2401. ముచ్చట్లెక్కువే నీ మౌనానికి_గోరింటలో నేను తలదాచుకుంటుంటే..
2402. అనుభూతికి అతిశయమెందుకో_నువ్వు ప్రస్తుతించింది అక్షరాన్నైతే
2403. నా కురులెందుకు మత్తెక్కాయో_కుసుమించిన పరిమళాలన్నె నీ తోటలోవైతే..
2404. విజయం తధ్యమే నీకిక_జీవిత గమ్యానికి చేరువవుతుంటే..
2405. విరహానికి వీడ్కోలు పలికేసా_నీలో ప్రేమ నన్నాదరించగానే..
2406. మెరుపుతీగనై నే మెరిసా_స్వాతిచినుకు సంకేతాన్ని నీకద్దిద్దామనే..
2407. మిగలని వ్యధలా_సుఖాంతమే చివరికి మన కధ..
2408. మనసుకి ఓదార్పు దొరికింది_అల్లిబిల్లిగా నీ అక్షరాలను పెనవేసుకోగానే..
2409. ఉలి కదలికలు తప్పవు_శిల శిల్పముగా ఆకృతవ్వాలంటే..
2410. కష్టాన్ని గుర్తించనంటూ మనసు_ఇష్టమైన కవితై నువ్వొచ్చేసాక..
2411. కలవరించడమింక మానేసా_నా కలలన్నీ నీ పరమైనందుకేగా..
2412. మృత్యువుతో మాటలెందుకో నీకు_సంజీవినై చెంత నేనుండగా..
2413. ఆకాశానికి నిచ్చేనేస్తున్నా_నా గమ్యానికి హద్దు విధించుకోరాదనే..
2414. అడుగులన్నీ ఏకత్వం వైపే_అంధకారాన్ని అధిగమించి ప్రయాణించాలని..
2415. నక్షత్రాల మధ్య నీ మనసు_అనంతప్రేమకై నన్ను ఆహ్వానిస్తూ..
2416. వరమో..కలవరమో కనుగొనలేకపోయా_నువ్వు కలలాగా నడిచొస్తే..
2417. తొలిచూపుల బాణాలే తుదివరకూ_తీయని శరాలై ఎదని గాయపరుస్తూ..
2418. నీ తొలి కవితల నీరాజనం_నులివెచ్చని నా రాతిరి పరిమళం..
2419. అడుగులకెప్పుడూ తడబాటే_నీ మౌనంలోకి నడిచెళ్దామని నేనంటే
2420. తొలి తలపుల వర్ణాలే_మది సంకీర్తనకు గమకాలు..
2421. కాల గమనంతో పోటీ పడలేకున్నా_అందుకొనేలోపునే ఊపిరాగిపోతుంటే..
2422. నీ దరహాస వీచికలకేమో_హేమంతం రాకుండానే మనసొణికిపోతోంది..
2423. జ్ఞాపకాలన్నీ ముత్యాలే_కన్నీట జారినా..కంటిమెరుపై వెలిగినా..
2424. నేవెంటే ఉండాలనుకుంటా నేనెప్పుడూ_సంతోషం రెట్టింపై పల్లవిస్తుందనే..
2425. ఇమడని మనసు_ఆకర్షించని విషాదంలో..
2426. ఒంటరినని గుర్తుచేస్తున్న కాలం_గతాన్ని కన్నుల్లోకి నింపేస్తూ..
2427. వెనుదిరిగిన హేమంతం_ఇరువురి నడుమన రగులుకున్న సెగతో..
2428. నువ్వున్న నిశ్చింత_ఇన్నాళ్ళకు నాకు కలిగిన ఆవలింత..
2429. పులకరమిచ్చింది నీ పలకరింత_మనసు వెతుక్కుంటూ నేనుంటే..
2430. పంచమవేదమై నే వినిపించనూ_నన్ను ప్రేమిస్తున్నావని తెలిసాక..
2431. వీడిపోని బంధమేగా మనది_కొన్ని జన్మలుగా కలిసొస్తూ..
2432. ఆశలకెప్పుడూ మరణమే_బాధలతో కప్పబడినందుకేమో..
