301. స్వరాల శ్వాస ఆగింది_నీ సరిగమల స్థానాలను లెక్కించలేక..
302. మదికి చేరిన చెమరింపు_కన్నులను నువ్వు లక్ష్యపెట్టలేదని..
303. చెలి కమ్మని ఊహనే నేనడిగా_చెలికాని చల్లని చూపుల చొరవెంతో..
304. సరికొత్తగా రాయడం మొదలెట్టా_కొత్తవత్సరం నిరాశను మింగేస్తుందనాశిస్తూ..
305. వసంతాన్ని విడువలేనుగా_శిశిరమై రాలినా మరోమారు చిగురిద్దామని..
306. మావి చివురుగా మారానందుకే_కోయిలవై కొరుక్కుతింటావనే..
307. మరువమై తోడైపోనా_మల్లెలకు మరికొంత మత్తునద్దుతూ..
308. ఆధారమైపోవా_నిన్ను వీడకుండా ఉండేందుకు..
309. ఆశలు సైతం చిగురించినవి_వసంతమటి నువ్వు గుర్తొచ్చినంతనే..
310. ఎంత సొగసో సోయగానికి_నీవొక్కసారి అల్లుకుంటానని మాటివ్వగానే
311. సున్నితమంటే నాకిష్టమే_సింధూరమంటి అంబరాన్ని హత్తుకుంటూ..
312. ఎన్ని సెగలో గ్రీష్మానికి_మన కలయికను చూసి ఓర్వలేకేమో..
313. అడ్డదారిలో వస్తావనుకోలేదు_అందానికి సంకెళ్ళేసేందుకు..
314. వానకారు కోయిలని ఆనాడే గమనించా_నీకో మేఘ సందేశం మోసుకొస్తోందని..
315. అంకురిస్తావనే ఎదురుచూస్తున్నా_వృక్షమైతే నీ నీడన సేద తీరాలని..
316. గోధూళివేళకై ఎదురుచూస్తున్నా_సంధ్యారాగం సింధూరాన్ని దగ్గర చేస్తుందని..
317. కరిగిపోయా కర్పూరమై_నీ నిరీక్షణలో సంధ్యలు చీకట్లవుతుంటే..
318. ఎన్ని భావాలు దాచుకోవాలో_మెరుపంటి నువ్వు కనిపెట్టరాదంటే..
319. వేకువనైనా వేచుంటా_మాట తప్పక నువ్వొస్తానంటే..
320. మనసు చదివింది చాలదా_పుస్తకాన్ని చదివే తీరిక లేదుగా..
321. నిర్వచించడం మానేసా ప్రేమను_అపార్ధాలెక్కువై అర్ధం మారిపోతుందని..
322. శిశిరాన్ని రావొద్దంటున్నా_వసంతానికి ముందు చోటిస్తే కొత్తగా స్నేహిద్దామని..
323. ఎన్ని ఒయారాలో అక్షరాలకి_అలకనందను రాసినప్పుడు నేర్చుకున్నవేమో..
324. నిత్యవసంతమెప్పుడూ నావెంటేగా_హేమంత శిశిరాలెంత చేరువగా చేరినా..
325. అలుకనిస్తావెందుకు అక్షరాలకి_ఆనందాన్ని అలలతో పోల్చి..
326. ప్రతి తారా వెలగాలనే చూస్తుంది_ధృవతారగా నిలవాలని ఏక్తారలో..
327. అర్ధాలను విడిచిపెట్టేసా_నా ఆనందానికి నిర్వచనం నువ్వయ్యావనే
328. అతివకెన్ని అందాలో_అలుకను మోములో దాచుకుంటే..
329. మనోవనమెంత నిండిందో_ప్రతికొమ్మా సుమాలను పూయిస్తుంటే..
330. సిగ్గొచ్చి చేరింది బుగ్గల్లో_వధువంటూ అలంకారాలు నువ్వు మొదలెడితే..
331. మందారాలందుకు చిన్నబుచ్చుతావో_కెంపులను నా బుగ్గలకు పూసి..
332. నానార్ధాల జోలికి పోలేదందుకే_నీ మనసెప్పుడో అర్ధమయ్యిందనే..
333. అక్షరాలకెంత పరవశమో_ముకుళించే సుమాలను రాసి మెప్పించేందుకు..
334. మనసు దాహమెంత మెలిక తిరిగిందో_నువ్వొచ్చి నీరిచ్చేంతవరకూ..
