5101. చందమామ చిక్కిపోతుంది..నీ అందానికి తను సాటిరానంటూ..
5102. మాటన్నది మరచింది మనసు..నీ మౌనాన్ని దిగమింగలేక..
5103. చింతన్నది చెంతకు రాదు..చిత్రమైన చిరునామాగా మారావుగా..
5104. వలపెందుకు నవ్విందో..నీ కలలోకి ఆహ్వానిస్తుంది నన్నైతే..
5105. చెలిమి నవ్వులను ఆహ్వానిస్తున్నా..నాకో ఓదార్పుగా నువ్వున్నావనే..
5106. శిలలుగానే మిగిలిన కొందరతివలు..పురుషాహంకారాన్ని ఎదిరించలేక..
5107. దారి మార్చుకున్న మనసు..రహదారులో గులాబీలను వెతుకుతూ..
5108. నా మనసంతా మధువనం..నీ మధువీక్షణలో ప్రతీక్షణం..
5109. మరువమై పరిమళించాలనుంది..మరుజన్మకీ నువ్వే నెచ్చెలి కావాలని..
5110. శృతి కలిపానందుకే..చరణాలు నీతో కలుపుకు పోవాలనే..
5111. హృదయముప్పొంగడం తెలుస్తోంది..తేనె అలలు తాకడమిది తొలిసారి..
5112. ఘనీభవిద్దామా మనం..ఒకేసారి కరిగి నీరై ప్రవహించేందుకు..
5113. నా కావ్యం..నిన్నెప్పటికీ విషాదంలో ముంచే మౌనం..
5114. నీ దృష్టి లోపించినట్లుంది..ఇద్దరమొకటైనా వేర్వేరుగా వెతుకుతున్నావ్.
5115. నిజానికిప్పుడో పాట రాయాలనుంది..హరివిల్లు రంగులే కురుస్తాయంటే...
5116. నల్లరంగు నేనిష్టపడలేకున్నా..కన్నుల్లో నీ రూపు మసకేస్తుంటే..
5117. నాకైతే ఆనందమే..నా చిరునవ్వుతోనే నీకు తన్మయమొస్తుంటే..
5118. కొన్ని కథలంతే_ఎంత రాసినా విశేషమనిపించుకోవు..
5119. గడ్డిపువ్వుకీ మనసుందట..నీరందించిన వాడు మాత్రమే చదవగలడని..
5120. తన చూపుదెంత అల్లరో_పెదవి మెదపకుండానే కవ్విస్తూ..
5121. వేకువ కనువిప్పిందిలా_రేయంత హాయిని బరువుగా మోస్తున్నా..
5122. ఆ చెలిమితో ఎంత చెలగాటమో_ప్రతిసారీ తన మాటే నెగ్గాలంటే..
5123. నీ చూపు గిచ్చితేనేమిలే..నాలో వలపైతే చిగురించిందిగా..
5124. నా గమనం నీవైపే..గమ్యమై నువ్వు అగుపించినప్పుడు..
5125. నీ విరహం నేనని ఒప్పుకుంటున్నా_నీ వేదన అర్ధమవుతుంటే..
5126. మనసనేదే లేదు తనకి..ప్రేమించేందుకో కారణం వెతుకుతున్నాక..
5127. మనసు మెచ్చిన పచ్చబొట్లు..నీతో పంచుకున్న కాసిని క్షణాలు..
5128. ఏడో రుచెంతో నచ్చింది..ఉగాదిని మరిపించి నీ తలపులుంటుంటే..
5129. మంత్రాలిప్పుడు మరువాలే..సువాసనంతా నాదవుతుంటే..
5130. కొత్త పుంతల్లో పులకరింతలు..ఈ మాయలన్నీ నీవనేగా
5131. మనసు నిండిన మధువులు..నీ తలపులెప్పటికీ తీయనివంటూ..
5132. కాలాన్నే నేను..నావల్ల నీ గాయం కొంత మానిందంటే..
5133. చూపులను ఆపలేకున్నా..నిన్ను చూడాలని తొందర పడుతుంటే
5134. విరిచేయనా నిరాశల కెరటాలు..నిశ్చలంగా కలిసి మనం ప్రవహిస్తామంటే..
5135. నా స్థానమిప్పుడు పదిలమయ్యింది..నేనేంటో నీ మదిలో తెలిసాక..
