Wednesday, 12 September 2018

4601 - 4700

4601. పరిమళించనా రేయంతా..నా  తలపునే నువ్వు శ్వాసిస్తుంటే..
4602. ప్రేమో వరమే..మదిలోని ఆనందాన్ని కాజేయనంత వరకూ..
4603. వానలా తెరిపించింది..నా నవ్వులు దీపాలు వెలిగించాక..
4604. నాతోడు నువ్వే..వేకువైనా..వేదనైనా..చెదరని చెలిమిగా..
4605. చిగురంత ఆశే పెట్టుకున్నా..చెలిమందుకే చిత్రంగా దొరికిందిగా..
4606. నీ లేఖనెప్పుడో చదివేసుకున్నా..నా చూపులు ఆగలేనన్నప్పుడే..
4607. జ్ఞాపకమెన్నడూ మాసిపోదు..నిత్యం నా  ఆలోచన రంగులేస్తున్నాగా..
4608. నా ఆత్మనెందుకు విడిచెళ్ళావో..నిరంతరం నిన్నే జపిస్తున్నా..
4609. మనసో పూలసంత..నువ్వొక్కసారి మెదిలావంటే నాలో..
4610. ఆశలు వానలై కురిసాయి..కోరికలు  చల్లగా తడవాలనే..
4611. లెక్కలేని కథలెన్నో..నా రాజ్యానికి రాజువై నువ్వుంటే..
4612. పంచదార చిలకనే..తీపంటే ఇష్టమైతే నీకు నేను..
4613. ఆశలు కరిగిపోయిన బంధాలు..భాషకందని కన్నీరై ఒలికిపోతూ..
4614. నీ జ్ఞాపకం మెదిలినట్టయింది..నేనలా రెప్పలు మూయగానే..
4615. పక్షమెలా గడిచిందో  తెలీలేదు..నా పక్షాన నువ్వుండగా..
4616. కన్నీరూ కంపిస్తుంది..నీరుగారే ఆశల తోడు తనయ్యిందని..
4617. నీ వలపులో నేను..మనసంతా విరజాజులు చల్లినట్టు..
4618. నా ఆనందం అంబరమే..నీ  కోవెలలో వెలసినందుకు..
4619. నా కలలెప్పుడూ  కవితలే..రహస్యాన్ని దాచి చేసేదేముందని..
4620. నా హృదయం..ఆకాశమై ఎదురుచూసే అనంతం..
4621. ఒంగిన  ఆకాశమై నేను..అలవై నన్నంటే అవకాశమిద్దామని..
4622. సీతాకోకలా మారిపోయా నేను..నీ మనసంతా విహరించానే..
4623. తలపుగానైనా మిగిలావు..తన్మయత్వాన్ని తరగనీయనంటూ.. 
4624. నవ్వునవ్వాలనుకున్నా  నీ పెదవులపై..ఎప్పటికీ నీతోడు ఉండాలనే..
4625. కార్తీక పున్నమినే నేను..నీ జీవితంలోకి ఆహ్వానించావంటే..
4626. సంతోషం నా ఇంటిపేరు..జతకట్టావంటే జన్మ సఫలమైనట్టే..
4627. ఆనందమైపోయా నేనే..అపురూపమని నువ్వంటుంటే..
4628. మనసున వెన్నెల..ఈరేయి అమావస్యైతే నాకేంటి..
4629. సుమానికెంత అతిశయమో..సౌందర్యానికి తను మారుపేరయినందుకు..
4630. మనసుని తాకిన మాటొకటి..మదిలో వీణలు మ్రోగించింది..
4631. ప్రియమైన భావమే నువ్వెప్పటికీ..ఆ పుస్తకం ఆముద్రితమంతే..
4632. చిరుచెమటలు పట్టిస్తావు..హేమంతమని మరిచేట్టు..
4633. మరణం తప్పదు మనుషులకు..కనికట్టు విద్యలెన్ని నేర్చినా..
4634. పొలిమేర దాటించేసా భయాన్ని..నా ధైర్యం నువ్వనుకోగానే... 
