2801. కురిసినప్పుడే అనుకున్నా_చెలిమి చినుకునై నేల జారిందని..
2802. స్మృతిపధంలో మెదిలేదెప్పుడూ నువ్వేగా_ఆత్మీయతను తలవగానే
2803. లెక్కకు మించిన నేస్తాలంట_మానవత్వాపు లెక్కరెరుగనివారికి..
2804. అంతరాత్మగా భాసించినప్పుడే అనుకున్నా_నిజమైన చెలిమికర్ధం నీవని
2805. కాగితాలన్నీ పడవలైనాయిగా_మన చెలిమి జ్ఞాపకానికొస్తే..
2806. నీడలా వెంటాడే నేస్తం నీవేగా_లోకమెంత ఎదురు తిరిగినా
2807. పాటలో దాచుకున్నా పదములన్నీ_మన చెలిమిని వివరించాలని
2808. ఒకే ప్రాణమై మిగిలిపోదామనుకున్నా_నేస్తమై వెంట నిలిచావని
2809. జీవితం స్నేహమయమే_నిరంతరం నీ తోడు దొరికితే
2810. జీవితమంతా రాగమయమే_హృదయగానం చెలిమిదైతే
2811. హృదయమంతా ప్రేమమయమే_పరిమళించు వెన్నెల్లో మనముంటే
2812. నీ చెలిమి చుక్కానే_జీవితనావకు దారి చూపుతూ..
2813. అనురాగమందిరం మనదేగా_మధుమాసపు పూజలంటూ మొదలెడితే
2814. చుట్టూ పెనుచీకటుంటే ఏముందిలే_నా చూపులకు చెలిమి వెలుతురుండగా
2815. కలగంటున్నావనుకున్నా_నాకై ఎదురుచూపుల నేస్తానివై నీవుంటే..
2816. మాట్లాడే బొమ్మనేగా నేను_నీ జ్ఞాపకాల వెల్లువ ఒరవళ్ళలో..
2817. స్మృతిగానే మిగిలిపోతా_నా చెలిమికి నువ్వంత దూరమయ్యాక..
2818. కోటి రాగాలూ మూగబోయినవిగా_మన చెలిమి విడిపోయిన కారణానికి
2819. వేయిదీపాల వెలుతురులేగా_చెలిమంటిన రాతిరి అమాసైనా
2820. చెలిమి ముగ్గులు పెడుతున్నా_అనురాగ తోరణాలు నువ్వు కట్టావని
2821. జ్ఞాపకాలన్నీ మధురాతి మధురమేగా_చెలిమి చిరునవ్వు నీదవుతుంటే
2822. మకరందమే నీ చెలిమి_మందారం మన అనుబంధమైతే
2823. ఆనందగీతమే మన స్నేహం_ఎంతమంది కవులు రాయాలని చూసినా
2824. అపురూప వరమేగా నీవు_స్నేహానికి చిరునామా నీవయ్యాక..
2825. పలుకరిస్తోంది ప్రతి కొమ్మా నా తోటలో_చెలిమితో పెంచింది నేనేనని గుర్తించి..
2826. అభిమానం మెరుగయ్యింది_ఒక్కసారి జ్ఞాపకాలను తడుముకోగానే...
2827. పదిలపరచుకున్నా నీ జ్ఞాపకాలను_మలిసందెలో నేస్తాన్ని నెమరేసుకుందామని
2828. దూదెపింజెలా మారింది మనసు_నీ చెలిమిలోని ఆప్యాయతలకే
2829.నీ పొడిపొడి మాటలతో మనసిరిగింది_చెలిమి నమ్మకాన్ని వెక్కిరిస్తూ
2830. అడుగులకు మడుగులెత్తినప్పుడే అనుకున్నా_నా చెలిమిని అభిలషించావని..
2831. నెమరింతలేగా మిగిలాయి_చెలిమి వాడిపోయిన జ్ఞాపకమయ్యాక
2832. నక్షత్రాల మధ్య నిలబడ్డట్లుంది_నేస్తాల నడుమ నేనుంటే
2833. కన్నులపై సేద తీరమన్నా_నా నేస్తానికి విశ్రాంతి లేదంటుంటే
2834. సంగీతం వీడిపోయినట్లుంది_నా చెలిమిని తిరస్కరించి నీవెళ్ళిపోతే
2835. అనురాగపు సూర్యకాంతి ఎదలో_ఒక్కసారి బాల్యాన్ని తలచుకోగానే
2836. చెలిమి కంట చెమరింపెందుకో_ఏకాంతంలో నేను అనుభూతినయ్యాక కూడా..