335. అత్తరును మరిపిస్తున్న గుభాళింపులు_ఏక్తార వెలుగులో దాగున్నవేమో..
336. చెక్కిలి సొట్టలకు మంటేస్తావెందుకో_కెంపులు దాచి నునుపును దోచేస్తూ..
337. క్షణాలకెంత విస్తుబాటో_నిరీక్షణలోనూ నన్నే తలిచావని తెలిసి..
338. గీత గీసినా గిలిగింతవుతోంది_కుంచెగా మారిన నా కలం మహిమేమో..
339. హేమంతాన్ని వీడలేనంది మది_శిశిరానికింకా సమయముందనే..
340. పున్నమై కౌగిలించానందుకే_వెచ్చదనాలు నీకు కానుకివ్వాలని..
341. నొప్పించని నా అక్షరాలు_కేవలం ఆనందాలనే అందించాలనే ఆశయంలో..
342. గులాబీలను రమ్మని కబురెట్టా_నీ పెదవులతో బుగ్గలను రాసుకోవచ్చని తెలీక..
343. ఎన్నళ్ళని చదవాలో మనసులను_చెలిమయాక చేయూతగానుండక..
344. చిక్కుముళ్ళకి చింతలెందుకులే_చలికాలానికి వెచ్చగా కంబళయ్యిందని మురిసిపోక..
345. అద్దాలను వెతుకకు చీకటిలో_మనసును నమ్ముకుంటే చాలని చెప్తుంటే..
346. కోయిలలెప్పుడొచ్చయో తారాలోకంలోకి_వెల్లువలై మదిని తీపి చేసేస్తూ..
347. నేనే కోకిలను కానా_వసంతమై నువ్వు పిలుపిస్తానంటే..
348. ఓరిమి నేర్పుతున్న హేమంతం_తెల్లవారగానే ఉదయమైపోదంటూ..
349. చల్లదనాన్ని మరిపిస్తున్న కోయిలలు_కొమ్మకొమ్మకీ పూసిన హేమంతంలో..
350. నవాంశగా చేరమని నిన్నడుగుతున్నా_నాతో చేయి కలిపి దగ్గరవుతావని..
351. మరలిపోవాలి బాధలే_వికసించే భావపుష్పాలను ఆఘ్రాణించి..
352. పాపలా పారాడే అక్షరాలు_అల్లరి అల్లికలతో మదిని కమ్ముకుంటూ..
353. అలలు ముంచితేనేముందిలే_కెరటాలను చేరదీసే ఒడ్డొకటుందిగా
354. చిలిపి యుగళాన్ని అంకితమిస్తా_నా తలపుల్లోనే పదిలమవుతానంటే..
355. మల్లె మకరందమైంది_చెలి నాసికనే కాక అధరాలను విచ్చేలా చేసిందంటే..
356. వావిరిపువ్వుల వానలు కురవాలేమో_నీకు అక్షరాల వెచ్చదనం కప్పాలంటే..
357. స్వరాలు సప్తమై ఉంటేనేమి_అర్చన చేసేయవా రాగాలై అల్లుకొని..
358. అలలా వచ్చీపోయే బాధలే అన్నీ_చేరదీయక నిలబడిపోతే చాలనుకుంటే..
359. అవగతమయ్యిందిలే స్వగతం_నా గతానికి గమ్యమవుతానంటూ నీవొస్తే..
360. చినుకుగానే కురిసాననుకున్నా_నువ్వు తడవడానికొచ్చావని తెలియక..
361. వర్తమానన్నే అనుసరిస్తున్నా_భవిష్యత్తుల్లో దిగులుండకూడదని..
362. పదునెందుకులే అక్షరాలకి_సానబెట్టే గంధపు భావాలుండగా..
363. లేపనాలొద్దనుకున్నా గతానికి_మరకైనా మంచే జరిగిందని..
364. గుభాళింపునే గుర్తుంచుకోమంటున్నా_అరగదీసే రోదనను రాల్చుకుంటూనే..
365. సప్తవర్ణాలూ సరిపోవంటున్నా_మరిన్ని రంగులతో నువ్వు మెరవాలనే..
366. సాహసమేనేమో నాది_ప్రతి కలనూ రాసేయాలని చూస్తుంటే..
367. నీ నిజాయితీకొచ్చిన లోటేముందిలే_నమ్ముకున్న సూత్రానికి కట్టుబడగా..
