Thursday, 5 April 2018

5601 to 5700

5601. మౌనారాధన మొదలెట్టా నేను..నిశ్శబ్దమంటే నీకానందమన్నావనే..
5602. కన్నీటి రుచి అలవాటయ్యిందిప్పుడు..కమ్మదనాన్ని విషంగా నెట్టేస్తూ..
5603. నీ ఎద నా సొంతమయ్యింది..నా నవ్వులు నీవు మెచ్చగానే..
5604. అలజడెందుకో చూపులో..మనసు కలుపుదామని కన్నులు వేడుతుంటే..
5605. మక్కువైన మాటనొదిలేసా..మౌనాన్ని ఆస్వాదిస్తున్నావనే..
5606. గెలవాలనుకొని నేనోడిపోతున్నా..నీ తలపుల యుద్ధాన్ని ఆపలేక..
5607. మురిపెం మధువయ్యింది..నీ మమతను తాగుతున్న గమ్మత్తులో..
5608. నీ ఊసులకెప్పుడూ దాసోహమే..గుసగుసల ఇంద్రజాలాన్ని చేసేస్తావని..
5609. పట్టుబడాలనే ఎదురుచూస్తున్న ఆశలు..నీ చూపుల్లో ఒదిగిపోవాలని..
5610. కన్నులబాస నేర్వమన్నానందుకే..బంధం బహు చిక్కనవుతుందనే..
5611.నాతో నేనే విసిగిపోతున్నా..ఆవేదనతో ప్రతీక్షించి గెలవలేక..
5612. వానొస్తేనేమిలే..ప్రేమలో మనమెప్పుడూ తడిచే ఉంటాముగా..
5613. స్రవిస్తూనే జ్ఞాపకాలు..కొన్ని గాయాలకు మందు పనిచేయదేమో..
5614. ఊయలూగుతున్న ఊహలు..కాలాన్నధిగమించి కదలాలని..
5615. ఏడడుగుల గమ్యమెటో..ఇరువురు చేరో దిక్కుకు పయనమవుతుంటే.. 
5616. నా గెలుపు నీదేగా..మనసనే రాజ్యాన్ని రాసిచ్చాక..
5617. జ్ఞాపకాల తాకిళ్ళు..కాలమెంత కదలమన్నా నన్ను తడుముతూ..
5618. నీ మాటలు సీతాకోకలు..నన్ను రంగుల్లోకంలోకి తీసుకెళ్ళినప్పుడల్లా..
5619. నా బుగ్గలెందుకో మందారాలు..మల్లెతోపోల్చి నువ్వు దగ్గరైనప్పుడల్లా..
5620. నీ జ్ఞాపకంలో నేను..వేలభావాలు నా అదృష్టమేగా..
5621. ఆకలితో నేనిక్కద..నాలుగక్షరాలు తినిపిస్తావనే ఆశతో ఇలా..
5622. తన మనసు చూసి దస్సిపోయా..రూపానికి తగ్గట్టు లేదని..
5623. నీ గుసగుసలన్నీ గసగసాలే..మధురభావాలనేసి కమ్మగా నూరినట్టు
5624. నా కనుపాప దాచుకొంది..నీ అరనవ్వుల్లోని అర్ధాన్ని..
5625. నా చూపులకో అందబద్దింది..నీ పెదవులనంతగా చూసినందుకే..
5626. వసంతానికో సమయం లేదంది..మనసు నందనమైన వేళలో నువ్వున్నందుకు..
5629. నా వలపు ముడిపడింది..నీ చూపులోని చొరవందుకొని..
5630. మసకేయడం మానలేదు కన్నులు..వికృతాన్ని తలచుకొని యాతనవుతూ..
5631. హేమంతానికి సీమంతం కావాలన్నా..తొలివలపంత మొగ్గేసిందనే..
5632. ఆల్చిప్పలుగా నా కన్నులు..ముత్యమై నువ్వుంటే మూతపెట్టాలని..
5633. తీరమై నేనుండిపోలేనా..నా నవ్వుల ముత్యాలకై నువ్వెతుకుతావంటే..
5634. ఆరని జ్వాలగా నేను..ప్రేమను నాలా చిదుముకున్నావనేగా..
