6601. అనవసరమే ఆ కొందరు..ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే ఆప్తులు..
6602. అనురాగానికి శృతి లేదంటావే..భావాలు వెల్లువలై ప్రవహిస్తున్నా..
6603. మనసు మత్తులో మునిగింది..నీ పాటకు పరవశించి..
6604. మౌనాన్ని భరించలేకున్నా..నీ అలుక నరకానికి సమానమవుతుంటే..
6605. నీ మాటలకర్ధాలు వెతుకుతున్నా..నా మనసిక్కడ వేదనవుతుంటే..
6606. నెలవంకలై నా అధరాలు..నీ మనసుని ఆకర్షించాలని..
6607. కొన్ని జీవితాలంతే..పాత కథల్లా మలుపులెక్కడా తిరగనంటూ..
6608. రుచులెన్నడో మరచిపోయా..విషమొక్కటే తలకెక్కుతుంటే..
6609. కొంత సంగీతం నేర్వాలి..జీవితం పాటగా సాగాలంటే..
6610. జీవితం నీపరం చేసా..ఉగాది రుచులు సమంగా అందిస్తావని..
6611. మాట పెగలనంటుంది..మౌనంపై మక్కువైందనేమో..
6612. ఎంత కవ్వింపో నీ కన్నుల్లో..నా మనసుని కేరింతల్లో ఊగిస్తూ..
6613. కదిలే జాబిలి నేనయ్యా..నన్నో పులకరింతగా నువ్వనుకోగానే..
6614. కృష్ణబిలంగా మారింది మనసు..నీ నిరీక్షణలో నిట్టూర్చుకుంటూ..
6615. ఊహల కలబోతే ఉగాది..రుచులేకమైన పండుగై మనకంది..
6616. మనసు ఘుమాయించింది..నీ జ్ఞాపకాల పూతలు పరిమళించి..
6617. నీ సరసమేనది..సమక్షాన లేకున్నా నన్ను మురిపించేది..
6618. పరిమళించి చానాళ్ళయింది నేను..నీ పిలుపందలేదని మరి..
6619. చందమామలా నీ నవ్వు..చల్లగా నన్నిట్టే ఆకర్షిస్తూ..
6620. పొరుగింటిపుల్ల కూర పొగడరాదందుకే..పస్తు పడలేనని నువ్వనుకుంటే..
6621. విషాదం అలవాటుగా మారింది..నవ్వులకి నేను లోకువయ్యేసరికి..
6622. పసిడినై మెరుస్తున్నానందుకే..నీ వలపు నాలో వెలుగుతున్నందుకు..
6623. వసంతమై నా పరిమళం..చైత్రానికి వన్నె తెచ్చిందందుకే..
6624. నవ్వులందుకే నటిస్తున్నా..మనసు తడి మధ్యలోనే ఆపేస్తూ..
6625. నిత్యమల్లెనై ఉండాలనొచ్చేసా..నీ కలవరాన్ని ఆపాలని..
6626. నెమలీక..ఇప్పటికీ మెత్తగా నన్నంటే ఓదార్పు..
6627. పున్నమై పులకరిస్తున్నా_నీ మాటలు మదిలో వినపడ్డందుకు..
6628. అందని ద్రాక్షని సరిపెట్టుకోవడమే..అందిన ఫలాన్ని ఆస్వాదిస్తూ..
6629. లిప్తలో లుప్తమైపోయా..నీ కోపగ్నిలో మాడి మసైపోయి..
6630. ఈ క్షణమో విస్పోటనం..నాలో ఆనందం గుప్పుమన్నందుకే..
6631. అంతరాత్మొక్కటే సత్యము..ఎవరెన్ని ముఖాలు ధరించిననూ..
6632. నా నవ్వులు వెన్నెలిస్తాయి..నువ్వు పున్నమిని తలచినప్పుడల్లా..
6633. మాటలన్నీ ముగ్ధమయ్యాయి..నువ్వు మౌనాన్ని వరిస్తావని తెలీగానే..
6634. మది గాయాల లెక్క చెప్పమన్నాడు..గేయాలుగా రాసానని నేనంటే..
6635. మనసు మరుగునపడ్డది..నీకు నచ్చినట్టు నన్నుండమనగానే..
