Saturday, 15 December 2018

6201 - 6300

6201. మధురం ఆసాంతం..నీ  మౌనం వెంట నేనో  అయస్కాంతం..
6202. గ్రంధాలెన్ని ఆవిష్కృతమైతేనేమి..చదివేవారసలే కరువయ్యాక..
6203. గిలిగింతలు..నాకై ఎదురుచూస్తున్నావన్న ఊహ మెలిపెడుతుంటే..
6204. మనసుతోనే గెలిచేస్తావు..మాటలు కరువై మనం ఎక్కడెక్కడున్నా..
6205. పదములన్నీ కొత్తవే..నిన్ను వర్ణించినప్పుడల్లా అనేక భావాలుగా..
6206. కలలు ఒంపుకోవాలనుకున్నా..కొన్ని తారలై ఆకాశంలో మెరవాలని..! 
6207. నాలోనూ వ్యక్తిత్వముంది..అది నీ మనసుకి తెలియాలని అభిలాష..
6208. వేకువకి విచ్చిన పరిమళాలు..నువ్వొచ్చిన కలలోని పారిజాతాలు..
6209. నేనంటే మనమేగా..నిన్ను వెతుకుతున్నావెందుకో..
6210. ఎన్నిరోజులని ఎదురుచూడాలో..నా కన్నీరు నీకై ఘనీభవిస్తున్నా..
6211. తడిచానందుకే వర్షంలో..కొన్ని జ్ఞాపకాలను కడిగేయాలని..
6212. నీ భావంలో నేను..వెన్నెల్లో విచ్చిన మందారాన్నేగా..
6213. కాలం సాక్ష్యమయ్యింది మనకి..ప్రేమింకా బ్రతికుందని నిరూపిస్తూ..
6214. చెదిరిందలా నిశ్శబ్దం..నీ నవ్వుల చిరుసవ్వడి వినిపించగానే..
6215. పున్నమి సంతోషం నాలో ఇప్పుడు..కురిసిన వెన్నెల వృధా కాలేదని..
6216. మనసు బరువెక్కినప్పుడనుకున్నా..నీ ప్రేమలో తడిచింది నిజమేనని..
6217. అలవాటు పడినందుకేమో నీకు..జ్ఞాపకాలతోనే నా జీవితమిప్పుడు..
6218. కొత్తగా నాలో కలవరం..కన్నీరింకిన చెంపల చారికలు చూసి..
6219. మనసిస్తే చాలనుకున్నా..నీవెక్కడున్నా నాకు దగ్గరున్నట్టేనని..
6220. గుండెగది మూతపడింది..నీ తలపులు నన్నొదిరి ఎగిరిపోగానే..
6221. శూన్యంలో నేనిప్పుడు..ఆనందమే ప్రవాహంలో కొట్టుకుపోయిందో మరి..
6222. సరితూగిన అనుభూతులు..నా భావాలు ఒక్కోటీ పేర్చుకోగానే..
6223. కాసిని ఓదార్పులేగా కోరుకున్నది..నిట్టూర్పులతో కదిలిపోతావెందుకో..
6224. ప్రాణానికి చిరునామా వెతుకుతున్నా..నీ ఊపిరిని గమనించనట్టుగా..
6225. రాతిరి రాగం మొదలయ్యింది..యుగళమయ్యేందుకు నువ్వు రమ్మనగానే..
6226. పగటికలలే కొన్ని..రాతిరి నీ ధ్యాసల్లో నిదుర కరువయ్యి..
6227. పుచ్చేసుకున్నా నీ మనసు..మక్కువగా నన్ను ఆరాధించావని..
6228. చీకటికి భయపడటం మానేసా..మనసంతా వెన్నెల కురియగానే..
6229. ఎప్పుడు చదివేసావో నన్ను..మనసులిపి తెలియదంటూనే నువ్వు..
6230. గుండెకంటిన అక్షరమేమో నువ్వు..ఏక్తారలా గగనంలో మెరిసిపోతూ..
6231. అలసిపోయిన అక్షరం..ఆనందాన్ని రాసి రాసినందుకేమో..
6232. మనసు బరువు తేలికవుతోంది..అక్షరాన్ని చేసి రాస్తున్నందుకేమో..
