3001. మనసుకే బుద్ధిపుట్టిందో_నీ మాటలనే అనుసరిస్తూ సాగిపోతోందిలా..
3002. వేదనెంత బరువుగా జారిందో_హృదయమంత తేలికై నవ్వింది..
3003. నువ్వు చేయందించినప్పుడే అనుకున్నా_అడుగులింక తడబడేదే లేదని..
3004. మనసు వీణై పాడింది_నీ అనురాగానికి పరవశించి..
3005. నాకు నేనుగా కరిగిపోతున్నా_కురిసింది ప్రేమజల్లని తెలియగానే..
3006. మరణంలేని ప్రశ్నలే అన్నీ_జవాబు దొరకని జీవితాలలో..
3007. అక్షర సౌరభాలెన్నో_పరిమళిస్తున్న తారాలోకంలో విహరిస్తుంటే..
3008. కలలోనూ దారం కానుగా_నీలో ప్రేమున్నది నాకోసమేనంటే..
3009. ఎదురొస్తున్నా నీ కోసం_నన్ను చేరేందుకు దూరాన్ని తగ్గించాలనే..
3010. ఉలిక్కిపడేవారే ఎక్కువేమో_ప్రేమను పంచాలని నేనొస్తుంటే..
3011. నేనే నువ్వైనందుకేమో_నన్ను రాస్తుంటే నీలా కనిపిస్తోంది..
3012. ప్రత్యుషనికి ముందే పలకరిస్తున్నా_నిన్ను నిద్దురలేపే అరుణిమ నేనవ్వాలని..
3013. అడుగడుగునా నడిచొస్తున్నా_నీ అరచేతిని నాకందిస్తావనే..
3014. తారాతోరణమైనప్పుడే అనుకున్నా_నన్ను స్వాగతించే పనిలో నువ్వున్నావని..
3015. ఆకాశానికి అరువిచ్చా ఆనందాన్ని_నిన్ను చూస్తూ సంబరపడమని..
3016. మందారాలేగా బుగ్గలు_నీ స్మృతులు మదిని మీటినప్పుడల్లా..
3017. జరిగిపోతున్న కాలం_నీ జ్ఞాపకాల గవ్వలాటలు ఆడుకుంటూ..
3018. ఆనందం గజ్జెకట్టింది_అంబరానికి నువ్వు రమ్మన్నావనే..
3019. విరిగిన హృదయన్ని వేడుకుంటున్నా_ఒంటరి ఆలోచనలో నన్నుంచొద్దని..
3020. నా అక్షరం నువ్వేగా_కవితగా ఉంటానని మాటిచ్చాక..
3021. భావాల నక్షత్రాలే మనసంతా_నిన్ను రాయాలని కూర్చున్నవేళ..
3022. తీపిని కాదనుకుంది గుండె_ఎంతమందిని ఆకర్షిచాలో తెలీక..
3023. వయసంత పొంగిందనుకోలా_నీలా మారిన భావాలు హత్తుకున్న వేళ..
3024. మధువనమంతా మనమేనంట_నువ్వేకాంతానికి రమ్మని పిలిచిన కలలో..
3025. నీ చూపులో కనుగొనలేదేమో_నా రూపు రెప్పల మాటుందని..
3026. వేరే సంతకమెందుకులే_చెలిమి గమ్యం నీ మనసయ్యాక..
3027. పువ్వు పువ్వుకీ వివశత్వమే_మధుపమై నువ్వడుగేసిన ఏకాంతంలో..
3028. ఒంటరితనమే బాగుందేమో_ఏకాంతంలో నువ్వు గుర్తొచ్చి ప్రేమొస్తుంటే..
3029. పదనిసల పరుగందుకుంది_పరువానికెన్ని గిలిగింతలిచ్చినందుకో..
3030. నీడల్లో నిలబడిపోయానిలా_నీ దారిలో పువ్వులను చిదమలేకనే..
3031. నిన్నటిదాకా మొగ్గనేగా_నీ వలపంటిన పువ్వు నేడై..
3032. ఎన్ని అలలో వెన్నెల మడుగులో_చెలి అలుకను తడిపేసి తీర్చాలని..
3033. స్థిరమైపోతానంది అందం_నీ ప్రేమే శాశ్వతం చేస్తానంటే..
