4201. ఆదిలోనే ఆపేసా ప్రేమని_అంతమైతే ఆవేదనే మిగులుతుందని..
4202. నాకు నేను_నీకు మాత్రం ఎప్పటికీ తేడాగా..
4203. వెచ్చని మమతలే పరిమళాలు_తనో స్నేహితుడే ఖచ్ఛితంగా..
4204. రేపటికి నేనెక్కడో_నిన్న నువ్వొద్దనుకుని నా చేయొదిలేసాక..
4205. ఎదురుచూపువే నేను_నువ్వొస్తావన్న నమ్మకంలో..
4206. మది మదికో ప్రవృత్తి_మనసుల్ని ఏమార్చుతూ మనిషి..
4207. కొందరంతే_ఆత్మీయులనుకొనేలోపు అపార్ధమై ముంచేస్తారు.
4208. గుండెలో వెన్నెల దాచుకున్నా_నువ్వు నవ్వితే కురిపిద్దామని..
4209. జ్ఞాపకాల జడివానలే_నడిరేయి కవ్వింతలై..
4210. ఆనందభైరవి అలిగింది_తను గుర్తొచ్చినా నన్ను ఆలపించలేదని..
4211. చూపులతో చుట్టినప్పుడనుకోలా_మనసు కూడా నువ్వు లాగేస్తావని..
4212. ఘడి ఘడికో ఇజం_మనుషులన్నది మరచిపోతున్నది నిజం..
4213. మౌనాన్ని నటించడం కష్టమే_తలపుల్లోనే నువ్వలా గిలిగింతలిస్తుంటే..
4214. ఊపిరాడలేదని నటిస్తున్నావనుకుంటా._నా చిరునవ్వులు ఆరా తీసేందుకని..
4215. నువ్వూనేనూ ఒకటేననుకుంటా_ఒకరికొరమని ఏకమయ్యాక..
4216. పండుగొచ్చిందని సంబరపడుతున్నా_నీ రాకతోనే మనసు నిండిపోతుంటే..
4217. మనసెప్పుడో మోహంలో మునిగింది_కురిసిన ప్రేమ వెల్లువైనప్పుడే..
4218. చిరునవ్వులు చూసే వెంటబడ్డా_తానో పిచ్చిమాలోకమని తెలీక..
4219. గిల్లుతూనే ఉంటాయలా_నీ తలపులు తోసుకొచ్చే క్షణాలల్లా..
4220. ఆనందం తాండవమే ఎప్పుడూ_నిత్యమల్లెలైన నీ జ్ఞాపకాలతో..
4221. మనసును తిట్టుకుంటున్నా ప్రతిసారీ_నిన్నింకా ఆరాధిస్తూ తపిస్తుందని..
4222. రోజుకో పండగంటావు_చెలి నవ్వితే చాలని పొంగిపోతూ నువ్వు..
4223. వల విసిరేందుకే కాదు_ఆనందాన్ని పట్టేందుకు కూడా..
4224. చిరునవ్వుల వరమందుకే అడిగా_పడిపోయిన ప్రాణం లేచొస్తుందని..
4225. కొన్ని వేదనలకు అంతముండదు_సమాధానం లేని సందిగ్ధంలా..
4226. మనోభావమలా మూగబోయింది_నిర్వచించినా నిన్నంటలేని నీరవంలో..
4227. నీ జ్ఞాపకాల మేలిమలుపు_నన్నాపిందో పరవశాల వీధిలో..
4228. నా నేస్తమైతే నువ్వేగా_అద్దంలా నన్ను సరిదిద్దుతున్నప్పుడు..
4229. చెలి నవ్వింది నిజమే_మాఘమాసమంటే నీకు మక్కువన్నావని..
4230. మువ్వలందుకే కట్టుకున్నా_సవ్వడించి నీ మౌనాన్ని గెలుస్తాయని..
4231. ప్రవహిస్తుందలా జీవితం_గమ్యాలు మార్చుకుంటూ నిరంతర వాహినిలా..
4232. మనసెప్పటికీ అతుక్కోదు_విరిచింది నన్ననుసరించే నీ నీడైతే..
4233. వసంతానికలా చోటు దొరికింది_శిశిరమలా పక్కకు మళ్ళిపోగానే..
4234. తలిరాకులా నేను_నిన్ను మరవాలని ప్రయత్నించిన ప్రతిసారీ..
