5301. మౌనానికెన్ని భాష్యాలో..అనువదించుకొనేవారికి అర్ధమైనంత..
5302. అమ్మ దిద్దించిన అక్షరాలివి..భావాలుగా పరిమళిస్తూ నేడిలా..
5303. విజయమే లక్ష్యమైంది నాకిప్పుడు..నువ్వలా ఆశని నూరిపోసాక..
5304. నన్నాడిస్తూ గెలిపిస్తావు..నువ్వోడినట్టే నటిస్తావు..
5305. వసంతమెందుకో నవ్వింది..నీ రాకను తనతో పోల్చినందుకేమో..
5306. విశేషమే మన ప్రేమ..పెళ్ళిపుస్తకానికి ముందువాక్యమయ్యిందంటే..
5307. మట్టివాసన మచ్చికయ్యింది..ఈ జన్మ మమకారాన్ని గుర్తుచేస్తూ..
5308. అమాసని గుర్తేలేదు..వెన్నెల్లో దీపంలా అనిపిస్తుంటే నువ్వు..
5309. కలలైతే కురవక ఆగవుగా..నిద్దురంటూ మేఘమై ముసిరిందంటే..
5310. చిదిమి దీపం పెట్టేసావు..చెలిమి చమురు చేతికందిందంటూ..
5311. నిశ్శబ్దానికో అందమబ్బింది..ఆస్వాదిస్తున్నాననే గర్వమనుకుంటా..
5312. నీ కధలే తలచుకుంటున్నా..అపరిచితనని ఎందుకన్నావోనని..
5313. నా మనసు గల్లంతయ్యిందనుకున్నా..నీతో మంతనాలాడుతోందని తెలీక..
5314. ప్రతిరేయీ నిన్నే కలగంటున్నా..నీ జ్ఞాపకాలు కానుకలైనట్టు..
5315. నా కార్తీకానికవి చిరునామాలు..నీ చూపుల్లోని చిరునవ్వులు..
5316. నీ పేరంటే నాకిష్టం..పెదవులకు తీపినింతగా దిద్దాయని..
5317. నా అసలు పేరు మరచిపోయా..నీ ఇంటిపేరొచ్చి ముందర చేరగానే..
5318. చెలియలకట్టలేని నీ చూపు..నను చెంగావి తీరాలకు చేర్చింది..
5319. పరిమళమంతా నాదేగా..నన్నో సంపెంగి సువాసనతో పోల్చాక..
5320. మౌనానికి మురిపెమొచ్చింది..మాట్లాడకుండానే
మనసులాటాడుకున్నందుకు..
5321. కార్తీకం వెలిగిపోతుంది..రాతిరైతే చాలు ఉజ్వలంగా ప్రకాశిస్తూ..
5322. తలపుల్లోనైనా నిదురోవాలనుంది..నువ్వొచ్చి పిలిచావనంటే..
5323. కార్తీకాన్ని నీతో పోల్చుకున్నా..నీ చిరునవ్వుకు సాటయ్యిందని..
5324. వసంతమొచ్చింది ఋజువే..నారాకతో నీలో ఆశలు చిగురించాయంటే..
5325. నా కవితలతో ముడిపడ్డావు..అక్షరాన్ని ఆరాధిస్తున్నానని తెలిసినందుకేగా..
5326. నీ సంచలనమంతటా నేను..భావావేశాలను ఇష్టంగా తరిస్తూ..
5327. ఏకాంతమెప్పుడూ ఇష్టమే..నాలోని నన్ను పునరాలోచించేలా చేస్తుంది..
5328. తరిగిపోయింది కన్నీరు..నీ ప్రేమలో పన్నీరు తాగినందుకే..
5329. ఇంత ఆలశ్యమెందుకు చేసావో..సౌందర్యలహరిలో నన్ను గుర్తించేందుకు..
5350. పయనమవుతున్నా నీ మదిలోకి..గుండెను గూడుగా చేసావనే..
5351. మనసంతా మధురిమ ప్రవహిస్తోంది..రేయంతా హాయిని మోస్తానంటూ..
5352. అధరసం..మనసులోని మధువు పెదవుల్లో మెరవడం..
5353. పున్నమికోసమని ఎదురుచూడకు..ప్రతిరేయీ దీపమై నే వెలగాలంటే..
5354. తరగక తప్పలేదు దూరం..ఆ పరిచయం గాఢమైనందుకు..
5355. అమ్మలా చేరదీసింది అక్షరం..ప్రపంచానికి నన్ను పరిచయించాలని..
5356. మంత్రమేస్తుంది నీ చిరునవ్వు..నాలో కవిత్వాన్ని కుమ్మరిస్తూ..
5357. జీవితమో బొమ్మలాట కానివ్వలేదు..ప్రాణం విలువ తెలుసు కనుకనే..
5358. అలా మొదలయ్యిందాస్వాదన..నీ తలపుల సాంగత్యం సాక్షిగా..
5359. నా స్వరములో నువ్వేగా..అనురాగానికి బాణీ మొదలెట్టాక..
5360. నవ్వైతే నీదేగా..అధరాలు చెలివవుతున్నా..
