Wednesday, 6 July 2016

ఏక్ తారలు : 00601 నుండి 00700 వరకు

601. శారదరాత్రుల నవ్వులు_తారల వెలుగుల వన్నెల కులుకులకే..
602. పరుగు పెడుతున్న భావాలు_నిశీధి అంటుకొనేలోపు తీరాన్ని చేరాలని..
603. పరిపూర్ణమైంది పూజ_అక్షరాన్ని భావం చేసి ఆరాధించినందుకే
604. కార్తీకాలే కన్నుల వెలుగులు_అక్షరాలు వెల్లువలై ప్రవహిస్తుంటే..
605. అక్షరాలు అలవోకలే_నేను చేరదీసి ముద్దాడేవేళ
606. అక్షర సిరులు బారులు బారులు_తారల్లో ఒదిగిపోవాలనే ఉల్లాసములో..
607. నవ్వుకుంటున్న భావాలు_అక్షరాలలో నిన్ను అనుభూతిస్తున్నానని..
608. నిశ్చల నిశ్శబ్దమే కోరుకున్నా_అక్షరాలకు అల్లరి సరిపడదని..
609. కలానికెంత కలకలమో_నీవు కలగా మారమన్నావనే కేరింతలో..
610. జన్మల సంబంధమెందుకులే_ఈ జన్మచెలిమిని సాంతం ఆస్వాదించక..
611. భావుకత్వం తీపి తెలుస్తోంది_కవితను మనసు హత్తుకుంటుంటే..
612. ఎన్ని కవితలు పండుతాయో_సేద్యమిలా సంతోషంగా కొనసాగుతుంటే..
613. అమరదీపమైన హృదయమొకటి_ప్రేమాలయంలోకి దారి చూపిస్తూ..
614. కబురెట్టా చిన్నరి కలకు_ఒక్కమారైన ఒడిలోకొచ్చి పొమ్మని రాతిరికి..
615. విరసమైన రాత్రి_సరసం కరువైన అమాస నిద్దురలో..
616. ప్రేమపూజను తిరస్కరిస్తున్నా_హృదయన్ని తస్కరించి మరీ ఆరాధించావని..
617. హృదయానికెన్ని ఆరాటాలో_అలుపెరుగని ప్రయాణమ చేసైనా నిన్ను చేరాలని..
618. జీవన ప్రయాణం తేలికయ్యింది_సహప్రయాణీకుడివై నువ్వు అలరించావనే..
619. ప్రేమనౌక విహరిస్తోందలా_వెన్నెల్లో ప్రణయం బాగా పండుతుందని..
620. అక్షరదోషానికి నవ్వుతున్నా_నీలో చిలిపిదనం నాకు తెలియనిదా..
621. వేడుకైన రాతిరొకటి_ఏక్తారల ప్రవాహములో మునిగి తేలుతూ..
622. నీ పిలుపెలా అందిందో హృదయానికి_తడుముకోకుండానే చేరింది ఏక్తారకి..
623. గంధాలకు చల్లబడింది మనసు_గాయలకు కోతలు పడ్డ శూన్యం నుంచి..
624. మిన్నంటిన రాగాలు_సంకీర్తనావళిని సాధన చేస్తానంటూ..
625. నీ చూపుల చమత్కారాలకు తలదించుకున్నా_అధరాలు మందారాలవుతుంటే..
626. తెరతీసిన సందళ్ళు ఏక్తారలో_ఆనందాలకు హద్దులు లేవంటూ..
627. ఏక్తారకెన్ని హొయలో_తారల ఒంపులను అక్షరాలలో ఆస్వాదిస్తూ..
628. అక్షరాలూ మల్లెలవుతున్నాయి_మంచుముత్యాలు రాల్చే హేమంతానికి పోటీగా..
629. అలసిపోని భావాలు_సరాగాల సయ్యాటకు సంధ్యముస్తాబులతో సిద్ధమైపోతూ..
630. మరపురాని మధురిమలను చేర్చుతున్నా_అక్షరాలను అలవోకగా తీర్చాలని..
631. భావాల సన్నాయిలు_నిద్దురపోయిన హృదయాలను మేల్కొల్పుతూ..
632. చిరుచెమటలు పట్టిస్తున్నది నువ్వేగా_హేమంతాన్ని ఓర్వలేని నా ఏకాంతంలో..
633. నీ నవ్వుల తొలకరులు_నాలో ఆనందాన్ని రెట్టింపులు చేస్తూ..