4635. తపనల రాగం తెలిసిందిలే..నాలో వలపు చిందులేసినప్పుడు..
4636. మధువనమై ఊగింది మది..నీ తలపు పరిమళమద్దుకోగానే..
4637. ప్రేమింకా బ్రతికుంది..బంధం దూరమైనా జ్ఞాపకాల సాక్షిగా..
4638. అందం అలసిపోతుంది..నీ చూపులు కిరణాలై తాకుతుంటే..
4639. ఆ బంధం..కేవలం అక్షరాల్లోనే పరిమళిస్తూ..
4640. భావాల రాసులు కురవాల్సిందే..అనుభూతుల్లో నన్ను తడపాలంటే..
4641. నా మనసు ఆకాశమే..నువ్వొచ్చి తేలిపోవాలంతే..
4642. అందం అడవి కాచింది..పున్నమిని నువ్వు అమాస చేసాక..
4643. అమాస అలగడం నేర్చింది..పొగుడుతున్నందుకే పున్నమిని..
4644. అమాస ఉండి తీరాల్సిందే..వెలుగునీడల విలువ తెలియాలంటే..
4645. మోయలేని నీ తలపు..వలపొచ్చి విహారానికి రమ్మంటుంటే..
4646. చూపులు కలిసినందుకేమో..నీవైపు సాగుతూ నా అడుగులు.
4647. మనసు మెలిపెడుతూనే ఉంది..నవ్వుల మువ్వలలా రాలిపోతుంటే..
4648. సన్నజాజిలా నా అందం..నీలో పగటికలలను రప్పిస్తూ..
4649. ఆరారు కాలాలు మనకోసమే..ఆమని రాగాలు ఆస్వాదించమంటూ..
4650. మనసంత ఇష్టమయ్యావు నువ్వు..నీ వశమయ్యానందుకే..
4651. కన్నులు కలిపానందుకే..మనసులు ఒకటవ్వాలనే..
4652. నీ మౌనం..కొన్ని అనుభూతులను దూరంచేసిన విషాదం..
4653. కన్నుల్లో కనిపిస్తుంది మనసు..ప్రేమ ప్రవహిస్తున్న గోదారిగా..
4654. ఆగిచూసే కాలమైపోనా నేను..నీ ఆనందాన్నలా ఆస్వాదిస్తూ..
4655. నేనో విషాదాన్ని..అంతులేని వేదనంతా నిశ్శబ్దానికి అంకితమిస్తూ..
4656. కలలు సృష్టించిన స్వర్గమది..వాస్తవమైతే బాగుండని మది..
4657. భావాలతో బరువెక్కుతున్నా..అక్షరాలు సహకరించనంటుంటే..
4658. నవ్వుల్లో నిన్ను ముంచాల్సిందే..పదేపదే తడవాలని నువ్వంటుంటే..
4659. రెప్పలు చాటు చేసిన విషాదాలు..కలలు చెదిరిన మనసు విన్యాసాలు..
4660. వశమై నేనుండిపోలేనా..నిత్యం నన్నే ధ్యానిస్తూ నువ్వుంటే..
4661. సుళ్ళు తిరుగుతోంది జ్ఞాపకమొకటి..నన్ను పునురుజ్జీవనం చేయాలనే..
4662. జీవితం నేనై..నా ప్రతి అడుగులో జతగా నీవై..
4663. ఆశలన్నీ నీపరమే..నిరాశను నా దరికి చేర్చొద్దన్నావుగా..
4664. కలలు కావాలంటూ కళ్ళు..మనసంతా నువ్వు నిండినందుకు..
4665. నా రాత్రి సార్ధకమయ్యింది..నిన్ను కలగా రప్పించుకొని..
4666. ప్రవహించక తప్పని గాయాలు..మనసుకు వేదనవుతున్న కొద్దీ..
4667. నేనెప్పుడో తరించేసా..నీకై  నిరీక్షణలు కలగా ఫలించి..
4668. నీ సమక్షం సంతోషమే..మన సంబరాలలా మొదలవుతుంటే..
