Wednesday, 6 July 2016

ఏక్ తారలు : 01701 నుండి 01800 వరకు

1701. కన్నీటిని పన్నీరు చేసేసా_కాలం సాయమందించిందనే..
1702. శృతి తప్పిన రాగమనుకున్నా_హృదయం గాయమయ్యిందని మౌనవిస్తుంటే..
1703. మల్లెల కాలమని మరచావెందుకో_కోరిన సౌరభాన్నిచ్చే నేనున్నందుకేమో..
1704. కలలను హరించావెందుకో_నీపై మనసు పడింది నేనైతే..
1705. నిరాశను నిరీక్షణలో పెట్టేసా_ఆశకు మాత్రమే పిలుపిస్తూ..
1706. ముసుగేసుకున్న మొహాలవి_అపార్ధాలన్నీ మదిలోనే నొక్కిపెడుతూ..
1707. ముసుగేసుకొనే నవ్వుతోందామె_అతను ముసుగేసుకున్న వికారానికి..
1708. ముసుగేసుకొనే వాళ్ళ బ్రతుకులు_కన్నీటి రంగులూ మార్చేస్తూ..
1709. బృందావనమెప్పుడో అయ్యింది మది_నీ చిరునవ్వులతో తడిచినందుకేగా..
1710. కలలోనూ నిన్నే కలవరిస్తున్నా_కాస్తంత కనికరం కురిపిస్తావని..
1711. చూపులు చదివిన ప్రేమలేఖ_కన్నులనే అధరాలుగా చేసుకుంటూ..
1712. గెలిచిందిగా వలపు_మలుపులో నువ్వెదురవ్వగానే
1713. ఆకాశమంత ప్రేమను కురిపించా_లోకమంతా మనమై ప్రవహించాలనే..
1714. నీ కౌగిలెప్పుడూ సమ్మతమే_ఊపిరిగా నీలో నన్ను దాచుకున్నందుకు..
1715. మృత్యువునే వేడుకోవాలేమో_కొన్ని బంధాల విలువలు తెలిసిరావాలంటే..
1716. అపార్ధాల సంకెళ్ళు_ఆశలను ఛిద్రం చేసి నొక్కేస్తూ..
1717. ఆనందం వెనక్కు మళ్ళింది_బాధలు భావాలై ఎదురవుతుంటే..
1718. ఒకరికొకరు ముసుగు_ఒకరిలో ఒకరుగా లోకానికి కనిపించేందుకు..
1719. రాజకీయ వారసత్వమది_ముసుగు మాటునే ప్రజలందరినీ మభ్యపెట్టేస్తూ
1720. ముసుగు తొలగించలేని మనసులవి_మనిషి రూపంలో నడయాడుతూ
1721. ఎన్ని నవ్వులని దాచుకోవాలో_నీకు పువ్వులుగా అర్పించాలంటే..
1722. నడివేసవిలో పన్నీటిజల్లు_మేఘమెక్కడో కురిసినట్లు..
1723. ఎన్ని మాటలు మంత్రాలవ్వాలో_నిన్నొక్కసారైనా కట్టిపాడేయాలంటే..
1723. ఎన్ని మేఘాలు కోసుకోవాలో_నీ మెరుపును గెలవాలంటే..
1724. కన్నుల్లోనే ఖైదీగా ఉండిపో_నా చూపులకు సౌందర్యాన్ని పెంచేస్తూ..
1725. నీలిమపై మనసుపడ్డా_నీలాకాశం నీడలన్నీ సంద్రంలో సంచరిస్తుంటే..
1726. నీ చూపులంటే ఎంతిష్టమో_నాలో ఆనందాన్నలా పెంచేస్తుంటే..
1727. నిశీధి రక్కసిలా వాడు_చిగురించే కోరికలను చిదిమేస్తూ..
1728. నీ ఆనందం కనబడుతోంది_కనులు మూసుకున్నా నా అంతరంగానికి..
1729. నిన్నే ధ్యానించడం మొదలెట్టా_మనసంతా నువ్వే కావలనుకున్నందుకే
1730. కలల కధానాయికను నేనేగా_కవనంలోనూ నన్నే చిత్రించినందుకు..
1731. ప్రతిపల్లవమూ పాడింది_మేఘరాగానికి సాయముంటామంటూ..