6233. ఆనందమంతా నీపరమే..మనసు ఆకాశాన్ని అంటుతున్నాక..
6234. జ్ఞాపకాల శిలువ మోయక తప్పట్లేదు..వాస్తావానికెంత కదలాలనుకున్నా..
6235. కన్నీరు తీపైన క్షణాలివే..నీకోసమని గుండెలోకి ఇంకినందుకే..
6236. అవమానాన్ని జయించవలసిందే..ఆప్యాయతలు కావాలని కోరుకుంటే..
6237. అభిమామనం పెంచుకోవాలి..అసూయను దరిచేరనివ్వ రాదనుకుంటే..
6238. మధురమైన జ్ఞాపకమొకటి..నీ చిరునవ్వులో నేను కాజేసినది..
6239. వీడ్కోలకు ఎదురుచూపులెందుకో..కలిసుందామని రమ్మం
6240. ఏకాంతంగానే ఉండాలనుంది..నీ తలపులిస్తున్న ఆనందాన్ని ఆస్వాదించేందుకు..
6241. కమ్మేయకలా విషాదంతో..విరహాన్ని భరించలేనంటూ..
6242. జ్ఞాపకాల పరిమళమదంతే..నా మనసులో ఇప్పటికీ తాజాగా..
6243. ఆనందవిషాదాల సమ్మేళనమే జీవితం..ఒకదాని వెనుక ఒకటవంతే..
6244. శూన్యమయ్యింది నిజమే..నీ తలపు నన్ను వీడిపోయాక..
6245. మధురమైన జ్ఞాపకమే నీవు..పదములో నిన్నందుకేగా కూర్చుకున్నా.
6246. ఎన్ని కథలు రాసేనేమిలే..నచ్చలేదంటూ నువ్వు నిట్టూర్చేసాక..
6247. నేలచూపునెప్పుడో దాటేసాను..సిగ్గెందుకని నీ కన్నులు ప్రశ్నించాక..
6248. కాశ్మీరానికి దారడుగుతున్న కథ..ఎన్నిసార్లు కంచికి తిప్పుతావంటూ..
6249. ముఖచిత్రం మనదేగా..వలపునంతా పుస్తకముగా అచ్చేసాక..
6250. పంజరమైతేనేమి..నీ తలపు వెచ్చదనం నాకు కలిసొచ్చింది..
6251. గుండెగది గుడయ్యింది..నువ్వొచ్చి కొలువైనందుకేగా..
6252. ఎన్నెదురుచూపులో..ఒక్కసారి నవ్వుతావేమోనని..
6253. అలక్ష్యాన్ని భరించలేకపోయా..అందరికన్నా వెనుకుంచుతుంటే..
6254. తొలిపాటిప్పుడు మొదలయ్యింది..గతంలోకి మది జారుకోగానే..
6255. మనసు లోతున కదలికలు..కొన్ని స్వరాల వెల్లువతో..
6256. గుడిగంట మోగినప్పుడే అనుకున్నా..నా మనసాలకించింది నువ్వేనని..
6257. స్పందన నీదేగా..హృదయం నాపరమైందని సంతోషించవెందుకు..
6258. నీ ఒక్క మాట చాలదు..మదిలో నేనున్నానని నమ్మడానికి...
6259. ఎంతకని నేనెదురుచూడాలో..ఋతువులు మారుతున్నా నీ జాడ లేదంటే..
6260. నీ చూపుల్లో చూసానో అల్లరి..కన్నులతో ఆటాడుతూనే ఉండాలనుంది మరి..
6261. మనసులొక్కటైనప్పుడే అనుకున్నా..మన బంధమీ జన్మది కాదని..
6262. విధికి ఎదురీదవచ్చు..గెలుపుని సంకల్పిస్తే..
6263. మనోవేగాన్ని మించింది లేదుగా..చరణాలెంత ఆగకుండా ప్రయాణించినా..
6264. నాలో పరవశం..మన పరిచయం పున్నమివెన్నెల సమానమైందని..
6265. మరమనుషులం మనమిప్పుడు..మానవత్వం మరుగునపడ్డాక..
6266. నాలో తెలీని శూన్యం..నువ్వు నింపి వెళ్ళిందేనేమో మరి..
6267. అక్షరాన్ని వరించింది మౌనం..నా మనసుని నీకందించాలనే..
