Saturday, 15 December 2018

6601 - 6700

6601. అనవసరమే ఆ కొందరు..ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే ఆప్తులు..
6602. అనురాగానికి శృతి లేదంటావే..భావాలు వెల్లువలై ప్రవహిస్తున్నా..
6603. మనసు మత్తులో మునిగింది..నీ పాటకు పరవశించి..
6604. మౌనాన్ని భరించలేకున్నా..నీ అలుక నరకానికి సమానమవుతుంటే..
6605. నీ మాటలకర్ధాలు వెతుకుతున్నా..నా మనసిక్కడ వేదనవుతుంటే..
6606. నెలవంకలై నా అధరాలు..నీ మనసుని ఆకర్షించాలని..
6607. కొన్ని జీవితాలంతే..పాత కథల్లా మలుపులెక్కడా తిరగనంటూ..
6608. రుచులెన్నడో మరచిపోయా..విషమొక్కటే తలకెక్కుతుంటే..
6609. కొంత సంగీతం నేర్వాలి..జీవితం పాటగా సాగాలంటే..
6610. జీవితం నీపరం చేసా..ఉగాది రుచులు సమంగా అందిస్తావని..
6611. మాట పెగలనంటుంది..మౌనంపై మక్కువైందనేమో..
6612. ఎంత కవ్వింపో నీ కన్నుల్లో..నా మనసుని కేరింతల్లో ఊగిస్తూ..
6613. కదిలే జాబిలి నేనయ్యా..నన్నో పులకరింతగా నువ్వనుకోగానే..
6614. కృష్ణబిలంగా మారింది మనసు..నీ నిరీక్షణలో నిట్టూర్చుకుంటూ..
6615. ఊహల కలబోతే ఉగాది..రుచులేకమైన పండుగై మనకంది..
6616. మనసు ఘుమాయించింది..నీ జ్ఞాపకాల పూతలు పరిమళించి..
6617. నీ సరసమేనది..సమక్షాన లేకున్నా నన్ను మురిపించేది..
6618. పరిమళించి చానాళ్ళయింది నేను..నీ పిలుపందలేదని మరి..
6619. చందమామలా నీ నవ్వు..చల్లగా నన్నిట్టే ఆకర్షిస్తూ..
6620. పొరుగింటిపుల్ల కూర పొగడరాదందుకే..పస్తు పడలేనని నువ్వనుకుంటే..
6621. విషాదం అలవాటుగా మారింది..నవ్వులకి నేను లోకువయ్యేసరికి..
6622. పసిడినై మెరుస్తున్నానందుకే..నీ వలపు నాలో వెలుగుతున్నందుకు..
6623. వసంతమై నా పరిమళం..చైత్రానికి వన్నె తెచ్చిందందుకే..
6624. నవ్వులందుకే నటిస్తున్నా..మనసు తడి మధ్యలోనే ఆపేస్తూ..
6625. నిత్యమల్లెనై ఉండాలనొచ్చేసా..నీ కలవరాన్ని ఆపాలని..
6626. నెమలీక..ఇప్పటికీ మెత్తగా నన్నంటే ఓదార్పు..
6627. పున్నమై పులకరిస్తున్నా_నీ మాటలు మదిలో వినపడ్డందుకు..
6628. అందని ద్రాక్షని సరిపెట్టుకోవడమే..అందిన ఫలాన్ని ఆస్వాదిస్తూ..
6629. లిప్తలో లుప్తమైపోయా..నీ కోపగ్నిలో మాడి మసైపోయి..
6630. ఈ క్షణమో విస్పోటనం..నాలో ఆనందం గుప్పుమన్నందుకే..
6631. అంతరాత్మొక్కటే సత్యము..ఎవరెన్ని ముఖాలు ధరించిననూ..
6632. నా నవ్వులు వెన్నెలిస్తాయి..నువ్వు పున్నమిని తలచినప్పుడల్లా..
6633. మాటలన్నీ ముగ్ధమయ్యాయి..నువ్వు మౌనాన్ని వరిస్తావని తెలీగానే..
6634. మది గాయాల లెక్క చెప్పమన్నాడు..గేయాలుగా రాసానని నేనంటే..
6635. మనసు మరుగునపడ్డది..నీకు నచ్చినట్టు నన్నుండమనగానే..
6636. ఇంద్రజాలికుడనుకున్నా..ఒక్క చూపుతో నా గుండె జార్చి గల్లంతుచేయగానే..
6637. నిరాశ గెలిచిందలా..ఉన్న ఆశ నిట్టూర్పులో జారిపోగానే..
6638. నిద్దట్లోనైనా కలవాలనుకున్నా..కలంటూ ఒకటొస్తే..
