5001. మునగాలనే ఉంది మమకారంలో..నువ్వలా అమ్మని గుర్తుచేస్తుంటే..
5002. కలలో ఎదురుచూపులెందుకో..మదిలో చోటిచ్చానంటూ..
5003. మిణుగురునై వెలుగుతున్నా..వేకువదాకా నీ మదిలో చీకటెందుకని..
5004. నిశీధైనా నాకిష్టమే_నా జతగా నువ్వంటానని మాటిస్తే
5005. ముడిపడిపోనా ముచ్చట్లలో..నీరవానికి మన మాటలు వినబడవంటే..
5006. వెన్నెలకెందుకు చెమట పట్టిందో..వియోగంలో మునిగింది మనమైతే..
5007. జాబిలి చినబోయింది..నీ కన్నుల్లో నా రూపాన్నెప్పుడు చూసిందో..
5008. తీరం చేరని నావలెన్నో..కష్టాల ఆటుపోట్లకి తప్పిపోతూ..
5009. నా పెదవికెన్ని నయగారాలో..ప్రియమైన పేరుని పలుకుతున్నప్పుడల్లా..
5010. నీ స్మృతులనే సమీక్షిస్తున్నా..నా క్షణాలను నింపుకుంటూ..
5011. నా మనసంతా వెండితీగలు..నీ జ్ఞాపకాలు జలతారులవుతూ..
5012. మమేకమైన ఊహలతో నేను..ఇద్దరమొకటై రేయి ఆగినట్టు..
5013. కవిత్వమంటే నాకింతే తెలుసు..నీ రాతల్లో నన్నుంచుతావనే..
5014. మైనపు బొమ్మనే నేను..నీ చూపుల వెచ్చదనానికే కరిగిపోతూ..
5015. రేయీ పగలేముందిలే..జన్మ జన్మలకీ మనమేకమవుతుంటే..
5016. మౌనవించింది మోవి_నీ రాగాలకు బదులివ్వాలనే ఊహలతో..
5017. రాత్రి కోసమే నా ఎదురుచూపులు..నువు నిద్రిస్తే కలనైనా కవ్విద్దామని.
5018. తడిచిపోతున్న కనులు..నీ స్మృతుల వెల్లువను తప్పించుకోలేక..
5019. నేనెప్పటికీ గోదారినే..సముద్రునికై రాదారెంట రకరకాలుగా ప్రవహిస్తూ..
5020. కళల కాణాచినే నేను..కంచిలో కామాక్షిగా కనిపిస్తానంతే..
5021. అలగా నే మారిపోయా..తీరమై నువ్వు ఎదురుచూస్తున్నావనే..
5022. తొలి వేకువ దీపం నేనే_నీ కనులు వెతికేది నన్నే అయితే..
5023. నిన్నల్లో నిలిచిన ఆశలు..నేటికి ప్రయాణించిన నిరాశలు..
5024. అరుణారుణ రాగం నాదే_కెంజాయి వర్ణాలు నీకు మక్కువవుతుంటే..
5025. శిల్పమై తీరతాను_ఉలినంటూ నువ్వు పట్టాలే గానీ..
5026. కలలకే సొంతం..మనసు కదలికల రహస్య భావం..
5027. నువ్వెప్పుడు రుచి చూసావో_వెన్నెల మరందాన్ని నాలో కనిపెడుతూ..
5028. వలపన్నదే అపురూపము..పులకింతలకు పండుగ కానిదేముంది ఎదలో..
5029. నా మనసు ఊయలూగుతోందిక్కడ..నీ అనురాగపు అల్లికకేనేమో..
5030. వానమ్మ వయ్యారం..పచ్చని చేను వెచ్చగా ఆహ్వానించినందుకే..
5031. కలలను కాదనలేనంటూ కన్నులు..రంగులంటిన కాటుకల ముచ్చట్లకే..
5032. నా నవ్వులెప్పటికీ నీకే..నన్నో సమ్మోహనాస్త్రమని కనిపెట్టావుగా..
5033. వియోగమెంత పని చేసింది..నన్నో మౌనానికి అంటుకట్టింది..
5034. అట్టను చూసి అసత్యమనుకోకు..అంతర్ముఖము నిజమై ఉండొచ్చు..