4235. నీ మౌనం గలగలలాడింది_నా మువ్వల సద్దుని సవాలు చేస్తూ..
4236. నిన్నటి కలలోకే నేను_కొన్ని మైమరపు క్షణాలకు తరలిపోవాలనుకున్నప్పుడు..
4237. అనుసరిస్తూనే నేనుంటా_నీ కోసమే పుట్టానని నువ్వన్నందుకైనా..
4238. నా నవ్వులెప్పుడూ గారడీలే_నిన్నాకట్టుకోవాలనుకున్ న చిలిపిదనానికి..
4239. నీతో నేనుంటా_కలకాలం కమ్మగా కలిసుందాం రమ్మంటే..
4240. రెపరెపలాడుతూ రాతిరి_భావాల సంచారానికి చీకటిని చెరిపేయాలని..
4241. కన్నీటితో జార్చేస్తావనుకోలేదు_గుండెల్లో భద్రంగా ఉండాలని నేనొస్తే..
4242. అపురూపమే జీవితం_షడ్రుచులను సమానంగా స్వీకరించే మనసుంటే..
4243. వేసవిలో మల్లెలు_హృదయాహ్లాదానికి దగ్గర దారులు..
4244. పల్లెటూరందుకే నాకిష్టం_వేసవైనా హేమంతాన్ని తలపిస్తుందనే..
4245. వసంతపు రెక్కలతో వేసవి_ఇక మల్లెలు నవ్వడమే తరువాయి..
4246. తీపికబురందిన రేయి_కలలకు సెలవిచ్చి కరిమబ్బులా రమ్మంటూ..
4247. మౌనవించకు_కొన్ని భావాలు మూగబోతాయిక్కడ..
4248. కలలెన్ని జల్లుగా కురిసాయో_రాతిరి నన్నెలాగైనా తడపాలనేమో..
4249. కులుకుల కోమలికెంత కష్టమో_అలుకలో అనునయించేవారే లేకుంటే..
4250. ఎన్నిసార్లు కుట్టుకున్నానో మనసు_అతకులబొంతగా అది మారేవరకూ..
4251. అక్షరాలన్నీ కవితలే_నీ అలకను రాద్దామని కూర్చోగానే..
4252. ముక్కలైన హృదయం_ఎడారిలో ముళ్ళకు నన్నొదిలేసిన పాపానికి..
4253. మనసెక్కడో తప్పిపోయిన భావన_నీ తలపులకు నేనందలేదంటే..
4254. మిత్రుడనే అనుకున్నా_ప్రతి ఉదయమింత మండిస్తాడని తెలీక..
4255. మల్లెలకెంత గర్వమో_వేసవిని చల్లగా మార్చగలిగేది తామేనని..
4256. ఆత్మీయతలా చిగురించింది_నువ్వు కురిపించిన మమతల జల్లుకే..
4257. హద్దులు చెరిగిన హర్షం నాది_ఆకాశమే హద్దుగా రెక్కలు విప్పింది...
4258. ఎన్ని బాధలని ఓర్చుకోవాలో_ఆనంద లేపనమై నువ్వొస్తావని..
4259. ఓటమి దగ్గరే మలుపు తిరిగింది_గెలుపుకి స్ఫూర్తినిచ్చిన దారి అదేనని..
4260. పుట్టినప్పుడే నీకనుకున్నారట_నేనేమనుకుంటానో ఊహించనందుకేమో..
4261. మనసు తేలికైనట్లు గుర్తించలేదు_శూన్యాన్నంటూ నువ్వెప్పుడొచ్చి చేరావో..
4262. నిద్రొస్తుంటే బాగుంది_స్వప్నంలోకి నువ్వొస్తావనే నమ్మకం నిజమవుతుంటే..
4263. నిర్మాల్యమైతేనేమి_వాడిన చెలిమి పూవుకి పరిమళమెక్కువేగా..
4264. వనదేవతనయ్యా నేనే_పచ్చగా రమ్మంటూ నీ పిలుపందగానే..
4265. శిల్పానికీ పరిమళమబ్బింది_ఏ ఊహల ఉలితో నువ్వు దిద్దినందుకో..
4266. నిన్ను కలుసుకోవడం పరిపాటేగా_ఊహలోకైనా రమ్మని ప్రార్ధిస్తుంటే..
4267. తడికన్నుల్లో నేను భద్రమే_నీ అనురాగం ప్రవహించేంత వరకూ..
