2901. ఎగిరొస్తున్న నా వలపు_నీ వయసొచ్చి పిలిచిందనే
2902. నన్నూ అదృష్టం వరించింది_సిరులందించిన నీ నెయ్యానికి..
2903. వెన్నెలనప్పుడే కలగంటున్నా_నువ్వుచ్చి రాత్రిని తప్పక వెలిగిస్తావని..
2904. ఆ నవ్వులన్నీ ఊహలోనేగా_నీ స్వప్నమిచ్చిన గిలిగింతలకి..
2905. పరాగాల నురగలై మది_నిన్ను ముంచెత్తాలనే ఆనందంలో..
2906. ఆల్చిప్పలేమో నీ కళ్ళు_నా నవ్వుల ముత్యాలను పొదుగుకుంటూ..
2910. విస్తుపోతోంది వర్తమానం_ఎంతసేపూ గతానికిజారి తనను విస్మరిస్తుంటే..
2911. నీ తపమే నిత్యమయ్యింది_వరమిస్తావనే నా ఆకాంక్షలో..
2912. నా కన్నులు కలువలైనాయి_నీ చూపులు జల్లుగా కురవగానే..
2913. మనసు కదిలిందిలా_కురిసిన కల కన్నుల్లో భాష్పములా..
2914. చిరునవ్వే సంతకం_హృదయపు ఆమోదానికి..
2915. మనసంటిన సుమబాణం నీవు_తీయనిబాధనోర్చు రాగాత్మ నేను
2916. మదిలో మొలకెత్తిన వలపులు_ధ్యాసంతా నువ్వే నిండినందుకే..
2917. మౌనమెందుకు నర్తిస్తుందో_ఒంటరితనాన్ని ఓదార్చాలనుకున్నప్పుడల్లా..
2918. విలాపమేనది_నిన్ను చేరలేని నా మది పరితాపమది..
2919. రాలిపోతూ గెలుస్తాయేమో భాష్పాలు_కన్నీటినీ తీయగా మార్చేస్తూ..
2920. నమ్మకమే దిక్సూచి_నిన్ను తలపునైనా చేరాలనుకొనే నా మనసుకి..
2921. నా కాటుక నల్లనైతేనేమిలే_నీకోసం రంగులకలనే కంటున్నాగా..
2922. అదే జీవితం_ఆస్వాదించేలోపునే కరిగిపోతూ..
2923. అక్షరానికందని భావాలవి_మదిలో కొలువున్నవి కురవలేమంటూ..
2924. వలపు వానై కురిసింది_ఆనందం ఏడడుగులు నడిపిస్తుంటే..
2925. నీ తలపుల వసంతమది_శిశిరాలెన్నైనా దాటిపోగలమంటూ..
2926. భావాలెన్ని కురిస్తేనేమి_బరువెక్కిన హృదయాన్ని కరిగించలేవుగా
2927. పదనిసవుతోంది పరువం_పిల్లగాలి పాట విన్న పరవశానికి..
2928. నీ పిలుపు వినబడితే చాలుగా_వలపంతా పులకరమై పూసేందుకు..
2929. చెలిమి బలపడింది_నేను చాచిన చేయి నువ్వందుకోగానే..
2930. నమ్మకం నీరు కారింది_ఋజువడిగిన మనసు చాటు చేయగానే..
2931. జాబిలమ్మకీ లోకువైన జాజులు_సున్నితమై ఒక్క పూటకే వాడిపోతుంటే..
2932. మైనమై వెలిగిస్తుందనుకున్నా_కరిగిపోతుందని ఊహించని జీవితం..
2933. ఆకాశమైన నాలో హాసం_ఆశలరెక్కల చప్పుళ్ళు నువ్వినిపిస్తుంటే..
2934. నీ అల్లరెంత చిలిపిదనమో_నా నవ్వులనూ అదేపనిగా దోచేస్తూ..
2935. ఎర్రని చెక్కిలెంత కందిపోయిందో_నీ విరహంలోని నా వేదనకే
2936. పల్లవిస్తోంది పిల్లగాలి_నా ఎదకోయిల పిలుపులకు బదులిస్తూ..