6639. ఒక్క గాయమూ మానలేదిప్పటికి..నేనిలా లెక్కేస్తూ కూర్చున్నా..
6640. జ్ఞాపకాలింకా ఏరుతూనే నేనున్నా..ఏదో క్షణంలో నువ్వొస్తావనాశిస్తూ..
6641. నీడవైతేనేమిలే..అనుక్షణం నీ సమక్షం నాకానందమేగా..
6642. జ్ఞాపకాలు పాతవే..బాధేంటో కొత్తగా..
6643. గుట్టెక్కువే కన్నీటికి..కళ్ళు ఒలికితే కార్యం సిద్ధించదని..
6644. కథగా నేనెప్పుడో మారాను..కవితగా రాసుకున్నావందుకేగా..
6645. అడుగు దూరంలో నేనాగిపోయా..నువ్వు ముందడుగు వేస్తావని..
6646. ప్రతి వేకువలో అరంగేట్రమే..వసంతాన్ని వలపించింది అందుకే మరి..
6647. ప్రకృతికెన్ని పరిహాసాలో..అప్పుడప్పుడూ ఋతురాగాల్ని శృతి తప్పిస్తుంది..
6648. మేఘమాలకీ కష్టాలున్నట్లున్నాయి..సందేశాలు మోయలేనని కురిసిపోతున్నయ్..
6649. మల్లెల మోత మొదలయ్యింది..జాజులు జారుకోవాలి మరి..
6650. మనసిప్పుడు చల్లబడింది..మల్లికలా నువ్వు పరిమళించగానే..
6651. పులకరిస్తూనే నేనున్నా..నా పేరంత తీయగా పిలిచావని..
6652. అవనిగా  ఆమె..అస్తిత్వాన్నలా అతని ముందు కాపాడుకుంటూ..
6653. అలలు కోసినట్టు నా మది..నీ తలపుల నునుపుదనం అంటినట్టుంది..
6654. నీ కలలెప్పుడూ అల్లిబిల్లివే..కనుమూస్తే చాలు కవ్వింతలిస్తూ..
6655. ఈ సువాసనలేంటో కొత్తగా..మనసుని మంత్రిస్తూ మెత్తగా..
6656. నా కనులెప్పుడూ వలలే..నీ రూపాన్ని బంధించాలనుకుంటూ..
6657. సందడంతా నీదేగా..సందిట్లోకొస్తానని మాటందుకున్నాక..
6658. నీ ఆదమరుపెన్నడో కనిపెట్టేసా..వేసవని మల్లెలను ఆరాతీసా..
6659. కల్యాణిగా నేను..కదనకుతూహలంతో నువ్వూ..
6660. నీలో నేను సగం..కాదంటూ వాదించడం మూర్ఖత్వం..
6661. నా నవ్వులు మరందాలు..నువ్వు కారణమయ్యే ప్రతిసారీ..
6662. అనుభూతి బాగుంది నాకు..నవ్వులేరుతున్న దృశ్యముగా  నువ్వు..
6663. మనసెంత దాచుకుందో మరందం..అధరం పొంగిందిలా ఆనందం..
6664. సుప్రభాతమని గుర్తుచేస్తున్నా..వసంతగీతాన్ని మనసు పెట్టి వింటావని..
6665. అంది నీకు తీయనవుదామనుకున్నా..దూరమై చేదు మిగుల్చుతావనుకోలా..
6666. నా మనసిప్పుడు విశాలమంటా..అందులో నువ్వు ఆకాశమంత..
6667. కష్టమైనా ఇష్టంగానే ఉంది..నీ ఇంటిపేరిప్పుడు నాదవుతుంటే..
6668. ముందు వెనుకల గోలెందుకులే..కలిసి నడిస్తే సరిపోలా మనం..
6669. నేనో ఎండమావినే..దాహం తీర్చుకోవాలని చూడబోకు ఆర్తిగా..
6670. మనసయ్యింది మనోహరాలు..నువ్వేయగానే కంఠహారాలు..
6671. నివేదనలోనూ  నిరంకుశమే..ప్రతిక్షణం చెలి నామజపం..
6672. నా వలపు నీమీదనే..తొలి తలపుగా మొదలయ్యావనే..
6673. కొన్ని భావాలంతే..సందర్భోచితంగా సవ్వడిస్తాయి..
6674. వృధా ప్రయాస..గమ్యం చేరినా నువ్వు కానరాకపోవడం..
6675. రాగాలను తోడు తెచ్చుకున్నా..నీ మౌనాన్ని చెదరగొట్టాలనే..