2433. తరిగిపోతున్న ఆశల ఆయువు_నిరాశలొచ్చి మింగేస్తుంటే
2434. చిగురించనంటూ అనుభూతులు_చిదిమేస్తుంటే ఆశలు..
2435. నిర్వేదమై మిగిలున్నా_నీ ప్రేమింకా నన్ను చేరలేదనే
2436. స్వరాలమాలికలెన్ని అల్లావో_నా మెడలో అలంకరించాలని..
2437. విషాదం వెనుదిరిగింది_నీ అనునయాల పలకరింపుతోనే
2438. కరిగిపోతోంది హృదయం_ఒంటరితనాన్ని తిట్టుకుంటూనే..
2439. విరహంలో నేను_వేసవని నువ్వంటుంటే..
2440. నీ స్మృతులే వెన్నెలలు_నా జీవితపు అమాసచీకటికి..
2441. కలలోనూ కన్నీరే_ప్రేమ విషాదమై వికటించిన వైనానికి..
2442. కన్నీటికి స్వరమెక్కువే_ఆగకుండా కరిగే హృదయ వేదనలో..
2443. విచ్చేయనూ నీ వియోగానికి_కవితాత్మగా కదిలి నన్ను రమ్మంటుంటే..
2444. కరిగిపోతున్న స్వప్నాలు_కన్నులు నిద్దురలోనూ కన్నీటిని చిలికిస్తుంటే..
2445. తనువు చెమ్మగిల్లిందెందుకో_నీ చూపు తమకమై అల్లినవేళ
2446. నక్షత్రాలు రాలిపడ్డాయి_నీ గగనంలో తమకు చోటివ్వనంటుంటే..
2447. నీ తలపులన్నీ ధిలానాలేగా_నా మనసును అనురాగంతో అల్లేస్తూ..
2448. ఎన్ని జ్ఞాపకాలు వాడిపోవాలో_తిరిగి సజీవినై నేను శ్వాసించాలంటే..
2449. హృదయస్పందనై విచ్చేయవూ_నా మనసుకి తాళం నువ్వు కావాలనుకుంటే..
2450. గతజన్మ పరిచయమున్నందుకేమో_నీ తలపుకే మైమురుస్తూ మది..
2451. మూతపడనంటూ రెప్పలు_నీ తలపుల తన్మయత్వపు పరవశంలో..
2452. శృతి తప్పుతోంది నా మేను_నీ తమకపు తాకిడికి ఉలికిపడుతూనే
2453. భావాలెన్ని భద్రపరచాలో_అక్షరాలలో కూర్చి నిన్ను మెప్పించాలంటే
2454. కధలన్నీ ప్రేమమయమే_ఆరాధనా రాధగా నన్ను వర్ణిస్తుంటే
2455. కొన్ని లక్షల తీయందనాలు_నీ మధుమాస దరహాసాలలో..
2456. ఒక్క పులకరింత చాలుగా_నేను మొగ్గనై ముడుచుకొనేందుకు
2457. అణువణువులోనూ గంధాలే_నీ ఊహలతో మత్తిల్లిన మేనులో..
2458. నవ్వినా కన్నీరే చిందుతోంది_కష్టించినా శ్రమకావల సుఖముందనేమో..
2459. మనసెందుకు అలసిపోతుందో_నీ చూపులు శ్రమకోర్చి బాణాలేస్తుంటే
2460. నా నవ్వుతో బ్రతికిద్దామనుకున్నా_నీ మాటలతోనే చంపేస్తావని తెలీక..
2461. సూర్యోదయమై నేనొస్తా_రసోదయాన్ని నీకు పరిచయించేందుకైనా
2462. మౌనం మువ్వై మోగింది_నీ నవ్వుల కెరటాల గుసగుసలకి..
2463. మాటల మాంత్రికుడివే నీవు_మంత్రాక్షరిగా నీ పేరునంటగట్టేసి..
2464. నీ కళ్ళవాకిటనే నిలుచున్నా_కలలాపి నిద్దురలేస్తే నీకెదురవ్వాలని..
2465. నా పెదవుల్లో కల్లోలం_నువ్వు పలవరించింది నా పేరైనందుకే..
2466. నా అల్లరిలో ఆనందం_నీ హృదయం నాదయ్యిందనే..