5136. నీ జ్ఞాపకాలెప్పుడూ సుతారమే..మనసంతా మెత్తగా అలుక్కుపోతూ..
5137. చీకటంటే చింత లేదిప్పుడు..చిదమకుండానే తను దీపమయ్యిందిగా..
5138. మనసిప్పుడు పదింతలయ్యింది..నాలో భావాలు విశాలమయ్యాక..
5139. పువ్వునై పుట్టానందుకే..ఏదో విధంగా నిన్ను అలరించాలనే..
5140. ఎన్ని శిలలకు ప్రాణమొచ్చింది..అతని చేతిలోని మహత్యానికి..
5141. అనురాగాన్ని విడిచిపెట్టను..మన అనుబంధం చిక్కబడేదాకా..
5142. ఆవేదనే ఆకట్టుకుంటుందేమో..ప్రతిపదమూ కవిత్వమై మెప్పుపొందుతూ..
5143. కాగితం పరిమళిస్తుంది చూడు..నీ భావాలనంతలా మోస్తున్నందుకే..
5144. మధుపాలే నీ చూపులు..ఎటుతిరిగినా నన్నే వెంటాడుతూ..
5145. కనుపాపలను ఆడించనివ్వవు..కలలన్నీ వెంటబడుతున్నా..
5146. వగలుపోతున్న కలలిప్పుడు..పగలైనా తమను హత్తుకుంటూ నేనున్నానని..
5147. ఊహల తంతే అంత..విచ్చేసిన భావాన్నల్లా వదలనంటూ..
5148. సగపాలతో సందడే రేయంతా..నేడే ప్రేమించినంత కొత్తగా..
5149. ఆశనెలా తీర్చాలో ఆలోచిస్తున్నా..నిరాశలో నువ్వుంటే చూడలేనని..
5150. నీ ఊహల గమ్మత్తు తెలిసింది..ఈనాటికి నా మత్తింకా దిగలేదని..
5151. వర్షమెప్పుడూ అంతే..ఏ మనసూ వదలిపెట్టాలనిపించని గంధం..
5152. మనసైనదే..నిన్ను జ్ఞాపకాల్లో తడుముకునే గతమెప్పుడూ..
5153. కాలమాగి చూసే కథలెన్నో..నువ్వూ నేనూ ఒకటైనందుకే..
5154. మనసులోనే నువ్వెప్పుడూ..విత్తుగా మొదలైనప్పట్నుండీ..
5155. అలికినట్టు మారుతూ అక్షరాలు..మనసుపుస్తకం తడిచిందన్నట్టు గుర్తుగా..
5156. కొత్తగా వెలుగుతున్న కనులిప్పుడు..నీ హారతులు ఉషస్సులవుతుంటే..
5157. అమృతంతో సమానమేగా నువ్వు..ఆగిన ఊపిరిప్పుడు అందుతుందంటే..
5158. చూపులతోనే ఆపెస్తావెందుకో..స్వకార్యమేదో సఫలం చేద్దామని నేనెళ్తుంటే..
5159. కెంపులకెందుకో అంత గర్వము..నీ చెక్కిళ్ళను అద్దినందుకేమో..
5160. నీ మాటలెప్పుడూ సుస్వరాలేగా..గుండెల్లో అమృతాన్ని ఒంపినట్టు..
5161. నీ తలపులతోనే తెల్లవారుతుందిక్కడ..నిరాశను నిద్దట్లోనే వదిలేస్తూ..
5162. విన్నానులే నీ పల్లవి..చరణాలు కలిపేందుకు కదిలానందుకే..
5163. నీ భావాలు తాగుతున్నందుకేమో..మనసిప్పుడు నిన్నే కోరుతోంది..
5164. ఎందుకటు కదిలిందో ఆమె..వెతుకులాటతో మొదలైన నేను..
5165. నీ మనసెప్పుడూ పాలచుక్కే..స్వచ్ఛమైన భావాల్ని పలికిస్తూ..
5166. విధి రాసే విచిత్రాలేగా కొన్ని..ప్రతీ చర్యకీ మనిషిని ద్వేషిస్తే సరా..
5167. మనోవనంలో విరగగాసిన పువ్వులు..నీ చిరునవ్వునలా తలపిస్తూ..
5168. నిజమైన కల్పనొకటి..నీ సహవాసాన్ని ఊహిస్తూ నేనున్నందుకేమో..
