1101. హృదయంలో మొదలైన ప్రేమే_కంటిచూపులో చెమరింపునద్దుకు మెరుస్తోంది..
1102. రెప్పలసడి వినబడనే లేదు_నిన్నారాధించే గుండె గంటల చప్పుళ్ళలో..
1103. పరిమళిస్తున్న గంధాలు_నిన్ను తాకి పరవశించే అవకాశం తమకూ వచ్చిందని..
1104. రసస్పందనొకటి కలగాలి_హృదయంలో ప్రేమ పరిమళించాలంటే..
1105. ప్రేమింపబడే అర్హత కావాలేమో_ప్రేమించే హృదయమొకటి తారసపడినా మనకి..
1106. చిగురేసిందనుకున్నా తొలిప్రేమ_నా నవ్వు నీతో వెళ్ళిపోయినప్పుడే..
1107. ఇవ్వడమే తెలిసిన ప్రేమ నాది_తిరిగి తీసుకోవడం నీ ఇష్టమనుకుంటూ..
1108. ముసిరే మబ్బులోనూ ప్రేమను వెతుకినందుకేమో_చినుకై కురిసి నిరూపించుకుంది..
1109. ఆకాశమంత ప్రేమ_పగటిని సైతం రేయిగా మరిపిస్తూ..
1110. అందనంత ఆశ_ప్రేమలోకానికి ప్రయాణం అంత తేలిక కాదంటూ..
1111. చిగురాకుల గలగలలు_నీ ప్రేమ పిలుపులకి స్పందిస్తూ..
1112. పవిత్రమైపోయానప్పుడే_నిర్మాల్ యమని నన్ను పక్కకి పెట్టగానే..
1113. చీకటిపడితేనే నవ్వులు వికసించేది_పగలంతా నీ వియోగంలో..
1114. కలలు కనడం మానేయమన్నా_ప్రపంచాన్ని బొత్తిగా మరచిపోతున్నావనే..
1115. పరవశమైపోయా_ఒక్కసారి నీ పిలుపు వినబడగానే
1116. విశ్వప్రపంచం మనలోనే_ఒకరినొకరం కలగంటుంటే
1117. ఉషోదయం నవ్వుకుంటోంది_వెలుతురిచ్చిన నీ నయనాలు తిలకించి..
1118. కలం కదలనంటోంది_పాటకి నువ్వు ప్రేరణ కాలేదని
1119. సుపరిమళమే నీ ఊహల్లోనూ_సుమాలన్నీ తలలు వాల్చుకొనేలా
1120. చెలిమొక చేబదులే_మన సంతోషాలన్నీ స్నేహంతోనే ముడిపడుతూ..
1121. గోరింకనే తలచుకున్నా నేను_నీ కువకువలు వినబడుతుంటే
1122. మనసు విసుక్కుంటోంది_కంటి చివరి భాష్పంగా నీ చొరవేంటని..
1123. మోనాలిసా నవ్విందందుకే_నీ కౌగిలిలో నేనో నెలవంకనవుతుంటే..
1124. మేఘమాల వలపు గీతమట_ఆకులు రాల్చు శిశిరపత్రాల అల్లరిపాటలు
1125. ఎన్నిచుక్కలు లెక్కించానో_నీరూపుగా తలచిన నా ఒంటరితనములో..
1126. ఓదార్చుకోవడం నేర్చేసుకున్నా_బ్రతకాలని నిశ్చయించుకోగానే..
1102. రెప్పలసడి వినబడనే లేదు_నిన్నారాధించే గుండె గంటల చప్పుళ్ళలో..
1103. పరిమళిస్తున్న గంధాలు_నిన్ను తాకి పరవశించే అవకాశం తమకూ వచ్చిందని..
1104. రసస్పందనొకటి కలగాలి_హృదయంలో ప్రేమ పరిమళించాలంటే..
1105. ప్రేమింపబడే అర్హత కావాలేమో_ప్రేమించే హృదయమొకటి తారసపడినా మనకి..
1106. చిగురేసిందనుకున్నా తొలిప్రేమ_నా నవ్వు నీతో వెళ్ళిపోయినప్పుడే..