6636. ఇంద్రజాలికుడనుకున్నా..ఒక్క చూపుతో నా గుండె జార్చి గల్లంతుచేయగానే..
6637. నిరాశ గెలిచిందలా..ఉన్న ఆశ నిట్టూర్పులో జారిపోగానే..
6638. నిద్దట్లోనైనా కలవాలనుకున్నా..కలంటూ ఒకటొస్తే..
6639. ఒక్క గాయమూ మానలేదిప్పటికి..నేనిలా లెక్కేస్తూ కూర్చున్నా..
6640. జ్ఞాపకాలింకా ఏరుతూనే నేనున్నా..ఏదో క్షణంలో నువ్వొస్తావనాశిస్తూ..
6641. నీడవైతేనేమిలే..అనుక్షణం నీ సమక్షం నాకానందమేగా..
6642. జ్ఞాపకాలు పాతవే..బాధేంటో కొత్తగా..
6643. గుట్టెక్కువే కన్నీటికి..కళ్ళు ఒలికితే కార్యం సిద్ధించదని..
6644. కథగా నేనెప్పుడో మారాను..కవితగా రాసుకున్నావందుకేగా..
6645. అడుగు దూరంలో నేనాగిపోయా..నువ్వు ముందడుగు వేస్తావని..
6646. ప్రతి వేకువలో అరంగేట్రమే..వసంతాన్ని వలపించింది అందుకే మరి..
6647. ప్రకృతికెన్ని పరిహాసాలో..అప్పుడప్పుడూ ఋతురాగాల్ని శృతి తప్పిస్తుంది..
6648. మేఘమాలకీ కష్టాలున్నట్లున్నాయి..సందేశాలు మోయలేనని కురిసిపోతున్నయ్..
6649. మల్లెల మోత మొదలయ్యింది..జాజులు జారుకోవాలి మరి..
6650. మనసిప్పుడు చల్లబడింది..మల్లికలా నువ్వు పరిమళించగానే..
6651. పులకరిస్తూనే నేనున్నా..నా పేరంత తీయగా పిలిచావని..
6652. అవనిగా ఆమె..అస్తిత్వాన్నలా అతని ముందు కాపాడుకుంటూ..
6653. అలలు కోసినట్టు నా మది..నీ తలపుల నునుపుదనం అంటినట్టుంది..
6654. నీ కలలెప్పుడూ అల్లిబిల్లివే..కనుమూస్తే చాలు కవ్వింతలిస్తూ..
6655. ఈ సువాసనలేంటో కొత్తగా..మనసుని మంత్రిస్తూ మెత్తగా..
6656. నా కనులెప్పుడూ వలలే..నీ రూపాన్ని బంధించాలనుకుంటూ..
6657. సందడంతా నీదేగా..సందిట్లోకొస్తానని మాటందుకున్నాక..
6658. నీ ఆదమరుపెన్నడో కనిపెట్టేసా..వేసవని మల్లెలను ఆరాతీసా..
6659. కల్యాణిగా నేను..కదనకుతూహలంతో నువ్వూ..
6660. నీలో నేను సగం..కాదంటూ వాదించడం మూర్ఖత్వం..
6661. నా నవ్వులు మరందాలు..నువ్వు కారణమయ్యే ప్రతిసారీ..
6662. అనుభూతి బాగుంది నాకు..నవ్వులేరుతున్న దృశ్యముగా నువ్వు..
6663. మనసెంత దాచుకుందో మరందం..అధరం పొంగిందిలా ఆనందం..
6664. సుప్రభాతమని గుర్తుచేస్తున్నా..వసంతగీతాన్ని మనసు పెట్టి వింటావని..
6665. అంది నీకు తీయనవుదామనుకున్నా..దూరమై చేదు మిగుల్చుతావనుకోలా..
6666. నా మనసిప్పుడు విశాలమంటా..అందులో నువ్వు ఆకాశమంత..
6667. కష్టమైనా ఇష్టంగానే ఉంది..నీ ఇంటిపేరిప్పుడు నాదవుతుంటే..
6668. ముందు వెనుకల గోలెందుకులే..కలిసి నడిస్తే సరిపోలా మనం..