6676. పాదాలను దాచేసాను..పదాలతో ఎక్కడ అర్చిస్తావోనని భయపడి..
6677. నవ్వులనిప్పుడు రువ్వలేను..నిదురలేదనే నీ నిందలనీరాత్రి మోయలేను..
6678. బంగారానికున్న వన్నె పెరిగింది..నిన్నంత ముద్దుగా పిలిచినందుకేగా..
6679. పౌర్ణమేగా నీ మది..నా రూపాన్ని తలచినప్పుడల్లా..
6680. నా అందానికో వెలుగొచ్చింది..నువ్వు వర్ణిస్తున్నావని తెలియగానే..
6681. మల్లెగాలి వీచినప్పుడే నీకు తెలియాలి..సంధ్యా సమయానికి నే సిద్ధమయ్యానని..
6682. పూల గమ్మత్తులో నేను..వలపు వసంతమాడేందుకు రమ్మనగానే..
6683. అక్షరాల సువాసనకే సోలిపోతావు..భావాలు శృతిమించితే  ఏమవుతావో
6684. వేపపువ్వంటే నాకు మక్కువే..చేదులోని తీపి మనసుకందిస్తుందని..
6685. మోదుగు పువ్వులై నీ మాటలు..మనసుకెన్ని గిలిగింతలిచ్చేనో..
6686. అపరాహ్ణం వరకూ నేనాగలేను..మంకెనే  కావాలంటూ నువ్వు  మురిసిపోతుంటే..
6687. నీ రాకతో నేను..ఎప్పటికీ వాడిపోని ఎర్ర మందారాన్నే..
6688. ఆనందభైరవిగా  మారిన అభేరి..నీవందించిన పూల సాన్నిహిత్యానికి..
6689. రేరాణిని తలపిస్తూ నీ నవ్వులు..పరిమళాలు  పూసినట్టు ప్రతిసారీ..
6690. నా చూపు నిన్నెప్పుడో చుట్టుముట్టింది..కొత్తపూల సువాసనై ఆకర్షించగానే..
6691. అల్లరి మాటలన్నీ నీపరమయ్యాయి..పూలగాలి పెనవేసినట్టు ఎదురైనందుకు..
6692. జాజులంటే పడి ఛస్తున్నా..జాజిరినాపమని మాత్రం అడగమాకిప్పుడు..
6693. కొత్త ఆశలకు ఆజ్యం  పోయాలనుకున్నా_ఓ పుస్తకంగా మిగులుద్దామని..
6694. విషాదం వీడనంటుంది..కొన్ని నిరాశల ఫలితమనుకుంటా..
6695. కొలువుండిపోనా నీ ఆశల్లో..అనుభవం నాదవుతుందంటే..
6696. ఏకాకిగానే మిగిలిపోతున్నా..నీ ఆశ  తడుముతుందనే ఎదురుచూపుల్లో..
6697. సమాధానమెప్పటికీ దొరకదేమో..నిరాశల్లోనే  ప్రశ్నలుంటుంటే..
6698. సమాధానమెప్పటికీ దొరకదేమో..నిరాశల్లోనే  ప్రశ్నలుంటుంటే..
6699. నేర్చుకోడానికేం మిగిలింది..నిరాశకు ఆజ్యం పోస్తూ మనసుంటే..
6700. ఆత్మను కౌగిలించుకున్నా..ఆశ ఎలానూ పోగొట్టుకున్నానని..

6501 - 6600

6501. పరవశమేదో మదిని తాకింది..సున్నితంగా నువ్వు పెనవేసినందుకే..
6502. ఆశలన్నీ పొదిగి ఉంచానందుకే..ప్రేమ పలకరిస్తే బదులివ్వాలని..
6503. నే చిరంజీవిగా మిగిలిపోతా..నీ చిరునవ్వులు వసంతమైతే..
6504. నాలో తెలియని మైమరపు..నీ నవ్వేం మంత్రమేసిందో..
6505. బుగ్గ చుక్క పెట్టింది సిగ్గులే..మాఘమాసం దగ్గర్లో ఉందని..
6506. మరువమలా పరిమళించింది..మల్లెలతో కలిసి రెట్టింపు గిలిగింతివ్వాలని..
6507. మనసంతా మధువూరినట్టే..నీ మాటలే తలపుకొస్తే..
6508. నీ సంతోషం నాదయ్యింది..అల్లిబిల్లిగా నువ్వు ఆకట్టుకున్నందుకే..
6509. వేకువకి తొందరెక్కువైంది..చీకటిని చేధించాలని..
6510. సిగ్గుల కెంపు దాయాలనుకున్నా..నా మది నువ్వు కనిపెట్టేస్తావనే..