2467. నా వియోగానికెందుకో ఆరాటం_నీ పలకరింపులో కరిగిపోవాలని..
2468. మంచి పనొకటి చేద్దాం_మంది మొత్తం గుర్తుపెట్టుకొనేలా..
2469. నన్నెతుక్కోవడం మానేసా_మనసంతా నువ్వని ఖాయమయ్యాక..
2470. మెరుపుల్లోనే నిలబడిపోయా_మలుపులన్నింట్లోనా తప్పిపోతానేమోనని
2471. ప్రణయవిహారాన్ని నిలిపేసా_నా నవ్వులు కోసుకొనే అవకాశం నీకిద్దామని
2472. ఆషాడం చిన్నబోయింది_దోబూచులాటలేని కొత్తకాపురంలో..
2473. నీ చూపుకెలా చిక్కాలో_వసంతానికి రమ్మన్న ప్రతిసారీ..
2474. జ్ఞాపకాల జాజుల ఘుమఘమలకే మత్తిల్లుతున్నా_నీవని గుర్తుపట్టాక
2475. మైమరపులకు కొదవేముందిలే_ప్రతిబింబాలుగా మనమొదిగిపోయాక..
2476. లోకుల భిన్నరీతిని విడిచేద్దాం_మంచితనం మన తోడున్నదిగా
2477. అనంతమై విలపించింది కన్ను_మసకైన నీ రూపును కడిగేద్దామనే
2478. మనసును మచ్చిక చేస్తుకుంటున్నా_వయసుని గెలవాలనే
2479. నన్ను నేనే మరచిపోతున్నా_నీ సమక్షంలో సంతసాలతోనే
2480. నా మనసారా వేచి ఉన్నా_నువ్వొస్తే స్వాగతిద్దామనే
2481. నీ కంటిచూపుకే కరుగుతున్నా_కాంతులెన్నో వెదజల్లుతున్నావనే
2482. మనసు పెంచిన వయసు విలువ_చలించేందుకు చిత్రంగా కట్టుబడి..
2483. అలుకను పరీక్షిస్తున్నా_అందాన్ని నువ్వు గుర్తిస్తావో లేదోనని..
2484. పగలెన్ని పడిగాపులో_నీ చూపుల వీక్షణకై నేనిలా..
2485. నువ్వు నేనుగా మారినప్పుడే అనుకున్నా_నీలో నన్ను దాచేసావని..
2486. అనురాగపు బరువెందుకు తగ్గిందో_శృతి చేసి మీటుకుంటున్నా..
2487. వెన్నెలంతా చీకటయ్యింది_బాల్యాన్ని తరిమేసినందుకేమో
2488. హృదయానికెందుకో పారవశ్యం_కన్నులు బరువెక్కి మూతలు పడుతుంటే..
2489. చెలిమికి మరో పేరు_నీ సమక్షంలోని సాంత్వనేనేమో..
2490. తరించిపోయా_నీ భావలలో నాకూ చోటిచ్చావని..
2491. మది వికసించినప్పుడే అనుకున్నా_నీ చూపు నన్ను వరించిందని..
2492. శిశిరాన్ని తట్టుకోలేను_వసంతమైన నువ్వు నన్ను వీడవనే నమ్మకంలో..
2493. అనురాగాన్ని అనుసరిస్తూనే ఉన్నా_జన్మలబంధమని గుర్తించినప్పటి నుంచీ..
2494. నీ జీవితం పరిమళించాలనుకున్నా_నా మదిలో చోటిచ్చినప్పుడే
2495. అరిమరికలు లేని ఆత్మీయత నీవయ్యవుగా_పరిమళాలన్నీ నా పరం చేసి
2496. అందం అంతుబట్టడం లేదు_అరుణరాగాలు మనవైనా..
2497. స్మృతులన్నీ కలిసొచ్చాయి_నాతోనే కలిసుంటామంటూ..
2498. కుందనమని కల్పించినప్పుడే అనుకున్నా_హృదయాలు కొల్లగొట్టేది నేనేనని..
2499. విరులంటే నాకిష్టమందుకే_పరిమళంతో ప్రాణం పోస్తాయని..
2500. పండువెన్నెలే పారావారమయ్యింది_నీ తలపులనే హత్తుకుంటుంటే

No comments:
Post a Comment