1107. ఇవ్వడమే తెలిసిన ప్రేమ నాది_తిరిగి తీసుకోవడం నీ ఇష్టమనుకుంటూ..
1108. ముసిరే మబ్బులోనూ ప్రేమను వెతుకినందుకేమో_చినుకై కురిసి నిరూపించుకుంది..
1109. ఆకాశమంత ప్రేమ_పగటిని సైతం రేయిగా మరిపిస్తూ..
1110. అందనంత ఆశ_ప్రేమలోకానికి ప్రయాణం అంత తేలిక కాదంటూ..
1111. చిగురాకుల గలగలలు_నీ ప్రేమ పిలుపులకి స్పందిస్తూ..
1112. పవిత్రమైపోయానప్పుడే_నిర్మాల్
1113. చీకటిపడితేనే నవ్వులు వికసించేది_పగలంతా నీ వియోగంలో..
1114. కలలు కనడం మానేయమన్నా_ప్రపంచాన్ని బొత్తిగా మరచిపోతున్నావనే..
1115. పరవశమైపోయా_ఒక్కసారి నీ పిలుపు వినబడగానే
1116. విశ్వప్రపంచం మనలోనే_ఒకరినొకరం కలగంటుంటే
1117. ఉషోదయం నవ్వుకుంటోంది_వెలుతురిచ్చిన నీ నయనాలు తిలకించి..
1118. కలం కదలనంటోంది_పాటకి నువ్వు ప్రేరణ కాలేదని
1119. సుపరిమళమే నీ ఊహల్లోనూ_సుమాలన్నీ తలలు వాల్చుకొనేలా
1120. చెలిమొక చేబదులే_మన సంతోషాలన్నీ స్నేహంతోనే ముడిపడుతూ..
1121. గోరింకనే తలచుకున్నా నేను_నీ కువకువలు వినబడుతుంటే
1122. మనసు విసుక్కుంటోంది_కంటి చివరి భాష్పంగా నీ చొరవేంటని..
1123. మోనాలిసా నవ్విందందుకే_నీ కౌగిలిలో నేనో నెలవంకనవుతుంటే..
1124. మేఘమాల వలపు గీతమట_ఆకులు రాల్చు శిశిరపత్రాల అల్లరిపాటలు
1125. ఎన్నిచుక్కలు లెక్కించానో_నీరూపుగా తలచిన నా ఒంటరితనములో..
1126. ఓదార్చుకోవడం నేర్చేసుకున్నా_బ్రతకాలని నిశ్చయించుకోగానే..
1127. పున్నమెప్పటికే అమాసతో సమానం కాదు_చందమామకి చేయి పట్టాలంతే
1128. సంక్షిప్తమే కొన్ని కధలు_కలలన్నీ కరిగిపోయిన నిదురలో..
1129. ప్రతికొమ్మలోనూ రాగాలే_మన అనురాగాన్నెవరో పాడమని చెప్పినట్లుగా
1130. చెమ్మగిల్లుతోంది కన్ను_కాలానికి ఆనకట్టేయలేని నిన్ను చూసి
1131. చీకట్లోనే జాగారం చేస్తున్నా_ఉదయాన్ని మదిలో ఊహిస్తూ..
1132. అస్తిత్వం కోల్పోయిందొక అందం_స్పందించలేని మనసుకు ఎదురుపడ్డాక..
1133. శిలలై మిగిలిన హృదయాలు_మానవత్వం శిధిలాల్లో చేరిపోయాక..
1134. నిశ్శబ్దంలో సమాధిచేసా_తీతువులై అరుస్తున్న ఉన్మాదపు కలలన్నీ
1135. కలలకు గొళ్ళేలు పెట్టలెకున్నా_కొన్నైనా నిజం చేసుకుందామనే..
1136. నేను సజీవమయ్యానప్పుడే_ధైర్యంగా నీతో అడుగులు కలిపినప్పుడే
1137. నా చూపు హరివిల్లయ్యింది_నీ కలవరం మేఘమవుతుంటే..
