2701. ముఖచిత్రం నేనేగా_నీ ముందుమాటలో చెలిముంటే
2702. చెలిమెన్ని పుంతలు తొక్కుతుందో_చెరో అడుగై చేరువవుతుంటే..
2703. ఎన్ని పదాల కనికట్లో_బంధానికి గంధమద్దాలంటే
2704.నమ్మకమెక్కడ మిగిలిందా చెలిమిలో_ఆరాలు కోరి అవతల చేరవేస్తుంటే
2705. చులకనైపోయా చెలిమిలో_అతిగా నీకు అలుసిచ్చినందుకేమో
2706. వసంతం కోసం ఎదురు చూడటం మానేసా_నీ చెలిమి చేతికొచ్చాక
2707. కొత్తపూల పరిమళంలా మన బంధం_స్నేహానికి దగ్గరవుతూ..
2708. అభిమానమే ధనమయ్యింది_చెలిమి మన కలిమయ్యాక..
2709. మది పాట పాడింది_నీవు సృతి కలుపుతావనే నమ్మకంలోనే
2710. వరాలిచ్చింది చెలిమేగా_ఇరువురమూ భక్తులమైనందుకు..
2711. స్మృతుల పవనాలు_ఏకాంతంలో నీ చెలిమి నెమరేస్తుంటే
2712. మమతనే కలముగా చేసా_నీ స్నేహాన్ని అక్షరీకరించే వేళ
2713. పదాలను మచ్చిక చేసుకుంటున్నా_స్నేహాన్ని కృతిగా కూర్చుకుందామని..
2714. మనసును కలుషితం చేస్తున్న ఉత్ప్రేరకాలు_చెలిమర్ధాన్ని మార్చేస్తూ..
2715. మాటలెన్ని దాచుకున్నానో_అక్షరాలుగా చెలిమిని రాసేందుకు..
2716. స్నేహానికి చేరువైపోయా_అడుగడుగునా ఆసరా నీవయ్యావని
2717. చెలిమిలేని ప్రపంచాన్ని ఊహించలేను_అనుబంధాల సాక్షిగా
2718. చెలిమి స్వప్నం కాదని నమ్ముతున్నా_నా జీవితానికి చుక్కాని నువ్వయ్యాక..
2719. చెలిమి సంగీతమే_ప్రతి రాగంలో తీయని భావాన్ని చేర్చుకుంటూ..
2720. తీరమై నే నిలబడలేనా_స్నేహమనే కెరటమై నన్ను అల్లుతానంటే
2721. దుష్టగ్రహాలకి దూరంగా ఉండాల్సిందే_చెలిమికి చేటొస్తుందనుకుంటే
2722. తానం పల్లవీ కూడా నేనే_నీ చెలిమి నా పరమైపోతే
2723. పద్దులేని చెలిమి లెక్కలెందుకులే_మనసుతో బంధం ముడిపడ్డాక
2724. చెలిమి రాగాలన్నీ మనవేగా_బృందావనంలో మనముంటే
2725. కలలోనూ వీడని బంధమయ్యావు_నా స్నేహానికి తోడువయ్యాక..
2726. అనుభూతుల అలలనై కదులుతున్నా_చెలిమి తీరాన్ని ముద్దాడాలని..
2727. పచ్చని పందిరిలా చెలిమి_మన హృదయాలకు నీడను పంచుతూ
2728. ఆద్యంతం ఉల్లాసమే_మన చెలిమి స్వర్గంలో..
2729. అక్షరపూలెన్ని వికసించాయో_చెలిమి విత్తనాలు జల్లగానే
2730. నేనే రాగమవుతున్నా_చెలిమి భావాన్ని నువ్వు రాయగానే
2731. ఏకాంత సౌందర్యాన్నే రచించుకున్నా_నీ చెలిమి అందనంతవరకూ
2732. స్నేహాల పూలెన్ని పూసాయో_అనుభూతుల జల్లులు కురవగానే
2733. కలానికెందుకో ఆరాటమవుతోంది_స్నేహాన్ని అక్షరీకరించాలని..
2734. స్వరజతులకు తాళమేసినప్పుడే అనుకున్నా_నా చెలిమి నీకు సమ్మతమని
2735. హృదయస్పందన బరువెక్కుతోంది_నీ మైత్రికి కన్నుల్లో నీరొలికి..