2837. ఎంతకని నీకై నిరీక్షించాలో_చకోరపక్షినై చెలిమిలో నేను
2838. బుగ్గలెందుకెర్రబడ్డాయో_కన్నీళ్ ళు చిందింది చెలిమి కోసమనేమో..
2840. ఆటలో నేనోడిపోయా_చెలిమైన నీ గెలుపు కోరుకుంటూ..
2841. వసంతర్తుల్లో వేచి చూస్తున్నా_చెలిమి కోయిలవై నీవు పాడతావని..
2842. పయనాన్ని కొనసాగిద్దామనుకుంటున్నా_చెలిమి గమ్యానివై నువ్వొస్తావనే..
2843. అలల సంగీతమొకటి ఎదలో_కెరటాల ఆలాపన నీవందిస్తుంటే..
2844. చెలిమి ప్రవాహానికి చెలియకట్టెందుకో_మనసు ఉప్పొంగి ఉల్లాసమవుతున్నా..
2845. నా ఆలోచనలెంత అల్పమో_నీ చెలిమి సలహాల ముందు..
2846. విషాదసంగీతం మాత్రమే మిగిలింది_చెలిమిలో సంతసం దూరమయ్యాక
2847. చెలిమి విలువెప్పుడు తెలుసుకుంటారో_జీవితాన్ని ఆటగా తీసుకొనే కొందరు
2848. చేయూతనై ఉందామనుకున్నా_చెలిమి విందుకు నన్ను ఆహ్వానించుంటే
2849. మూడక్షరాల చెలిమే_మనసంతా మధురోహలు నింపింది..
2850. అతిశయమంటే మనదేగా_చెలిమి తారలమై నింగిని అలంకరిస్తుంటే
2851. ఆకులెన్ని గలగలలాడాయో_మన చెలిమి సంబరానికి పిలిచినందుకు..
2852. కనులకు రెప్పవలే నేనుండిపోనా_నీ చెలిమి నా పరం చేస్తానంటే
2853. ఎప్పటికీ నేనో పుష్పాన్నే_నీ చెలిమి పరిమళం నాదవుతుంటే
2854. ఎప్పటికీ నీ జ్ఞాపకాన్ని నేనేగా_బాల్యంలోకంటూ నువ్వెళితే
2855. నా పూలతోటంతా అద్భుతాలే_చెలిమి పూలై మీరంతా పలకరిస్తుంటే
2856. నిదురించిన జ్ఞాపకాలకెంత అలజడో_చెలిమొచ్చి ఒక్కసారి హత్తుకోగానే
2857. జ్ఞాపకాల పూదోటలో విహరిద్దామా_చెలిమి చిగురింతను నెమరేసుకుంటూ
2858. నువ్వేగా నా ఆరాధన_వేరే నేస్తాలెందరొచ్చినా నా జీవితాన
2859. కదంబమై ఒదిగిపోయాముగా మనమంతా_స్నేహాన్ని కలిపి మాల కడుతుంటే..
2860. చెమ్మగిల్లింది చూపెందుకో_నీ చెలిమి మౌనవించగానే..
2861. క్షణాలెందుకు నిలబడిపోయాయో_మన చెలిమి ఆస్వాదనలో..
2862. తుదిభావం నువ్వై మిగిలిపోవా_చెలిమి అనుభూతి నే రాసేవేళ
2863. మనోరధానికెంత వేగమో_చెలిమి ఊహల్లోకి ఉరకలెత్తమనగానే..
2864. మందారపువ్వై మనసు నవ్వుతోంది_నీ చెలిమి ఊహలో మెదలగానే
2865. విశేషాలే అన్నీ మన చెలిమిలో_ఇన్నేళ్ళైనా చెదరనందుకేమో
2866. చెదిరిపోయే స్నేహమైతే కాదుగా మనది_మరువంపు దారాలతో ముడేసుకున్నది
2867. వెతలన్నింటినీ దూరం చేసా_నీ చెలిమికి చేరువ కాగానే
2868. మరుజన్మకైనా నీవేగా_అనురాగకిరణాలు నాపైనిలా ప్రసరిస్తుంటే..
2869. నాకు నేనే కొత్తగా కనిపిస్తున్నా_నీ చెలిమినల్లుకున్నాక మదిలో..
