1301. కోయిల కన్ను ఎర్రబడ్డది_వెతికినా దొరకని మావిచిగురుల వసంతాలలో..
1302. నీ జ్ఞాపకాల అలల సవ్వడికేగా_నా మనసు తీరం కుదుటపడ్డది..
1303. కోనేరు ముగ్ధమయ్యింది_నా తలపులతో తలంటి పోసుకున్న ఊహలకే..
1304. రేపటి గురించి ఆలోచించలేని మనసు_హృదయమంతా గతమై నిండినందుకే..
1305. నీ ఊహల్లోకొచ్చి చేరిపోయా_నీ జ్ఞాపకాలు ఈలవేసి పిలిచినందుకే..
1306. యవ్వనం కలల పాలయ్యింది_వర్తమానంలో నిదుర కరువైనట్లు..
1307. ఎన్ని తలపులు అంతరించాలో_నీ వలపు నన్ను వీడిపోవాలంటే..
1308. నీ ఊహల గుసగుసలు వింటూనే ఉన్నా_నా మది తూగుతుంటే..
1309. నీడై నిలిచే జ్ఞాపకాలు కొన్ని_స్నేహపు ముక్కెరలో మేలి ముత్యములా..
1310. ఉలిక్కిపడుతున్నా నీ జ్ఞాపకాలతో_గతం గుర్తుకొచ్చి భయపెడుతుంటే
1311. అనుసరించే ఆనందం_బాల్యమనే బంగరు జ్ఞాపికై..
1312. ఆనందాల కొసమెరుపులు_నీ జ్ఞాపకాల గిలిగింతలకే
1313. కాలం కరిగిపోయిందలా_నీ జ్ఞాపకాల నిధుల అన్వేషణలోనే..
1314. జీవన మాధుర్యం తెలుస్తోందిప్పుడిప్పుడే_నీ తలపుల నెమరింతల్లోనే..
1315. నీ జ్ఞాపకమొక్కటే తీపయ్యింది_నా వాస్తవ జీవితంలో..
1316. నీ భావుకతలో చేరితే చాలనుకున్నా_జ్ఞాపకాలలో తుడిచేసినా..
1317. మిణుగురులై వెక్కిపడుతున్న నా ఊహలు_నీ జ్ఞాపకాలు వెలిసిపోతుంటే..
1318. వేరే గంధాలెందుకులే_మల్లెలమాసం నీ జ్ఞాపకాలను మోసుకొచ్చాక..
1319. నీరవంలోనే తాదాత్మ్యత చెందుతున్నా_నీ జ్ఞాపకాలు పరిమళిస్తున్నాయని..
1320. నీ జ్ఞాపకాలు మెరుపులే_నా నిశీధికి వెలుతురులిస్తూ..
1321. ఊహలకి ఉలికదలికలు నేర్పించు_నీ భావంలో శిల్పాన్నై ఒదిపోతా..
1322. మనసాకాశం మెరుపులీనింది_నీ తలపుల చప్పట్లకే..
1323. ఎన్ని భాష్యాలిస్తావో నా భావాలకు_ఒక్కసారి అనుభూతిగా మారి చూడక..
1324. నీ పిలుపుల గిచ్చుళ్ళే_నీ చూపుల చెంగావిలా
1325. తారలకెందుకో ఉడుకు_తామివ్వని మెరుపులో నా రేయి గడిచిపోతుంటే
1326. సూదంటు రాయిలా నీ అందాలు_అయస్కాంతంగా నా చూపుని ఆకర్షిస్తూ..
1327. వేయిజన్మాల వెతలన్నీ పరారు_నీ వెంట నా అడుగేయగానే
1328. జీవితాన్ని హత్తుకున్నా_మెరుపుతీగలా నన్ను నీవైపు ఆకర్షించిందనే
1329. నా చూపులు బాణాలే మరి_నీవింత అందాన్ని నాపై గురిపెడుతుంటే
1330. ఆడదానిపైనే ఆంక్షలన్నీ_అనుమానాలేవీ లేవంటూనే
1331. కొందరంతే_తమకు జన్మనిచ్చింది అతివేనని మర్చిపోతుంటారు..
1332. నీ తలపులేగా చమురు_నా జీవనజ్యోతి వెలిగేందుకు..
1333. మహారాణంటూ మెచ్చేందుకు సందేహమెందుకో_ఒంటిచేత్తో పనులన్నీ చక్కబెట్టినా..