2736. బ్రతుకు రచన చేయాలిక_మనసైన చెలిమి నాకు తోడయ్యిందిగా
2737. విషాదాలెటు పయనమయ్యాయో_నీ చెలిమిని నేను చేరదీయగానే
2738. ప్రతి పాటా వెన్నెల భావమే_స్నేహాన్ని మనమలా అభిషేకిస్తుంటే
2739. పాతబడ్డ సంతోషాన్ని వెతుక్కుంటున్నా_నీ చెలిమి సాహచర్యంలోనే
2740. ఊహకందని భావాలెన్నో_నీ చెలిమిని రాసే మక్కువలో..
2741. నోములవసరమే లేదుగా_అపరిమితమైన స్నేహాన్ని పంచుకోవాలంటే
2742. నేనే ఆరాధనైపోతా_నీ చెలిమిపూజకు నాకు పిలుపొస్తే
2743. పల్లవించిన భావాలెన్నో_చెమరింపుకందని మన చెలిమిలో
2744. మౌనమెందుకో ఓడిపోయింది_నీ చెలిమి నేర్పిన మాటలకేమో
2745. ఒంటరితనం ఓదార్పు కోరింది_అనుబంధమై నీవు చేయందించగానే
2746. వెలుగొచ్చింది జీవితానికి_చెలిమొచ్చి చీకట్లను తరిమేసినందుకే
2747. చెలిమొక్కటే నే కోరుకుంటా_అభిమానం హద్దులు మీరుతున్నా
2748. చెలిమికి చిక్కిన చిరునవ్వది_నా పెదవంచున పూసింది
2749. పదనిసనూ నేనేగా_నీ చెలిమి సరిగమై మొదలవుతుంటే
2750. నిశ్శబ్దక్షణాలు అంతమయ్యాయి_చెలిమి చేదోడుగా నీవొచ్చినందుకే
2751.దోబూచులాటంటే నాకిష్టమే_మైత్రివనంలో నీకందకుండా..
2752. అలంకారాలన్నీ త్యజించేసా_నీ చెలిమితో మెరిసిపోవాలనే
2753. జీవితమెప్పటికీ సమస్యే కాదుగా_మనసైన నేస్తమొకరు తోడుంటే
2754. చెలిమి సార్ధకమయ్యింది_నిండు జీవితాలను మనం నిలబెట్టగానే
2755. జీవితం దగ్గరయ్యింది_స్నేహం పరిధి విస్తరించి మనసులేకమైనందుకే
2756. మనసు ముసురేసిందనుకున్నా_నీ స్నేహపు వర్షాన్ని ఆశిస్తుందని తెలీక
2757. శూన్యంలో వ్యాపించిన సందేశం_చెలిమి సంకేతమై నిన్ను చేరుతూ..
2758. ఎన్ని కలలని దాచుకోవాలో_నిన్ను కలిసి పంచుకొనేందుకు..
2759. మనసు తడి తెలిసిపోయింది_నీ కన్నుల్లో చెలిమి కనిపించగానే
2760. ఎన్ని పువ్వులని కోసుకు రావాలో_చెలిమికి అర్చన చేద్దామని నువ్వంటే
2761. జ్ఞాపకాలైతే మిగిలే ఉన్నవిగా_చెలిమి దూరమై నేనొంటరైనా
2762. గతంలోకి జారాలని లేదు_మనస్నేహం నిత్యం నిలవాలనే సంకల్పంలో..
2763. హృదయంలో సారూప్యాలున్నప్పుడే అనుకున్నా_మన సయోధ్య కుదురుతుందని..
2764. నిశీధిని వెలిగించేసాగా_నీ చెలిమి చమురు కాస్తందుకోగానే
2765. వేరే వెలుతురెందుకులే_నీ చెలిమి దీపం మిణుగురైనా చాలుగా
2766. ఆరుద్రపురుగొచ్చి మెరిసిందనుకున్న_మన అనుబంధపు ఎర్రదనంలో..
