Saturday, 15 December 2018

6501 - 6600

6501. పరవశమేదో మదిని తాకింది..సున్నితంగా నువ్వు పెనవేసినందుకే..
6502. ఆశలన్నీ పొదిగి ఉంచానందుకే..ప్రేమ పలకరిస్తే బదులివ్వాలని..
6503. నే చిరంజీవిగా మిగిలిపోతా..నీ చిరునవ్వులు వసంతమైతే..
6504. నాలో తెలియని మైమరపు..నీ నవ్వేం మంత్రమేసిందో..
6505. బుగ్గ చుక్క పెట్టింది సిగ్గులే..మాఘమాసం దగ్గర్లో ఉందని..
6506. మరువమలా పరిమళించింది..మల్లెలతో కలిసి రెట్టింపు గిలిగింతివ్వాలని..
6507. మనసంతా మధువూరినట్టే..నీ మాటలే తలపుకొస్తే..
6508. నీ సంతోషం నాదయ్యింది..అల్లిబిల్లిగా నువ్వు ఆకట్టుకున్నందుకే..
6509. వేకువకి తొందరెక్కువైంది..చీకటిని చేధించాలని..
6510. సిగ్గుల కెంపు దాయాలనుకున్నా..నా మది నువ్వు కనిపెట్టేస్తావనే..
6511. నువ్వు పాడితే వినాలనుందట..తెలిసిన పాటైనా సరేనంటూ మనసు నస..
6512. మరో మొక్కై మొలకెత్తనా..రాలిన పత్రమై మట్టిలో కలగలిసినా..
6513. వసంతం నాలో రాగమిప్పుడు..చైత్రపువ్వులు విరబూయాలంతే..
6514. ఎన్ని పదాలు కుమ్మరించాలో..నాలో మధువునంతా రాయాలంటే..
6515. సుగంధం నీవల్లేననుకుంటా..మనోభావాలు నాలో పరిమళిస్తున్నాయంటే..
6516. పలకరించాలనుంది నిన్నే..నాకై నిరీక్షిస్తున్నావంటే..
6517. విషాదం పూర్తిగా రాలిపోయింది..వసంతం వాయిదా పడదిప్పుడు..
6518. వివశమైనట్టు మనసు..పున్నమిని ఊహించిన రేయిలో..
6519. నెమలికన్నుల మెరుపులు..ఆ చిన్నప్పటి పుస్తకాన్ని తెరిచి చూసినందుకే..
6520. ఏకాంతం తలుపు తట్టింది..వెన్నెల చారను నాపై ప్రసరించేలా..
6521. ఆగనంటుంది వసంతం..నీ జ్ఞాపకాలు తరుముతుంటుంటే..
6522. వెన్నెల పరిమళం నా సొంతమైంది..ఒకజతగా మనమయ్యామని..
6523. వియోగాన్ని తిట్టుకుంటూ నేనున్నా..విరహమూ మధురమని తెలీక..
6524. ప్రేమని విస్మరించకు..కలనైనా నిన్ను నిద్రలేపుతుంటా..
6525. మల్లెలు మంటపెట్టింది మనసుకేగా..పరిమళమందుకే తలకెక్కింది..
6526. వియోగాన్ని ముగించేస్తాలే..ఊహల్లో నా స్పర్శని అందించైనా..
6527. కలలను పిలుచుకొస్తానుండు..రేయంతా సందడి చేసేలా..
6528. ఎన్ని కలలని అనువదించాలో..నా కథ నువ్వు మెచ్చాలంటే..
6529. కల్లోనైనా కలుసుకుందాములే..ఈరోజైనా నిద్ర నన్ను వరిస్తే..
6530. నేనో ప్రేమాత్మని..అనుభూతిగా నన్ను రాస్తూ పోవాలంతే..
6531. మధురభావమైతే నువ్వేగా..నాలో నిద్రించిన రాగాన్ని ఓలలాడిస్తూ..
6532. మాటలతో అలజడి రేపకలా..మనసు మౌనాన్ని ఆశ్రయించేలా..