1334. సవ్యసాచిలా ఆమె_అవలీలగా ఇంటిబాధ్యతను నెరవేర్చుతూ..
1335. ఆదిశక్తి అవతారమేగా_పదిచేతుల విశ్వరూపముతో నేటి మహిళ..!
1336. అర్ధంకానిదేముంది ఆమెకు_ఆమెవరికీ దగ్గరవకున్నా
1337. ఎప్పుడూ ఆమె_నచ్చిన పాత్రకై ఎదురుచూసే అభినేత్రిలా..
1338. నీరాజనం అందుకున్నా_నీ అభిమానం కర్పూరమై వెలిగినప్పుడే..
1339. సెలవడుగుతున్నాయెందుకో భావాలు_అక్షరాలు రాసి అలుపొచ్చినందుకేమో..
1340. శ్రమ విలుప తెలిసిన మది_విశ్రాంతితో తనకు పనిలేదంటూ..
1341. పల్లవులుగా మారిన పదాలు కొన్ని_నీ అరచేతిలో చేరినందుకే
1342. నిద్దురెక్కడ పట్టింది నాకు_నీ కలవరంతోనే పొద్దెక్కిపోతుంటే..
1343. ఎప్పటికీ అమ్మనేగా_ఇంట్లో యుద్ధాన్ని నివారించలేకున్నా..
1344. ఉషోదయంలో చేరానప్పుడే_నీ నిశీధిని తరమాలనుకున్నప్పుడే..
1345. నిర్లక్ష్యాలకూ నెలవే_ పలకరింపుకే నోచుకోని అలక్ష్యాలలో..
1346. అగరుధూపాల అందమే మహిళ_వేల పువ్వుల సున్నితత్వాన్ని పరిమళిస్తూ..
1347. మగువే_మరుమల్లెల మనసుని మించిన మధువనమై..
1348. రచ్చ గెలుస్తూనే ఉంది స్త్రీ_ఇంట్లో కూసింత ఆదరణ కరువైనా..
1349. ఎన్ని తరలింపుతో_సిరితో పాటుగా శ్రీదేవినీ కానుకగా వరునికి..
1350. ప్రతి బిందువుగా నిన్నుంచాలనేగా_నా కన్నంత ఆర్ద్రమై ఒలికింది..
1351. కన్నీరెందుకో బరువెక్కుతోంది_కష్టాలను కడలితో పోల్చి కనులలో నింపినందుకేమో
1352. నిఘంటువులే మరచిపోయా_నీ ప్రేమలో మునకలేస్తూ నేను
1353. నీ తలపే నా మౌనం_వలపాక్షరాలు మదిలో దిద్దుకోవాలంటే
1354. నీరవంలో నేను_నీ మువ్వల అలికిడి మాయమవగానే
1355. తీరమై ఎదురుచూస్తూనే ఉంటా_నీవొచ్చి ప్రక్షాళనం చేస్తావని..
1356. కాలం తీపయ్యిందప్పుడే_కన్నీరు రుచి మారి కరిగిపోతున్నప్పుడే
1357. నిలబడిపోకలా నిన్నల్లోనే_భవిష్యత్తు నీకై ఎదురుచూస్తుంటే
1358. నీ ఉషోదయమైతే నేనేగా_రాతిరి నిద్దుర కరువైనా
1359. ప్రేమిస్తే పూబంతే ఇంతి_కాలరాయాలని చూస్తే కాళికాదేవే మరి..
1360. కన్నుల్లో దీపావళి కాంతులు_ఈరోజే పండుగని అనిపిస్తూ..
1361. తప్పుకున్నట్లు నటిస్తున్నాయి తలపులు_తలచినా నువ్వు రాలేవని..
1362. రాతిరి అదో రహస్యం_నిద్దురలో నిన్ను కలవరించినట్టు..
1363. అదెంత మోహమో_నన్ను దూరం చేసిన క్షణాలన్నీ నువ్వు తిట్టుకుంటూ..
1364. నీ అక్షరసోయగం తిలకిస్తున్నా_సాగరతీరాన గవ్వల్లో చేరి సవ్వడిస్తుంటేనూ..
1365. ముసుగు తీసేసా మనసుకి_నన్ను నన్నుగా ఇష్టపడతావనే..
1366. నీ శుభోదయం నేనందుకున్నా_నీ కలలో నాకు తెల్లారిందనే..
