5401. అధిగమించానలా జీవితాన్ని..ఒక్కో ప్రశ్నకూ సమాధానాలు వెతుక్కొని..
5402. నా మనసిక్కడ ఊయలూగింది..నెమలీకల నేస్తాన్నిలా తలచుకోగానే..
5403. ఎంత ఎరుపో కన్నుల్లో..నీవల్లనే నిదురకి దూరమైనట్టు..
5404. ఎన్ని పుస్తకాలు చదివేసానో..చెలిమికోరి తీయగా చేరినందుకు..
5405. నీ కవనలోకానికి నేనొస్తున్నా..మనసుకి రెక్కలొస్తే విహరిద్దామనే..
5406. కంటిభాష్పముగా కరిగిపోయాను..నాపై నీ అనురాగం వ్యర్థమేనని..
5407. ఒక్క పిలుపు చాలుగా..జీవితమో మలుపు తిరగడానికి..
5408. నా సుస్వరం..నీకోసమే మది పాడుతుంది మధురం..
5409. అబద్దం..కొన్ని జీవితాల్ని నడిపిస్తున్న నిజం..
5410. ప్రేమ పుస్తకం పూర్తయ్యింది..నీ మనసొక్కసారి తడమగానే..
5411. సహించక తప్పలేదు కాలానికి..ఋతువులన్నిటా తను ఒదిగిపోతూ..
5412. చల్లగాలి పాడినప్పుడనుకున్నా..నీ నవ్వుల్ని అనుకరించడం నేర్చిందని..
5413. కలతలన్నీ పరారు..కలల పరిమళంతో వేకువొకటి మొదలవుతుంటే..
5414. మిణుకుమిణుకుమంటుంది ప్రేమ..కార్తీకదీపమై వెలిగేలా..
5415. జీవితం ఆగిపోయిందక్కడ..ఏ చెలిమీ చేయందించనందుకే..
5416. ఎటు కదిలినా సమ్మోహనమే..మోహనరాగపు పరవశాల వివశత్వానికి..
5417. మౌనం వెనుక వెతుకుతున్నా..శోకం ప్రవహిస్తుందని తెలీక..
5418. కొత్త పుంతలతో సాహిత్యం..తారల సాన్నిహిత్యాన్ని మెరుగుపరిచేలా..
5419. నా ఊసులు మకరందాలే..అందుకేగా తుమ్మెదవై నువ్వెంటొస్తుంది..
5420. గంపెడు ఆనందం నా సొంతమయ్యింది..నీ గుప్పేదు జ్ఞాపకాల్లో నేనుండబట్టి..
5421. ఆసాంతం నీలో కొలువై నేనుంటా..ప్రేమగా రమ్మనొకసారి పిలిచావంటే..
5422. ప్రతిపూటా పరవశమే..నువ్వే నేనైన పండుగను తలపిస్తుంటే..
5423. ఎందుకో ఇంత విషాదం..కొన్ని జ్ఞాపకాలు మనసైనవైనా కూడా..
5424. ఉలిక్కిపడుతున్న నిజాలు..భయపెడుతుంటే అబద్దాలు..
5425. స్నేహ పరిమళమో ఆహ్లాదం..సంపెంగలు చేరువైన మధురభావం..!
5426. కలానికీ తొందరెక్కువైంది..కాలాన్ని రాసేయాలనే ఆరాటంలో..
5427. అక్షరం ఆత్మానందమే..మదిలో భావాన్ని నలుగురికీ పంచేందుకు..
5428. మేఘం వర్షించినప్పుడే అనుకున్నా..మోసేందుకింకేం మిగిలుండదని..
5429. జారలేక దాగినట్టుంది కన్నీరు..నా అస్తిత్వాన్ని కాపాడాలని..
5430. కాటుక నలుపులో తళుకులు దాచా..నవ్వినట్లుండే కళ్ళను చదువుతున్నారని..
5431. మనసుకి చేస్తున్నా అభివాదం..మౌనరహస్యాన్ని మోస్తుందని..
5432. పన్నీరై పరిమళిస్తోంది మనసు..కనులు కన్నీటిని జార్చేసినందుకే..
5433. నీ పెదవినాలకిస్తూ నా మది..ఏం మాయ చేసిందో మరి..
5434. చెక్కిలిపై సంతకాన్ని తడుముకున్నా..నీ మనసేమైనా తాకగలనేమోనని..
5435. రాధా బాధితుడు మాధవుడేగా..అతని మనసునూపేపే తలపు ఆమేగా..
5436. అందం రెట్టింపయ్యింది..అద్దం నన్ను జాబిల్లిగా చూపాక..