6511. నువ్వు పాడితే వినాలనుందట..తెలిసిన పాటైనా సరేనంటూ మనసు నస..
6512. మరో మొక్కై మొలకెత్తనా..రాలిన పత్రమై మట్టిలో కలగలిసినా..
6513. వసంతం నాలో రాగమిప్పుడు..చైత్రపువ్వులు విరబూయాలంతే..
6514. ఎన్ని పదాలు కుమ్మరించాలో..నాలో మధువునంతా రాయాలంటే..
6515. సుగంధం నీవల్లేననుకుంటా..మనోభావాలు నాలో పరిమళిస్తున్నాయంటే..
6516. పలకరించాలనుంది నిన్నే..నాకై నిరీక్షిస్తున్నావంటే..
6517. విషాదం పూర్తిగా రాలిపోయింది..వసంతం వాయిదా పడదిప్పుడు..
6518. వివశమైనట్టు మనసు..పున్నమిని ఊహించిన రేయిలో..
6519. నెమలికన్నుల మెరుపులు..ఆ చిన్నప్పటి పుస్తకాన్ని తెరిచి చూసినందుకే..
6520. ఏకాంతం తలుపు తట్టింది..వెన్నెల చారను నాపై ప్రసరించేలా..
6521. ఆగనంటుంది వసంతం..నీ జ్ఞాపకాలు తరుముతుంటుంటే..
6522. వెన్నెల పరిమళం నా సొంతమైంది..ఒకజతగా మనమయ్యామని..
6523. వియోగాన్ని తిట్టుకుంటూ నేనున్నా..విరహమూ మధురమని తెలీక..
6524. ప్రేమని విస్మరించకు..కలనైనా నిన్ను నిద్రలేపుతుంటా..
6525. మల్లెలు మంటపెట్టింది మనసుకేగా..పరిమళమందుకే తలకెక్కింది..
6526. వియోగాన్ని ముగించేస్తాలే..ఊహల్లో నా స్పర్శని అందించైనా..
6527. కలలను పిలుచుకొస్తానుండు..రేయంతా సందడి చేసేలా..
6528. ఎన్ని కలలని అనువదించాలో..నా కథ నువ్వు మెచ్చాలంటే..
6529. కల్లోనైనా కలుసుకుందాములే..ఈరోజైనా నిద్ర నన్ను వరిస్తే..
6530. నేనో ప్రేమాత్మని..అనుభూతిగా నన్ను రాస్తూ పోవాలంతే..
6531. మధురభావమైతే నువ్వేగా..నాలో నిద్రించిన రాగాన్ని ఓలలాడిస్తూ..
6532. మాటలతో అలజడి రేపకలా..మనసు మౌనాన్ని ఆశ్రయించేలా..
6533. శిశిరాన్ని పిలవలేదందుకే నేను..పచ్చదనాన్ని చూసి విస్తుబోతుందని..
6534. పలకరించడం మానేసా కలల్ని..వేళంటూ లేక ఏడిపిస్తున్నాయని..
6535. తుఫానులా నువ్వు...ఊహించని వర్షంలా కలల్లో కురిసిపోతూ..
6536. నిద్దుర చెదరనీకు..కలలో వెన్నెలకు తడిచానని భ్రమించి..
6537. అనురాగం నా బలహీనత..అందమెందుకు నిన్ను ఆకట్టేందుకు..
6538. ఆగనంటూ జ్ఞాపకాలు..వేదన కురిసి మనసు తేలికయ్యేందుకు..
6539. నీ తలపులే సుమాలు..నా ఆరాధన పూర్తయ్యేందుకు..
6540. మమతలంటే మనవే..కథగా మారామంటే..
6541. వెన్నెల్లో సడివే..నిద్దురను దూరం చేసిన రాగమై...
6542. క్షణాల గడుసుదనం చూడు..మనల్ని కలిపెలా కదిలిపోతుందో..
6543. వెచ్చదనమిప్పుడు తెలుస్తోంది..నీ అలుకతీరి నన్ను పలకరించగానే..
6544. మనసు పాడే సంకీర్తనది..మౌనంగా నిన్ను అల్లుకున్నదది..
6545. విలువ పెరిగింది కన్నీటికి..నా విరహాన్నీనాటికి గుర్తించావని..
6546. దూరం తెలియని మనసులవి..మనువు కలానికి అందనివి..
6547. తడికన్నుల నవ్వులివి..ఆర్తి తెలిసిన మనసుకి మాత్రమే తెలిసేవి..
6548. కాగితాన్నిక తడవనివ్వకు..తడవ తడవకు కన్నీటిని రాస్తూ..
