Saturday, 15 December 2018

6001 - 6100

6001. మనసులో విచ్చిన ఆనందాలెన్నో..ఒక్క నీ పలకరింపుతో..
6002. ఎగిరిపోయింది నిద్ర..కల కవిత్వానికి ప్రేరణయినందుకే..
6003. సముద్రమయ్యింది జ్ఞాపకం..మనసంతా అల్లకల్లోలమైపోతూ..
6004. చెప్పలేని వేదనొకటి..మనసునిలా బరువుగా మార్చింది..! 
6005.  నాలోని ఇంపు సొంపు ఎప్పుడు చూసావో..నీలో ఇంత భావోద్వేగం..
6006. జీర్ణించుకోలేని అవాకులూ చెవాకులు..ఆ నోళ్ళకి తాళాలుండవేమో..
6007. అదుపు పొదుపు లేని జీవితం..మధురానుభూతుల లెక్కలేసుకుంటూ.. 
6008. నువ్వద్భుతానివే..ఆదమరుపులో ఉండి నే గమనించలేదంతే..
6009. కలలకై ఎదురుచూస్తూ కళ్ళు..నిద్దరోతే బాగుండని తలపోస్తూ..
6010. కవితలుగానే రాస్తుంటాను..నే గాయపడ్డ క్షణాలన్నింటినీ..
6011.  నీ రూపం అపురూపమే..పాత్రలన్నిటా సమానముగా ఒదిగిపోతూ.. 
6012. అలసిపోయింది మనసు..నీ నిరీక్షణలో విసిగి వేసారి..
6013. చూపందుకే తిప్పేసుకున్నా..అపహాస్యాలు కంట పడరాదని..
6014. ఆనందమిప్పుడు సొంతమయ్యింది..నీలోని అద్భుతానికి కారణం నేనవగానే..
6015. అల్లుకోవాలనే ఉంది ప్రేమగా..నీ మనసు అనుమతీయాలంతే..
6016. ఊహిస్తూనే నేనున్నా..ఈ శ్రావణవెన్నెల్లో మనమొకటైతే ఎలా ఉంటుందోనని..
6017. కలనేతలా నీ నవ్వు..నా మనసంతా పరుచుకుంది నిజమే..
6018. తీరని తాపానివే..పదేపదే తన్మయత్వాన్ని తడిమి జారుకుంటూ..
6019. సమయమంతా నీకిచ్చేసా..ఆకాశంలో తారగా నన్నభివర్ణించావని..
6020. కాలం కాగితమయ్యింది..నా అనుభవాలు రాస్తూ కదిలిపొదామంటూ..
6021. ఉక్కిరిబిక్కిరయ్యింది స్వప్నం..ఎన్ని జాజులు కుమ్మరించిందో నీ మోహం..
6022. అలుకలోనే నేనుండిపోనా..నిండుచందమామలా నాతో మంతనాలాడుతానంటే..
6023. నీ జ్ఞాపకాలు నక్షత్రాలే..రాతిరైతే నాకు కలలవుతూ..
6024. కొంత ప్రేమను పంచవూ..మనసును చిరుజల్లులతో తడుపుకోవాలనుంది..
6025. ఓ అనుభూతి రాగం నాలో..నీ తలపుల వెచ్చదనం మొదలైనందుకే..
6026. మనసు నవ్వింది..ఈరోజు ఇంద్రధనస్సు విరియడం ఊహించిందేనని..
6027. కలలెందుకు రాయమంటావో..విఫలమైన ఆశలు గుర్తుచేసేందుకు..
6028. మనసంతా కోలాహలం..నీ తలపు సీతాకోకచిలుకల సందళ్ళతో..
6029. రాత్రికి ఆకలేస్తున్నట్టుంది..కలల ఆహారం కావాలనుకుంటా..
6030. నాలో ప్రవహిస్తున్న ఆనందం..నీలా కదులుతుందని కాబోలు..
6031. మనసు తాళం పారేసుకున్నా..నీకేమైనా దొరికిందేమో మరి..
6032. నా పలుకులు పారిజాతాలు..ఆ అమృతం నువ్వు తాగాలంతే..
6033. ఆనందభైరవితో పనేముందిప్పుడు..మనసు కదనకూతూహలాన్నాలాపిస్తుంటే..