6533. శిశిరాన్ని పిలవలేదందుకే నేను..పచ్చదనాన్ని చూసి విస్తుబోతుందని..
6534. పలకరించడం మానేసా కలల్ని..వేళంటూ లేక ఏడిపిస్తున్నాయని..
6535. తుఫానులా నువ్వు...ఊహించని వర్షంలా కలల్లో కురిసిపోతూ..
6536. నిద్దుర చెదరనీకు..కలలో వెన్నెలకు తడిచానని భ్రమించి..
6537. అనురాగం నా బలహీనత..అందమెందుకు నిన్ను ఆకట్టేందుకు..
6538. ఆగనంటూ జ్ఞాపకాలు..వేదన కురిసి మనసు తేలికయ్యేందుకు..
6539. నీ తలపులే సుమాలు..నా ఆరాధన పూర్తయ్యేందుకు..
6540. మమతలంటే మనవే..కథగా మారామంటే..
6541. వెన్నెల్లో సడివే..నిద్దురను దూరం చేసిన రాగమై...
6542. క్షణాల గడుసుదనం చూడు..మనల్ని కలిపెలా కదిలిపోతుందో..
6543. వెచ్చదనమిప్పుడు తెలుస్తోంది..నీ అలుకతీరి నన్ను పలకరించగానే..
6544. మనసు పాడే సంకీర్తనది..మౌనంగా నిన్ను అల్లుకున్నదది..
6545. విలువ పెరిగింది కన్నీటికి..నా విరహాన్నీనాటికి గుర్తించావని..
6546. దూరం తెలియని మనసులవి..మనువు కలానికి అందనివి..
6547. తడికన్నుల నవ్వులివి..ఆర్తి తెలిసిన మనసుకి మాత్రమే తెలిసేవి..
6548. కాగితాన్నిక తడవనివ్వకు..తడవ తడవకు కన్నీటిని రాస్తూ..
6549. నీ వలపుకి చిక్కుకున్నా నేను..ఎగరాలనుకున్న నాకు వల విసిరావని..
6550. ఉషస్సులేని జీవితాలే కొన్ని..జ్ఞాపకాల చీకట్లలో మగ్గిపోతూ..
6551. అంతమవని నా ఊహలు..అలవిమాలిన నీ అనురాగానికి..
6552. మనసు మెచ్చిన భావమొక్కటి..నీ పదముగా నన్నలరించింది..
6553. సద్దుమణిగింది పొద్దు..రద్దయిన ముద్దులతో..
6554. అనుసరిస్తున్న పాటే..నువ్వు పాడుతుంటే నన్ను కనుగొన్నా..
6555. శృతిగా మార్చుకున్నాలే..నా లయని సమంగా పాడుతున్నావని..
6556. మాట వినదెప్పటికీ మనసు..తీరని ఆశలను తలపోసుకుంటూ..
6557. పులకింతలు నిజమే..పండగై నువ్వొచ్చావుగా..
6558. హద్దులేక కురిసింది ప్రేమ..నువ్వు సిద్ధమన్నావని తనతో..
6559. ఎన్ని పాటలు రాసుంటావో నువ్వు..నా నవ్వులకు బాణీలు కడుతూ..
6560. ప్రాణమలా నిలబడింది..నీ పలుకులు అమృతమై కురిసాక..
6561. విలువైన ముత్యాలవి..కన్నులు రాల్చే నీటి చినుకులు..
6562. మౌనం వలపయ్యింది..ఇన్నాళ్ళూ మాటలు వెతుకుతూ కూర్చుంది..
6563. ఎన్ని క్షణాలు నిశ్శబ్దమయ్యాయో..నీ ఆరాధనా ఆలాపనల్లో..
6564. అలసటలా తీరుతుంది..ఆనందభాష్పాలు వెదజల్లుకుని..
6565. ఆనందమంటే స్వర్గమే..నా జతగా నువ్వు నిజమయ్యాక..
6566. అదే మత్తు..నీ పొగడ్తగా నన్ను ముంచెత్తింది..
6567. కుతూహలం నిజమే..నీ కవనంలో నన్నెలా చిత్రిస్తావోనని..
