4901. హరివిల్లు కలనేతవే నీవు_నాలో అలవోకగా విరిసినప్పుడల్లా..
4902. కరిగింది నిశ్శబ్దపు చప్పుడు_భావాల వ్యధతో మౌనమిప్పుడు వృధా
4903. చినుకు చిలిపి సుమాలు_కదులుతున్న గాలి కవిత్వం అయిందనో
4904. చిక్కని పదం చింతిల్లింది_కూసే కోయిల కన్నీరు కొమ్మపై జారిందని..
4905. గెలిచిందిలా ప్రేమ_కొన్ని వ్యధలు కధలుగా మారినప్పుడు..
4906. పంచమికింకా పదిరోజులుందనుకున్నా_నీ పదముల్లో నడుస్తుందని తెలీక
4907. చినుకు పరిమళం మనసుకిప్పుడు_నువ్వో అక్షరమై కురిసావనే..
4908. చిదుముకున్న చెలిమికిప్పుడు చిరునవ్వులు_ఉద్వేగాలు కలిసాయనేమో
4909. మనసు_ఏమయ్యేదో నువ్వంటూ జీవితంలో కలవకపోతే..
4910. కరిగిన ప్రతిసారీ అదే మైమరపు_నా మదినేలే రాజు నువ్వైనట్టు..
4911. నవ్వుల సంతకాలు చేస్తున్నా_నీలో పరిమళమై నిలిచుండాలనే..
4912. కులికే కన్నుల్లో కనుగొన్నా_నువ్వెదురొచ్చేదెప్పుడూ నా కోసమేనని..
4913. జ్ఞాపకాల బరువు పెరిగినందుకేమో_అదేపనిగా మనసు కుంగుతోంది..
4914. విధికిష్టమేమో ఆ సన్నివేశం_కలిసిన మనసుల్నెలాగోలా విడగొడుతుంది..
4915. అడుగులన్నీ కలిసే వేద్దామనుకున్నా_నువ్విలా వెనుకడుగేస్తావని తెలీక..
4916. మనసు మనసుకో కధ_కళ్ళకంటూ చదవగలిగే వీలుంటే..
4917. మనసు విహంగం ఎగురుతానంటోంది_నువ్వో ఆకాశమై అగుపడ్డందుకేమో..
4918. కొన్ని హృదయాలంతే_ఎన్ని గాయాలైనా మరుపుకి వదిలేస్తుంటాయి..
4919.మనసునందుకే మూసేసుకున్నా_నీ మూగనోములో సంకల్పం నేనయ్యానని..
4920. నన్ను చేరిన కవితొకటి_నిన్ను జాబిలిగా రాయమంటోంది..
4921. భావాలకిప్పుడు కొదవేముంది_అనుభూతుల్లోకల్లా నువ్వగుపిస్తుంటే..
4922. పలకరించినట్టుంది కోయిల_నీ పిలుపు శ్రావ్యంగా వినబడుతుంటే..
4923. రాగాలన్నీ నీలోనివే_నా సంగీతంలో వినిపిస్తున్నాయంతే..
4924. హృదయమెప్పుడో తరించింది_నీ వలపు పిలుపై నన్నంటగానే..
4925. క్షణాలను కదలనిస్తున్నా_నీ కథలో నా పాత్రనెతుకుతూ..
4926. మచ్చలెంచాలని ప్రయత్నించను_తనెప్పుడూ నా చందమామనే..
4927. అందానికేం తక్కువలేకుంది_మనసెంత విషపూరితమైనా
4928. విషాదం వినోదమయ్యింది_నీ చెలిమి కానుకైనందుకే మరి..
4929. నా కలమవుతోంది బేజారు_నీ అక్షరాలు అలికిడవ్వలేదనే..
4930. మనసొక్కటే మిగిలింది_ఒంటరితనానికి పరాకాష్ఠగా..
4931. ఎప్పటికీ నేనే_నీ అనుభూతుల్లోకి తొంగిచూసే నక్షత్రాన్ని..
4932. తలపులతో తీరిక లేదిక్కడ_మనసుకి పండుగొచ్చిన నేపధ్యంలో..
4933. నిజమైన నా కల_కన్నుల నిండుగా నువ్వైనందుకే..