5169. మన వలపు సుగంథాలు..విరులనే ఓడించే తరంగాలు..
5170. పన్నీటి రుచి మారుతుందనుకోలా..నువు లేకుంటే కన్నీరవుతూ..
5171. నువ్వో అద్భుతానివే..నా ప్రాణాల్ని నిలబెట్టే ప్రేమవయ్యావుగా..
5172. ఉదయమిప్పుడే అయ్యింది నాకు..ఉషస్సు మెరుపువై నువ్వొచ్చినప్పుడు..
5173. రాతిరికి దూరంగా నేను..నీ తలపు సంధ్యల్లో రాగమవుతూ..
5174. నీరెండలా నువ్వొస్తే చాలనుకున్నా..వెతల వెక్కిళ్ళనలా నిలువరించేందుకని..
5175. మనసుకదో కలవరపాటు..నీ పలకరింపుల తొలకరులు కరువైనప్పుడల్లా..
5176. మనసు లాస్యమిది నిజమే..మౌనంలో మధురానుభూతులు దాచుకుంటూ..
5177. నా నవ్వులు నీలో కురిసాయనుకోలా..తడిచానని నువ్వొచ్చి చెప్పేదాకా..
5178. జీవితమే ప్రణయమై సాగుతోందిలా..బృందావనం మదిలోనే కొలువయ్యిందనేలా..
5179. ప్రేమెప్పుడూ ఓ పండుగే..అపశృతుల రాగాలు మొదలవనంతవరకూ..
5180. చూపులతో అదుపు చేయలేక ఛస్తున్నా..చెలివంటూ చేసే నీ కొంటెఅల్లరికి..
5181. నీ చూపులకే వెచ్చబడుతున్నా..మనసంతా హేమంతమైందని తెలిసాక..
5182. నేనంటే నువ్వే..నా మది గదిలో కాలు మోపాక..
5183. ఆమెలోని భావమలా నవ్వుతోంది..ఆశలన్నీ కవితలుగా అల్లుకొని...
5184. నిశ్శబ్దం నాట్యం నేర్చిందిప్పుడు..నీ మౌనాన్ని వెక్కిరించాలనేమో..
5185. నవ్వుతూనే నేనుండిపోతా..నీ రాతిరికి దీపముగా వెలిగించుకుంటానంటే..
5186. మరువమంటి మమతవేగా నాకు..మల్లె నవ్వులతో నన్ను మాయచేస్తూ..
5187. మనసందుకే నీకిచ్చేసా..నే లేకున్నా నువ్వు నవ్వుతూండాలనే..
5188. పొడారనివేగా నీ తలపులు..మనసంతా తేనెజల్లులు తడిపినట్టు..
5189. నీ మాటలకే మురిసిపోతున్నా..అద్దమంటి మనసు నాదవుతోందని..
5190. చూపులతో చెక్కిళ్ళు చుంబిస్తావెందుకో..మనసెటూ నీ వశమయిపోయినా..
5191. రాజు నువ్వని ఒప్పుకుంటున్నా..రాణి గదిలోకి ప్రవేశం నీ ఒక్కడిదేగా మరి..
5192. పరిమళమిప్పుడే తాకింది..నువ్వు నేనయ్యానన్న మాట నిజమయ్యాక..
5193. మనసంతా వెన్నెల..ప్రేమ విరిసిన గదిలో చల్లదనమదేనేమో..
5194. పెదవులపై పలుకుతున్నాలే అదే..నీ పేరొక్కటే ప్రియమవుతుంటే..
5195. రేపటికైనా నువ్వే కావాలి..ఈరోజు విరహాన్ని భరిస్తున్నానందుకే..
5196. ఎన్ని పూల పరధ్యానమో..పరమాత్ముని చేరే దారి మూసుకుపోయిందంటే..
5197. మల్లెల మత్తులెందుకులే ఇందరిలో..గమ్మత్తుల ఆరాలు తీసిపోతారు..
5198. ఆకాశాన్నే దించేసావుగా..నీ ప్రేమ విలువెంతని అడిగినందుకే..
5199. మనసెప్పుడూ మర్మమెరుగనిదే..మాయమాటలకు ఆకర్షితమవుతూ..
5200. క్షణాలనెటు తరమాలో..మౌనన్ని దించలేని మనసుని ఆపాలంటే..

No comments:
Post a Comment