4001. ఉద్వేగానికి మించిన సందడేముంది_పండుగై నాలో నువ్వడుగేయగానే..
4002. మనసుపొరల్లో భద్రం చేసా నిన్ను_వేరెవరి కన్నూ పడకూడదని..
4003. కలిసినట్లనిపించినా కలవబోమంతే_నువ్వో గగనం..నేనో భూమనుకున్నాక..
4004. హృదయమెంత గాయపడిందో_జ్ఞాపకాలను తిప్పికొడుతుంది..
4005. నువ్వో విహంగం_రెక్కల్లేకున్నా నన్ను చేరాలనే ఆశలో..
4006. జ్ఞాపకాలెన్ని దొంతరలో_మనసిప్పితే చాలు ఉరకలేసేందుకు సిద్ధమవుతూ..
4007. నన్ను మరచిపోమన్నదెవరు_నా జ్ఞాపకాలే నీకు ఊపిరవుతుంటే..
4008. తీపిగాయమనుకోలేదు నిన్ను_పదేపదే నన్ను తట్టి పిలిచేవరకూ..
4009. మరపు కావాలనిపించింది అందుకే_కొన్ని జ్ఞాపకాలను వీడలేకనే..
4010. అలలేమో నీ జ్ఞాపకాలు_వద్దనేకొద్దీ నన్ను తడిమి పరీక్షిస్తూ..
4011. తీరదుగా నాలో కలికితనం_నువ్వొచ్చి నన్ను పలకరించేవరకూ
4012. వర్తమానం_వాస్తవంలో నిన్ను దాచుకున్న మనసు వైనం..
4013. వసంతాన్ని రుచి మరిగాలే_శిశిరమెంత కనుసైగ చేస్తున్నా..
4014. చీకటంటే భయం లేదట_రేయైతేగానీ రానంటూ కలలు..
4015. చేయి చాచితే నువ్వు_నాకందిన ఏకైక జాబిల్లివిగా..
4016. నిరాశను చేరదీస్తావెందుకో_జాబిల్లికోసం ఆశపడాలనుకున్నాక..
4017. ఆకాశమయ్యా నేను_విహంగమై నన్నందుకుంటానన్నావనే..
4018. మునుపెరుగని చైతన్యం_నీ ఎదలో విహరిస్తున్న కొద్దీ..
4019. గతాన్ని తవ్వుకోవడం మానేయాలందుకే_కన్నీటి చెలమలు బైటకొస్తాయనే..
4020. నేనంటే మక్కువన్నావనే_ప్రతిరేయి కలనై నీ ముందుకు..
4021. గెలవాలని మరచిపోతున్నా_నిన్నోడిస్తే చాలనుకుంటూ..
4022. కదనకొతూహలమే ప్రతి పలుకూ_నీ పలకరింపుల మేళవింపులో..
4023. ఊపిరి బరువెక్కుతుంది_కలలో నువ్వొచ్చినందుకే..
4024. నిత్య సంచారిగా తాను_నా మనసో బృందావనమనుకుంటే..
4025. నటించాలనిపిస్తుంది_చూపులు కలిసినప్పుడల్లా కోపాన్ని కురిపిస్తూ..
4026. మనసు నిండినట్లుంది_నీ పలుకులనే ప్రేమగా వడ్డిస్తుంటే..
4027. వందలో ముందున్నది నేనే_వృత్తాల విలువ పెంచాలనుకున్నందుకు..
4028. నేనో తరంగం_నువ్వూపిరిని శ్వాసించినప్పుడల్లా..
4029. నేనంతే_అలిగైనా ఆనందాన్ని సాధించుకుంటూ..
4030. సరసం తీరే వేరు_నువ్వు వయసుని మరిపిస్తుంటే..
4031. అటువైపు తిరిగి చూడు_నేనిటు ముక్కలై పడుంటా..
4032. భావాలలా మేళవించాయి_పదాలతో మదిలో పన్నీరు చిలికిస్తూ..
4033. నా చెక్కిలప్పుడే సిద్ధపడింది_నీ చిలిపి సంతకాలు దాచుకోవాలని..