6549. నీ వలపుకి చిక్కుకున్నా నేను..ఎగరాలనుకున్న నాకు వల విసిరావని..
6550. ఉషస్సులేని జీవితాలే కొన్ని..జ్ఞాపకాల చీకట్లలో మగ్గిపోతూ..
6551. అంతమవని నా ఊహలు..అలవిమాలిన నీ అనురాగానికి..
6552. మనసు మెచ్చిన భావమొక్కటి..నీ పదముగా నన్నలరించింది..
6553. సద్దుమణిగింది పొద్దు..రద్దయిన ముద్దులతో..
6554. అనుసరిస్తున్న పాటే..నువ్వు పాడుతుంటే నన్ను కనుగొన్నా..
6555. శృతిగా మార్చుకున్నాలే..నా లయని సమంగా పాడుతున్నావని..
6556. మాట వినదెప్పటికీ మనసు..తీరని ఆశలను తలపోసుకుంటూ..
6557. పులకింతలు నిజమే..పండగై నువ్వొచ్చావుగా..
6558. హద్దులేక కురిసింది ప్రేమ..నువ్వు సిద్ధమన్నావని తనతో..
6559. ఎన్ని పాటలు రాసుంటావో నువ్వు..నా నవ్వులకు బాణీలు కడుతూ..
6560. ప్రాణమలా నిలబడింది..నీ పలుకులు అమృతమై కురిసాక..
6561. విలువైన ముత్యాలవి..కన్నులు రాల్చే నీటి చినుకులు..
6562. మౌనం వలపయ్యింది..ఇన్నాళ్ళూ మాటలు వెతుకుతూ కూర్చుంది..
6563. ఎన్ని క్షణాలు నిశ్శబ్దమయ్యాయో..నీ ఆరాధనా ఆలాపనల్లో..
6564. అలసటలా తీరుతుంది..ఆనందభాష్పాలు వెదజల్లుకుని..
6565. ఆనందమంటే స్వర్గమే..నా జతగా నువ్వు నిజమయ్యాక..
6566. అదే మత్తు..నీ పొగడ్తగా నన్ను ముంచెత్తింది..
6567. కుతూహలం నిజమే..నీ కవనంలో నన్నెలా చిత్రిస్తావోనని..
6568. జవాబివ్వలేకున్నా..నీ అనుభూతుల మహోద్వేగాన్ని దాచుకొని..
6569. ఇవేమి చురకలనుకున్నా..నీ చూపులు గుచ్చుకున్నాయని తెలీక..
6570. కలతలకి జలగండమట...దిగులు మేఘాన్ని మధించే సమయమయ్యింది..
6571. కాలానికి జాగరణే...మన ఇద్దరి దాగుడుమూతలు ముగిసేంత వరకూ..
6572. రంగవల్లయింది రమణి...ఎన్ని తీపికలలు నెమరేసుకుందో మరి..
6573. జ్ఞాపకాల తోడయ్యింది జీవితం..నిరంతర నీరవంలో నన్నుంచుతూ..
6574. పదములు కదిపా నీతోనే..జతగా నేనై సాగాలని..
6575. రంగులకలలా జీవితం..నిద్దురలోనే బాగుందనిపిస్తూ..
6576. మనసు మెచ్చిన పరిమళం నీది..ఏ పువ్వుకీ లేని సువాసనది..
6577. అదృష్టం కొద్దీ ఆనందం..ఉత్సవానికి వేళయితే అంతేగా..
6578. కాలానికి తెలిసిన కదలికలు..జీవనాన్ని నడిపే చక్రాలు..
6579. ఊరింతలు ముగిసినట్టున్నాయి..ఊహలు దూరమై వాస్తవం ఎదురైనందుకే..
6580. జీవితం రంగులమయమే..చీకటిని వదిలి వెలుతురు చూడాలంతే..
6581. నీతోనే నేనుంటా..సంతోషాన్ని అనుభూతించాలంతే..
6582. అంతరంగం మృదువయ్యింది..కొన్ని భావాల సున్నితత్వానికే..
6583. నీడకి తెలియని నిజం..నడుస్తున్న ఆలోచనలో తనులేదని..
6584. కదలాల్సిందే అక్షరం..నిద్రించిన చీకటికి వెలుగుందని తెలియాలంటే..
6585. ఎక్కడుందా ఆత్మీయ స్పర్శ..పలుకులన్నీ పాకంచేసి పంటికిందేసుకుంటే..
6586. గుండెను జార్చుతున్న భావాలు..మైమరపును ఓర్చుకోలేనంతగా..
6587. మధువంతా నీకోసమేలే..మనుగడై నువ్వు తోడయ్యావుగా..
