Wednesday, 6 July 2016

ఏక్ తారలు : 01001 నుండి 01100 వరకు

1001. నీలవేణి పూబోణయ్యింది_పంచవర్ణాలను జడలో తురుముకొని..
1002. అనురాగాన్ని గుర్తుచేసుకుంటున్నా_నీ చూపులను తలచుకుంటూనే..
1003. చూపులో ఎందుకన్ని రహస్యాలో_పెదవులు బయటపడేందుకు ప్రయత్నిస్తుంటే
1004. అక్షరాలవరింపుని మరచిపోయా_నీ అనురాగానికి తలఊచుతూ..
1005. హేమంతసమీరాన్ని చూసి పొరబడతావెందుకో_మంచుధారని గుర్తుపట్టనట్లు..
1006. చూపులకే చెక్కిన శిల్పాన్నవుతున్నా_పదంకలిపితే ఏమై మిగులుతానో..
1007. మల్లె మనసెప్పుడూ తెల్లనే మంచులాగా_హేమంతాన్ని తాకకపోయినా ఎన్నడూ..
1008. వంశధారనై ఉరకలేస్తున్నా_నాగావళిని దాటి ముందుకేగాలనే
1009. వినోదబాలల సయ్యాటకేగా_నిదురిస్తున్న మనసు ఉలిక్కిపడి లేచింది..
1010. గంగని చేరే తీరికెక్కడిదిలే_మూణ్ణాళ్ళకు తారలు బిక్కుమైపోవూ..
1011. మరువాన్ని మనసుకద్దినప్పుడే అనుకున్నా_మల్లెలను వెనక్కు పంపించావని..
1012. కలికి చిలక కులుకుదనాలు నాలో_పదేపదే నీ ప్రేమలోనే మునుగుతుంటే
1013. విరహానికి వేడెక్కువే_హేమంతాన్ని సంతోషంగా హత్తుకుంటూ..
1014. రంగవల్లులందుకే ఆపేసా_నా నవ్వులను నువ్వు దోచుకున్నావని..
1015. పువ్వులపేర్లూ మరచిపోతున్నా_రోజుకో పువ్వులా నువ్వెదురవుతుంటే
1016. నిరీక్షణను వెలివేసా_యుగాలు దాటించే ప్రేమలు తనవల్ల కాదని..
1017. మరపులైన స్మృతులెన్నో_నీ చిరునవ్వుల ఆకాశాన..
1018. పూలబాణాలకే మూర్ఛిల్లుతున్నా_మత్తెక్కించే పూలను గుచ్చావని..
1019. జ్ఞాపకాలన్నీ చిరంజీవులేగా_నాలో సజీవంగా ఉన్నంతకాలమూ..
1020. నా మనసో బృందావనమవుతోంది_చుక్కలన్నీ గోపికలై తిరుగుతూంటే
1021. నెలవంక ఇలకు జారిందంటే ఏమోననుకున్నా_నీ పెదవులను చూసాకే ఒప్పుకున్నా..
1022. నేనెప్పటికీ క్షయమవనుగా_నన్నో అక్షరంగా నువ్వు రాస్తున్నంతవరకూ..
1023. మల్లెల మక్కువ ముచ్చటవుతోంది_మాఘమాసానికి ముందే నన్ను చేరుతుంటే
1024. కావ్యసరస్సుల్లో ఈదులాడుతున్నా_పద్మరాగం అక్కడే సాధనచేయాలని..
1025. అక్షయమే నీ వలపు_నా పరుగందుకొని నన్ను అనుసరిస్తుంటే
1026. హృదయ తేజస్సు వెలిగిపోతుంది_వీణాపాణిలా అక్షరం నాదవుతుంటే
1027.భావాల బెంగ తీరిపోయింది_నీ గెలుపులో నేను పాత్రనవుతుంటే
1028. చిరునామానే మరచాను_నిదుర మరచిన రాతిరిలో తప్పిపోయిన నేను..
1029. పగలే వెన్నెల కనిపిస్తోంది_తారల మెరుపులతో సూర్యుడ్ని మరగుపరుస్తూ..
1030. స్వరాన్ని శుద్ధిచేసుకొనొచ్చా_మన విజయగాధను నేనే పాడాలని..
1031. మాయామాళవగౌళ ముందుకొచ్చింది_నవరాగమల్లికలో తాను ముందుంటానంటూ..
1032. నిన్ను పాడినప్పుడే అనుకున్నా_కాలమెక్కడో ఆగి వింటుందని..