5035. నా మనసు విశాలమయ్యింది..ఎగిరొచ్చే నీకు చోటివ్వడానికి..
5036. కలలను కాదనుకుంటూ నేను..నిజమై నువ్వొస్తే బాగుండని..
5037. నిముషాల్ని పెనవేస్తూ నిర్వేదం..నాలో సంతోషాన్ని భరించలేనంటూ..
5038. వాస్తవానికని వేచి ఉన్నా..నీ వార్తల్లో నన్ను విందామని..
5039. కలల కొనసాగింపులు..వేకువకి వాస్తవం చేసుకొమ్మనే ఊహలు..
5040. కలల పండుగ నాకిష్టమే..కనులారా నువ్వొస్తే..
5041. వెన్నెలకి చలువెక్కడ..నీ తలపుల వేడిమి పెరిగిపోతుంటే మదిలో....
5042. అమావసైనా పట్టించుకోనులే..చందమామిప్పుడు నా వాకిట్లో ఉందిగా..
5043. ఏకాంతం..ఒంటరితనపు రూపుమార్చిన నీ స్నేహం..
5044. మమకారం తగ్గదు మగువకి..మగవాడెన్ని వికారాలు పోతున్నా..
5045. అనుభూతులను ఓడించాలనుకున్న భావాలు..అక్షరాలుగా అలంకారమువుతూ..
5046. చిరునవ్వుగా చేరిపోయా..నీ విజయంలో భావస్వామ్యం నాదవ్వాలనే..
5047. నీ చెలిమిలోనే రాగాలేనన్నీ..సీతాకోక వర్ణాలై మురిపిస్తున్నవి..
5048. ఉద్వేగమవుతున్న ఉప్పెనలు..తుంపర్లుగా మొదలైన నా కన్నీళ్ళు..
5049. అనురాగమొక్కటీ సరిపోతుందిగా..నీ పాటలో శృతిలయలు నాకక్కర్లేదుగా..
5050. నిరంతర నవ్వులతో నేను..నిత్యమైకంలో నా నిన్నుంచాలని..
5051. అనుసరిస్తున్నా నీ అడుగులనే..రాదారంతా పూల గంధాలమయమేగా..
5052. కలల్లోకి అనుమతిచ్చినందుకేగా..రేయింబవళ్ళు ఏకం చేసి మురిపిస్తున్నావ్..
5053. కలలోనూ కన్నీళ్ళ చప్పుడు..కన్నులు కురవడం ఆగనందుకే..
5054. ఆనందంతో తడుస్తోంది మది..నిత్యాభిషేకాల నీ భావనతోనే..
5055. ఈ జన్మలో నాకు నువ్వు..మరుజన్మలో సైతం నీకు నేనేగా..
5056. నన్ను నేను చూసుకోగలిగా..నీ మనసు అద్దమయ్యిందనే..
5057. తొలిసారి కలిసినప్పుడే అనుకున్నా..పరిచయం పరుగెత్తక తప్పదని..
5058. ఆనందపు సిరులా ఇంట..ఆడపిల్ల కన్నులపంట పండిందనే..
5059. చెలికాని చిత్తం సొంతమయ్యింది..నాకునేనుగా పులకింతను పాడగానే..
5060. జ్ఞాపకం చేదయ్యింది..గతం గుచ్చుకుంటుంటే..
5061. అందానికదో అతిశయం..వాన వెలిసేలోపు తనను గుర్తుపట్టావని..
5062. కవితలవుతున్న కలలే అన్నీ..కన్నీట జారితే బాగుండవని..
5063. మౌనం ముత్యమే..కుదిరిన కథగా..
5064. తగిలిన సెగనే..రేపేందుకు విరహాన్ని..
5065. నీ మాటలెంత గమ్మత్తో..ఎన్నిసార్లైనా అదే కనికట్టుతో..
5066. నీ నవ్వులో మైమరచిపోతున్నా..కొత్త వ్యసనమిప్పుడెంతో నచ్చింది..
5067. కదలనంటూ కాలం..నీ తలపుల ఆలింగనాన్ని ఆస్వాదిస్తూ..
5068. అనునయానికని అలుకలు మానేసా..నీ ఏకాంతమిప్పుడు నాదయ్యిందనే..