1138. అప్పుడెప్పుడో తీపైన కన్నీరు_ఒక్క కష్టం గట్టెక్కినందుకే
1139. శిశిరపత్రాల లెక్కలు తేలకున్నవి_వసంతమొస్తున్నా ఇంకా గలగలలాడుతూ..
1140. మిధ్యాబింబాలెన్నో_ఇమడలేని జీవితనాటకంలోని పాత్రలుగా..
1141. రమ్మని వేడుకున్నందుకే_నీ మనసు వేదికపై నేనొచ్చేసా..
1142. మంచానపడింది మంచి_చెడొచ్చి చింతలిస్తుంటే..
1143. ఒడ్డుకు చేరుతున్న భావాలు_అనుభూతుని నువ్వు ఆదరించినందుకే..
1144. ఆనందాన్ని బానే హత్తుకుంటావు_ఆవహించినది దుఃఖంలోనని గమనించకుండా
1145. సుఖశాంతులు కరువేగా_నిరంతర యుద్ధంతోనే జీవితం ముగిసిపోతుంటే..
1146. స్వరార్చనకి నేనొచ్చేసా_నీ కచేరీలో పాడేందుకు పిలిచావని..
1147. ఆకర్షిస్తున్న వెన్నెల_నీ చూపుల్లోకి నేను తొంగిచూసినప్పుడల్లా
1148. కలకలమెందుకో కనులలో_కలవరాలు పుట్టింది నీ మనసులోనైతే..
1149. ప్రవహిస్తున్న మౌనం_నిన్నూ నన్నూ కలిపే వారధిగా..
1150. గుభాళింపును ముందు పంపానందుకే_నే వెనుకొస్తున్నానని తెలియచెప్పేందుకే
1151. మాలోకమంటున్నరంతా_నాలోకం నేను సృష్టించుకున్నా..
1152. చెక్కిలిలో చిక్కిన చినుకు_ఉద్వేగం వెల్లువై పొంగరాదని..
1153. మూగబోయిన కోయిలలా నువ్వు_ముందే విచ్చేసిన వసంతమై నేను..
1154. నా కలానికి ఆధారమైనందుకేమో_కన్నీటికీ కాస్తంత మెరుపొచ్చింది..
1155. మదన కోమలుడివి నీవు_నా రసగీతి చరణాలలో..
1156. వ్యామోహాన్ని కనిపెట్టానప్పుడే_స్నేహమంటూ కాయాన్ని కెలికినప్పుడే..
1157. కల్యాణవీణా నాదమది_కొంగుముడేసి ఇద్దరి ప్రేమను ఒకటిచేసింది..
1158. ఆకర్షణ పెరిగిందప్పుడే_వద్దనేకొద్దీ తను ముద్దు చేస్తుంటే..
1159. హేమంతమై నీ రాక_మదికి కొత్తదనాన్ని పరిచయిస్తూ..
1160. నిద్దురపోయిన నా కల_హృదయ కలకలం ఎక్కువవుతుంటే
1161. నా మనసైతే మధువయ్యింది_నీ తీపికలల జలకాలాటలకే..
1162. మైకం చల్లాను_నన్ను మాత్రమే నువ్వు ఆఘ్రాణించేలా..
1163. అవమానాలనూ ఓర్చుకోవాలేమో_మనసుని జయించాలంటే..
1164. నిరాశే మిగిల్చింది_నిన్ను చూడాలనుకొనే చిరకాల వాంఛ..
1165. జ్ఞాపకాలకెప్పుడూ చొరవే_అడక్కుండానే మదిని చేరి కలదిరిగేస్తూ..
1166. ఎన్ని కలలు పిండాలో_ఆ సిరాలో ఆర్ద్రతను నింపలంటే..
1167. చిరునవ్వుతోనే చేధించా సమస్యలన్నీ_నా పరుగు నిన్ను గమ్యం చేసిందని..
1168. ఎక్కడని అన్వేషించాలో నిన్ను_కలలో సైతం నువ్వు పరుగులే పెడుతుంటే..
1169. ఆ పరుగక్కడే నిలిచింది_ఆమె అన్వేషించే గమ్యం గతానికి రమ్మంటుంటే
1170. వెలుగునీడలు జీవితంలో భాగమేగా_నువ్వూనేనూ సగం సగమైనట్టు..
