Sunday, 1 January 2017

02301 నుండి 02400 వరకు

2301. మౌనమే భూషణమయ్యింది_మానసిక ఆనందాన్ని అనుభూతించేందుకు..
2302. నీ తలపేనది_మౌనం పాడే పల్లవిగా నాలో ప్రవహిస్తూ
2303. వెతుకుతున్నా ఆనందాన్ని_నాలో నిక్షిప్తమైన మౌనంలో కనుగొనలేక..
2304. మౌనానికెన్ని సవ్వళ్ళో_ఆలకించే మనసుకి మాత్రమే వినబడుతూ..
2305. కొన్ని మౌనాలంతే_మదిలో మొదలై మాటలనే అంతం చేస్తాయి..
2306. నా మౌనంలో నువ్వు_అక్షరమై మెదిలే భావముగా..
2307. కన్నులను చదవడం నేర్చుకున్నా_నీ చూపులభాషను పట్టుకోవాలనే..
2308. మౌనం బెంగటిల్లింది_కొన్ని మాటలను తిప్పికొట్టే వీలులేక
2309. నువ్వూ నేనూ నీరవమై కనిపించినందుకేమో_శూన్యానికి సమస్యగా తోచింది..
2310. నిన్నలు దాటి నేనొచ్చేసా_నీ ముందడుగులో నేనుండాలని..
2311. దయలేని కన్నులనుకుంటా_చూపులతోనే దేహాన్ని పంచనామా చేసేస్తూ..
2312. ప్రణయకిరణాలను ప్రసరించానందుకే_నీ ఎదురుచూపులకు ఉషోదయం నేనవ్వాలని..
2313. ఆఘమేఘమై నేనొచ్చేసా_నీ క్షణాలకు గుసగుసలు పరిచయిద్దామని..
2314. పుప్పొళ్ళ గంధాలెన్నో పూసుకున్నా_నీ స్మృతులనే మనసుకంటించుకొని..
2315. సరిమువ్వల గజ్జెలతో నేనొచ్చేసా_నీ అడుగులను  నేననుసరించాలనే..
2316. ఆశలు సైతం ఆకాశానికే_నక్షత్రాలై పైకెగిరి మెరవాలని..
2317. ప్రేమంటే మనమేగా_ఇద్దరమూ ఏకమయ్యాక..
2318. శిలగా పడి ఉండలేకపోయా_శిల్పిగా నువ్వొచ్చి తాకినందుకే..
2319. వెన్నెలబొమ్మగా మారానందుకే_నీ స్పర్శకే కరిగిపోదామని..
2320.   మౌనమే ధ్యానమయ్యింది_మదికి నీ ఆరాధన ప్రియమయ్యాక..
2321.మౌనమైతేనేమి_నాలో కురిసిన వెన్నెల వైనమదేగా..
2322. నిశ్శబ్దాన్ని జయించేసా_మదిలో నీ పాటనే పాడుకుంటూ నేను..
2323. ముందుకే పడుతున్న అడుగులు_నీడలజాడలన్నీ నిశీధికే వదిలేస్తూ..
2324. పరవశాలన్నీ నాకెందుకో_పులకరించిందేమో నువ్వైతే..
2325. ఆత్మీయతంతా నిజమయ్యింది_అభిమానం నీదయ్యాక..
2326. మాటలన్నీ దాచేసుకుంటున్నా_మౌనాలు మిడిసిపడేలా..
2327. పదాలన్నీ పరుగెత్తుకొచ్చాయి_వాక్యానికి పల్లవిగా తామవ్వాలని..
2328. నివేదించుకున్నా నన్నే_ఆరాధనంతా నీవయ్యాక..
2329. చినుకు తాకిడికే చిత్తడైన ధరణి_జల్లుగా కురిసుంటే ఏమయ్యేదో మరి..
2330. మాటలకే మైకమెందుకో_మనసిస్తే ఏమవుతావో..
2331. పాటలన్నీ మన సొంతమేగా_యుగళాలుగా మారిపోయాక..
2332. సైగతో సరిపోతుందనేగా_చూపులనే చుంబనాలుగా విసిరావు..
2333. మదిలో సరిగమలే_పరువాలు పదనిసలు కోరుతుంటే
2334. హత్తుకోక తప్పలేదు మౌనాన్ని_నీతో మాటలనేవే కరువయ్యాక..
2335. వేరే నీరాజనాలెందుకులే_నీ చూపుల ధూపాలు సరిపోతాయిగా..
2336. నా మైకాన్ని అద్దుకున్నందుకేమో_మరుమల్లెలు అంతగా పరిమళిస్తున్నాయి..
2337. సవరించుకున్నా భావాన్ని_నీ నిశ్శబ్దానికి భంగం కలగరాదని..
2338. చేరికైన చైతన్యం నేనేగా_నువ్వు దూరం జరిగిన ప్రతిసారీ..
2339. నీ తెల్లదనం తడిమినందుకేగా_మల్లెపై నేను మోజుపడ్డది..
2340. కురిసిపోతున్న మధురం_కలసిపోతున్న వివశాన.. 
2341. నీ మనసు మందారమేగా_నా అల్లరికి ఎర్రదనం పూస్తూ..
2342. చెదిరిపోయే అనుబంధం కాదుగా మనది_చెలి చక్కిలిగింతలు మనవయ్యాక.
2343. చెక్కిట మందారమై నేనొస్తా_కెంపులు కొత్తగా మెరిపించేందుకై..
2344. మౌనంతో చేస్తున్నా సైగలన్నీ_తూటాలను తిప్పికొట్టే మాటగా..
