Wednesday, 6 July 2016

ఏక్ తారలు : 01501 నుండి 01600 వరకు

1501. నా కనుపాపలకెందుకో సైగలు_నీ చూపులు తడిమినంతలోనే..
1502. ఆశువుగా జారిపోతున్న అశ్రువులు_మనసు ఆపలేని వేదనైనందుకే..
1503. గొలుసుకట్టుగా ఆరాధనలు_రేయింబవళ్ళు నీ అనుగ్రహం కోసమే..
1504. ఒక్కోసారి కన్నీరంతే_తుడుచుకొనేలోపే వరదలైపోతూ..
1505. కన్నుల భాష నేర్చేసాను_నీకిచ్చిన బాసలు గుర్తుకు రాగానే
1506. నీ పిలుపుతో వలపయ్యింది_నా గెలుపు నువ్విచ్చిందేనని..
1507. సుముఖమై నేనొచ్చేసా_నన్ను కలవరించే నీవు పిలిచినందుకే
1508. నన్ను నీలో కనుగొన్నా_నీదే ఆరాధనని తెలిసాక..
1509. ఊగిసలాడుతున్న ఊపిరులు_నీ శ్వాసలోని పరిమళాలు నన్నంటగానే
1510. ఆనందం చేదయ్యింది_నన్ను కాదని నీరై జారిపోయావని..
1511. మౌనం రవళించింది_గాలితరంగాలు నీ ఊసులు మోసుకొచ్చినందుకే..
1512. అనునయాలతో గడుస్తున్న పొద్దు_నీ అలుకలనే సాధించుకుంటూ..
1513. ఆరడుగులే లెక్క తేలుతున్నాయెందుకో_ఏడోఅడుగు దగ్గర మనసాగిపోతుంటే..
1514. కోయిలవై కూసినప్పుడే కనుగొన్నా_నాకై మనస్ఫూర్తిగా స్పందించావని..
1515. కాశ్మీరాన్ని కలలో రమ్మన్నా_మనసు వేడెక్కి కరిగిపోనుందనే..
1516.  మకరందాల వింతగంధాలు_ఉగాదిపాయసాన్ని పరిమళభరితం చేసేస్తూ..
1517. ఉగాదులన్నీ మనసులోనే_దుర్ముఖినని వాస్తవం వెక్కిరిస్తుంటే
1518. మావిచిగురు మేసినట్టుంది మనసంతా_కోయిలమ్మై కూస్తున్నా పగలంతా
1519. కాదని పోలేవుగా నన్ను_నీ ప్రేరణే నేనయ్యాక.
1520. గెలవాలనే అనుకున్నా_ఒక్కసారన్నా మనసు మాట నిజంచేద్దామని..
1521.
మదికెప్పుడూ వరదలేగా_చినుకైన గతాన్ని ఒడిసిపట్టాలని చూసినప్పుడల్లా..
1522. మనసు ఓడిపోమని చెప్తుంది_తననే గెలిపించమంటూ
1523. ఓటమి కూడా సుఖమేనేమో_మనవారిని గెలిపించిన ఆనందంలో..
1524. కొన్ని భావాలలా రూపు దిద్దుకుంటాయి_వాగ్దేవికి నీరజనమిచ్చేందుకే..
1525. తన గెలుపు నాదనుకున్నా_ఆ మనసూ నాదేననే..
1526. చందమామని మందాకినితో కలిపి పాడినందుకేమో_ఒయారం నాకబ్బింది..
1527. మనసెప్పుడో మైనమై కరిగింది_వసంతంలో గ్రీష్మమంటి తన మాటలకి..
1528. మందాకినికి ముచ్చెమటలెందుకో_నేనున్నది కిన్నెరసాని వంకనైతే
1529. విశ్వనాధుడలిగిందందుకే మరి_తనను కాదని కిన్నెరసాని నన్ను అనుకరిస్తోందని..
1530. వాగ్దేవి నీవై వరమిచ్చావుగా_అక్షరాలతో ఆటలాడేందుకు అనుమతిస్తూ..
1531. అక్షరాలకెన్ని సోయగాలో_నన్ను వర్ణించిన ఆనందంలో..
1532. తొలి కోయిల కూసినట్లనిపిస్తోంది_నీ స్వరాలను గాలి మోసుకొస్తుంటే
1533. అన్నీ కత్తిపోట్లే గుండెల్లో_నన్ను గుచ్చిన ఒక్కోమాటలవి..
1534. నిత్యవసంతంలా మది_నా ఆశలన్నీ పచ్చదనాన్ని ప్రకటిస్తుంటే..
1535. నీ పిలుపొక్కటే చాలు_నన్ను పరుగు పెట్టించేందుకు..
1536. ఉగాదులెన్నొస్తేనేమి_గాయాలతో ఉషస్సన్నదే లేదుగా జీవితానికి..
1537. గులాబీలు దాక్కున్నాయేమో నా నవ్వులో_నిన్నొక్కసారి మంత్రించేందుకు..
1538. నా శ్వాస బరువయ్యింది_ధ్యానంలోనూ నీపైనే మనసవుతుంటే..