4934. మనసంతా కురిసిన పన్నీరు_నువ్వంతా నేనని వినగానే..
4935. పులుపు కోరుతూ మనసిప్పుడు_నీ వలపుతీపి పండినందుకు..
4936. మనసు తెరిపించింది_ఎన్ని కన్నీటివర్షాలను దాటినందుకో మరి..
4937. ఆ కన్నులెంత మాయలో_ఒక్క చూపుకే కనికట్టు చేసినట్టు..
4938. కాలాన్ని అనుసరిస్తున్నానందుకే_విధి తప్పక వియోగాన్ని తీరుస్తుందని..
4939. ఎంత బురద అంటుకుందో_అనుభవాల పొర్లాటలో ఓడిన ప్రతిసారీ..
4940. అపురూపాలిప్పుడు ఆనందాలు_నీ కురిసింది నేననగానే..
4941. ఆకాశమంత ఎగరాలన్న ఆశ_నీకు నువ్వుగా విశాలమవగానే..
4942. కొట్టి రాసినా గంధమే_నీ స్పర్శంటింది చాలనుకుంటూ..
4943. అందాలన్నీ కౌలుకే_వలపుక్షేత్రం పండాలంటే..
4944. మునుపున్న లోకమే_ప్రేమ కళ్ళజోడు పెట్టాక కొత్తకొత్తగా..
4945. నా అడుగులిప్పుడు నాట్యాలు..మేఘరాగానికి మనసు నిలువనంటుంటే..
4946. నా కలలిప్పుడు పసిపాపలు_నీ కన్నుల్లో చేరినందుకు..
4947. జాబిలిగా జన్మెత్తుతా_మచ్చలేవీ నువ్వెంచనంటే..
4948. ఆ సంద్రం ఎండిపోయిందట_నీ కష్టాలను కడిగేందుకనొచ్చి..
4949. విగతమవుతూ నాలో ఆశలు_వివశం కాలేనందుకు నీలో..
4950. చెలిమి నిత్యవసంతమే_ఋతువులు దాటేందుకు అవసరమే లేదన్నట్టు..
4951. ఆనకట్టేయలేని కన్నీరు_అకాలంలో అపార్ధాలు కురిసినందుకేమో..
4952. నీ ఎదురుచూపుల్లో నేను_వెన్నెల్లో ఆడపిల్ల అలుకనేగా..
4953. మనసుకి దగ్గర దారి వెతుకుతున్నా..నవ్వులతో నిన్నాకట్టుకోవచ్చేమోనని..
4954. ఊహల వెల్లువ బాగుంది_మన ఊపిరులొకటైనట్లు మనసుకనిపించగానే..
4955. అలల్లాడుతూ నా కోరికలు_నిన్ను దాచుకున్న స్మృతిపధంలో..
4956. ఆ కన్నీటికి విలువలేదు_నిత్యమందులోనే ఈదులాడే నిరాశలకు..
4957. నా గుండెల్లో ప్రకంపనాలు_నీ రాకనాశిస్తున్న మధురక్షణాలు..
4958. నేనెప్పుడూ నీతోనే_మనసనేదెప్పుడో కోల్పోయానుగా..
4959. గుప్పెడు గుండెనిచ్చేసా..పువ్వులతో పూజిస్తావన్నందుకే..
4960. ఎండమావులు అబద్దమైతే బాగుండు..నిజాన్ని తట్టుకోలేని గుండెకోతకు..
4961. చిగురునై రావాలనుకున్నా_చినుకువై కురుస్తానని నువ్వంటే..
4962. నీ గుండె సవ్వడసలు వినవే_రాగంలో నేనో కృతినై దాక్కుంటే..
4963. ముసురేసినప్పుడే అనుకున్నా_చిరుజల్లుగా కురవబోయేది నువ్వేనని..
4964. పరకాయమైనా నాకిష్టమే_నీ వలపులో ముంచి తేల్చుతానంటే..
4965. చూపుకి వలపు ఆదేశమైనప్పుడు_మదిలో ప్రేమావేశం వెల్లువవును..
4966. వగలరాణినే నేను_ఆసరా కోసమని నీ మనసుని దోచేస్తూ..
4967. భావాల పరామర్శలు..అక్షరాలుగా కూర్చలేదని నామీద అలుగుతూ..