2345. నీ పిలుపే జీవలహరి_నీరవంలో నినదించిన వలపుగీతి..
2346. నిర్జీవినే నేనింక_నిన్ను కాదనుకొని నిర్వేదాన్ని హత్తుకున్నాక..
2347. మనసుకెందుకో నాగపూల వివశం_రాసావనగానే ప్రథమకావ్య శతకం..
2348. కలలతోనే కరిగిపోతుంది కాలమంతా_రేయింబవళ్ళు నీ పరధ్యానంలో..
2349. నువ్వెతుక్కునే అసలైన స్వర్గం_నీలోనే ఉందనేదే నిజం..
2350. తీరమై నిలబడలేనా_వెల్లువై నన్ను తడేందుకు నువ్వొస్తానంటే..
2351. ఊయలూపింది ఎవరోననుకున్నా_నీ తలపులను గమనించక మునుపు..
2352. నిద్దురలో తడుముకున్నా_కలలో నువ్వు కనబడలేదంటూ..
2353. నీ రూపులో సాంత్వమున్నది సత్యం_నన్ను నిరంతం ఓదార్చుతూ..
2354. ఒకటైతే బాగుండనుకున్నా_ప్రకృతికి మనమే కనువిందయ్యేందుకు..
2355. కనుమరుగు కాదెప్పటికీ కన్నుల్లో_మనసైన నీ రూపమది..
2356. ప్రేమవిత్తు నాటిందిప్పుడేగా_ఆరాధనా పువ్వులు పూసేందుకు..
2357. కొన్ని కలతలంతే_కలలో మొదలై వాస్తవాన్నీ మింగేస్తాయి..
2358. మత్తకోకిలై కూయాలనుకున్నా_నీకో గమ్మత్తును రుచి చూపించాలనుకున్నందుకే..
2359. ఆకాశానికెందుకో అతిశయం_తారలన్నీ చుట్టుముట్టింది రేరాజునైతే..
2360. ఆశలన్నీ ఆకాశానికంటాయి_జల్లుగా కురిసి నన్ను తడపాలనే..
2361. ఆకాశం ఓడిపోయిందట_విస్తరించిన తన నిజాయితీకి ముందు..  
2362. కాలానికెంత కష్టమొచ్చిందో_వేయి చేతులతో నిన్ను బుజ్జగించలేక..
2363. నిన్నే ప్రపంచం చేసుకున్నా_వేరే పరిచయం అక్కర్లేకుండా..
2364. నువ్వంతే_నాలో కురిసే మేఘానివే ఎల్లప్పుడూ..
2365. కాటుకదిద్దా కన్నులకు_నల్లని సాక్ష్యం చెక్కిట చారికలవ్వాలని..
2366. శాశ్వత రూపమే నాదయ్యింది_నీ హృదయంలో పూజించగానే..
2367. వికృతినెందుకు చేసావో ప్రకృతిని_అనవసరంగా నాతో పోల్చి..
2368. రాతిరికై వేచివుంటా_కలలో నాపై నీకు మక్కువంటే..
2369. రోదిస్తున్న హృదయాలే అన్నీ_ఆవిష్కృతి లేని అంతరంగాలతో..
2370. సమాధానపడక తప్పలేదు_మార్పుని కోరి గతాన్ని మరవాలంటే..
2371. అమ్మ దూరమయ్యాకే తెలిసింది_భవిష్యత్తు అంధకారమై మిగిలిందని..
2372. అనుభూతుల విపంచులేగా నా భావాలన్నీ_మది తీయగా నిన్నాలపిస్తుంటే..
2373. ప్రశ్నగా మిగిలిన ప్రశ్నొకటి_సమాధానం శోధించలేని రహస్యంలో..
2374. వెన్నెలై కురిసిపోలేనా_తాదాత్మయంలో తేలేందుకు నువ్వు సిద్ధంగానుంటే..
2375. ఆనందానికి ఆలంబనే నీవు_ఏకాంతాన్ని సురానుభూతిగా మార్చేస్తూ..
2376. అశ్రుగీతులు అనవసరం_మూగమనసెదుట ఆలపించడం..
2377. చిన్న మాట చాలుగా_మనసు ముక్కలై విరిగిపడేందుకు..
2378. ప్రపంచాన్ని గుర్తించడం మానేసా_మనసంతా నువ్వై నిండిపోయాక..
2379. చూపులు గారడి చేస్తాయని తెలీదు_మనసు పూలఒరవళ్ళు ఎగిసేవరకూ..
2380. ఆరళ్ళెన్ని తట్టుకోవాలో_అత్తగారి గారడీని తిప్పికొట్టాలంటే.. 
2381. విషాదానికి దారి తీస్తుందనుకోలేదు_గారడికి చిక్కిన మనసు ఒరవడి..  
2382. వేరే కవనాలెందుకులే_నీ కలలన్నింటిలో అనుభూతి నేనయ్యాక..
2383. నీ తలపులకెప్పుడూ తొందరే_తెల్లారకుండానే మేలుకోమని ఒత్తిడిచేస్తూ..
2384. బరువెక్కుతున్న కలలు_నీవు రాని రాతిరిని తిట్టుకుంటూ..
2385. మధుమాసమొచ్చింది మనసుకి_నీ పిలుపు మంజులమై వినబడుతుంటే..
2386. కొన్ని రాగాల సంకేతాలు_మౌనం ముగిసిందనే సల్లాపాలు..
2387. నా పలుకులెంత మధురమో_తీయందనాలై నిన్ను కలవరించినప్పుడల్లా..
2388.