1367. వద్దాన్నా తీపినే కోరుతున్న కలలు_నువ్వున్నావనే కాబోలు
1368. అసావరి రాగమే మొదలెట్టా_అభేరి రాగమై నీ కర్ణాన్ని చేరుతుందని తెలీక
1369. నన్నంటుకుందో చూపు_నీ మెరుపు జ్వాలై తాకగానే
1370. స్వరాలు ఏడే_మౌనరాగానికి ఒక్కటీ ఉపయోగపడక..
1371. ఎన్ని ఊహలు చిలికిందో రాత్రి_నీ విరహంలో నిద్దుర కరువయ్యాక..
1372. ఆసరా ఇచ్చిన అమ్మే_మరోసారి ఆసరా ఇచ్చేందుకు మరలిపోయింది
1373. అక్షరపల్లకీ అది_అనుభూతలన్నీ మోసుకొస్తూ..
1374. చెలిమెప్పుడూ బలమేలే_జీవితానికి ఆరంభమూ..ఆలంబనమూ..
1375. ఎందుకంత నవ్వులపిచ్చో నీకు_మాధుర్యమంతా మోవిలోనే ఉందంటూ..
1376. ప్రతిపలుకూ పదమై అలరిస్తోంది_నా భావం నిన్ను అనుభూతిస్తుంటే..
1377. అక్షరాల విన్యాసమది_హృదయాలను అనంతాలలోకి లాక్కొనిపోతూ..
1378. అక్షరమో తారై వెలుగుతోంది గగనాన_అమాసన్నదే ఆకాశానికి లేదంటూ..
1379. తనివితీరకుంది_నీ భావామృతం ఒక్కమారే రుచిచూస్తుంటే..
1380. అధికమాసాన్ని తిట్టుకుంటున్న కోయిలలు_వసంతానికి గొంతు మూగబోవునేమోనని..
1381. నీరుగారిన ఆశలు_నీ పిలుపులోని ఆర్తి నాది కాదంటుంటే..
1382. అక్షరాలకెందుకో ఆరాటం_నీ తారలో ఒక్కసారన్నా మెరవాలని..
1383. వసంతమెందుకు వాయిదా పడ్డదో_కొన్ని కలలను గుమ్మంలోనే ఆగిపోమంటూ..
1384. మనసో మధువనమైంది_అంతరంగాల అంతఃకరణాలకు దారి దొరికాక..
1385. వసంతం ముందే ఉంది_శిశిరంలోని ఆకులన్నీ కొత్తగా చిగురించేందుకు..
1386. నా చూపును కనిపెట్టిన నీ కనులు_పున్నమంతా నాలోనే ఉందంటూ..
1387. గగనమే నేలజారినట్లుంది_ఆనందగంధాలన్నీ తరంగాలై మది మీటుతుంటే
1388. రేపనేదే క్లిష్టమనిపిస్తోంది_కన్నీటిని తాగలేకపోతుంటే..
1389. నీలో భావోద్వేగమే_నా మనోచింతనకు పరోక్ష అంకురార్పణమవుతూ.
1390. గుభాళిస్తున్న ప్రశంసలేనవి_నీ వెనుక నలుగురూ తలచుకుంటున్నా..
1391. జ్ఞాపకాల్లో చేరింది విరహం_ప్రేమ పాతబడి చేదయ్యాక..
1392. వేసవి కమ్మదనం తెలుస్తోంది_మల్లెలు మనసంతా పరచుకున్నందుకే
1393. కెరటానికెప్పుడూ గెలుపే_తీరమెంత వెనక్కు తోసినా ప్రయత్నించే ఉత్సాహంలో..
1394.విజయం తధ్యమేగా_ఆత్మవిశ్వాసాన్నే తోడు తెచ్చుకుంటే
1395. కొన్ని భావాలంతే_రెప్పల్లో చేరి రాగాలై వినబడతాయి..
1396. పువ్వునై పరవశిస్తున్నా_నీ చూపులు మెత్తగా తాకుతుంటే..
1397. నా నీడ నువ్వయ్యావనే_వెలుతురంటే భయం పోయింది..
1398. నీ నవ్వులెంత గీర్వాణమో_పదేపదే నన్ను కవ్విస్తూ..
1399. ఎన్ని మెరుపులు కోసుకొచ్చానో_తారలన్నీ నీకే దాసోహమయ్యేలా..
1400. నీ పెదవులెర్రబడ్డప్పుడే అనుకున్నా_నా పేరునెంత తీయగా పలికుంటావోనని..

No comments:
Post a Comment