Thursday, 5 April 2018

4801 to 4900

4801. చీకటిలోకి చూడాలంటూ కన్నులు_కలలు సాక్షాత్కరిస్తాయని కాబోలు..
4802. హృదయమెంత గాయపడిందో_నీ మదిలో లేనని తెలియగానే..
4803. పగటికలలెన్ని పాడుకోవాలో_నీ పల్లవిలో నాకు చోటిస్తావో లేదోనని..
4804. కురిసిన వాన కవిత్వమైంది_కొన్ని జ్ఞాపకాల తడివల్లనే..
4805. పిల్లగాలి తెస్తున్న ఊసులేమిటో_మలిపొద్దు నా ఏకాంతములో..
4806. అవనికి  తప్పలేదు_అమ్మలా తానలసినా తనవారిని చేరదీయడం..
4807. పొడుపుకథలు_చిక్కుపడ్డ అనుభవాల ఆనవాళ్ళు..
4808. అనుబంధాలే_మనషుల్ని కలిపి ఉంచే పునాదులు..
4809. ఆ కలానికే పదునెక్కువ_అస్తిత్వాన్ని చీల్చేందుకు సిద్ధపడ్డదంటే..
4810. నువ్వెప్పటికీ ఒప్పుకోని అబద్దం_నీకు నేనేమీ కానని..
4811. అంతరంగం అద్భుతమైన రహస్యం_అద్దం కేవల ప్రతిరూపం..
4812. నిన్న మనసు దోచిన పువ్వునేగా_నేటికి నిర్మాల్యంగా..
4813. కాటుక చెదిరిన కళ్ళు_ఆ నీలీమేఘానికి చూపద్దగానే..! 
4814. కాంతి లేని కన్నుల్లో కన్నీరు_నీ జ్ఞాపకం నీరైనట్టుంది..!
4815. మనసు తడబాటు వింతగా_చొరబడగానే ప్రియుడు చెంతగా.
4816. అల్లుకుంటున్న శిశిరం_వసంతం వైపేసే అడుగులకు అడ్డుపడుతూ..
4817. అంతమవని కధలే మనవన్నీ_అందరికీ అలవోకగా నచ్చేస్తూ..
4818. నిరాశ వెనుదిరిగిందలా_నా అడుగులు లక్ష్యాన్ని పయనించగానే..
4819. రవళించింది వేణువేననుకున్నా_పిల్లగాలిని ఆలకించక మునుపు
4820. విరులు కురిసే వేళయ్యింది_వెన్నెల్లో నా మది నిను కోరగానే..
4821. వసంతమై చిగురించలేనా_మేఘమై నన్ను తడుపుతూ నువ్వుంటే..
4822. కౌగిలికి దూరమైతేనేమిలే_నా కవితలన్నిటా మెరిసేది నువ్వేగా..
4823. జీవితానికిప్పుడు చేరువవుతున్నా_కాలమొచ్చి త్వరపడమంటుంటే
4824. గుండెల్లో ప్రేమభావం_నిన్ను దాచిన విశ్వరహస్యం..
4825. నీరవుతున్న నవ్వులు_మదిలోని స్మృతుల వలస భారాలతో..
4826. నీ వలపులే నాకన్నీ_నాలో మధురభావాలు తొణికాయంటే..
4827. నీ కన్నులదే చల్లదనం_నా మనసంటిన పచ్చదనం..
4828. అక్షరమంటే నీదే_చదివిన నా మనసూగి తూగినట్టు
4829. ఆలోచనకందిన నీ రూపం శిల్పమైంది_ఆవేశానికందని మనసు దిద్దలేదందుకే..
4830. జీవితాన్నలా నెగ్గుకొస్తున్నా_కష్టాలెన్ని బిందువులైనా చకోరినై తాగి..
4831. చినుకును విడిచింది గగనం_ఏ భావాన్ని మోయలేకనో..
4832. గరిక పోచలు_ఎందరు తొక్కినా తిరిగి నిలబడగలిగే విజేతలు..
4833. చూపులతోనే కబురందింది_నీ మౌనంలోని సంగీతం నాదేనని..
4834. తిరిగొస్తున్న నా జ్ఞాపకాలు_వసంతం నీ పాటగా వినబడగానే..
4835. తాపంతోనే అల్లాడుతావెందుకో_వర్షన్నిచ్చి నే గ్రీష్మాన్ని వెళ్ళగొడుతున్నా..