2388. అనురాగానికద్దంపట్టినప్పుడే అనుకున్నా_నేనింకా సజీవంగానే ఉన్నానని..
2389. నాలో ప్రేముందని గుర్తించనేలేదు_నీ కన్నుల్లో గమనించేదాక.. 
2390. జన్మ పులకించినట్లుంది_మనసుపొరల్లోని రూపం నీలా ప్రత్యక్షమవ్వగానే..
2391. నవ్వుల నజరానాలు నీకే_అలుకలు పులకలుగా అపురూపమయ్యేవేళ..
2392. ఆకాశ శిఖరమెక్కిన నేను_ప్రతిసంధ్యకీ నీకు వేడుకనైపోతూ..
2393. నీ అనురాగం సంజీవనే_మరోసారి సంగీతమై నన్ను బ్రతికిస్తూ..
2394. అమూల్యమయ్యానిప్పుడే_నీ పరిమళభాషలో గుభాళించగానే..
2395. గోరింట ఎరుపెందుకో నీ కన్నుల్లో_అరచేతిలో అలంకరించమని నేనంటే..
2396. మనసెందుకో వెనుకబడుతుంది_గమ్యం ఎదురుగా కనిపిస్తూనే ఉన్నా..
2397. కన్నీటిని దాచేస్తాలే_నీపై అనురాగం ఛిప్పిల్లినప్పుడల్లా..
2398. నీ పదమో పరిమళనాదమే_నా అక్షరానికి సువాసనలిస్తూ..
2399. నీ పిలుపు పంచమమై వినిపించింది_వలపును తడుముకున్నప్పుడల్లా..
2400. కలలను రాతిరికి రమ్మని పంపేసా_పగలంతా పలవరింతవై నీవుండాలని..

No comments:

Post a Comment