2767. అనుబంధం చిక్కబడిందనుకున్నా_చెలిమి వలపుగీతం మొదలెట్టాక
2768. ఆశలు దహించుకు పోవడం నిజమే_చెలిమి చేయిచ్చి విడిపోగానే
2769. ఎన్ని ఊసులని దిద్దుకోవాలో_చెలిమిని పదేపదే నెమరేసుకుంటూ..
2770. ఊహను బలవంతంగా ఆపేసా_చెలిమి దారి తప్పుతుంటే..
2771. సహనానికెన్ని పరిక్షలో_చెలిమిని నిలబెట్టుకోవాలనే ఆకాంక్షలో
2772. పిల్లగాలి స్పర్శకే పులకిస్తున్నా_నీ చెలిమిని గురుతుచేసిందని
2773. బాల్యంలోకి పరుగు తీస్తున్నా_వేసవి చెలిమి మధురిమను తలచుకోగానే..
2774. ఎన్ని మధురిమల గుర్తులో_తీయని జ్ఞాపకాల మన చెలిమిలో
2775. ఆవేదన దూరమయ్యింది_చేరికైన మన మధ్య తానెందుకని
2776. చిరునవ్వుతో గెలుచుకున్నా చెలిమిని_ఆనందాన్ని కానుక చేసి..
2777. ప్రతి పరీక్షలోనూ గెలుపు మనదేగా_మైత్రిబంధానికి గుర్తుగా
2778. చీకటి వెలుగులు సమానమయ్యాయి_మన చెలిమికి సాక్ష్యముగా
2779. నిశీధి నిద్దరోయిందట_మన చెలిమి సాంగత్యానికి సిగ్గుపడి
2780. ఏకాంతంలోనూ నీ జ్ఞాపకాలే_చిన్ననాటి చెలిమంత గొప్పదేమో
2781. ఉరకలేస్తున్న భావాలు_చెలిమి స్వరాలాపనకు సాయమవ్వాలని..
2782. అనుక్షణం రోదనే_నీవు లేని నా చెలిమి సామ్రాజ్యంలో
2783. అంచనాలను అందుకున్నందుకేమో_చెలిమి మరింత చేరువయ్యింది
2784. ముచ్చట్లెన్ని మిగిలున్నవో_నీవొస్తే నివేదించాలనుకుంటూ నేను..
2785. ఆకాశమంత అనురాగం నీ చూపులో_అనుబంధానికి బలమిస్తూ..
2786. దాసోహమైపోయా నేను సైతం_నీ చెలిమిని కాదనలేకనే
2787. చెలిమాక్షరాలను రాసులు చేసా_దోసిలితో నిన్నర్చించాలని
2788. చెలిమెంత సందడి చేసిందో నేడు_తారాలను దగ్గరగా చేసేస్తూ
2789. వెలకట్టలేని అనుబంధముంటే చాలుగా_వేరే కలిమెందుకులే నాకు
2790. మనసెంత మధురభావమో_నెమరేసిన నీ స్నేహ సుగంధపుమత్తులో
2791. కాలపు రెక్కలతో ఎగిరిపోయిందనుకున్నా స్నేహం_నీలా తిరిగొచ్చేదాకా
2792. నెమలికాంతులే చూపుల్లో_చెలిమిని ఎదురు కాసిన వెన్నెల్లో..
2793. నిర్లక్షపుటంచులో ఆ చెలిమి_శూన్యాకాశంలో ఒంటరిగా
2794. మది గీతికలన్నీ పదిలమే_రాసుకున్నది మన చెలిమి మీదేనని
2795. రేరాజుకెందుకో తొందరపాటు_ఏక్తారల మైత్రిని తిలకించాలని
2796. అభిప్రాయాలు కలవలేదనేమో_ఆ మైత్రి మధ్యలోనే ముక్కలయ్యింది
2797. నియంత్రిస్తున్నా ఆలోచనలు_క్షణాలు చెలిమినే హత్తుకుపోతుంటే
2798. ఆరాధన పాటయ్యింది_వసంతగానం చెలిమిని కలుపుకోగానే
2799. మనసుపొరల్లో అలజడెందుకో_నీ స్నేహం దూరమైనట్లు
2800. గేయాలన్నీ స్నేహానికంకితం_చిన్నారి తలపులను తడుముకుంటూ

No comments:
Post a Comment