4836. ఎన్ని ఊహల కలవరపాట్లో_నీ కలంలో కవితలవుతూ..
4837. మనసెప్పుడో కదిలొచ్చేసింది_పల్లవిలో నా పేరు వినిపించగానే..
4838. నీ చిరునవ్వులొక్కటీ చాలనుకుంటా_జన్మజన్మాలకీ వీడిపోని చెలిమివనే..
4839. నాట్యమయూరిననుకోలేదు_నీ స్వరానికి అడుగు కదిపానంతే..
4840. హద్దుమీరుతున్న మనసు ఆగడం_నన్ను సంప్రదించకనే నిర్ణయాధికారం..
4841. చిరునవుల్లే అన్నీ_ఒక్క తలపుతో నాలో ఉదయించేవి..
4842. నాది తపస్సే_నువ్వో దేవతవైతే..
4843. అనురాగమలా గెలిచింది_మనసుతో ఆకట్టుకున్నందుకే..
4844. మనసెప్పుడో శృతి చేసుకుంది_ఏకాంతంలో నిన్నే పాడుకోవాలని..
4845. నీ వెంటెప్పుడూ నేనేగా_అడుగులను పరుగులుగా చేసానంటే..
4876. ఎందుకలుగుతోందో తనలా_నిన్ను కలసినప్పుడల్లా..
4877. నేనపరంజినై మిగులుతాను_నీ కన్ను కూసింత నను తడిమినా..
4878. నా మోమిప్పుడే వికసించింది_ప్రణయమంటూ భావమొకటి వీచిందనే..
4879. ఘుమఘుమలే గుండె నిండా_నిన్ను దాచుకున్న ఆనవాళ్ళు..
4880. భూపాలంలో మేఘరాగం ప్రవహిస్తుంది_నువ్వో చినుకై రావాలని నేననుకోగానే
4881. నీ జ్ఞాపకాల ఊయలిప్పుడు_నన్నో అమరస్వరముతో లాలిస్తూ..
4882. విరహాన్ని రాయలేక ఛస్తున్నా_ప్రేమిప్పుడు పూర్తిగా వంటబట్టినట్టుంది.. 
4883. నా నవ్వుల వెంటే పడతావెందుకో_తీయదనం కావాలని నీ మనసడిగిందంటూ..
4884. మనసు మనసుకో కథ_మనసిచ్చి ఒంటరైనందుకో ఏమో..
4885. నీ తలపులకెప్పుడూ తొందరలే_నా భావాల్లో చోటుకోసమని..
4886. కలగానే మిగులుతాననుకున్నా_నన్నో పులకింతగా నువ్వు చేర్చేంతవరకూ..
4887. వసంతమే అనుదినం_వలపందిన వేడుకలో..
4888. కలలోనూ ఒంటరిగానే నేను_నువ్వో జ్ఞాపకమై మిగిలినందుకు..
4889. మౌనంగా నిన్ను మలచేసుకున్నా_మాటలొస్తే మనసు బయటకొస్తావనే..
4890. నా పెదవుల్లో నెలవంకలిప్పుడు_హఠాత్తుగా వసంతంలోకి పడిపోగానే..
4891. ఆనకట్టలాపలేని కన్నీరు_అక్కడో చిత్రవథ లోతుగా జరిగినందుకే..
4892. కునుకులేని కళ్ళే నావెప్పుడూ_నీ ధ్యానంలో నిమీలితమవుతూ..
4893. సిగ్గుపూల స్వాగతాలేమిటో_నీ మనసులో నేనో రహస్యమంటూ..
4894. భావాలు పోతెత్తుతాయలా_కావ్యం రాయాలని కలం పట్టినప్పుడల్లా..
4895. బుగ్గలకు పాకిన మత్తు_వాలిన రెప్పలు సిగ్గును దించేస్తుంటే
4896. వియోగాన్ని ఆలకిస్తున్నా_నీ కన్నీటికో సడుందని తెలిసాక..
4897. నా మనసు ఆకాశమయ్యింది_నీ విహారానికి తోడ్పడదామనే..
4898. మౌనమిప్పుడు ఫలించింది_నా మాటల విలువను కనిపెట్టినందుకే..
4899. తేలిపోతుంది మనసు_ఏకాంతంలో క్షణాలను ఓడించాలని ఉరకలేస్తూ..
4900. జాలిలేని జాబిలివే నువ్వు_మౌనపు బరువునింకా పెంచేస్తూ..

No comments:

Post a Comment