాదానికి అంతులేనట్టుంది..మనసు కావ్యాన్ని పూర్తిగా తడిపేస్తూ..
4488. నువ్వో వరమనుకున్నా..మనసు ప్రేమించడం నేర్చుకున్నాక..
4489. చందమామ చేతికి చిక్కినట్టుంది..నీ మనసు నా వశమవ్వగానే..
4490. గొంతుదాటి రానంటూ రాగాలు..మనసుకే విషాదమంటిందో..
4491. గుండెల్లో పొంగుతున్న సంద్రాలు..నీ మనసు లోతు ఆరాతీసినందుకే..
4492. ఏకాకితనం రెండింతలు..మనసు బరువెక్కుతున్న ఆనవాళ్ళు..
4493. ఏమరుపాటులో నేనుండిపోయా..నా మది నీలో వశం తప్పగానే..
4494. ఏకాంతమిప్పుడు బాగుంది..నీ మదిలోకి రమ్మని ఆహ్వానమందాక..
4495. నిన్నటి పలకరింపులో నేను..నా మనసంతా నీ జ్ఞాపకమైనట్టు..
4496. క్షణమాగనంటూ మనసు..నీ అనురాగంలో తడవాలనుందంటూ..
4497. మనసెందుకో వర్షిస్తోంది..ఈరోజు నీ పిలుపు కరువైనందుకేమో..
4498. అన్వేషనిప్పుడు ముగించేస్తా..మనసుకి నచ్చిన నువ్వు దొరికావుగా
4499. మనసివ్వక తప్పలేదు..దేహాన్ని దాటి ఆత్మని సృజించావుగా..
4500. విస్తరిస్తూ నా మది..నీ ప్రేమ ఆకశమై కప్పుతోంది మరి..

No comments:

Post a Comment