4968. మెలికనై కదులుతున్నా..ముగ్గుల్లో నన్నెతుకుతున్నావనే..
4969. నీ వలపో భరణం..ఆశించకనే నాకందిన ప్రియవరం..
4970. అక్షయమే నా తలపులు..ఒక్కమారు నువ్వు ఆహ్వానించాలేగానీ..
4971. నీ స్మృతులన్నీ పరిమళాలే..నా మనసున పువ్వులవుతూ..
4972. నీ కానుకతో మురిసింది మది_అక్షరాల విందు కొత్తగా ఉందంటూ..
4973. నానార్ధాలతో అపార్ధాలెన్నైతేనేమి_అక్షరమెన్న
టికీ క్షరం కాదు..
4974. శ్రావణమిప్పుడు అలరిస్తుంది_నీ మది దాహానికి జల్లులు కురిపిస్తూ..
4975. గుడిగంటల సవ్వళ్ళిప్పుడు గుండెల్లోనే..నేను నీదాన్నని నువ్వంటుంటేనే..
4976. ప్రియమవుతూ నీ చెలిమి_నాలో ప్రతిబింబముగా నువ్వగుపడగానే..
4977. ధరణి దాహం తీరింది_ఒక్కో నీటిచుక్కా మెత్తగా తనలో ఇంకిపోతుంటే..
4978. మునిగిపోతున్నా బానే ఉంది_మనసు లోతుల్లో తడి తెలుస్తూంటే..
4979. ఒంటరిగుంటేనేమి..నా తలపుల్లో నువ్వో బృందగానమే చేస్తుంటే..
4980. నా పెదవెన్నటికీ తడవనిది_నీ ఎదురుచూపుల్లో రంగు మారింది..
4981. సంస్కారమటు నిచ్చెనెక్కింది..సంప్రదాయాలకి నీళ్ళొదులుతుంటే..
4982. ప్రేమలోకంలో మనమిద్దరం_ఇప్పుడీ ప్రపంచం కొత్త చిరునవ్వులతో..
4983. మధురాలకే మధురం నీ పిలుపు_నాకు మాత్రమే వినబడుతూ..
4984. నిచ్చెనెక్కినట్టు నీ మాటలు_నాలో కలవరాన్ని రేప్పెడుతూ..
4985. తుమ్మెదలా గిల్లకు_పరిమళాన్ని పట్టించుకోనట్టు నటిస్తూ..
4986. మల్లెపందిరంటే నీకు మక్కువేగా_చంద్రోదయానికి అల్లికలందుకే..
4987. సౌందర్యాన్ని తూకమేస్తున్నా_నీ మురిపెముతో పోటీ పడలేకనే..
4988. చీకట్లు చెదిరిపోవల్సిందే_చెలిమితో సూర్యోదయమవుతుంటే..
4989. నేనో శాంతిపావురం_స్వేచ్ఛనిచ్చే నీ మనసాకాశాన..
4990. ఆక్రోశమే..మనసుకి నచ్చింది జరగనంతవరకూ..
4991. మందారమై పూస్తా నేను..నీ వేకువకి ఆహ్వానించావంటే..
4992. ప్రతినిత్యం యవ్వనమే..నీజతలో నేనుంటే..
4993. శతపత్రసుందరిలా నేను..నీ కవితగా రాస్తానంటే నన్ను..
4994. పువ్వులా చేరాలని నేనొచ్చా_మెత్తగా ఒక్కసారైనా నిమరకపోతావానని..
4995. మనిషి తెరలు జారినాయక్కడ..ధనప్రవాహంలో తడిచిపోతూ..
4996. ఆవిరందినప్పుడే అనుకున్నా_నీ ఊపిరి వెచ్చదనం సోకుంటుందని..
4997. స్మృతులతోనే నాకు పండుగలిప్పుడు_గతంలోంచీ పిలవకందుకు..
4998. నీ రాకతో ఆగిన స్వగతం_భవిష్యత్తు నీతోనేనంటూ..
4999. ఉదకమంతా తీపి పాయసం_స్వేదమైతేనేమి ఎవరికి నష్టం..
5000. మనసెంత మచ్చికైందో..నీ చూపుల వశీకరణ శక్తికే..

No comments:
Post a Comment