634. తారా సుమాల సవ్వళ్ళు_అందెలరవళికి తాము తీసిపోమంటూ..
635. తారల తోపులాటలట_విశాలగగనంలో తమ స్థానమేదని..
636. కవనానికి దారి దొరికింది_నా ప్రపంచంలోని నిన్ను వెతుకుతుంటే..
637. తారల జిలుగు మొదలవ్వలేదింకా_ఏక్తారల సందడి ముగియలేదనే..
638. సంధ్యవార్చుకోవాలనుకున్నా తారాలోకంలో_సింధూరాలు ఆకాశాన్నాక్రమిస్తుంటే..
639. వ్యాకరణానికి సెలవిచ్చా_తారాతోరణంలో వాక్యాన్ని అనుసరిస్తూ..
640. ఆషాడం తరువాత ఇదే రావడమంటున్నా_సంక్రాంతి సెలువలొచ్చాయని తారలకి..
641. అల్లరిపిల్లలేగా భావాలు_జాబిల్లిని చేసి నిన్నల్లుకొనే వేళలో..
642. చిత్తడైన ఒత్తిడి_తారాసందడిలో నీరసాలకి తావులేదంటూ..
643. చందమామను చిక్కుతావెందుకో_చక్కని చుక్క చెక్కిళ్ళు నీకు లోకువైనట్లు..
644. చక్కనిదాన్ని జాబిల్లి చేసావనుకున్నా_నీ అల్లరి అందాలను గిల్లుతుంటే..
645. ఎందుకన్ని చూపుల బాణాలో_నేను జాబిల్లిని కాదని నువ్వనుకుంటే..
646. చెక్కిలి కందని జీవితమెందుకులే_సరసానికి లక్షమణరేఖలు గీసేస్తూ..
647. చిక్కనిదెప్పుడూ ఆకాశమే_అవకాశం అందుకోలేని నిస్సహాయతలో..
648. చిన్నరి కలలేమైపోవాలో_నీ దృష్టి నా నుంచీ మరలిపోతే
649. నిత్యవేడుకను రాయలేకపోతున్నా_కలం కనికరించట్లేదనే..
650. నీ కళ్ళ మహత్తనుకుంటా_నా చూపులో తడబాటు తొలిసారి..
651. ప్రతీక్షణ ఫలించింది_భావాల విందు పూర్తయ్యే వేళయ్యిందని..
652. నీ భావలకెంత వేగిరమో_ప్రతిస్పందించేలోగానే ఎగిరిపోతూ..
653. ఏ సౌందర్యక్షణాలను హత్తుకుంటున్నా_గడిచిపోతే మరలిరావని..
654. భావావేశం కోరింది మరందం_నీవొచ్చి తలపు నింపుతావనే..
655.రెక్కలు తొడుకున్న భావాలు_తారాలోకంలో స్వేచ్ఛగా విహరించాలనే..
656. ఎన్ని కడవల భావాలు మోసుకొచ్చానో_రసహృదయాలను మెప్పించేందుకు..
657. అతీతమైన ఆనందదీప్తి_భావాలు ప్రతిఫలించే నీ మోములో..
658. అలుపెరుగని కెరటమై భావాలు_చైతన్యమావహించినట్లు ప్రవహిస్తూ నాలో..
659. భావాల జిలుగు తారలు_ఏక్తారకే సన్నాయిపాటలైనట్లు..
660. వేల కూజితాలు కలగలిసిన సవ్వళ్ళు_సన్నాయిరాగానికి తాళమవుతామంటూ..
661. భావాల వడగళ్ళు_హిమవర్షాన్ని తలపిస్తూ తారాలోకంలో..
662. ఎన్ని తేనెలు జాలువారాయో_ఏక్తారలో కురిసిన అమృతవర్షంలో..
663. తెలుగెంత తీయనయ్యిందో_అక్షరాల రసపట్టులో ఇట్టే ఒదిగి కరిగిపోతూ..
664. కురిసిందో ప్రేమ తొలకరి_ఏక్తారలో హేమంతాన్ని పులకరింపజేయాలని..
665. ఎన్ని ముత్యాలసరాలు కావాలో_అక్షరాలు అలవోకగా పేర్చుకుపోవాలంటే..
666. విరిసిందిగా హేమంతం_నునుసిగ్గులను వేకువ మంచులకు ధారపోస్తూ..