1033. కనుమరుగవుతున్న నిరాశ_హేమంతపు ఆశలు శ్వాసను ఊపేస్తుంటే
1034. తారలకెందుకు తడబాటు_పట్టపగలే సూర్యునికి ఎదురై వెలిగిపోతుంటే
1035. మరో శిశిరాన్ని తోడు తెచ్చుకుంటుందేమో_అధికమాసంతో హేమంతాన్ని ఓడించాలని..
1036. లెక్కలు విడిచిన నిరాశలు_ఆశల అమ్ముదిపొదిలో బాణాలను ప్రోదిచేసుకుంటూ
1037. రెప్పల యవనికను ఎప్పుడో ఎత్తేసా_తారల గెలుపుకి ఉవ్విళ్ళూరుతూనే..
1038. విలువైన ఆశలకెప్పుడూ గెలుపేగా_అందం అవకాశం కలిసొచ్చినందుకు..
1039. వేరే ఊసుల తోడు కోరనేలేదుగా తారలు_తమ విశేషాలకే సశేషమిస్తూ..
1040. నిట్టూర్చుతూ కూర్చోలేను_నీడనై నిన్ను వెంటాడాలని నిర్ణయించుకున్నాక
1041. మనసెప్పుడూ వసంతంలోనే_మాటలు శిశిరాలై గాలికి ఎగిరిపడుతున్నా..
1042. దొంగతనంగా చూస్తున్నా నిన్ను_కనిపెడితే ఎలాంటి శిక్షకు గురిచేస్తావోనని..
1043. గోరంత గుండే_నీ జ్ఞాపకాలతో గుప్పెడుగా మారింది..
1044. వేరే లోకంతో పనేముందనుకున్నా_నా లోకమే నువ్వయ్యాక..
1045. జ్ఞాపకాల సవ్వళ్ళు_నీ తలపును రేపాలని అందెలుగా మారిపోతూ..
1046. వసంతాన్నెందుకు వెక్కిరిస్తావో_నాలా నవ్వులు నీకివ్వక వేధించిందనా
1047. హేమంతంలోనే నిలబడిపోయా_మెలికలతో మనసు నాట్యం నేర్పుతుందనే..
1048. ఊసులన్నీ గవ్వలుగా మారినవి_పులకింతలతో మదిని మోహిస్తూ..
1049. పూబంతిగా మారిపోయా_చేమంతుల మెత్తదనాన్ని నాకు కానుకిచ్చావనే
1050. సగపాలతోనే సరిపోతోంది సమయం_సరిగమలకి సంధ్యను సాయమడుగుతూ..
1051. చెక్కిళ్ళ చెంగావులు_చందమామను చేసి చిరునవ్వులు చిందిస్తుంటే
1052. జాబిలికెందుకో అక్కసు_దృష్టిచుక్క నేనెట్టుకుంటే తానూ మచ్చను పెట్టుకుంటూ..
1053. మాఘమాసం దగ్గర పడిందనేమో_మధురోహలను పురిగొల్పుతూ మది..
1054. మధువనిలా రమ్మంటావెందుకో_మధుమోహానికే నీకు మొహమ్మొత్తితే
1055. పరిమళం దోచింది పెదవులనుకున్నా_నా కన్నులను నువ్వారాతీసేవరకూ..
1056. పెదవెందుకో తడబడుతోంది_తీయందనాలను నువ్వలా కాజేస్తానని ఎదురవుతుంటే
1057. మధుపముగా మార్చింది నువ్వేగా_పువ్వులా నన్నాసాంతం ఆకర్షిస్తూ..
1058. చిలుకపలుకులు నేర్చింది మోవి_ఆ ముద్దుముచ్చట్లకేమో నీ మది..
1059. కొసరింపుల్లోనే కరిగిపోతున్నా_నీ పెదవి విసుర్లు అర్ధమవుతుంటే..
1060. నా భావాలు_అమాస మనసుపై వెన్నెల మరకలు..
1061. కన్నులెప్పుడూ కలిసే చూపుతాయి_నీ మనసద్దంలో నేనున్నానంటూ..
1062. మనసు ఏకాంతాన్ని కోరింది_కనుపాపలే అద్దమై మెరుస్తుంటే.
1063. నాలోనూ కురుస్తోంది మౌనం_ఏకాంతంలో నిన్నాస్వాదిస్తుంటే..
1064. ఏకాంతవాసంపై మక్కువవుతోంది_ఆనందం ఉధృతమై ప్రవహిస్తుంటే..