368. తాపం తీరిన దేహమైంది_నా దాహం నీకు చెప్పుకున్నందుకే..
369. కురులను మోహించినప్పుడే అనుకున్నా_విరులను ఆస్వాదించి ఉంటావని..
370. కలలన్నింటినీ కలగలిపేసా_హరివిల్లును చూడాలన్నావని..
371. ప్రోత్సాహమైపోయా నేనే_నీలో ఉత్సాహాన్ని నింపే ఉత్తేజమై..
372. విరహమైన విరిగా మారిపోయా_నన్నో స్మృతిగా స్వీకరించావనే..
373. పగటికలనే మురిసిపోతున్నా_తప్పక నిజమయ్యే అవకాశముందని..
374. తారలని అనుకరిసున్న సుమాన్నేగా_మెరుపులతోనూ పరిమళించాలని..
375. పరుగు మొదలెట్టానందుకే_కలను అనుసరించాలనే
376. వెన్నెలపాటని రాయాలని కూర్చున్నా_నీవే వెలుతురై వస్తావని తెలియక..
377. కలవరపెడుతున్న కల ఒకటి_మాటలన్నీ మౌనానికి దాసోహమయినట్టు..
378. భావానికి ఆజ్యం పోస్తున్నా_నువ్వు ఆవహించి రాయిస్తున్నావనే..
379. ఎన్ని తారలు ఏకం కావాలో_నీవు పంచే వెలుగును నేనాస్వాదించాలంటే..
380. అనుబంధాన్ని నీరాజనమిస్తున్నా_బంధానికి విలువిచ్చావనే..
381. స్వేచ్ఛాలోకంలోకి ఎగిరిపోవాలనుకున్నా_నీ కన్నీటిలో తడిచి కరిగిపోరాదనే..
382. శృతులై నర్తిస్తున్న ఆనందాలు_నాలో నువ్వొచ్చి లయమైన భావనలో..
383. నిరాశకు నీరొదిలేసా_ఆశావాదాన్ని వత్సరంతో పాటుగా ఆహ్వానిస్తూ..
384. నివురుగప్పిన నిరాశలు_ఏ కాలంలో బయటపడాలో తెలీక..
385. పల్లవికి ప్రాణం పోసాను_అనుపల్లవి వెంటబడి రావాలనే..
386. జాబిల్లి నువ్వంటే ఒప్పుకుంటా_ఆకాశం నాకు తారగా అవకాశమిచ్చినందుకు..
387. వెన్నెల్లో వెతుకుతావెందుకో_వెలుతురిచ్చిం ది నేనేనని గుర్తించక..
388. మంగళకరమైనవే మన క్షణాలు_రాహువొచ్చి కాలు పెట్టనంతవరకూ..
389. తీయగా ఉంటావని ఊహించలేదసలు_ప్రేమకి తేనెరుచి ఉంటుందని..
390. సంతోషసాగరమే జీవితం_సాగరసంగమం నీతో అయ్యుంటే..
391. పండుగన్నదే మరచిపోతున్నా_నిత్యానందంలో నే మునిగిపోతుంటే..
392. ఋతువుల గతి మారిపోతోంది_అమాసల్లేని రాతిరిని చుట్టబెడుతూ..
393. పిండారబోసిందనుకున్నా వెన్నెల_ వెలుతురుకుప్పగా మారావని తెలియక..
394. ఊపిరి వేణువులూదుతున్నా_నా తలపును రాగమయం చేసేద్దామని..
395. శిశిరమూ తలవంచింది_రాలిపోని ఆశలతోనే జీవిచడం నేర్పావని..
396. మధువనాన్ని తలపిస్తావు_నీరెండలో అలసిపోయి నే కూర్చున్నా..
397. హేమంతంలో చేరానందుకే_శీతలంలోని ఆనందమూ నీకు చూపించాలనే
398. రెక్కలొచ్చింది ఈరోజే మరి_రేపటికి ఎగిరే ధైర్యమిచ్చింది..
399. మెళకువలు నేర్పింది నువ్వేగా_దిగుళ్ళను దిగదుడిచేయమని సలహాలిచ్చి..
400. ఐదుమాసాలయ్యాక మరలొస్తుందేమో_ఈలోపు శిశిరానికి చోటివ్వలేనని..

387. వెన్నెల్లో వెతుకుతావెందుకో_వెలుతురిచ్చిం

No comments:
Post a Comment