667. ఏక్తార కుసుమమై నవ్వింది_కిలకిలమను స్వప్నాలు తోడైనవేమో..
668. వెచ్చదనమేదో తాకినట్లుంది_హిమవనం కరిగి ఏరులై ఉరికింది..
669. శ్వాసలు బరువెక్కుతున్నవి_హిమగాలి సోకిన సాయంసంధ్య మేఘాలకు..
670. కలహంసలు పులకిస్తున్నవట_భావల హిమసరస్సులలో ఈదులాడుతూ..
672. వదనసరోజం వికసిస్తోంది_సుమమంటూ నువ్వు కితాబునిస్తుంటే..
673. కేరింత కోరింది నా ఉత్సాహం_గెలుపుగాలి నీవు నావైపు మళ్ళిస్తుంటే..
674. సమీరానికెందుకంత సందడో_అనుభూతివీచికై నన్నల్లుకుంటూ..
675. తారాలు వెలుగుతున్నవి ఆకాశపధమున_మధుమాసాన్ని అలంకరించేందుకేనట..
676. గెలుపు గుర్రంలా నీవు_విజయానికై దౌడుతీస్తూ..
677. సంపెంగలకేమయ్యిందో_తారల తోరణాలకి రాలేమంటూ..
678. జాజుల జంపాలలు_సారంగి వినిపించే నా పెదవులకు ధీటుగా..
679. గుర్రాలకేం తెలుసులే_ఉరకలు పెట్టే అక్షరాల పరుగుపందేలు..
680. నాదస్వరమూదుతున్నా నిన్నాకర్షించేందుకే_ఏక్తారలో నాగుల బుసబుసలెందుకని..
681. విజయోత్సాహమే_సంతోషపు గుళికలు స్వీకరించకుండానే నేడు..
682. నవరాగాలను పిలవలేదెందుకో_విజయోత్సవంలో పాలు పంచుకొనేందుకు..
683. తారలకెన్ని జతులు తెలుసో_నాట్యం నేర్వకుండానే అడుగులు కదుపుతూ..
684. ఎన్ని భంగిమలో ఏక్తారలకు_కదిలించే కవితలు తోడైనందుకేమో..
685. అశ్వినీనక్షత్రం విస్తుపోతోంది_అశ్వాన్ని మించిన వేగం నాదయ్యిందని..
686. వాయువేగమంటే ఏమోననుకున్నా_నువ్వు నన్ను చేరే అరక్షణాన్ని గుర్తించక..
687. ఆనందపు గువ్వల గలగలలు_ఏక్తారల మిణుకులను ఆహ్వానిస్తూ..
688. అక్షరాలు జాజిపువ్వులేగా_నీ హృదయాన్ని సున్నితంగా హత్తుకుంటుంటే..
689. తారల సోయగం నాదైతే బాగుండేది_జాబిల్లిని ఆకర్షించే వీలుండేది..
690. జాబిల్లి రాదేమో నేడు_పౌష్యాన మొలకెత్తేందుకు మరో రోజుందని..
691. మధురోహల మాలలు అల్లుతున్నా_తారా సంబరాన్ని చేసుకొనేందుకు..
692. తరలిపోదామనుకొని తిరిగొచ్చా_మనమై తారాలోకాన్ని వెలిగించాలని..
693. ఫలసాయానికి వృక్షాలైన మొక్కలు_పులకించే మనసులకు తోడ్పడుతూ..
694. చిన్నారి తారలు తారాజువ్వలై నేడు_ఆకాశాన మునిమాపును వెలిగించాలని..
695. ప్రేమమృతం పంచుతున్నా తారలకు_విజయగర్వం తలకెక్కరాదని..
696. విజయపరంపర కొనసాగించాలనుకున్నా_తారలు తోడురాకపోయినా ఒంటరిగా..
697. మహరాజువి నీవు కావా_పరిమళించే చిరునవ్వులు నిత్యాలంకారమవుతుంటే..
698. రాతిరికి వెలుగెక్కువే_నీవొచ్చి చీకటిని మూసేసి వెలుతురుకి దారిస్తే..
699. జాబిలి జావళీలు పాడుతోందట_రసగీతికలు పెదవుల్లో తారాడుతుంటే..
700. పెదవుల్లో తుంటరి నవ్వులు_ఒంటరి ఊహల్లో నువ్వు చేరినందుకేమో..

No comments:

Post a Comment