1539. గ్రీష్మమప్పుడే ఎందుకొచ్చిందో_వసంతాన్ని పూర్తిగా అనుభవించకుండానే..
1540. గ్రీష్మపత్రాలై రాలుతున్న ఆశలు_శిశిరాన్ని తలచుకున్న కొద్దీ
1541. గ్రీష్మంలోనూ సౌందర్యం చూస్తున్నా_నీ తలపుల పచ్చదనం వల్లనే..
1542. గ్రీష్మంలా వెలువడుతున్న శ్వాసలు_నీ ఊపిరందని విరహానికే
1543. మనసవుతున్న గ్రీష్మం_మల్లెగాలితో నీ ఊసులు మమేకమైనందుకే
1544. గ్రీష్మమెక్కడ గుర్తుందని_నువ్వూ మల్లెలూ నా తోడయ్యాక..
1545. వసంతరాగాల కువకువలు_గ్రీష్మానికి ఆరోహణలై అధిగమిస్తూ..
1546. ఆనందం మానసికమయ్యింది_గ్రీష్మమొచ్చినా మల్లియలున్నాయని..
1547.  కవితా గ్రీష్మమట_కవనవనంలో రసహృదయాలను సేదతీరుస్తూ..
1548. స్వప్నం బృందావనాన్ని తలపిస్తుంది_వాస్తవం గ్రీష్మంలోనికి తరిమేస్తుంటే..
1549. విజయం వరించేసిందిగా_నీ గెలుపులో మలుపును నేనైనందుకు..
1550. జీవితం వ్యర్ధమైనట్లుంది_నువ్వేడిపించినా ఆ ఒక్క క్షణమే..
1551. వర్షాకాలం కోసమే ఎదురుచూస్తున్నా_గ్రీష్మానికి విత్తులంటే లోకువని..
1552. మరో ప్రహసనం మొదలవుతుందేమో_కొంగొత్త పాఠాలతో నువ్వలరిస్తుంటే
1553. సౌందర్యాన్ని రాయద్దన్నానా_అక్షరాలు గుభాళించి గుట్టు విప్పేస్తాయని..
1554. నీ కనుసైగలో భావాల సోయగం_మరిన్ని అందాలు సంతరించుకుంటూ..
1555. నువ్వు పంచిన ప్రేమేగానది_నాలో విరహంగా సంచరిస్తూ..
1556. హేమంతంలోనే ఉండిపోతావెందుకో_వసంతమొచ్చి రమ్మంటున్నా..
1557. చిగురించే వేళవుతుందిలే_నీ తలపులు కాస్త నాటుకోగానే..
1558. మావికొమ్మల ఎదురుచూపులు_కోయిలవై నువ్వారగించేందుకొస్తావనే
1559. పెదవుల్లోనూ నువ్వే_నా నవ్వులన్నింటిలో చల్లగా చేరిపోయి..
1560. పరవశమైతే చాలనుకున్నా_పులకింతలు కూడా పరిమళిస్తాయని తెలీక..
1561. చీకటి విలువప్పుడే తెలిసింది_విశ్రాంతి కావాలని తనువు కోరినప్పుడే..
1562. ప్రత్యేకత పెరిగిపోయింది_అందరితో కలగలిసి కూడినందుకే
1563. అక్షరాలే ఆత్మీయులు_లక్షలు కలిసినా ఇవ్వలేని ఆనందాలలో..
1564. కాలాన్ని బ్రతిమాలుతున్నా_మరోసారి అవకాశముంటే వెనక్కు మళ్ళమంటూ..
1565. మౌనానికి మౌనం కూడిన_మాటగా మారునా..
1566. మనసుకే శిక్షంతా_వయసొచ్చినా బుద్ధిరాలేదని..
1567. జీవితకాలం దూరం పెరిగినట్లుంటుంది_నువ్వొక్కసారి స్పందించలేకుంటే.
1568. వేరే జీవితమెందుకు_నీ నవ్వులే నీరెండలై సాంత్వనిచ్చేస్తుంటే..
1569. అమ్మకి మాత్రమే తెలుసనుకుంటా_పగిలిన హృదయపు గాయాలు... 