5437. నేలచూపులు చూస్తూ నెలరాజు..తనకోసం వేచున్న కలువలను కరిగించేందుకు..
5438. మనసెప్పుడూ ఎడారే..తనలోని తడినంతా కన్నులకు ధారపోసి..
5439. మరపురానివే ఆ జ్ఞాపకాలు..మనసులో పదిలమై మురిపిస్తుంటే..
5440. పిల్లగాలినై పెనవేస్తున్నా..ప్రకృతిని పలవరించావనే..
5441. తీర్పులన్నీ కాలానికొదిలేసా..బంధాల్లో నిట్టూర్పులొక్కటే మిగులుతుంటే..
5442. సప్తవర్ణాల ఇంద్రధనస్సుతో పోటీ..నిన్నాకర్షించాలని నా మది..
5443. కబుర్లు పరిమితమవ్వాలి..అపార్ధాలు సృష్టించుకోవద్దనుకుంటే..
5444. వెనుదిరిగి చూడాలనుకోలా..నీ చూపులకి చిక్కి ఆగిపోతాననే..
5445. నలుగుతూనే సార్ధకమవుతుంటాయి..మనసున్నవి పువ్వులంటే..
5445. చూపులతో మొదలయ్యిందనుకున్నా రణం..మనసులొక్కటై కలిసాయన్నది నిజం..
5446. కలనై కల్లోలం చేద్దామనుకున్నా..నీ కనులస్సలు మూతబడవే..
5447. క్షణాలకు తీరికలేనట్టుంది..దూరమైన మనసుల్ని దగ్గర చేసేందుకు..
5448. అమాసని సర్దుకుంటావనుకున్నా..వెన్నెలను వెతుకుతున్నావని తెలీక
5449. తెల్లారిందనుకోలా..కనులింకా కలల్లోనే తేలిపోతుంటే..
5450. మనసుకి దిక్కుతోచకుంది..వయసంతా వృధాగా కరుగుతున్నందుకు..
5451. నిమజ్జనమయ్యానని నిట్టూర్పులెందుకో..మదిలోకి చేరమన్నప్పుడు వాయిదాలేస్తూ..
5452. రాజీ చేసేస్తా నీ మనసుని..రాసులుగా నా సొగసు రాసిచ్చైనా..
5453. నా మౌనానికి మాటలు నేర్పాలనుకున్నా..నీ ఊసులనే వల్లిస్తుందని తెలీక..
5454. ఆనందం అందరికీ తెలిసేదే..విషాదం కనిపెట్టేది నువ్వొక్కడివే..
5455. స్వరాలు తారుమారవడం గుర్తించలేదు..నేనో స్వప్నాన్ని ఆలకిస్తున్నందుకేమో..
5456. నీకోసం పెంచిన తోటొకటి..పరిమళాన్ని మాత్రమందరికీ పంచుతోంది..
5457. తలపులకు తొందరెక్కువయ్యిందిలా..నిదురకు రమ్మంటూ కలల కంగారు..
5458. ఇంటికి దీపం కావాలంటారు..చమురు అందించకుండానే వెలగాలంటూ కొందరు..
5489. నా చూపు ఆకాశాన్ని తాకింది..నీ నవ్వులు నక్షత్రాలై విరబూస్తుంటే..
5490. గుండెలోని ఊసులే..కంటిలోని కలగా..
5491. మనసు కలపలేనంటావెందుకో..వద్దన్నా తలపునాక్రమిస్తూనే..
5492. గులాబీల వర్షమైనట్లేగా..ఆనందం పరిమళిస్తుందంటే..
5493. నేనొప్పుకుంటాను..అక్షరమో ఆయుధంతో సమానమని..
5494. నాలోని నన్ను దాచేస్తావెందుకో..నువ్వే పదుగురికీ కనబడేలా..
5495. స్మరించాల్సొస్తోంది నవ్వుని..బాధలు వెన్నంటుతుంటే..
5496. నిండు కుండలే నా కన్నులు..భావోద్వేగాలు నిండుకోవెప్పటికీ..
5497. ప్రపంచాన్ని చదవాలనిపించలా..నీ మదిలో నేనో కవితనయ్యాక..
5498. రెండో మాటతో పనేముందిలే..ముందువరసలో నన్ను స్వాగతించాక..
5499. నేనేగా నీ అక్షరం..నువ్వు కలమంటూ పట్టాక..
5500. నీ తలపు చల్లదనం..మనసుకందిందిగా కోరుకున్న ఔషదం..

No comments:
Post a Comment