1171. నా గమ్యమే నువ్వయ్యావుగా_నన్నో మార్గదర్శిగా తీర్చిదిద్ది..
1172. అనుభవాల రంగురాళ్ళే_మరపురాని అనుభూతుల ఆనవాళ్ళు..
1173. కలల పరం చేసేసా కావ్యాలు_కలం కదలనని మొరాయిస్తుంటే..
1174. లయమయిపో_నా శృతిలో తోడయ్యేందుకు వచ్చావనే
1175. నువ్వన్నది నిజమేలే_నిన్న రువ్విన నవ్వులు నావేలే..
1176. నవ్విందో బృందావనం_నువ్వు రమ్మన్న కలలో నన్ను రాధను చేసావని..
1177. కొన్ని అనుభూతులు దాచేసా_అక్షరాలతో పొదిగి నీకందించాలని
1178. వెన్నెలదొంగని మన్నించేదెవరులే_తన రాకకై కన్నులు తెరిచే కూర్చుంటూ..
1179. అందాలన్నీ అక్షరాలయ్యాయి_నీకు మధురకానుకగా కావాలనే
1180. కల నిజమవుతుందని ముందే కనిపెట్టా_నా కన్నులతో నీ చూపు కలిసినప్పుడే
1181. పగడాలు కొన్ని దాచుంచు_ముత్యాలలో అందంగా ఒదిగిపోగలవు..
1182. పరాగాల మధుపాన్నే_నిన్నటి పువ్వుగా మారి నన్ను పిలిచావని..
1183. రేపటి ఉదయమై విచ్చేస్తా_నువ్వే పువ్వై మళ్ళీ పూస్తానంటే
1184. నెమలీకలెన్ని పోగేయాలో_వేలకన్నులతో నిన్ను దర్శించాలంటే
1185. ఇంద్రధనస్సెలాగూ లేని జీవితమేగా అది_రంగుబట్టలకీ కరువెందుకో..
1186. చప్పట్ల సవ్వళ్ళేమిటో_నీ చూపు నన్ను తడుముతుంటే
1187. జ్ఞాపకాలే అభిరుచులయ్యాయి_నేటికీ నన్నంటిపెట్టుకుంటూ..
1188. కొన్ని జ్ఞాపకాలంతే_జ్ఞాపికలుగా మొదలై వేదనతో ముగుస్తాయి..
1189. నీ జ్ఞాపకాలు అమరమేలే_నేటికీ ఎదలో పరిమళించేలా నువ్వున్నందుకు..
1190. జ్ఞాపకాల నీడల్లో నేను_వర్తమానం వేడిని భరించలేకనే
1191. జ్ఞాపకాలు నాకైతే వసంతాలే_ఎన్ని శిశిరాలొచ్చినా రాలిపోనివే..
1192. కొన్ని జ్ఞాపకాలంతే_మన జీవితాలకు చమురందించి వెలిగే దీపాలు..
1193. తారాడుతున్న జ్ఞాపకమొకటి_నాలోని నన్ను నీలోకి తరిమేస్తూ..
1194. జ్ఞాపకాల సయ్యాటలు_నీ పిలుపు తరంగాలకి నృత్యిస్తూ..
1195. వసంతమై విచ్చేసినందుకేమో_శిశిరానికి అసూయ పెంచిన జ్ఞాపకాలు..
1196. నన్ను నేనే మరచిపోయా_నీ జ్ఞాపకాలతో మమేకమయ్యాక..
1197. నీ జ్ఞాపకాల వైభవమేగా_హృదయసీమను ఈనాటికీ వెలిగిస్తూ..
1198. తరంగమవుతూ నీ జ్ఞాపకాలు_తరంగిణై నాలో కలిసిపోతూ..
1199. వేరే ఆనందమేముందిలే_నీ ఊరికే నీవో కానుకయ్యాక..
1200. గోరంత ఆశొక్కటే మిగిలింది_గొంతెమ్మ కోరికై తీరకపోగా..

No comments:
Post a Comment