1570. శిల్పం కాలేని శిలని_హృదయం బండరాయిగా మారిపోయాక..
1571. వేకువై తిరిగొచ్చా నీకై_అమాసవని నన్ను భ్రమిస్తుంటే..
1572. వెన్నెలై కురిసిన కవిత్వం_మదిలోని చీకట్లను తరిమేయాలనే..
1573. తరువుగా తరించాలి_పచ్చని ఆకులతోనే మొలకెత్తి జీవించాలంటే..
1574. గమ్యమెప్పుడో నిర్ధారించబడింది_పయనాన్ని మనం ఆస్వాదించడం లేదంతే...
1575. పువ్వులంటే ఇష్టమనప్పుడే చెప్పా..నీ  నవ్వులతో మెత్తగా నాకందిస్తావనే..
1576. ఎంత సంఘర్షణయ్యిందో మదిలో_నాకున్నది నీవడక్కుండానే పంచేందుకు..
1577. భావాల కావ్యాలు రాస్తున్నా_ఆక్షరాలు ఆసరా ఇచ్చాయనే..
1578. కాకలనిషాదంలో నేను_సహస్రావధానంలో నీవు..
1579. విజయం తేలికయ్యింది_ఓటమిని గుర్తించనందుకే..
1580. వలసపోతున్న జ్ఞాపకాలు_నీవొద్దని తిరగేసినందుకే..
1581. స్వాతిశయమెక్కువవుతోంది_నన్నలా ఆరాధిస్తూ నీవుంటుంటే.
1582. నీవెదురైనప్పుడే అనుకున్నాను_నాకిష్టమైంది అడక్కుండానే నువ్విస్తావని..
1583. నేల చూపులు చూస్తూ నిలబడిపోయా_ఎరుపెక్కిన పాదాలను దాచుకోలేక
1584. ఎన్ని యుగాలు దొరికితేనేమి_నీ సమక్షంలో క్షణాలుగా కరిగిపోతుంటే
1585. మరలిపోయిన చినుకులు_కాసినైనా మనసారా నేను దాచుకోలేదనే
1586. మరో కవనానికి సిద్ధమైపోయా_ఊహలన్నీ కలలో నిజమైపోతుంటే..
1587. మిళితమైపోయిన రాగాలు_నా పెదవుల్లో సంగీతమై ఒదిగిపోవాలనే
1588. వర్షంలోనే కన్నీటిని కలిపేసా_నేనేడిస్తే నువ్వు చూడలేవనే..
1589. ప్రతిపొద్దూ మధుమాసమే_నీ జ్ఞాపకాలలో నన్ను గుర్తించినందుకు..
1590. పులకరింతలిచ్చానందుకే_నీకో అనుభూతిని పంచివ్వాలనే
1591. కాలాన్ని కరిగిస్తున్నా_మదిలో జ్ఞాపకాలని మరింత హత్తుకుంటూ
1592. రాత్రికోసం ఎదురుచూడటం మానేసా_పగలు సైతం కలలోకొస్తున్నావని..
1593. కుసుమిస్తున్నా నీలో_జీవన రాజీవంలో పరిమళం కరువయ్యిందన్నావనే..
1594. వెనుకనుంచీ చదువుతావెందుకో_ముందుమాటలోనే నా ముచ్చట్లుండగా
1595. మధువంతా దాచుకుంటున్నా_నిన్ను కలసిన క్షణాలలో ఒంపుకోవాలనే
1596. ఉల్లాసపు సురగంగనే..నీకై ఉరకలెత్తి ప్రవహించే వేళ
1597. గెలుపంటే అతనిదే_ఇష్టానికి కొత్త అర్ధం ఇచ్చాడుగా
1598. మరలొచ్చేసా మదిలోకే_నీ నిశ్శబ్దస్వగతం ఆలకించినందుకే..
1599. నేనేగా ధృవతార_నీ మనసు నాకై ఆకాశమైతే.
1600. రాలిపడ్డ అశ్రువులు_నీరవంలో నీ స్వరాలు తిరిగిరావు గనకనే..

No comments:

Post a Comment