1732. బద్దకంగా లేచాడు భానుడు_ప్రకృతి పోసిన తలంటుకెంత నిద్ర పట్టిందో..
1733. అక్షరాలదే అదృష్టం_నీ కలంలో ఇంపుగా ఒదిగినందుకు..
1734. మనసూ పరిమళిస్తోంది_పువ్వులను అలంకరించుకున్న సౌందర్యాన్ననుసరించి..
1735. అపురూపమే మదిభావన_అక్షరమయ్యింది నేనంటే
1736. స్నేహం తీయనైనదే_తేనె పూయకుండానే సహజమైనదైతే..
1737. వానకారు కోయిలకూతలే అన్నీ_మేఘసందేశాన్ని వినిపించే ఆనందంలో
1738. అలలై ఆడుకుంటోందేమో ఎద_తీరమైన నన్ను చేరి కవ్వించాలని
1739. కన్నులతో కాటేస్తున్నావెందుకో_పున్నాగు
లనే మదిలో తలచుకుంటూ..
1740. మనో మధనం చేయాలిక_మనసంతా నువ్వు కెలుకుతుంటే
1741. చిరునవ్వు చేరువైనప్పుడే అనుకున్నా_నాకోసం వస్తున్నది నువ్వేనని..
1742. మానవత్వాన్ని వెతకడం మానేసా_చర్చలకే పరిమితమయ్యిందని తెలిసాక
1743. నా ప్రేమ నిన్ను చేరడం గుర్తించలేదు_నీ ధ్యానంలో మునిగిపోయి..
1744. మనసునెందుకు కాల్చేస్తావో_నా హృదయాన్ని పరీక్షిస్తానంటూ..
1745. ఊహల సందళ్ళు_జ్ఞాపకాల జావాళీలను కూర్చుకొని పాడినప్పుడల్లా
1746. నామకోటి పూర్తికాలేదింకా_నీ ఆత్మీయతా విలువను పెంచేందుకు..
1747. అడుగడుగునా స్మృతులే_గతజన్మలో ఏడడుగులూ మనవేనంటూ..
1748. లెక్కకందని తలపులు నీవి_నిదురలోనూ నన్ను కలవరపెడుతూ
1749.  కలలో చెప్పిన కబుర్లే అన్నీ_అక్షరాలుగా అనువదించేసా నువ్వెదురైనందుకే
1750. ఆనందానికి హద్దు చెరపాలనుకున్నాను_ఆకాశం నువ్వైపోతే
1751. అక్షరమే నేనైపోతా_నీ కవనంలో నన్నూ కూర్చుతానంటే
1752. నిశ్చింతగా నిలిచిపోయా నీ కన్నుల్లో_నీ కనుపాపలతో నేస్తం కట్టి
1753. కవనముగా విచ్చేస్తా_కలలోకి రమ్మని నువ్వు పిలిచినా..
1754. కోనేరనే సరిపుచ్చుకుంటా_నీ కన్నీటితో స్నానాలు చేయిస్తున్నా
1755. భాష కొరవడిన భావాలే నావన్నీ_మనసు పెట్టి రాస్తున్నందుకు..
1756. గుండె గర్భగుడిగా మారింది_కన్నీరు పుష్కరిణిగా ప్రవహిస్తుంటే
1757. నువ్వు కలంలో ప్రవహించినా చాలు_నా భావాలు బంగారమయ్యేందుకు..
1758. సంతసాన్ని అర్ఘ్యమిస్తా_నీ కన్నీటిని పన్నీరుగ మార్చేందుకు..
1759. మక్కువైన మాట నీది_పలుకు తేనెలనే కురిపిస్తూ
1760. కన్నులు మూస్తే కలనై రాలేనా_పగలంతా కలవరిస్తావెందుకో
1761. అక్షరాలన్నింటా నువ్వే_అల్లిబిల్లిగా అల్లుకుపోతూ
1762. రాగానే మువ్వై మోగానందుకే_నాలో వసంతాన్ని గుర్తిస్తావని..
1763. కన్నీరిప్పుడు తీపయ్యింది_నీ సాంత్వన మదిని చేరగానే..
1764. మౌనిగా మిగిలాను_తన చిరునవ్వులో..
1765. కన్నీటిలో కరిగాయి ఆశలన్నీ_మాటలు పొడిపొడిగా రాలిపోయాక..