6588. చెలిమెప్పుడూ తీయనిదే..చేదు రుచి చూపేవారు లేనంతవరకూ..
6589. ఊహలతోనే బంధమేసేసా..కొన్ని ఊసులైనా నీకు చేర్చాలని..
6590. ఉగాది కలలో కొచ్చినట్టుంది..మనసు పండుగను పిలిచింది..
6591. మనసు తడిచింది దేనికో..కురిసింది వాన ప్రకృతిలోనైతే..
6592. అంతరంగమే రణస్థలమైంది..కొన్ని విరుద్ధభావాల వైరాలతో..
6593. కవనమవ్వాల్సిందే స్నేహం..కలతలన్నీ తీరాయంటే..
6594. అమాస వెన్నెలైపోదా..నీ మాటల్లోని వెన్నను ఆరగించిందంటే..
6595. అర్ధం కాని కలలెన్నో..నిద్దురలేవగానే వేకువకి ముగిసిపోతూ..
6596. నిశ్శబ్దం పాటయ్యిందెప్పుడో..నీ మౌనానికి మాటలే రానప్పుడు..
6597. పగటికలల సిగ్గులేమిటో..మత్తులోనే నన్నుండమంటూ..
6598. అనుభవానికందని కలలే అన్నీ..వేకువకి మరుపులో జారిపోతూ..
6599. జన్మజన్మల సంబంధమే..ఈ జన్మకిలా ఒక్కటి చేసింది..
6600. అలలకు అలుపు తెలీదస్సలు..తీరం కౌగిట చేర్చుకుంటుందనే..

6401 - 6500


6401. పలచబడినట్టుంది చీకటి..వేకువ విచ్చుకున్నందుకే..
6402. అపస్వరాలను ఆలపించకలా..నాలో భావాలు వలసపోయేలా..
6403. వెన్నెల నవ్వుతున్నది నిజమే..మన అనురాగాన్ని తొంగిచూసిందిగా..
6404. అపాత్రమయ్యింది ప్రేమ..విలువలెరుగని అతని స్వార్ధాన్ని తెలుసుకోలేక..
6405. వెలుతురు విలువ తెలుసుకుంది చీకటి..అందుకే పక్కకి తొలిగింది..
6406. మనసుకో గమ్యముందనుకున్నా..జన్మజన్మలుగా నిన్నారాధిస్తుంటే..
6407. మాటలతో ఏమార్చకలా..మనసునిన్నిసార్లు మభ్యపెడుతూ..
6408. మధురమేగా మన బంధం..కొన్ని జన్మలుగా కలిసున్నామంటే..
6409. వెన్నెల చిక్కబడింది..కార్తీకాన్ని అనుభూతికి అందించాలని కాబోలు..
6410. నిట్టూర్పులే..నన్ను రాయలేని నీ అసహాయతను నిందిస్తూ..
6411. కలల్లోకి తొంగిచూడకలా..నాలో కేరింతలన్నీ కులుకులయ్యేలా..
6412. విషాదమే మిగులుతుందేమో..పదేపదే విషాన్నే స్మరిస్తే..
6413. జ్ఞాపకాలను రాయాలనుకున్నా..అక్షరం సాయమొచ్చిందిలా..
6414. కనుబొమ్మలవంతే..కాంచినవారికే కనువిందులు చేస్తుంటాయ్..
6415. మౌనం పాటయ్యింది..నీ మాటలు పల్లవులై మొదలవ్వగానే..
6416. మతి పోతుందిక్కడ..ఎంతమంది నన్ను వలపిస్తున్నారో తెలిసి..
6417. మిసమిసలెన్నో నీ అక్షరాలలో..మనసుతో నన్ను చదివించేస్తూ..
6418. నక్షత్రాలు కుమ్మరించినట్లుందిలే..నీ పలుకుల అభిషేకాన్ని ఆస్వాదిస్తుంటే..
6419. హడావుడెక్కువే అక్షరానికి..మనసునందుకే బయటపెడుతుంది..
6420. కలలు హత్తుకున్నది మనసునే..రేయంతా మత్తిల్లినది కన్నులైనా..
6421. స్వర్గం ప్రాప్తించింది నాన్నకు..నరకాన్ని తప్పించాలనే మరి..
6422. కన్నులు ఎర్రనయ్యాయి..వియోగాన్ని పాడి అలసిన కోయిల మాదిరి..
6423. చీకటలా చెదిరిపోయింది..మనసు ప్రేమను కాస్త పులుముకోగానే..
6424. కాలానికి చిక్కని అనురాగం..నీ పాటందుకే నాకపురూపం..