5635. తనో ఆనందం..నిశ్శబ్దాన్ని సైతం వినగలిగే సంగీతం..
5636. పరితాపం పెరిగింది..నా భావాలు నీ కవనాలవుతుంటే..
5637. ఎన్ని కాలాలు కదిలితేనేమిలే..మన అడుగులొకటై ముందుకెళ్తున్నాక.. 
5638. విరి నేనై పులకరిస్తున్నా..కూసింత ప్రేమజల్లు కురిపించావనే..
5639. మోహితనే మరి..నా ఆకర్షణ నిన్ను మురిపించిందంటే..
5640. అనుభూతి చేజారింది..జ్ఞాపకమెటు తప్పిపోయిందో మరి..
5641. మరాళినని మురిసిపోతున్నా..ఆయువైపోనుందని తెలిసినా..
5642. నీ జ్ఞాపకాలు పక్షులయ్యాయి..మనసైనప్పుడల్లా నాపై వాలుతూ..
5643. ధనుర్మాసం వెలిగిపోతుంది..వేకువనే లక్ష్మి నట్టింట కదులుతుంటే..
5644. నేడెప్పుడూ చేదే..గతాన్ని గరళంలా పదేపదే తవ్వుకుంటే..
5645. చిలిపి చిలకలై నీ ఊసులు..ఏకాంతపు చెట్టుపై సొగసుగా ఊపుతూ..
5646. శిధిలాల్లోకి చేర్చాలనుకున్నా జ్ఞాపకాలు..కాలాన్ని వెంబడిస్తాయని తెలీక..
5647. తప్పలేదు గ్రహపాటు..మనసిచ్చి మోసపోయినందుకు..
5648. వసంతమెప్పటికీ వాడనంటుంది..పాడే కోయిల నీలా నన్నలరిస్తుంటే..
5649. నీ జీవితంలో నేనుంటా..చిన్న పాత్రగానైనా నీ కథలో రాస్తావంటే..
5650. వీడని నీడవంటే నువ్వేగా..తలపులన్నిటా చొరవగా విచ్చేసావంటే..
5651. పయనమాపనంటూ కాలు..నీ జతలో అడుగులు కదులుతున్నందుకు..
5652. మెరుస్తున్నది నా రూపమే నీ కన్నుల్లో..తొలిచూపు తడి కాస్తంటిందని..
5653. నీ వలపే వాయులీనం..నన్నూయలూపే మధుర సంగీతం..
5654.  ప్రతి పదంలో నిన్నే రాస్తా..నా ప్రేమతో నిన్ను అభిషేకించాలని..
5655. రంగమెప్పుడో సిద్ధం..నీ పిలుపుకని నిరీక్షణలో నేనిలా..
5656. మనసుపగ్గం నీ చేతికిచ్చేసా..ప్రేమలో నిజముందని తెలిసే..
5657. నువ్వో అభూతకల్పన..నా ఊహలో చోటిచ్చానంతే..
5658. వెల్లువనే నేనెప్పుడూ..నా తలపుల్లో నువ్వు మునగాలన్నప్పుడల్లా..
5659. ఆటాడ్డం రావాలంతే..కాలం చేతిలో కీలుబొమ్మలమే అంతా..
5660. పరిమళిస్తూ నా నవ్వు..పువ్వులతో నువ్వు పోల్చినందుకే..
5661. నీ వలపు దూరమైతేనేమి..గుండెలో నువ్వైతే పదిలం..
5662. స్నేహించినప్పుడే తెలిసింది..చెలిమిలో తీపుందని..
5663. సరోజంతో సరిపోలిందా వదనం..నవ్వులతో నిత్యం పరిమళిస్తుంటే..
5664. నిప్పు రాజేసిన నిజం..అబద్దమైతే బాగుండన్న ఆవేదనలో..
5665. సరస నీరాజనాలే అన్నీ..వలపు కర్పూరమై పరిమళిస్తుంటే..
5666. కలకెంత తొందరలో..ప్రతిరేయీ నువ్వే దర్శనమిస్తావంటే రేయిలో..
5667. సంతృప్తికి అర్ధం మార్చాలిప్పుడు..ఆశలకు అంబరమూ చిన్నదవుతుంటే..
5668. చెమరించడం నేర్చింది కాగితం..నీ భావాల ఆర్తి తెలిసినందుకే..
