Thursday, 5 April 2018

4101 to 4200

4101. నన్ను వెలివేస్తాడు_తన తప్పులు దిద్దుకొనేంత లేవంటూ..
4102. నీ తలపో సంతోషం_నన్నో నవలోకానికి చేరుస్తూ..
4103. అలసిపోతూనే నేనున్నా_నీ పరుగుల్లో నేను పయనమవుతూ..
4104. అవే చూపులు_ఈరోజు కొత్తగా కత్తులై గుచ్చుతున్నాయంతే..
4105. వెళ్ళొద్దనందుకే వేడుకుంటున్నా_కాలాన్ని కాసేపైనా కౌగిట్లో కవ్విద్దామనే..
4106. ఎదురుచూపుల మేఘాలట_నా కాటుకకళ్ళ వర్షాన్ని ఆశిస్తూ..
4107. నా మనసెందుకు నిర్వచిస్తుందో_నీలో పరిమళాన్ని రాయాలంటూ..
4108. స్వర్గం దిగి వచ్చినప్పుడనుకున్నా_స్వరాల వెల్లుల నరాల్లోనిదని..
4109. వేసంగిని గుర్తు చేసావు_తలపుల్లో సెగలు పుట్టిస్తూ..
4110. జీవితమంతా నువ్వేగా_మరు జన్మంటూ ముందుందంటే..
4111. నమ్మకమలా ముగిసింది_నీ ప్రేమ ఋజువులు తేలగానే..
4112. కేరింతలే కావాలెప్పటికీ_మనసుతీరా నవ్వుకోవాలంటే..
4113. మల్లెలపై మోజైతే ఇంతే_రేయికి నిదురలు కరువవుతూ..
4114. విహంగమై నేను_నీ తలపులు కవ్విస్తున్నది కలలోనైనా..
4115. తనే నేనైన భావం_వేసవిలో మల్లెల పరిమళానికి ధీటుగా..
4116. నవ్వుల్లోనే నిన్ను దాచుకున్నా_కళ్ళల్లోనైతే కనిపెట్టే అవకాశముందని..
4117. కురులతో కినుకెందుకో_మల్లెలను మనసుపొరల్లో దాచుకుంటున్నా..
4118. అనివార్యమే మార్పు_నాకలవాటు కాలేదంతే..
4119. తరలిపోయింది కోపం_ఒక్క చిరునవ్వు పంచిన చెలిమికే..
4120. ఇష్టసఖితో ఏడడుగులు_ఏడు జన్మల ప్రయాణమైనా సౌఖ్యమే..
4121. వానవిల్లువైతేనేమి_నాలో నిత్యం వెల్లివిరిసేది నిజమేగా..
4122. చూపుల దారాలతో నువ్వు_నన్నో మల్లెపువ్వుగా భావిస్తూ..
4123. విరిజల్లునై కురుస్తున్నా_వేసవితాపాన్ని మరిపించాలని..
4124. దూరాలవెంట పడటమెందుకో_నీ దగ్గరగా నేనుంటున్నా..
4125. నీరెండలో దాగున్నా_కనపడకనే నిన్ను సేద తీర్చాలని..
4126. విరహమని భ్రమపడతావెందుకో_వేసవిని లెక్క చేయక నడుస్తూ..
4127. మధుమాసమై నేను_ముహూర్తం చూసుకు నువ్వొస్తావని
4128. సంతోషాల తలపోతలే_మదిలోకి అడుగెట్టావని గుర్తిస్తే..
4129. వసంతాన్ని వద్దనుకోలేను_గ్రీష్మమెంత తరమాలని చూసినా
4130. నాలో సహనాన్ని పరీక్షిస్తుంది_నీలో నిర్లక్ష్యమనే వైఖరి..
4131. ఎంత ప్రేమని వృధా చేసానో_నీలో నేనున్నానని భ్రమసి..
4132. మనసిచ్చినప్పుడే అనుకున్నా_ముగింపులేనంత వరకూ శ్వాసిస్తూనే ఉండాలని..
4133. ఆనందానికి పుట్టిల్లు నువ్వే_నిన్ను తలవగానే వస్తుంది..
4134. కలలు కని చానాళ్ళయింది_నిద్దురే బరువైన రాత్రుల్లో..
4135. తనే నా గమ్యం_ప్రయాణం జటిలమంటే మానేస్తానా..