2937. దిగులు మేఘం కమ్ముకుంది_ఆశించిన తన సందేశం చేరలేదనే..
2938. ఎన్ని సంధ్యాదీపాలో గగనంలో_నా నిరీక్షణా తారాతోరణాల్లో..
2939. నేనో కవితనై రావాలనుకుంటా_నువ్వు కలమంటిన ప్రతిసారీ..
2940. స్వప్నాలతో చెలిమి చేస్తున్నా_భావాలను ఊహలుగా చిత్రించుకుందామని..

2941. క్షణాలకెన్ని వగలో_అనుభూతిని తనతో లెక్కించుకు మురిసిపోతున్నానని..
2942. అరనవ్వైనా చాలనుకున్నా_నీ కవితలో నెలవంకగా మారేందుకు..
2943. భావాల వరదలు_మనసు ఉత్తుంగమై నింగిని ఎగిసేకొద్దీ..
2944. ఆమె అంతరంగం నవ్వింది_రాతిరిని వెలిగించే అతనొచ్చాడనే..
2945. ఊపిరందింది నా మానసానికి_కలలోని నీ పలకరింపులకే..
2946. నేనో ప్రేమికనై మిగిలిపోతున్నా_నీ విరహాన్ని పదిలపరచుకున్నాక..
2947. వియోగమూ విస్తుపోతోంది_ప్రేమంటూ విరహంలోనే మది మగ్గిపోతుంటే
2948. ఆద్యంతం మధురమే_అనురాగమే ఆధారమై ఇరువురము ఏకమైనందుకు..
2949. మనసంతా మధువనమై ఎదుగుతున్నా_నీ చైతన్యమంతా కుమ్మరించినందుకే..
2950. అనుబంధాలకు కాలం చెల్లింది_రోజుకో అవసరం పుట్టుకొస్తున్నందుకే..
2951. జీవితమంతే_కుసుమించిందని గుర్తించేలోపునే వాడిపోతూ..
2952. జ్ఞానం చిగురించింది_వివేకం వానై ఒక్కసారి కురవగానే..
2953. కాలం వెనకబడుతోంది_ఆశలు తీర్చలేని ఆవేశం పెరిగిపోతుంటే..
2954. విభక్తులెన్ని తోడు రావాలో_నాపై ప్రేమను నువ్వు ప్రకటించాలంటే
2955. కలువనే నీ కన్నుల్లో_నిరీక్షణకే అంకితమైన రేయిలో..
2956. నవ్వులు పరిమళించినప్పుడే అనుకున్నా_నీ మనసును ప్రతిఫలిస్తున్నవని..
2957. కవుల కలంలో తడింకిపోదు_కలలొచ్చి అక్షరాలుగా కురిసిపోతుంటే..
2958. పువ్వంత గంధం పులుముకున్నా_భ్రమరమైన నిన్ను ఆకర్షించేందుకే..
2959. సద్దు మరచిన మువ్వలు_నీ స్వరాలాపన తన్మయత్వంలోనే
2960. భావాల్లో కొలువైనప్పుడే అనుకున్నా_వెచ్చని అనుభూతులింక నీవేనని..
2961. అక్షరాలెన్ని పోగు చేయాలో_అపురూపమైన నిన్ను పొగిడేందుకు..
2962. నేనెప్పుడో అపరాజితనుగా_నీ మనసు గెలిచిన మరుక్షణములోనే..
2963. ఆకాశంత అనురాగం నీదేగా_నక్షత్రమై మెరుస్తున్నది నేనైనా
2964. అందాలన్నీ అరవిరిసాయి_వెలుతురొచ్చిన మధువనంలో..
2965. నా పాదాలకెన్ని జిలుగులో_నీవలంకరించిన పారాణి మెరుపులతో..
2966. గగనమెంతైనా సరిపోదనిపిస్తుంది_నా ఆశలకే రెక్కలొస్తుంటే
2967. నేనెప్పుడూ నీ చూపులోనే_వెన్నెలగానో..పండుగలా నో..
2968. అనునయాల సింధూరం_ప్రేమకు లేపనమవుతుందట..