2870. చెంత చేరగానే మురిసిపోయా_ఇందరిలో నన్నే చెలిమిగా స్వీకరించావని
2871. అలౌకికమేగా నీ సాన్నిధ్యం_నిరీక్షణలోనూ చెలిమి పరిమళిస్తుంటే
2872. చిలిమిరధమైతే ముందుకే సాగుతోందిగా_రధసారథి లేకున్నా
2873. ఆనందాన్ని దారి కాసా_నీ చెలిమిలో దొరుకుతుందని తెలిసే
2874. ఎన్ని జ్ఞాపకాలు తడుముకుంటేనేమి_చెలిమన్న తీపి మదిలో లేకుంటే
2875. మనసెందుకో తేలికైన భావన_నా చెలిమి గీతానికి తాళమయ్యారనే..
2876. మచ్చికైన క్షణాలేగా అన్నీ_ఏక్తారలో చెలిమిలా వెలిగిపోతుంటే
2877. వసంతాన్నిక వెతికక్కర్లేదేమో_మన తారాతీరాన కనుగొన్నాక
2878. మదిలో పరిమళించిన చెలిమిగంధం_ఆకృతి దాల్చిన నీలా
2879. కలలకు అందని కల్పననుకున్నా స్నేహం_వాస్తవమై ఎదురవనప్పుడు..
2880. మనసు ప్రాంగణంలో చిందులేంటో_స్నేహితులు చరవాణిలో పలకరిస్తుంటే..2802. స్మృతిపధంలో మెదిలేదెప్పుడూ నువ్వేగా_ఆత్మీయతను తలవగానే

2838. బుగ్గలెందుకెర్రబడ్డాయో_కన్నీళ్

2881. ఆశల సందడి తీరింది_చెలిమి పిలిచిన తీయని పిలుపుతోనే...
2882. పల్లవినై చేరుకోలేనా_చెలిమి చరణమై నువ్వొస్తానంటే
2883. కలలెన్ని రాసివ్వాలో_నేస్తానివై నా తోడు నీవవుతుంటే
2884. జీవనరాగమిప్పుడే మొదలయ్యింది_చెలిమి పంచమవేదాన్ని మొదలెట్టగానే
2885. గుప్పిట్లో చిక్కిన చేతిని వీడనుగా_చెలిమి నువ్వై చేపడుతుంటే
2886. కల్పనలో చూసాననుకున్నా నీ రూపం_చెలిమై నువ్వెదురొచ్చేదాకా..
2887. శూన్యాకాశంలో ఒంటరినక్షత్రాన్నే_నీ చెలిమి చేయందక మునుపు
2888. సరితూగితే చాలనుకున్నా_అక్షరాల ఆలంబనతో చెలిమి సహస్రం..
2889. అభిప్రాయాలు కలిసినప్పుడే అనుకున్నా_చెలిమి శ్రీకారం చుట్టబోతున్నామని
2890. పూర్ణమయ్యేందుకు నే సిద్ధమేగా_చెలిమి చేయి చాచి నువ్వు ముందుకొస్తే
2891. మాటలే రావనుకున్నా నీకు_మన చెలిమిలో నీ మౌనాన్ని చూసి..
2892. అస్తిత్వానప్పుడే వదిలేసా_చెలిమికి ప్రేముంటే సరిపోతుందని..
2893. కొసమెరుపుగా నాలో మౌనం_నీ చెలిమిని ఆస్వాదించు వేళలో..
2894. అనుసరిస్తున్న జ్ఞాపకాల నీడలు_అనుబంధాన్ని మరువలేని వేదనలో
2895. పొలిమేర అంచులదాకా వచ్చేసా_నీ చెలిమి నమ్మికలో నేను
2894. నీ పలుకులెంత మధురానుభూతులో_నీ స్నేహపు పందిరిలోన
2895. అమృతమే అక్షరమై కురిసిందేమో_చెలిమిని శాశ్వతం చేసేందుకు..
2896. కలల వాకిట్లోనే నిలబడిపోయా_మెలకువొస్తే నీకు దూరమవుతానని..
2897. విషాదమెందుకు కమ్ముకుంటుందో_స్నేహాన్ని మధించడంలో అసూయ ఎదురవుతుంటే..
2898. కౌముదీ కిరణాలకెంత ఆనందమో_మన చెలిమిలోని స్వచ్ఛతను తిలకించి
2899. మౌనం నవ్వుకుంటోంది_నీ చెలిమిలో తను నిర్లక్ష్యమైందని..
2900. అదే నువ్వు_కొత్తపాట మొదలెట్టినా పాత చెలిమిగానే
No comments:
Post a Comment