4136. ఎన్ని జన్మలెత్తితేనేమి_ఒక్క జన్మలోనూ నీకు దగ్గరవ్వనప్పుడు..
4137. నిరీక్షణ ఫలిస్తుందిలే_నీ ఎదురుచూపులకు జవాబు కావాలనుకుంటే..
4138. ఎన్ని ఋతువులని ఎదురుచూడాలో_నీ రాకతో మధుమాసమవుతుందంటే..
4139. కలిసిన మనసులైతే రెండే_ప్రాణం పోసుకున్న ప్రేమకి..
4140. కావాలనే అంటుకట్టుకున్నా_బంధమెప్పటికీ కొనసాగాలనే..
4141. కాలాన్ని మించి కదలాలనుకున్నా_జీవితంలో వేగవంతాన్ని చవిచూడాలనే..
4142. మల్లెల మక్కువేమిటో రేయంటే_తనుంటే పరిమళాలు పెంచేసుకుంటూ..
4143. ఎన్ని భావాలు చిత్రించానో_నిన్ను రాయాలని అనుకున్నప్పుడల్లా..
4144. కలలకు కాలం చెల్లనివ్వను_నా జ్ఞపకాల్లో నువ్వున్నంతవరకూ..
4145. ఎన్ని చిత్రాలు గీసానో_ప్రతిఊహలోనూ నిన్నే కనుగొంటుంటే..
4146. వివశత్వం హద్దులు దాటింది_నా పొలిమేర నీవైనట్లుగా..
4147. నేనో అపురూపం_అక్షరం నన్ను అమరం చేసినందుకే..
4148. ఊపిరందిందిప్పుడే_నీ ప్రేమను హృదయం చవిచూసినందుకే..
4149. మనసు పడితే ఇంతే_ఉదయాస్తమానాలూ మధుర యాతనలోనే..
4150. జ్ఞాపకాలే జోలపాటలు_విషాదం నర్తిస్తూ నిద్దుర దూరమైనప్పుడల్లా..
4151. నాకై నేనే ముందుకొస్తున్నా_జావళీలతో నువ్వు శృతి చేస్తావనే..
4152. మోసుకు తిరగక తప్పట్లేదు_మనసు చచ్చినా జ్ఞాపకాలభారాన్ని..
4153. మనసారా నవ్వెన్నాళ్ళయ్యిందో_లక్ష్మణరేఖల్లోనే కలలు గీసుకున్నందుకు...
4154. ఒంటరవ్వనివ్వని నీ ప్రేమ_నాలోని నిశ్శబ్దానికి నవ్వులద్దుతూ..
4155. కొన్ని గాయాలంతే_మది సలుపుతున్నా తీయగా ఉంటాయంతే..
4156.  కరిగితేనేమి ప్రేమ_నాలోని నన్ను వెలికి తీసిందిగా..
4157. బంధం ఖరీదైనదనుకున్నా_గుండెతడెవ్వరూ తుడవలేనంటుంటే..
4158. జ్ఞాపకాలిప్పుడు కన్నీళ్ళు_కరిగిన ప్రేమను నెమరేసినప్పుడల్లా..
4159. నీ ఒక్క చూపు చాలుగా_నా పెదవుల్లో మధురిమలు పుట్టేందుకు..
4160. మనసంతా రుధిరపు మరకలు_స్రవించిన దుఃఖపు ఆనవాళ్ళు.. 
4161. ఊపిరిని విడవాల్సిందే_రమ్మన్న పిలుపు రాతిరైనా వినబడితే..
4162. జ్ఞాపకాలు_నీరెండిన కళ్ళల్లో నీ వలపు శిధిలాలు..
4163. మౌనానికలవాటు పడ్డా_మనసుతో మాట్లాడటం మానేసాక..
4164. నేనన్నది ఓ అబద్దమనిపిస్తుంది_నీలో ఉనికి కోల్పోయాక..
4165. అదో పంజరం_మరణంతోనే విడుదలనుకుంటే..
4166. కలవరింతెటో మటుమాయం_నీ పలకరింపుతో మనసు పరిమళించగానే..
4167. నేనో కల్పనని_తను కలమంటగానే అక్షరమయ్యే అనుభూతిని..
4168. నా ఆశలా కరిగిపోతుంది_బాధ్యతల చిట్టా నువ్విప్పినప్పుడల్లా..