4268. నా మనసుకి ఎక్కిళ్ళు_నువ్వాలపించే గేయాలకి తాళాలు..
4269. నాది కూడా ఒయ్యారమే_భావంలో ఒంపినప్పుడల్లా ఒంపులు తిరగడం..
4270. మౌనమిప్పుడు కరిగిపోయింది_నీ మదిలో చోటిచ్చావని తెలియగానే..
4271. రెప్పల చప్పుడుకెన్ని రాగాలో_నీతో దోబూచులాడుతున్న వేళ..
4272. ఎన్ని మాటలు దాచుకున్నానో_నా మౌనాన్ని కెలికితే వినిపిద్దామని..
4273. అంతులేని జ్ఞాపకాల నావదంతే_కాలంతో సంబంధంలేని ప్రవాహంలో..
4274. నిశికెంత తన్మయత్వమో_శిశికిరణాలు తనపై తారాడుతున్నాయని..
4275. మనసు బీడయ్యింది నిజమే_చెలికాడు చల్లగా చేరకుంటే..
4276. ఎగిరిందొక మదన పతాకం_నీ వలపునే పరిమళమనుకుంటూ..
4277. ప్రేమవిత్తులు జల్లుతున్నా ఎదలో_ఆత్మీయతా పూలేనాటికైనా పూయించాలనే..
4278. మనసెందుకు రాయిగా మారిందో_దుఃఖాన్నలా అదిమిపెట్టి మరీ..
4279. నీ రూపునే కప్పుకున్నా_నా చూపు నిన్నల్లుకోగానే..
4280. విషాదమలా దారిమళ్ళింది_నా వియోగాన్ని నువ్వొచ్చి తీర్చగానే..
4281. నా చూపుకు చిక్కుతావనుకోలా_పరధ్యానంలో మెరుపులా నువ్వెళ్తున్నా..
4282. ముభావం మాయమయ్యింది_నీ భావంలో నన్ను తడుముకోగానే..
4283. ఎన్ని పువ్వుల్ని పిలుచుకొచ్చానో_నా నవ్వులకై ముచ్చటపడ్డావని..
4284. అనుభూతులలా కురిపించా_నీ అనురాగాన్ని ఎప్పటికీ వెలకట్టలేననే..
4285. కొన్ని జన్మలుగా ఎదురుచూస్తున్నా_తను తప్పక పుడతాడనే..
4286. ప్రేమ తరంగమంతా నీదే_నేనెదురు చూసిన ఆమనిలో..
4287. తాపం తీరకుంది_తను అందనంత దూరంలో ఊరిస్తుంటే..
4288. తెలుగు పలుకు తీయందనము_తెలుపును మనసు నిండుదనము..
4289. అపరాహ్నమూ నీవే_ఉదయాన్నే నే జపం మొదలెట్టినా..
4290. చిరుదీపాలుంచా కన్నుల్లో_నా చూపు నీకు వెలుగవ్వాలని..
4291. నువ్వేగా నా ప్రాణం_నాకో గమ్యాన్ని నిర్దేశిస్తూ..
4292. కురిసెను జల్లులు హృదయంలో_వర్షధారలకేమీ తక్కువ కాదంటూ..
4293. విశాల ధృక్కులన్నీ నీవైపే_అనుక్షణం అమృతాన్ని కురిపించాలని..
4294. అద్దానికి ముస్తాబు చేస్తున్నావెందుకో_అందంగా లేనని నేనేడుస్తుంటే..
4295. వేలపువ్వులు కమ్ముకున్నట్లుంది_నీ పరిమళమొచ్చి నన్నంటగానే..
4296. హర్షాతిరేకమంటే ఏదోననుకున్నా_నీ ఆనందాన్ని చూడక మునుపు..
4297. తనో అకాల వర్షమే_తలుచుకోగానే అలా కురుస్తాడంతే..
4298. నీ ఆశలు కరిమబ్బులు_నా ఊహకు అందనంటూ..
4299. మనసుతో గెలవాలనుంది_మానవత్వాన్ని గుభాళించి..
4300. పసితనానికీ సంకెళ్ళే ...పంజరంలోని చిలుకని చేసి స్వేచ్ఛను హరించాక..

4238. నా నవ్వులెప్పుడూ గారడీలే_నిన్నాకట్టుకోవాలనుకున్

No comments:
Post a Comment