4669. వివర్ణమైన ఓ జ్ఞాపకం..మరోసారి నీకై ఎదురుచూసేలా..
4670. ఈరోజే సంక్రాంతైనట్టుంది నీ రాకతో..పండుగలన్నీ విస్తుపోయేలా..
4671. జీవించాలనిపిస్తుందింకా..నువ్వే నా లోకమయ్యాక..
4672. తరలిపోతూనే ఉంటుంది కాలం..వర్తమానాన్ని గతంలోకి మార్చుకుంటూ..
4673. కలతే మిగిలింది కలలోనూ..కన్నులు వర్షిస్తూనే ఉన్నాయని..
4674. అమాసకెంతకీ అర్ధంకాదు..వెన్నెల పడే వెండిచెర పాట్లు..
4675. భవిష్యత్తు ఆశాజనకమే..వర్తమానం వరమైనప్పుడు..
4676. ఎన్నాళ్ళు బెంగ దాచుకోవాలో..నిన్ను కలవాలనే ఆరాటమెక్కువవుతుంటే..
4677. నా చెక్కిళ్ళకెందుకో ఎక్కిళ్ళు..నన్ను తలచింది నీ మనసైతే..
4678. పున్నమికందుకే కబురెట్టా..వెన్నెలతోడుగా కాస్తైనా తాపం తీరుద్దని..
4679. వర్తమానం విసిగిపోతుంది..భవిష్యత్తుని ఆలోచించిన ప్రతిసారీ..
4680. ఇన్నాళ్ళందుకే ఎదురవలేదు..నీ కన్నులు చెమరించరాదని..
4681. మాటకందని మనసిక్కడ..మౌనాన్నందుకే ప్రవచిస్తోంది..
4682. మనసు కరువు తీరింది..ప్రతిక్షణం నువ్వు నన్నే తలచావంటే..
4683. సమయం విలువ పెరిగింది..నీ సమక్షపు సంతోషమది..
4684. ఎదురుచూపులిక్కడ..నువ్వొస్తున్నావనే కబురందుకుందిగా మనసు..
4685. ఊసుల్లో కొత్త రాగమొచ్చింది..నేనంటే ఇష్టమని నువ్వనగానే..
4686. ఆశలలా పూసాయి..మదివనంలో నువ్వు ప్రేమమొలకలు నాటగానే..
4687. వెన్నెలెప్పుడు సమానమయ్యిందో నాతో..నా నవ్వులన్నీ కాజేసి..
4688. మన కలయిక క్షణాలదైతేనేమి..నీకొరకో యుగమైనా నిరీక్షించలేనా
4689. మౌనం..నీపై వలపును దాచుకున్న నా మనసు మంత్రం..
4690. మౌనరాగంలో ఎంతో ఆర్తి..పెదవిప్పని నవ్వుల కాంతి..
4691. కవితగానైనా మిగులుతా నేను..నీ గతమయ్యే జ్ఞాపకములా..
4692. వర్తమానం నవ్వుకుంది నిజమే..గతంలోనే నేనింకా జీవిస్తున్నానని..
4693. మౌనమే నేస్తమయ్యింది..ఏకాకితనం దిక్కయ్యాక..
4694. కాలంతో కబురులాపేసా..గతాన్ని కెలికి గాయం చేస్తున్నాయని..
4695. సంతోషం సొంతమయ్యింది..విషాదాన్ని విడిచేయగానే..
4696. నా నీడంటే నువ్వేగా..నీరెండ గొడుగవుతూ ఎల్లప్పుడూ..
4697. కన్నులు ఆపలేని కన్నీళ్ళు..మనసు కురుస్తున్న ఆనవాళ్ళు..
4698. మనసు విప్పి చూడు..గుండె లోపలి సందడంతా నాదేగా..
4699. జీవితం వసంతమయ్యింది..నీ కవితల కౌగిట్లో పులకించగానే..
4700. మనసు బరువెక్కుతుంది..మాటసాయం కరువైతే..

No comments:

Post a Comment