1065. విరహమే ఏకాంతమవుతుందనుకున్నా_ఏకాకితనన్ని దూరం చేస్తుందని తెలీక.. 
1066. పావురమై ఎగిరిన ఏకాంతం_ఎక్కడ శాంతిని స్థాపించాలనో..   
1067. ఏకాకితనం గ్రీష్మించింది_నా ఏకాంతాన్ని నువ్వు ఆక్రమించగానే..
1068. పదములు కలిసిపోయాయి ఏకాంతంలో_సంగీతాన్ని సారస్వతం చేయాలని.. 
1069. శూన్యాకాశం కనబడుతోంది_ఏకాంతాన్ని అన్వేషిస్తూ కూర్చున్నందుకేమో.
1070. ఏకాంతం రాలిపోయింది_వసంతమొస్తోందని సంకేతాలు అందినందుకే..
1071. ఏకాంతమంతా ఆనందసందోహాలే_ఊపిరాడనివ్వని నీ తలపులతో..
1072. గాలమేసింది ప్రేమ_గాలిలో తేలుతూ నిన్ను తాకిపోవాలని..
1073. పరవశించిందొక వేణువు_నువ్వాలపించిన కీర్తనకేనేమో..
1074. మెరుపు నిండింది ఎదలో_కలంలో నన్నొలికించినందుకేమో
1075. వెక్కిరించిందొక తీతువు_మన స్నేహానికి మనసు కుళ్ళిందేమో..
1076. మయూరమయ్యింది మానసం_నీ మది మేఘరాగానికి నాట్యమాడుతూనే..
1077. రాహువు సైతం రధమంపింది_చెలిమిని ఊరేగించాలనేమో..
1078. ప్రణయం యుగళమయ్యింది_మన తీయని మనసులు పాడుతున్నందుకే..
1079. రసమయమయ్యింది కళ్యాణం_హృదయాల కలయికను ముడేసినందుకే..
1080. హేమంతాన్నై కదిలిపోతున్నా_శిశిరం వెంటబడుతుందని..
1081. కొరుకుడుపడని ప్రేమ_సగమై నా చేతికొచ్చాక..
1082. ఆకర్షణగానే మిగిలిన ప్రేమ_జీవితమో యాంత్రికమయ్యక..
1083. మనసు బ్రతకనంటుంది_ప్రేమనే ఆకలేసి మేను మెలిపెడుతుంటే..
1084. ఆరారు కాలాలూ ఆమనులేగా_నీ జతలో నే కరిగిపోతే
1085. ఒక్క రంగైనా సరిపోతుందనుకున్నా_హరివిల్లునంతా నువ్వు కలిపి పూసేస్తుంటే..
1086. ఘనీభవించాలనే అనుకున్నా_శీతలమై ఒక్కమారు నువ్వు వీచుంటే..
1087. ఎన్ని పువ్వులున్నా దండుగే_నీ పరిమళాలు నా పరమయ్యాక..
1088. నెర్రలెక్కడున్నవి హృదయంలో_కన్నీటికి దారులు మూసేసాక..
1089. అబలెప్పుడూ లోకువే_ఆ కళ్ళ ఆకళ్ళకి..
1090. కారుమేఘాన్ని అరువడిగావెందుకో కాటుకను_నా కన్నుల్లో కాపురముండమంటూ..

1091. వియోగానికి దడిచిపోతావెందుకో_కన్నులు మూస్తే కలనై వస్తానన్నా
1092. మౌనంపై మక్కువవుతోంది_విసిరేసే మాటలకు మనసు గడ్డకడుతుంటే..
1093. పదేపదే అలరిస్తున్నవి నన్నే_నీ స్మృతులు కనకాంబరాలై..
1094. అనుబంధమెక్కడ మిగిలింది_నిర్బంధంలో మనసు బంధీ అయ్యాక..
1096. కన్నుల్లో వెన్నెలైన ప్రేమ_హృదయంలోని అనుభూతి ప్రతిబింబమేగా
1097. కెరటానికెప్పుడూ తొందరే_తీరంలో ఇసుక చెక్కరలా కనబడ్డందుకేమో..
1098. ప్రేమెప్పుడూ తీయనే_అలుకల్లో మరింత మధురాలు పెంచుతూ..
1099. ఉప్పెనంటే గుర్తుకొస్తోంది_హృదయ సంద్రం ఆటుపోట్ల సంగతేమిటోనని..
1100. తనివి తీరిపోతే అది ప్రేమే కాదేమో_ఆకర్షణకి మరో పేరేమో..

No comments:

Post a Comment