3034. అలిగిన మోము వికసించింది_నీ నవ్వొచ్చి తాకిందనే..
3035. అమాసని గుర్తుపట్టలేకపోయా_జలతారు సొగసులతో నువ్వు మెరుపద్దాక..
3036. వయసు దాచేలేనంటూ ఏక్ తార_ఏటేటికీ నేస్తాల తాకిడెక్కువవుతుంటే..
3037. ఆగిపోతున్న కదిలే మేఘాలు_నా మదిలో భావాన్ని చదవాలని..
3038. నీ ఆనందంలో చేరినందుకేమో_నా అందానికెన్ని అతిశయాలో..
3039. నువ్వెక్కడ మిగిలావో వెతుకుతున్నా_ఏకమై నాకు నేనుగా నిలిచాక..
3040. పరిహాసాలు వెతుకుతున్నావెందుకో_ప్రణయపు సందేశాలలో..
3041. నీ కంటి జాబిలది_సంధ్యవెలుగులో దాన్ని గుర్తించేదెవరని..
3042. అనుసరించడం నేర్చింది మనసు_చెలిమి దారి తప్పించదనే..
3043. బంధీనైనా బాగుంది_అది నీ తలపుల్లోనని తెలిసాక..
3044. నేనున్నదెందుకనుకున్నావ్_అద్దం లో నిన్ను నువ్వే చూసేసుకుంటూ..
3045. కన్నులు కలపడం మానేసా నీతో_నా మనసునే కట్టేస్తున్నాయని..
3046. ఎన్ని నెర్రలయ్యిందో భూమి_వానొచ్చి మట్టిని ముద్దచేస్తుందని..
3047. మనసో బృందావనం_నీ రాకతో పూలన్నీ పరిమళిస్తూ..
3048. పులకితమవుతోంది మనసు_నీ ధ్యాసలో గులాబీలు గుర్తొచ్చినట్లయ్యి..
3049. మరణమంటే భయం పోయింది_మరుజన్మకైనా నిన్ను కలుస్తాననిపించే..
3050. అమరమయ్యింది నా ప్రేమ ఇలా_ఆమోదించిన నీ మనసు సాక్షిగా
3051. విషమించిన జీవితాలవి_నిత్యం నిషాలలోనే మునిగి తేలుతూ..
3052. వేదనలా తీరిపోయింది_వేయి రాగాలతో నన్ను స్తుతించినందుకే..
3053. ఆనందపు మేలి ముసుగును పరదాలు చేసాను_మన జంటజావళి సాగిపోవాలని
3054. కొన్ని అనుబంధాలంతే_బుగ్గమీద చారల సాక్షిగా సాగిపోతుంటాయి..
3055. నిశ్శబ్దానికి రవళింపు_నీ మౌనంతో పోటీపడి గెలిచినందుకు..
3056. నా ఒడేగా ఊయల_పసిపాపై నువ్వు ఊగాలనుకున్నప్పుడల్లా..
3057. అదే నేను_ఆనందపు క్షణాలన్నింటిలోనూ నీ జంటవుతూ..
3058. నా అందం అరవిచ్చింది_నీ ఆనందాన్ని రెట్టింపు చేయాలనే
3059. మాటలు మంత్రాలు చేసా_తలంబ్రాలకై సిద్ధపడ్డావని..
3060. తారలను కోసుకొచ్చానందుకే_వినూత్నంగా వివాహమవ్వాలని..
3061. ఎన్ని ప్రమోదాలో నాలో_మది నిండుగా ప్రవహిస్తున్నది నువ్వైతే..
3062. గెలిపించాలనుకున్నా నిన్నే_ఆగిపోయిన నా ఊహల సాక్షిగా
3063. ఓడిపోయినా గెలిచినట్లనుకున్నా_నీ మౌనాన్ని వినగలిగే మనసు నాకుందని..
3064. వేరెవ్వరినీ తలవలేను_మదిలోకి రావాలనెంత ప్రయత్నించినా
3065. మంచీచెడూ మమేకమే నేడు_రాజ్యమేలుతుంది అబద్దమైతే..
3066. అమాసెటో పారిపోయింది_పున్నమంటి నీ రాకతో వెలుగులద్దుకొని..
3067. నిన్నూ నన్నూ ఏకం చేసినోడు_ఇప్పుడెందుకిలా దూరం చేసాడో..