6034. అరచేతిలో తారలిప్పుడు..చందమామ గోరింటై పండగానే..
6035. కన్నుల్లో వర్షమిప్పుడు..మనసు ముసురేసింది మరి..
6036. నా రాతిరెంత మధురమైనదో..నీ కలలతో ఆదమరిపిస్తూ..
6037. చిరునవ్వు కళ తప్పింది..ప్రకృతిలో శూన్యాన్ని కనుగొనగానే..
6038. పాలబుగ్గ కందింది..నీ గుసగుసలు మనసుని మీటగానే..
6039. కదలని చూపులనడిగి చూడాలి..నీ కన్నుల్లో ఏం వెతుకుతుందోనని..
6040. మూగబోతోంది అక్షరం..నీ మాటసాయమందలేదని..
6041. నా ప్రేమెప్పటికీ జలపాతమే..ఉరకలేస్తూ నీ మురిపెములో..
6042. కన్నీటి ముత్యాలే మెరుస్తుంటాయి..మనసులో అలజడిని బయటపడనివ్వక..
6043. మనసులో మాట..నువ్వుంటే వేరే ఆనందాలు నాకెందుకని..
6044.  ప్రతీదీ పరిమళమేగా..మన వలపు బృందావనంలో..
6045. వాస్తవానికి బంధాలకు బంధీనే..కానీ ఊహలకు దాసోహమవుతాను..
6046. మనసెప్పుడో నీపరమైంది..నా వరమని నిర్ణయించానప్పుడే..
6047. అక్షరం అలిగినట్టుంది..ఇన్నాళ్ళకు మనసు గుట్టు విప్పింది..
6048. మదిపలికే మౌనగీతాలే నావన్నీ..చదువుకొనే తీరిక నీకుండాలంతే..
6049. అనుభవానికో రూపముంటుంది..అక్షరమెప్పుడో ఆక్రోశించాల్సిందే..
6050. నువ్వుగా పరిచయమయ్యావందుకేగా..నిన్ను కలగని నే చానాళ్ళయినా..
6051. క్షణాలకు తొందరెక్కువే..నీ ధ్యాసలో నేనున్నా కదిలిపోతూ..
6052. మనసెప్పుడూ గుంభనమే..మౌనంలో తన ఆశలను దాచుకుంటూ..
6053. అనిర్వచనీయమే..నిన్ను నిర్వచించాలని చూసే నా ప్రేమ..
6054. మౌనానికో పరిభాషున్నట్లుంది..నీ భావాన్ని నాకేదోలా వెల్లడిస్తుంది..
6055. నా భావాలన్నీ వెలవెలబోయినట్లేగా..మదిలో ప్రేమను చేరవేయలేదంటే..
6056. వెన్నెల నా నవ్వులోనే దాగుంది..నీ మనసున కురిసింది ఇప్పుడేనేమో..
6057. రాయడమో వ్యసనమయ్యింది..నా మనసు నీకు బానిసయ్యాకనేగా..
6058. ఆ మనసుని తెలుగుతో పోల్చారందుకే..తీయందనానికి సరిపోలికయ్యిందని..
6059. తెరిపిలేని భావాలు..తెలుగులో రాస్తున్నందుకేమో..
6060. నా నవ్వులు జీవధారలు..నీ లేఖలో అచ్చమైన తెలుగు వీక్షించి..
6061. వసంతకాలాన్ని వెతుకుతావెందుకో..నీకోసం నేను నవ్వుల్ని పోగేసుంచినా..
6062. ఎన్ని భారాలో గుండెకి..తడి ఆరని ఋతువులన్నిటా..
6063. వెన్నెలెటు కనుమరుగయ్యిందో..పున్నమలా మాయమవ్వగానే..
6064. నేనుంటే నందనవనమేగా..వేరే ఋతువులతో పనేముందప్పుడు..
6065. ఎన్ని ఆశలుంటేనేమిలే..కొన్ని నిరాశలు నిట్టూర్పులై వేధిస్తుంటే..
6066. నిశ్శబ్దానికిన్ని వరసలెందుకో..స్వరాలన్నింటినీ ఆవహించినట్టు..
6067. విశేషించి నే నవ్వుతున్నా..నిన్ను ఆనందంలో ముంచెత్తాలని..
6068. పదములన్నీ పదనిసల్లోకే ఇప్పుడు..నీ గుసగుసల్లో చోటిచ్చినందుకు..