6568. జవాబివ్వలేకున్నా..నీ అనుభూతుల మహోద్వేగాన్ని దాచుకొని..
6569. ఇవేమి చురకలనుకున్నా..నీ చూపులు గుచ్చుకున్నాయని తెలీక..
6570. కలతలకి జలగండమట...దిగులు మేఘాన్ని మధించే సమయమయ్యింది..
6571. కాలానికి జాగరణే...మన ఇద్దరి దాగుడుమూతలు ముగిసేంత వరకూ..
6572. రంగవల్లయింది రమణి...ఎన్ని తీపికలలు నెమరేసుకుందో మరి..
6573. జ్ఞాపకాల తోడయ్యింది జీవితం..నిరంతర నీరవంలో నన్నుంచుతూ..
6574. పదములు కదిపా నీతోనే..జతగా నేనై సాగాలని..
6575. రంగులకలలా జీవితం..నిద్దురలోనే బాగుందనిపిస్తూ..
6576. మనసు మెచ్చిన పరిమళం నీది..ఏ పువ్వుకీ లేని సువాసనది..
6577. అదృష్టం కొద్దీ ఆనందం..ఉత్సవానికి వేళయితే అంతేగా..
6578. కాలానికి తెలిసిన కదలికలు..జీవనాన్ని నడిపే చక్రాలు..
6579. ఊరింతలు ముగిసినట్టున్నాయి..ఊహలు దూరమై వాస్తవం ఎదురైనందుకే..
6580. జీవితం రంగులమయమే..చీకటిని వదిలి వెలుతురు చూడాలంతే..
6581. నీతోనే నేనుంటా..సంతోషాన్ని అనుభూతించాలంతే..
6582. అంతరంగం మృదువయ్యింది..కొన్ని భావాల సున్నితత్వానికే..
6583. నీడకి తెలియని నిజం..నడుస్తున్న ఆలోచనలో తనులేదని..
6584. కదలాల్సిందే అక్షరం..నిద్రించిన చీకటికి వెలుగుందని తెలియాలంటే..
6585. ఎక్కడుందా ఆత్మీయ స్పర్శ..పలుకులన్నీ పాకంచేసి పంటికిందేసుకుంటే..
6586. గుండెను జార్చుతున్న భావాలు..మైమరపును ఓర్చుకోలేనంతగా..
6587. మధువంతా నీకోసమేలే..మనుగడై నువ్వు తోడయ్యావుగా..
6588. చెలిమెప్పుడూ తీయనిదే..చేదు రుచి చూపేవారు లేనంతవరకూ..
6589. ఊహలతోనే బంధమేసేసా..కొన్ని ఊసులైనా నీకు చేర్చాలని..
6590. ఉగాది కలలో కొచ్చినట్టుంది..మనసు పండుగను పిలిచింది..
6591. మనసు తడిచింది దేనికో..కురిసింది వాన ప్రకృతిలోనైతే..
6592. అంతరంగమే రణస్థలమైంది..కొన్ని విరుద్ధభావాల వైరాలతో..
6593. కవనమవ్వాల్సిందే స్నేహం..కలతలన్నీ తీరాయంటే..
6594. అమాస వెన్నెలైపోదా..నీ మాటల్లోని వెన్నను ఆరగించిందంటే..
6595. అర్ధం కాని కలలెన్నో..నిద్దురలేవగానే వేకువకి ముగిసిపోతూ..
6596. నిశ్శబ్దం పాటయ్యిందెప్పుడో..నీ మౌనానికి మాటలే రానప్పుడు..
6597. పగటికలల సిగ్గులేమిటో..మత్తులోనే నన్నుండమంటూ..
6598. అనుభవానికందని కలలే అన్నీ..వేకువకి మరుపులో జారిపోతూ..
6599. జన్మజన్మల సంబంధమే..ఈ జన్మకిలా ఒక్కటి చేసింది..
6600. అలలకు అలుపు తెలీదస్సలు..తీరం కౌగిట చేర్చుకుంటుందనే..

No comments:

Post a Comment