6425. తరలిపోయిన చిరునవ్వు..విషాదాన్నెందుకు స్మరించిందో మనసు..
6426. మనస్సంఘర్షణది..శోకం అడ్డుపడి మౌనాన్ని ముసుగేసుకుంది..
6427. అక్షరమై మురవాలో భావం..మనసులోటు తీర్చే చెలిమిగా..
6428. ఆగిపోయిన ఊహ మొదలయ్యింది..నువ్వలా వెన్నెల్ని గుర్తుచేసాక..
6429. కనులిప్పుడు కథలు..కన్నీటిలో పన్నీరు కలిసిందని మురిసిపోతూ..
6430. చిలిపిదనం మన సొంతమైంది..నీ మనసు నాదైనప్పుడేగా..
6431. ఒక్క పలకరింపు చాలుగా..మనమో చెలిమిబంధంలో ముడిపడేందుకు..
6432. నాలోనే నువ్వు..ప్రపంచంతో పనేముందసలు..
6433. మధురమైనదే నీ ఊహ..మనసందుకే నీకు దాసోహమైంది..
6434. కొన్ని నిముషాలు అపురూపమే..నీ సమక్షాన్ని నాకిచ్చినవి..
6435. కలలో కలుస్తావేమో నన్ను..నీ భావాలందుకే మెరుస్తున్నాయి..
6436. కబుర్లు కోటి చెప్తావు..క్షణాలు ఇట్టే కరిగేట్టు..
6437. మనసింక పారేసుకోవద్దనుకున్నా..నువ్వు తిరిగివ్వలేనంటుంటే..
6438. వెన్నెలై కాసింది నేనే..మనసుకి ఉక్కబోసిందని కబురెట్టావని..
6439. నాలో భావం అనంతమైంది..నిన్ను రాయడం మొదలెట్టగానే..
6440. ఎప్పుడూ నువ్వనే సాగదీస్తావు..నేనేదో నువ్వు కానట్టు..
6441. కొన్ని మాటలందుకే దాచేసా..మౌనంలో నన్ను చదువుకుంటావని..
6442. మౌనం ముగిసింది..నీ మాటలు పదేపదే స్మరించుకున్నందుకే..
6443. పరిచయం పరవశమయ్యింది..నిన్ను చూసినంతనే భావాలు పరిమళించి..
6444. తళుక్కుమంటున్న మనసు..నీ కన్నుల్లో స్వప్నాలు నావేనని..
6445. మనసందుకే వలచింది నిన్ను..కన్నుల్లో ఎప్పటికీ నన్ను దాచుకుంటావని..
6446. ఎప్పుడూ అదే మాట..నువ్వెప్పుడిన్నావో నా పాట..
6447. నీ మనసుని ఆలకించలేదెన్నడూ..నే మౌనంలో మునిగినందుకేమో..
6448. మనసు తలుపులు మూసేసావనుకున్నా..నీ కన్నుల్లో నన్ను చూసుకోగానే..
6449. ఎన్ని భావాలో నాలో..మునుపులేని నిన్ను స్మరించినప్పుడల్లా..
6450. విషాదాన్ని వెనక్కి పంపుతాలే..వరమై నన్ను వరిస్తావంటే..
6451. నీ మాటలు ముద్రించకలా..నా మది పుస్తకమయ్యేలా..
6452. ఎంత మౌనాన్ని రాసానో..నీ మాటిలా బైటకొచ్చేందుకు..
6453. కలలింకా మొదలవ్వలేదు..కథను ఊహించనందుకేమో..
6454. అలుకెటో ఎగిరిపోయింది..తన చిరునవ్వు పులకింతలు రేపగానే..
6455. ఆనందం ఆగిందక్కడ..నువ్వొస్తే కన్నులు దాటి ప్రవహించొచ్చని..
6456. పదునెక్కువే పరువానికి..నీ పదాలు నన్ను ఎక్కుపెట్టాయంటే..
6457. అక్షరంలో మనసుంటుందని తెలిసింది..నీ భావాలు నాపరమైనందుకే..
6458. శోకమలా మించిపోతుంది..తీర్చేవారే దూరమయ్యారని..
6459. రాత్రి కోసం ఎదురుచూడలేదందుకే..నీ కన్నుల్లో విశ్రాంతి తధ్యమని..
6460. మనసు ఏకాంతం కోరుతోంది..తనలో తను సంభాషించుకొనేందుకే..
6461. మురిపాలనూ రాస్తుంటాను..మనసును జోకొట్టుకొనేలా..
6462. నాలోని ఆర్తి వికసించింది..మనఃసౌరభాన్ని నువ్వు గుర్తించినందుకే..