6069. నవరసాలన్నీ నీ నయగారంలోనే..నయనాలను చూసే పనేముందిప్పుడు..
6070. మునుపున్న మోహమే..ఈ జన్మలో పరిమళమై నిన్నల్లుకుంది..
6071. ఎందుకలా ఎదురయ్యావో మరి..నాలో ఆనందం ఆవహించేట్టు..
6072. నా కన్నులలో చోటిస్తా..కాటుకవై కాపు కాస్తానంటే..
6073. అర్ధం కానిదీ నిశ్శబ్దం..వలపు ఋతువులో మనమున్నప్పుడు..
6074. ఋణపడిపోయున్నా నీకే..అనుభవమంతా నాదైనందుకు..
6075. కవితలలా కదిలొచ్చాయి..నా నవ్వు నీకు నిషానిచ్చిందంటే..
6076. వసంతానికి పూర్తిగా చోటివ్వనంటావే..శిశిరం దాటేసి తప్పుకుంటున్నా..
6077. నాకెప్పుడూ నచ్చుతూనే ఉంటావు..నీ వలపు నాదైనందుకేమో..
6078. ఆనందభాష్పాలిక్కడ..నీ మాటలతో సుధామధువులు మదిలో పొంగుతుంటే..
6079. పన్నీరై పులకరిస్తున్నా..నీపై కురిసి పరిమళాన్ని కానుకివ్వాలని..
6080. నా కలలిప్పుడు మల్లెపువ్వులు..పరిమళాల విందు నీకిష్టమన్నావని..
6081. వెన్నెల సవ్వడిస్తుందని తెలిసిందిప్పుడే..నీ నవ్వులకెరటాల్లో నన్నుంచగానే..
6082. గతంలోకే తొంగి చూస్తావెందుకో..భవిష్యత్తు ఊరించి పిలుస్తున్నా..
6083. తమకమిప్పుడు నావంతు..నీ తలపుల్లోకి ఆహ్వానమందిందంటే..
6084. కవనంలో నన్నుంచినప్పుడే అనుకున్నా..నీపై నవ్వులమంత్రం ఫలించిందని..
6085. మమతనెందుకు కెలుకుతావో ప్రతిసారీ..మనసు రుచి మారిపోయేట్టుగా..
6086. అపురూపమైంది సాంగత్యం..నీ నిరీక్షణలోనూ  నేనింత ప్రియమవుతుంటే..
6087. నీ ఆంతర్యమిప్పుడు తెలిసింది..కన్నుల బిడియమెప్పుడో రాసిచ్చేసానని..
6088. నీవల్లే నాలో సంగీతం..ఇన్నాళ్ళూ నేనో మౌనాన్నేగా..
6089. నాకింక చీకటే..విషాదంలో ముంచి నువ్వు మాయమయ్యావుగా..
6090. వలపు బాణాలింక ఆపవూ..ఈరేయి ప్రశాంతమై నిదురించాలనుంది..
6091. నిన్నంతా ఎదురుచూస్తూనే నేనున్నా..నీ విరహం చిరునవ్వై పలకరిస్తుందని..
6092. శుభమూర్తమింకా మించిపోలేదు..పారిజాతాలందుకే వికసిస్తున్నాయి..
6093. గతి మారుతున్న రాగాలు..ఋతువులను అనుసరిస్తున్నామని అతిచేస్తూ..
6094. నా వర్తమానం విశేషమే..నీతో భవిష్యత్తు భవ్యమనిపిస్తూ..
6095. మదిలోంచీ నెట్టెస్తావెందుకు..ఖైదీగానైనా నేనుంటానంటే..
6096. మనసులోతుని ప్రతిబింబిస్తూ కన్నులు..తడింకిన నిర్లిప్తత కాబోలు..
6097. ఆగలేని ప్రవాహమది..మదిలో ఆవేదన దాచలేని కన్నులది..
6098. నందనమవ్వాలనుంది నీలో..బృందావనమంటే నీకిష్టమని..
6099. అద్దంలో నేనున్నది నిజమే..మనసు ప్రతిబింబిస్తుందని భావిస్తే..
6100. నీ మనసిట్టే తెలిసిపోతుంది..ప్రతివాక్యంలో నన్నే ఆరాధిస్తుంటే..

No comments:

Post a Comment