4034. నేనో అన్యాయం_తన సిద్ధాంతాలు నాపై రుద్దినప్పుడల్లా..
4035. నాకోసం ఒక్కసారి ఏమారు_జీవితం సరికొత్తగా కనిపించగలదు..
4036. వేదనా తరంగం_ఋతువులను పట్టించుకోని శిశిర సంగీతం..
4037. నీ జ్ఞాపకమో అయాస్కాంతం_సమయమెరుగని వలపు దరహాసం..
4038. వత్సరానికొక్కసారొస్తేనేమి వసంతం_నిత్య సంతోషం నీ చేతిలోనిదేగా..
4039. అడుగందుకే ముందుకేసా_ముళ్ళు నువ్వేసుకుంటావని..
4040. నీ పదాల శుభశకునమే_నా మదికి యోగాన్నందిస్తూ..
4041. వేల భావాల రాగరంజితం_కోటి కూజితాల మనోరధం..
4041. నా మనసు తీపవుతుంది_నిన్ను నాలో కనుగొనగానే..
4042. వెన్నెలెందుకు నవ్వుకుంటుందో_పున్నమికి నేను నీ పరమవుతుంటే..
4043. అలలకెంత ఆరాటమో_పున్నమొస్తే పైకెగరాలని..
4044. నిజానికదెంత గమ్మత్తో_కలలు ఋజువవుతుంటే..
4045. నిన్నటివరకూ స్వప్నాలే అవి_నేడు కన్నుల్లో నీ రూపు దివిటీలు..
4046. నల్లని అక్షరమై నేను_నీ స్వీయచరిత్రను రాసేందుకు..
4047. కల్లవనుకున్నా_కలను నిజం చేసావు..
4048. తాదాత్మ్యత నాది_తడుముతున్నది నువ్వైతే..
4049. అనుసరిస్తూనే నేనున్నా_నీ అడుగులు పరమపద సోపానాలనే..
4050. అలసిపోయిన అడుగులిప్పుడు_ఆ మనసు మర్మం అవగతమవగానే..
4051. నా తలపులంతే_నీలో భావుకత్వాన్ని రాయమని తొందరెడతాయి..
4052. క్షమించక తప్పలేదు_మనిషి మనవైపనుకున్నాక..
4053. నీ జతగా నేను_రగిలే ఊపిరిలో చోటిచ్చావంటే..
4054. స్వర్గమదే_నీ చేరువలో నా తన్మయత్వానిది..
4055. అనురాగమంతే_అనుభూతుల చుట్టూ తానై ప్రవహిస్తూ..
4056. గుండె గాయమలా తగ్గింది_నీ రాక సంజీవనయ్యి..
4057. ఊహల్లోనూ ఉలి కదలికలే_నన్నో శిలగా నువ్వు భావించినట్లు..
4058. జాణతనం ఉట్టిపడుతుంది_ఆ శిలలో ప్రాణమున్నది నిజమేమో..
4059. వెన్నెల్లో నెరజాణ_విరహంలో కన్నీరొలుకుతున్న ఆ శిలలో..
4060. నా అడుగుల నర్తనలు_నీ ఎదలో గిలిగింతలకే..
4061. క్షణాలు వృధాలే_నిన్నెదురుచూసిన కాలం ముడతలు పడినంత..
4062. కలకలం రేపుతూ కల_నిన్నందరికీ చూపుతానని బెదిరిస్తూ..
4063. కరగక తప్పలేదు కలతలు_నీ వాత్సల్యం తోడవగానే..
4064. నిజానిది అల్పాయిష్షే_అబద్దానికెక్కువ ప్రచారమిచ్చాక..
4065. నీ స్వరమో సుప్రభాతం_లక్ష్యానికి నన్ను తొందరచేస్తూ..
4066. తాపమెన్నటికీ తీరదింక_తటిల్లతలా తను కదిలిపోయాక..
4067. నువ్వో పరవశం_నీకు నే వశమైన ముహూర్తాల్లో..