6669. నేనో ఎండమావినే..దాహం తీర్చుకోవాలని చూడబోకు ఆర్తిగా..
6670. మనసయ్యింది మనోహరాలు..నువ్వేయగానే కంఠహారాలు..
6671. నివేదనలోనూ నిరంకుశమే..ప్రతిక్షణం చెలి నామజపం..
6672. నా వలపు నీమీదనే..తొలి తలపుగా మొదలయ్యావనే..
6673. కొన్ని భావాలంతే..సందర్భోచితంగా సవ్వడిస్తాయి..
6674. వృధా ప్రయాస..గమ్యం చేరినా నువ్వు కానరాకపోవడం..
6675. రాగాలను తోడు తెచ్చుకున్నా..నీ మౌనాన్ని చెదరగొట్టాలనే..
6676. పాదాలను దాచేసాను..పదాలతో ఎక్కడ అర్చిస్తావోనని భయపడి..
6677. నవ్వులనిప్పుడు రువ్వలేను..నిదురలేదనే నీ నిందలనీరాత్రి మోయలేను..
6678. బంగారానికున్న వన్నె పెరిగింది..నిన్నంత ముద్దుగా పిలిచినందుకేగా..
6679. పౌర్ణమేగా నీ మది..నా రూపాన్ని తలచినప్పుడల్లా..
6680. నా అందానికో వెలుగొచ్చింది..నువ్వు వర్ణిస్తున్నావని తెలియగానే..
6681. మల్లెగాలి వీచినప్పుడే నీకు తెలియాలి..సంధ్యా సమయానికి నే సిద్ధమయ్యానని..
6682. పూల గమ్మత్తులో నేను..వలపు వసంతమాడేందుకు రమ్మనగానే..
6683. అక్షరాల సువాసనకే సోలిపోతావు..భావాలు శృతిమించితే ఏమవుతావో
6684. వేపపువ్వంటే నాకు మక్కువే..చేదులోని తీపి మనసుకందిస్తుందని..
6685. మోదుగు పువ్వులై నీ మాటలు..మనసుకెన్ని గిలిగింతలిచ్చేనో..
6686. అపరాహ్ణం వరకూ నేనాగలేను..మంకెనే కావాలంటూ నువ్వు మురిసిపోతుంటే..
6687. నీ రాకతో నేను..ఎప్పటికీ వాడిపోని ఎర్ర మందారాన్నే..
6688. ఆనందభైరవిగా మారిన అభేరి..నీవందించిన పూల సాన్నిహిత్యానికి..
6689. రేరాణిని తలపిస్తూ నీ నవ్వులు..పరిమళాలు పూసినట్టు ప్రతిసారీ..
6690. నా చూపు నిన్నెప్పుడో చుట్టుముట్టింది..కొత్తపూల సువాసనై ఆకర్షించగానే..
6691. అల్లరి మాటలన్నీ నీపరమయ్యాయి..పూలగాలి పెనవేసినట్టు ఎదురైనందుకు..
6692. జాజులంటే పడి ఛస్తున్నా..జాజిరినాపమని మాత్రం అడగమాకిప్పుడు..
6693. కొత్త ఆశలకు ఆజ్యం పోయాలనుకున్నా_ఓ పుస్తకంగా మిగులుద్దామని..
6694. విషాదం వీడనంటుంది..కొన్ని నిరాశల ఫలితమనుకుంటా..
6695. కొలువుండిపోనా నీ ఆశల్లో..అనుభవం నాదవుతుందంటే..
6696. ఏకాకిగానే మిగిలిపోతున్నా..నీ ఆశ తడుముతుందనే ఎదురుచూపుల్లో..
6697. సమాధానమెప్పటికీ దొరకదేమో..నిరాశల్లోనే ప్రశ్నలుంటుంటే..
6698. సమాధానమెప్పటికీ దొరకదేమో..నిరాశల్లోనే ప్రశ్నలుంటుంటే..
6699. నేర్చుకోడానికేం మిగిలింది..నిరాశకు ఆజ్యం పోస్తూ మనసుంటే..
6700. ఆత్మను కౌగిలించుకున్నా..ఆశ ఎలానూ పోగొట్టుకున్నానని..

No comments:
Post a Comment