5361. చూపులతో చదవడమొకటొచ్చింది..అక్షరమాలంటూ నేర్వకపోయినా..
5362. కొన్ని అనుభూతులంతే..కలను నిజం చేసి అనుభవాలవుతాయి..
5363. ప్రేమలేఖను రాయాలేమో నేనిప్పుడు..అక్షరాలొచ్చని నువ్వు నమ్మాలంటే..
5364. మధులాలస నీవే..నా క్షణాలకు అమృతం అద్దావంటే..
5365. ముసురేస్తున్న ఉదయాలెన్నో..నా ఎడబాటుని విషాదానికి అప్పగిస్తూ..
5366. ఎన్ని కలహాలని తప్పించుకోవాలో..నా ప్రేమని నిరూపించుకోవాలంటే...
5367. మౌనమలా చలించింది..నా ఏకాంతంలో నీ గుసగుసలకి..
5368. హృదయంలో మొదలయ్యిందే..కన్నుల్లోంచీ తొణుకుతూ ఆ నీరు..
5369. నాలోనే ఉన్నావనుకున్నా..నా ఉనికేదని ప్రశ్నించుకోక ముందు..
5370. నీ కవితంటే నేనేగా..నిశ్శబ్దాన్ని రవళించమంటావెందుకు..
5371. వెతకలేదందుకే నేను..నా హృదయం చేరుంటుంది నిన్నేనని..
5372. వసంతం దూరమైనట్టుంది..రెప్పల్లో కన్నీరు ఉబుకుతోందిలా..
5373. పల్లవిస్తున్న పాటలెన్నో..పండుగలా నువ్వెదురొస్తుంటే..
5374. మనోరథానికెన్ని చక్రాలు కావాలో..నీ తలపుల్లో విహరించేందుకు..
5375. మౌనాన్ని తాగుతున్నా విషమల్లే..మనసుని చేర్చలేని విషాదంలో..
5376. చుట్టూ ఎందరున్నా వ్యర్ధమే..నీలా ఎవరూ లేనప్పుడు..
5377. మన అనుబంధం శృతిమించింది..ప్రణయం ఆకాశమయినట్టు..
5378. పెదవిప్పని ప్రేమే'నది'..గుండెల్లోంచీ ప్రవహిస్తున్నది..
5379. మరపు నాకలవాటైంది..నువ్వు దూరమైనప్పటి విషాదపు సంధి..
5380. మౌనం ముచ్చటనిపిస్తుంది..చూపులు చదవడమొచ్చినందుకే..
5381. ఓదార్చుకుంటున్నా ఒంటరితనాన్ని..గెలుపుని జతచేర్చుదామని..
5382. జీవితం అల్పమయింది..దొరికిన తీగకు మెరుగు పెట్టలేనందుకే..
5383. వలదన్నా గర్జిస్తుంది నాలో మౌనం..నువ్వలకిస్తున్నావో లేదోనని..
5384. ముగిసింది అన్వేషణ..నీకన్నా మించిన చెలిమి నాకనవసరమని..
5385. ప్రేమంటే అంతే..నాలోంచీ నన్ను తప్పించే ఇంద్రజాలమనుకుంటా..
5386. సాగనంపక తప్పలేదు గతాన్ని..భవిష్యత్తులో భరోసాతో అడుగులేయాలని..
5387. పున్నమిపోగులు పూసుకుంది మది..మనసంత రేయిని అలంకరించాలని..
5388. ప్రతి ఉదయం పండుగే ఆ ముంగిట్లో..రంగవల్లుల సింగారాలతో..
5389. విమానమే నా హృదయం..విహంగాన్ని పోలి విహరిస్తున్నదంటే..
5390. నిజానికి నిర్భయమెక్కువ..అబద్దాలెన్ని చీకటి వీధులు చేరినా..
5391. నిదురపోవుగా నిముషాలు..నిన్ను తలచే నా తలపుల విరహాలు..
5392. యుగాల పారవశ్యంతో నేను..నువ్వున్న క్షణాలు అపురూపమవుతుంటే..
5393. ఏకాంతమెంత తీపయ్యిందో..నా హేమంతానికి రాజుగా నువ్వొచ్చాక..
5394. ఆ జాబిలెందుకు చిన్నబుచ్చుకుందో..నాక్కాస్త అందం అంటిందనగానే..
5395. నీ మనోభావంలో నేను..కార్తీక దీపానికి పోలికనేగా..
5396. వెతుక్కుంటున్నా వసంతాన్ని..హేమంతమింకా పూర్తవలేదని మరచి..
5397. చిగురెందుకు ఒణుకుతుందో..గ్రీష్మంలో నా పరితాపాన్ని తలచి..
5398. ప్రశ్నగా మిగలక తప్పలేదు..జవాబవసరం లేదని నువ్వన్నాక..
5399. కాలమొక కల్యాణిరాగం..ఋతువులెన్ని మార్చుకున్నా స్వరకల్పనాపదు..
5400. అపురూపమే అనిపిస్తుంది..ఇన్ని కోట్లమందిలో నన్ను వరించడం..

No comments:
Post a Comment