3068. ఒక్క నవ్వు చాలుగా_పెక్కు అమాసలను పారద్రోలేందుకు..
3069. నీకోసం నిందనైనా భరించాలనుకున్నా_అందులో మనముంటామని..
3070. నీ నవ్వుకందుకే దాసోహం_ప్రత్యూషాన్ని వెలిగించే దీపికవని..
3071. దేవుడికసూయెందుకో_మనం కలిసేందుకు మరో జన్మనిప్పించిందే తానైతే..
3072. నీ వలపే అమృతం_తాగేకొద్దీ రుచిని పెంచేస్తూ
3073. నిశీధికీ మెరుపొచ్చింది_నీ ప్రేమలో తడిచిందేమో
3074. చెరుకుతీపిలా నీ ప్రేమ_ఎంత తాగినా మరింత మది కోరినట్లు..
3075. నేను నువ్వైపోయానెప్పుడో_నీ ఆహార్యాన్ని దొంగిలించినప్పుడే
3076. దేహమిక్కడ నాతోనే ఉంది_మనసెటూ నీతో వచ్చేసాక..
3077. తరిస్తూనే నేనుండిపోతా_తలపుల జడివాన నీలా కురిస్తే..
3078. మగని మనసునెరిగిన మల్లెలు_కురులనంటి రేయి మత్తెక్కించాలని..
3079. దైవనిర్ణయాలంతే_మనసు వ్యధలన్నీ జీవితాలకి అన్వయిస్తూ..
3080. నీ నవ్వులనే మోహిస్తున్నా_నీరవాన్నీ సందడి చేస్తాయని..
3081. ప్రత్యూషమై పలకరిస్తున్నా_నిశీధి రాగం నీకు నచ్చలేదనే..
3082. ఏకమైన మనసునడుగు_నాలో ఉన్నది తానెందుకు దోచిందో
3083. మేను పరిమళించినప్పుడనుకున్నా_నీ ఊసు ఆశేదో రేపిందని..
3084. మరపురాని వెన్నెలయ్యింది మదిలో_నీలో సగం నేనయ్యాక..
3085. ప్రవరాఖ్యునిలా బెట్టెందుకో_నాకై నేను మెచ్చి చేరినందుకా
3086. చంద్రకాంతనై నేనొచ్చా_రాత్రి పూస్తేనే నీకిష్టమన్నావని..
3087. నా మోమో పున్నమి పువ్వేగా_వేరే పున్నమెందుకు నీ రాతిరికి
3088. వేదనలో పడలేనంది మది_ఇప్పుడే ఆనందం అనుభవమయ్యిందని
3089. నా మనసెప్పుడూ విరాగినే_వేదన మోసుకు తిరిగే పరాజితలా..
3090. అదేమో మనసుకి చలేస్తుంది_కన్నులు తలారా చేసినప్పుడల్లా..
3091. గడప తోరణాలకై తొందరపడ్డా_చూపులతో రణాలు మొదలెట్టావనే..
3092. అశ్రు జలపాతాలంటే ఏమో అనుకున్నా_నీ హృదయం కరుగక మునుపు..
3093. కనులు నవ్వుకుంటుంటే అనుకున్నా_కలలోకొచ్చి మురిపించింది నువ్వేనని..
3094. మౌనమెక్కడ మిగిలిందని_చెలి నవ్వులొచ్చి భగ్నం చేసాక..
3095. నిశ్శబ్దం పల్లవించిన సవ్వడి_చూపుల కోలాటపు సందళ్ళలో..
3096. విషాదమే పలుకుతోంది గొంతు_నువ్వులేని ఆనందం తనకొద్దంటూ..
3097. ప్రతి కలలో అనుసరిస్తుంటావెందుకో_నాపై ప్రేమ లేదంటూనే
3098. ప్రేమని గుర్తించలేదు_పొద్దస్తమానూ నీ తలపులే తడుముతుంటే..
3099. ఎన్ని ప్రశ్నల చిక్కులో_జవాబులేక తలను చుట్టుకుంటూ..
3100. స్మృతుల వెల్లువలు ఎదలో_కన్నీటి వరదలేమో కన్నుల్లో..

3044. నేనున్నదెందుకనుకున్నావ్_అద్దం

No comments:
Post a Comment