6268. మనసంతా కువకువలు..నీ గుసగుసలు గుర్తుచేసుకు మరీ..
6269. ఎప్పటికీ అరుదైనవే..నువ్వూ నేనూ కలిసుండే క్షణాలు..
6270. విషాదం పరిపాటయ్యింది..నీ పొడుపుకథలకి నేను జవాబునవుతుంటే..
6271. బరువైన క్షణాలు కొన్ని..రాలిపోయిన ఆకులకి సమానమవుతుంటాయి..
6272. చిరునవ్వుల వరమందుకే ఇచ్చా..మరోసారి జీవితాన్ని హత్తుకుంటావని..
6273. పలకరింపులన్నీ పులకరింతలైనవి..ఎదురుచూపులు ఫలించినందుకేమో..
6274. మనసులో కనుగొన్నా నిన్నెప్పుడో..నీ చూపులకి గుచ్చడమొచ్చేమో..
6275. నొప్పించలేనుగా ఎన్నున్నా..నువ్వూ నేనూ ఒకటని నువ్వన్నందుకైనా..
6276. అద్భుతమే నాకు నువ్వు..అందుకే నీకు అపురూపమవుదామని..
6277. కొన్ని అనర్ధాలందుకే..హద్దుమీరిన ఆవేశానికే..
6278. అమూల్యమైనవే నీ భావాలు..నాలో చైతన్యాన్ని ఉసిగొలుపుతూ..
6279. ఈ నవ్వులెప్పటికీ నిక్షిప్తమే..నా మదిలో నువ్వున్నంతవరకూ..
6280. తనివి తీర్చని జన్మలెందుకులే..నువ్వుంటే చాలనుకొనే ఒక్క జీవితానికి..
6281. ఎన్ని కలలు సంగమించాయో..నిన్నూ నన్నూ వేరుచేయకూడదనిలా..
6282. మాటలెందుకు మౌనవించాయో..నీ కవితను చదవాలని మొదలెట్టగానే..
6283. మౌనవించానందుకే..ఈరోజు నీ పిలుపు నాకందక..
6284. లుప్తమైన కొన్ని మాటలు..మౌనాన్ని ఆస్వాదిస్తున్న క్షణాలలో..
6285. కొన్ని అక్షరాలంతే..దీర్ఘకవితలయ్యే దాకా ప్రవహించక మానవు..
6286. భావాన్ని ముడేసుకున్నా..బంధమదే దానంతటదే చిక్కపడుతుందని..
6287. గిచ్చిగిచ్చి తడుముతున్న భావాలు..నువ్వెప్పుడు కంటబడ్డావో..
6288. వానరాగమంటే నాకిష్టం..అద్భుతాన్నందుకే వినాలనుకుంటానలా..
6289. కన్నులు తడవక తప్పలేదు..మనసుకి ఆనకట్ట వేయలేకపోయినందుకు..
6290. నువ్వో కార్తీకం..నేను వెలుగుదీపాన్ని తలచినా చాలుగా..
6291. ప్రేమ చుక్కానైంది..దారితప్పిన జీవితనౌక ఒడ్డు చేరడానికి..
6292. నా తలపులంతే..కేరింతలకు నిన్ను దగ్గర చేస్తుంటాయి..
6293. మధురభావం మరలిపోయింది..మనసు ఒంటరయ్యాక..
6294. కనులెందుకు ప్రవహిస్తున్నాయో..మనసును తేలికవ్వమంటుంటే..
6295. యుగాలవుతూ కొన్ని క్షణాలు..నీ నీరీక్షణ భరించలేమంటూ..
6296. కవితగానైనా మిగలాలనుకున్నా..కలలో సైతం తిరస్కరిస్తావని తెలీక..
6297. క్షణాల సందడి..నువ్వున్నప్పుడే పండుగొచ్చిందని..
6298. పెదవెప్పుడూ మధువుకి సమానం..నీ పేరునే పలవరిస్తుందందుకే..
6299. అనుమానం నిజమయ్యింది..ఆ నవ్వు నొసట్లో కనపడగానే..
6300. అనురాగమనెలా మురిసిపోనూ..కలలో రోజుకో అనుభవం ఎదురవుతుంటే..

No comments:

Post a Comment