1766. మనసంతా నువ్వేగా_నేనే నీవయ్యాక..
1767. ఊపిరిగా మారిపోయాను_నిత్యం నీలో కంపిస్తూనే ఉండాలని..
1768. ముభావంగా మిగిలిపోయా_నీ భావంలో చోటివ్వలేదని..
1769. మరుభూమిగా మారుతుందెందుకో మది_మాటలు తరిగిన ప్రతిసారీ..
1770. కాలానికీ కోరికలెక్కువే_నువ్వూ నేనూ ఏకమైతే చూడాలని..
1771. నాలోనూ మౌనమే_నీలోని విషాదానికి వంత పాడుతూ
1772. అపురూపమైంది మది_అలవోకగా నీవొచ్చి స్పృసించాగానే..
1773. కొసరి కొసరి నవ్వా నిన్ను చూసి_కోపిస్తే కనుమరుగవుతావని..
1774. అరచేతిలో గీతనైపోయా_నీ రాతగా నన్ను రమ్మన్నావని..
1775. కలకలమంటూ కలలు_రేయి రమ్మని సైగ చేయగానే..
1776. 'అ'కారం అమృతమయ్యింది_అమ్మతనమందులో ఉన్నందుకే..
1777. కలలోనే కలుస్తోంది అమ్మ_నిదురంటూ పట్టిన రోజున..
1778. ఆక్రోశిస్తోంది అమ్మ మనసు_విలువను గుర్తించేవారే కరువయ్యారని..
1779. అమృతమెప్పుడూ దూరం కాలేదు_అమ్మనే పిలుపులోనే వినబడుతూ..
1780. నీరెండలవే నాకు_అమ్మ జ్ఞాపకాలతో సేదతీర్చే క్రీనీడలు..
1781. అమ్మ_మనోనిబ్బరానికి మరో నిర్వచనం..
1782. బొమ్మగానూ మారుతుంది అమ్మ_పాప ఆడుకొనేందుకు రమ్మంటే..
1783. ప్రేమించడమెందుకు నేర్చుకోలేదో_అమ్మెంత నేర్పాలని చూసినా
1784. అమ్మని అర్ధం చేసుకొనేదెవరో_ఆసరాని ఆమె చేతికి అందించకుండా
1785. అమ్మ_పెదవికి తెలిసిన తొలి తీపి తనే కదా..
1786. ముక్కోటి దేవతలూ అమ్మలోనేగా_ఆర్తిగా పలికినా వరమిచ్చేది..
1787. అమ్మో ఆకాశమే_అందని వెన్నెల దారుల్లో
1788. అమ్మలోనే ఉన్నది అందమంతా_సహజత్వానికి మరో పేరుగా
1789. అందనంత దూరంలో ఉంటేనేమి అమ్మ_ఆమె దీవెనలన్నీ మనవేగా
1790. ఊపిరిగా మారిపోదాం అమ్మకు_తన జీవంలో మనమున్నామంటూ..
1791. మనసంతా అమ్మకే_క్షణాలన్నీ రోజులుగా మారిపోతున్నా..
1792. అమ్మకైతే తప్పలేదు_అవకాశావాదులు జీవితం నుండీ తప్పుకున్నా..
1793. అమ్మకి ఆసరా ఇచ్చేదెవరో_ఆమెందరిని చేరదీసి జీవితమందించినా
1794. అమ్మొక సహకారమే_ఆసరా కరువైన ఏ జీవితానికైనా..
1795. మరుజన్మలోనూ స్త్రీగానే పుట్టాలనుంది_అమ్మగా పూజలు అందుకోవాలని..
1796. ప్రాణామాలే అమ్మకి_బిడ్డలకు ప్రాణాలను పణంగా పెట్టిందని..
1797. అమ్మని ఆయుధం చేస్తూ కొందరు_తమ పంతాలను గెలిచేందుకు..
1798. యంత్రంగా మిగిలిందొక అమ్మ_బిడ్డలే మనిషిగా చూడకపోతుంటే..
1799. సంగీతం తానయ్యింది అమ్మ_సరిగమలు నేర్వాలనుందని మనసంటే..
1800. ఎంత రాసినా తక్కువేగా అమ్మ_మరికొంత ఎక్కడో మిగిలిపోతూ..

No comments:

Post a Comment