4068. ఎడారి పువ్వునైనా చాలనుకున్నా_నవ్వుల పరిమళాలే నువ్వు కావాలంటే..
4069.నీలో కదులుతూనే నేనున్నా_మనసుకి దాహాన్ని పరిచయించాలని..
4070. నా మనసు_నీ అక్షరాన్ని ప్రేమిస్తున్న మౌనం..
4071. నా ముద్దు పద్దులు దాటింది_నువ్వు గమనించావని తెలియగానే..
4072. అప్పుడే సంక్రాంతి వస్తుందనుకోలా_మదిలో ముగ్గులు వేయమన్నప్పుడు..
4073. కనికరమెక్కువే కాలానికి_కదులుతున్నా నిన్ను దగ్గరగానే ఉంచింది..
4074. సిగ్గు తెరలు దించింది_నీ చూపులు గుచ్చుకున్న ఆనవాళ్ళతో..
4075. కాలనికెప్పుడూ తొందరే_నే నిద్రపోకున్నా తానెళ్ళిపోతుంది..
4076. నువ్వే నేనైన మది పరవశం_ఈ జన్మది కాదన్నది వాస్తవం..
4077. బంధీ అయినప్పుడే తెలిసింది_ఒకటి మూడు ముళ్ళెందుకు వేసారోనని..
4078. కనుమరుగవ్వని వెతలు_వేకువైనా వీడని నీడలన్నట్లు..
4079. నీ మనసెందుకు మువ్వై మోగిందో_మల్లెలు అలంకరించింది నా కొప్పైతే..
4080. పసివెన్నెలైతేనేముందిలే_పసిడి జ్ఞాపకాలెన్నో ప్రేమగా కురిపించిందిగా..
4081. అణువణువూ పాకింది_హేమంతం గిలిగింతగా నీ చూపుననుసరించి..
4082. పండుగకని వేచున్నా_నీ పలకరింపుతో పాయసమొందొచ్చని తెలీక..
4083. చేమంతుల నా చూపు_నీ మదికి చల్లదనాన్ని విసిరేందుకే..
4084. నా చూపుల పదునిప్పుడే తెలిసింది_నీలో పండుగలు కనువిందవుతుంటే..
4085. కరగక తప్పలేదు నిరాశలు_నీ ఆశల వేడిమితో..
4086. నీవు లేని నేను_ఊహకందని విషాద విభావరిని..
4087. నీ కలిమి_నాలో చెమరింతల చెలిమి చంద్రికలే..
4088. హృదయమెందుకు తడబడుతుందో_నువ్వేదో నాలో మొదటిసారి అడుగేసినట్లు..
4089. ఎప్పుడూ నిరాశే_నా ఆశలు నీరెండిన ప్రతిసారీ..
4090. హృదయాన్ని మోయలేకున్నా_చెదిరిన కలలు వాస్తవాన్ని దింపుతుంటే..
4091. మరణమైతే అనివార్యం_మరోసారి జీవించాలనిపించినా..
4092. ఎండే వెన్నెలనిపిస్తోంది_నీ మాటల ఝల్లులో తడిచిపోతుంటే..
4093. ఎన్ని నవ్వులు తూకమేస్తావో_నీ మందారానికి సరిలేవంటూ..
4094. హరివిల్లునై విరియనా_నీ మది తడిచిందని చెప్పేందుకు..
4095. కాలమే పక్షానుందో_వెన్నెల్ని వదిలేసి అమాసని లెక్కిస్తుంటే నువ్వు..
4096. ఇంటిల్లిపాదికి ఆమే సైన్యం_ఆటుపోట్లెన్ని ఎదురైనా పోరాడుతూ..
4097. నీ గెలుపు నాదనుకోలేనా_నీకోసం ఓడానని తెలిసాకైనా..
4098. రాజీలు_సహజీవనంలో తప్పని సర్దుబాట్లు..
4099. పన్నీటి నవ్వులన్నీ నీకిచ్చేసా_నీ మనసు పరిమళించాలనే..
4100. ఆనందం నిండింది అణువణువూ_నువ్వాకాశమై పూసినందుకేమో..

No comments:
Post a Comment