5069. నువ్వెప్పుడూ నా లోకమే..తలవగానే ఎదురవుతుంటే ఊహల్లో..
5070. నా మది కేరింతలే సాక్షి..నీ ఊసులుకు తలచి మురిసిపోతుంటే..
5071. మురిపాలకేం తక్కువలేదు..ముద్దుల్లో తీపెక్కువైందని మేను మొత్తుకున్నా..
5072. సశేషమైంది కల..సాకారమైతే తిరిగి నిద్ర పట్టదనే..
5073. నా చిరునవ్వులిప్పుడు అంబరాలు..చెలి నేనని చెప్పుకున్నావుగా..
5074. సంతోషం నట్టింటే..సావాసాలు మనవైతే..
5075. మన కథప్పుడే ముగియాలి..నా దీర్ఘనిదురతో..
5076. చెలికాని జ్ఞాపకాల గూడు..మదిలోకి అడుగేసి చూడు..
5077. జాబిల్లినని సరిపెట్టుకుంటున్నా..వ్యక్తిత్వ మున్నా మచ్చలవుతుంటే..
5078. పెదవి చప్పుడెలా వింటావో..నాకేసి చూడనట్టు నువ్వుంటూనే..
5079. నెలవంకనై ఎదుగుతున్నా_ఓనాటికి తప్పక పూర్ణమవుతాననే..
5080. భవిష్యత్తుని రాయడం మొదలెట్టా..గతం కనుమరుగయ్యింది చిత్రంగా..
5081. తీరిక లేదంటూనే నీ తలపులు..పదేపదే నా మది తలుపు తడుతూ..
5082. ప్రతిరోజూ పండుగే_తారాలోకంలో అడుగుపెట్టే వీలు నాకుంటే..
5083. క్షరమయ్యిందో జీవితం_అక్షరాన్ని బ్రతికించాలని ఆరాటపడి..
5084. నీ మదిలో నేనెప్పుడూ పదిలమే_మౌనమూ ముత్యమై నవ్వినవేళల్లో..
5085. చీరలు మార్చలేక ఛస్తున్నా_హరివిల్లుని చూసి కుళ్ళినందుకే..
5086. మరుగున్న పడ్డ నిజం_అబద్దానికి ఆయువు పెరిగిపోతుంటే..
5087. మనసు లేను నువ్వు..ఒంటరిగా నన్నొదిలి సంధ్యారాగాలతో..
5088. నా మనసుకంటింది పరిమళం..శ్వాసించింది నీ తలపునైనా..
5089. నీ భావానికని ఎదురుచూస్తుంటా..దూరమైన క్షణాలను తిట్టుకుంటూనే..
5090. ఎప్పటికీ తనేగా సారథి..మౌనాన్ని గెలిపించే తీరతనిది..
5091. మౌనవ్రతం మొదలెట్టాలి చెలి..నిన్ను మధుమేహానికి దూరమెట్టాలంటే..
5092. కన్నుల్లో చేరిన నీరు..గుండె పట్టలేనంత ఆవేదనవుతుంటే..
5093. ఏ జన్మ శాపమోనిది..ఒంటరితనానికి నన్ను బానిస చేసింది..
5094. అనుబంధాన్ని గానం చేస్తున్నా..నీకంట పన్నీరు నేనవ్వాలని..
5095. పల్లవిగానైనా చేరాలనుకున్నా..చరణాలెటూ కుదరలేనంటుంటే..
5096. వార్ధక్యమైతేనేమి వరసకి..మనసు నిత్యయవ్వనంలోనే ఉందిగా..
5097. తాళంలో తప్పులెంచకు..రాగంలో నేనెంత శృతి పెంచుతున్నా..
5098. నా అలుకలా సద్దు మణిగింది..నీ ముద్దుల మోతలు మొదలవగానే..
5099. తీపికర్ధం తెలిసిందిప్పుడు..చెలికాని చుంబనం చెక్కిట చేరగానే..
5100. అర్ధంలేని బంధాలు..ఘర్షణతో ముగిసే వ్యర్ధ సంభాషణలు..

5077. జాబిల్లినని సరిపెట్టుకుంటున్నా..వ్యక్తిత్వ

No comments:
Post a Comment