4169. రాతిరెప్పుడు కమ్ముకుందో తెలీలేదు_నీ కలలొచ్చి పిలిచేంతవరకూ...
4170. నీ మౌనం వినబడుతోంది_ఆలకించింది నా మనసైనందుకే..
4171. గాయం అప్రస్తుతమట_సలుపు నిత్యకృత్యమవుతున్నా..
4172. తొలికిరణమై నేను_మేల్కొలుపుగా నన్ను రమ్మని పిలిచావనే..
4173. లేపనాలేవీ కోరనంటూ మనసు_గాయం నిన్నలా గుర్తుచేస్తుందనే..
4174. ఊహలు దాచుకుంటే చాలనుకున్నా_ఏదోనాడు నువ్వు చదువుతావనే..
4175. నా మనోభీష్టం నీవేగా_నన్ను చుట్టేందుకు అనుమతిచ్చానంటే..
4176.  జ్ఞాపకాన్నలా జార్చేసుకున్నా_విషాదానికి కబురెట్టి వేధిస్తుందని..
4177. కరిగిన మౌనం ప్రశ్నిస్తోంది_ఊహల తుట్టను కదిపినదెవరని..
4178. నాదో కవి హృదయమేగా_అనుభవాన్ని అనువదించుకొనే ఆర్ద్రతున్నప్పుడు..
4179. మనసు మూసుకోవలసొచ్చింది_కొన్ని మాటలు గాయాలై గుచ్చుకుంటుంటే..
4180. వానవిల్లుకి వరసవుతానని తెలీదు_నీలో రంగులు నాకంటేవరకూ..
4181. నిన్నటి ముద్దులు గుర్తొస్తాయి_ఈరోజేం చేస్తుంటావోనని వేధిస్తూ..
4182. వేకువైందని విస్తుపోతావెందుకో_ప్రయాస లేకనే పగటికలలు కంటూ..
4183. అలివేణి అందాల భరిణే_అంటుకుంటే అఖండ కల్యాణే..
4184. వసంతంలో వెన్నెలంతే వేధిస్తుంది_మౌనరాగాన్ని నిషాదంలోకి కలిపేస్తూ..
4185. రంగుల నీడలో నేనున్నా_చీకటొస్తే చెక్కిలి చెమ్మగిల్లుతుందని..
4186. నేను గెలిస్తే నువ్వోడావని_నువ్వోడితే నేను గెలిచానని..
4187. ఆత్మకిరణాలనే ప్రసరిస్తా_నీలో విరహం నాకై తపస్సవుతుంటే..
4188. ఓ ఎడారి_నీ రాకతో ఇసుకపూలు పూయిస్తూ..
4189. ఎదురుచూపులకంతెక్కడుంది_నీ మీద ప్రేమధికమయ్యే కొద్దీ..
4190. నిజానికి నిచ్చెమల్లెనే_పక్షానికి పున్నమిపువ్వుని..
4191. తీరికలేని జీవితాలే అన్నీ_క్షణాలన్నీ వ్యర్ధంగా సాగదీస్తూ..
4192. చూపులతో సైగ చేసినట్లున్నాను_అందాన్నందుకే గమనించావు..
4193. చెక్కిలి గుంతల్ళొ పడిపోయా_ఆ నవ్వుల సోయగానికి నిలబడలేక..
4194. యాభయ్యారక్షరాలు సరిపోలేదు_నాలోని భావాన్ని బాధొచ్చి కబళిస్తుంటే..
4195. అరనిముషం చాలేమో_కన్నుల కోలాటంలో నిన్నోడించి గెలవడానికి..
4196. నన్ను తరిమేసినప్పుడే అనుకున్నా_నీ మనసో రాయేమోనని..
4197. పరవశంతో నేను_నీ ఒడి ఊయలై నన్నూపుతుంటే..
4198. మెదులుతూనే ఉంటా మదిలో_నీ చూపుల్లో ఖైదీనయ్యేవరకూ..
4199. వివశాలే నీ తలపులు_వద్దన్న విజృంభించి వేధిస్తూ..
4200. వదిలించుకోలేని వ్యసనమే నువ్వు_గుర్తురావొద్దన ప్రతిసారీ నన్నల్లుకుంటూ..

No comments:

Post a Comment