6463. వేసవితో పనిలేదిప్పుడు..నీ మాటలకే నే వెచ్చబడుతుంటే..
6464. నా ప్రేమ పారిజాతమైంది..నువ్వు రాగరంజితం చేసినందుకే..
6465. ఆనందాన్ని వర్షించాలనుంది..నీ భావం మనసు మీటగానే..
6466. లాలిత్యమే నీ పదాలన్నిటా..నన్ను రాసేందుకు సంకల్పించినందుకేమో..
6467. కోటితారలిప్పుడు కన్నుల్లో..మనసు ఆకాశమైందని గుట్టు విప్పేస్తూ..
6468. నవ్వుల్లో ఎప్పుడు మునిగావో..నేనెప్పుడూ విషాదాన్నే వర్షిస్తుంటే..
6469. కాసేపాగితే భాషనీ మర్చిపోతావు..నా నవ్వులతో లెక్కలు తారుమారైతే..
6470. మనసిప్పుడు నిండుతోంది..తన ఖాళీలన్నీ నువ్వు పూరిస్తుంటే..
6471. మాటలతో వల వేయకలా..మౌనానికి కలలు కానుకయ్యేలా..
6472. జ్ఞాపకాలనిప్పుడు తవ్వకలా..కన్నీరు ఊటబావులయ్యేలా..
6473. కాదనలేను మౌనాన్ని సైతం..కన్నులతో అనునయించి పలకరిస్తుంటే..
6474. నేనో ముగ్ధలా మిగిలిపోతా..నందివర్ధనంతో నన్ను పోల్చావంటే..
6475. కలతలెప్పుడూ రహస్యాలే..మనసు గుట్టువిప్పనంటుంటే..
6476. ముద్దులంటూ గుర్తుచేయకలా..మాటలతో నన్ను ముగ్గులోకి లాగేస్తూ..
6477. కలలే కదానని అనుకున్నా..శిశిరంలా అవి రాలిపోతాయని తెలీక..
6478. కలలు నిజమైనప్పుడనుకున్నా..నన్ను మదిలో దాచుకున్నది నిజమేనని..
6479. ఏకాంతమిప్పుడెంతో బాగుంది..నీ తోడు నన్నిలా ఆకర్షిస్తుంటే..
6480. సంతోషపు దొంతరలు మేనంతా..నీ తపనలన్నీ నావైనందుకు..
6481. కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించాలనుకున్నా..ఉలి పట్టడం ఆలశ్యమైందీలోపే..
6482. నా బుగ్గల్లో సొట్టలు..నీ చూపులు ఉలిగా మారినందుకే మరి..
6483. ఉలి దెబ్బలకు భయపడ్డట్టుంది..పసుపు రాసుకు పూజలందుకుంటుందా రాయి..
6484. ఉలి కుంచెగా మారిందేమో..ఆకాశంలో హరివిల్లుగా ఆవిష్కరించబడింది..
6485. కలే నా కనపడని ఉలి..కవిత్వాన్ని శిల్పంగా మలచానందుకే..
6486. అమృతం తాగినట్టుంది..ఆనందం తరగలేదందుకే..
6487. సంబరమయ్యింది నిజమేలే..ఇచ్చిన మనసుకి బదులిలా అందుకోగానే..
6488. కథనే మరి..కలతలా ఉలిక్కిపడతావేమి..
6489. అమాస దగ్గరైందనేమో..చీకట్లో తప్పిపోతున్నా..
6490. పంచదార పూస్తావేమి క్షణాలకి..సమక్షంలో ఉన్నది నేనైతే..
6491. కలగా రావాలనుకున్నా..కథనమే మార్చేసావుగా..
6492. ప్రవహించడం మర్చిపోతున్నా నేను..మునకేయడానికి వస్తున్నది నువ్వైతే..
6493. విరహమొచ్చి ఛస్తున్నాను..వసంతమింకా రాదేమని..
6494.వలస పోతోంది యవ్వనం..వయసొచ్చి మీద పడుతుంటే..
6495. శీతాకాలమని మర్చిపోతావు..వెచ్చదనాన్నే తలపోస్తూ నువ్వు..
6496. నీ నవ్వులెన్ని దాచుకున్నానో..మౌనంలో నన్ను ఓదార్చుకోడానికి..
6497. ఎన్ని పువ్వుల మకరందాలో..నీ నవ్వులుగా నన్ను తడిపినవి..
6498. మనసందుకే కలిపేసా..నీ కన్నీటిని తీపి చేద్దామని..
6499. నీ వలపే..నా నులివెచ్చదనం..
6500. మునిగినప్పుడల్లా సంతోషమే..ప్రణయాంబుధి నీవైతే..