2969. నీ చిలిపి పలుకులే_మదికి పులకరమిచ్చి ఓలలాడిస్తూ
2970. అనుసరిస్తున్నా నిన్నే_పరిమళాల పొదరింట్లో నాకూ చోటిస్తావనే..
2971. కొన్ని గాయాలంతే_నిమురుకోకున్నా అదేపనిగా మంట పెడుతుంటాయి..
2972. కవితగా రాసుకుంటున్నా_అక్షరమై నువ్వు ఎదురైన ప్రతిసారీ..
2973. నిండుకున్న మనసు వెతుకుతోంది_నువ్వొచ్చి ప్రేమను ఒంపుతావని..
2974. రుధిరమెంత జలపాతమో_నిన్ను తలచే ప్రణయపు మాధురిలో..
2975. ఊపిరినై విచ్చేసా_నీలో సంజీవినై ప్రాణంగా ఉందామనే..
2976. పరిమళం కోసమే వేచున్నా_నువ్వొస్తే ప్రాణం వస్తుందని..
2977. కురిసినప్పుడనుకోలేదు_మౌనానికి చినుకై జారడం వచ్చునని..
2978. నీ కదలికలో కనిపెట్టాగా_మది కోరింది నన్నేనని..
2979. నా అనుభూతుల గోదారి నీవే_నేనో భావుకత్వాన్ని రాసే వేళ..
2980. వానాకాలమెటెళ్ళిందో_అరవిందునికి సెలవీయక విధులను ఎగ్గొడుతూ..
2981. నీ నవ్వులేగా రహస్యాలు_నా ఆయువుకు పంచాక్షరులు..
2982. ముగ్ధమవుతుంది నేనేగా_పరవశం అందిస్తున్నది నీ మాటలైనా..
2983. నీకానందాన్ని ఇవ్వాలనొచ్చా_గందరగోళంలో మనసుందన్నావనే..
2984. అక్షరాలు చల్లినప్పుడనుకోలేదు_భావాల మొలకలిన్నొస్తాయని..
2985. అవే తలపులు_నిన్ను తలచేకొద్దీ తీపెక్కుతూ..
2986. నీ చూపుల దీపాలేగా_నా వలపుకు వెలుగిచ్చింది..
2987. మనసెన్ని ముక్కలైతేనేమి_చెలి మీద ప్రేమైతే పెరిగిందిగా..
2988. చరణాలు కలిపేందుకే నేనొచ్చా_పల్లవించే పాట మొదలెడతావనే..
2989. బాధ్యతలెక్కువే నీకు_అనుబంధాలకి విలువిస్తున్నందుకు..
2990. కన్నీళ్ళే_ఆవేదననై కురిసినప్పుడల్లా జ్వలిస్తూ..
2991. తెలుగెంత మురిసిపోయిందో_లాలించిన నీ అక్షరాల పొత్తిళ్ళలో..
2992. వానాకాలమీరోజు కనిపించింది_ప్రకృతికే కదలికొచ్చి మేఘం కురిసిందో..
2993. వర్షానికి చల్లారే హృదయాలేవిక్కడ_వేదనతో మనసెండి పగుళ్ళిచ్చాక..
2994. పులకరిస్తుంది నేనేలే_సరిగమలై నన్ను చేరింది నువ్వైనా..
2995. మరోజన్మకైనా వేచుండలేనా_నీ పిలుపులు నన్నే పాడుతానంటే
2996. నిన్ననందుకే ప్రేమిస్తున్నా_నేటికి ఊహై నన్ను బ్రతికిస్తుందని..
2997. కంటికింపయ్యింది_వానలో తడిచి మెరిసిపోతున్న పచ్చదనం..
2998. కొందరంతే_పలకరింపులకీ విలువివ్వడం తెలియని అనాగరికులు..
2999. శ్రావణం సెలవు పుచ్చుకుంది_భాద్రపదానికి బహురమ్యంగా దారిచ్చి..
3000. మనసుకెప్పుడు లోకువయ్యానో_నన్ను కాదని నిన్నే వరిస్తోంది..

2967. నేనెప్పుడూ నీ చూపులోనే_వెన్నెలగానో..పండుగలా

No comments:
Post a Comment