5669. కలతందుకే కరిగిపోయింది..కలలన్నిటా నువ్వవుతుంటే..
5670. ఎన్ని జన్మలెత్తినా ఆనందమే..మనిద్దరం ఇలానే కలిసుంటామంటే..
5671. పున్నమిగానే నేనొచ్చా..పొరబడి నిర్లక్ష్యం చేస్తావని తెలీక..
5672. మమతెప్పుడూ పదిలమే..మనసులేకమై ఒక్కటిగా స్పందించేంతవరకూ..
5673. నునుపుతో మెరిసిపోతున్నా..తెలుపుగా నీలో నన్ను వెతుకుతున్నావనే..
5674. నిన్నటి కలలో నిలిచిపోయున్నా..రేపటి కవితగా మిగలాలనే..
5675. ఈ వెన్నెల్లో నీ ఊహలు..నాలో మౌనానికి రేపుతూ రాగాలు..
5676. నా అంతరంగమో అద్దం..నిన్నే ప్రతిరూపముగా ఊహించుకుంటూ..
5677. అక్షరాలుగా తేలుతున్న వేదనలు..కాగితానికి చెమరింపునద్దేస్తూ..
5678. వాదించి ఓడాలనుకోలా..మౌనవించి గెలవాలనుకున్నాక..
5679. అమృతం పొంగుతున్నది నిజమే..నిన్ను ప్రణయాంబుధిలో ముంచాలని..
5680. వేసవికి తొందరే లేదు..నీ తలపుల వెచ్చదనమున్నంతవరకూ..
5681. అదే వరసలో నీ కృతులు..నా పెదవులపై అలవోకగా నర్తిస్తూ..
5682. నిశ్శబ్దం పాటయ్యింది..శిశిరాన్ని తిరగ రాస్తున్న సాయంత్రంలో..
5683. వెన్నెలకెందుకో విలాసం..జాబిలివైన నువ్వు నాచెంత నుంటే..! 
5684. విస్తరిస్తున్న భావాలు..ఆలోచన పరిధి పెంచుకోగానే..
5685. మంచిచోటే దొరికింది మనసుకి..నీ తలపుల్లోనికందుకే జారింది..
5686. కరుగుతున్న శిల్పములా నేను..నీ అక్షరాల తాదాత్మ్యానికి..
5687. నా కలానికి కవితలెక్కువే..నువ్వో ఉపమానమై ఉండిపోతావంటే..
5688. మకిలితనం కడుక్కోడట వాడు..వానొస్తే బాగుండన్నట్టుంది..
5689. అంతులేని కధలేగా అందరివీ..మగువకెందుకు అంటగడతారో వ్యధలన్నీ..
5690. ఒలికిపోతున్న నవ్వులిక్కడ..ఆనందం దాచలేకనే..
5691. ఒక్క ప్రియమైన మాట చాలు..మనస్ఫూర్తిగా అనాలనుకున్నప్పుడు..
5692. నర్తనకందని భావాలెన్నో..శృతిలో లేమని గొంతు చాటవుతూ..
5693. జ్ఞాపకం సంద్రమైంది..మనసు మునిగిపోయేంత ఆనందపు కెరటాలిస్తూ..
5694. నా పేరుకి చెక్కెరంటిందిప్పుడు..నీ ధ్యానంలోని తీయందనానికి..
5695. ఆత్మ పరిమళించడం తెలుస్తోంది..నువ్వొచ్చి చేరడం గమనించకపోయినా..
5696. క్షణాలన్నిటా సంగీతమిప్పుడు..నీ నవ్వులకు మైమరచిపోతున్నానందుకే..
5697. నిరీక్షిస్తేనేమి..నువ్వొస్తావన్న ఆశ నాలో రెట్టింపయ్యిందిగా..
5698. ఆనందం అవధులు దాటింది..అనురాగం నలుదిక్కులా వినబడగానే..
5699. ప్రేమరాగం వినబడ్డట్టుంది..నీ పిలుపులో మకరందం చెవినంటగానే..
5700. కన్నుల్లో దాయలేకున్నా నిన్ను..స్వప్నాల్లోకి తొంగిచూస్తుంటే కొందరు..
Virus-free. www.avast.com

No comments:

Post a Comment