701. రెట్టింపు అవుతున్న నవ్వులు_సహస్రానికి దగ్గరపడే సూచనిస్తుంటే మనసు..
702. నీ నవ్వుల్లో నెలవంకను గుర్తుపట్టాలే_నన్ను చూసి ఒంపు తిరిగినవని..
703. తుంటరి తనమంటే మనసవుతోంది_మనమిద్దరం ఒంటరిగా ఉన్నామని..
704. పొద్దులు కలవరించడంతోనే సరిపోతుంది_కలలో ప్రతిరేయీ నీవయ్యాక..
705. కలలోనూ పులకరింతలే_వేకువపువ్వై నువ్వు నిద్దురలేపుతావనే ఆనందానికి..
706. కలలోనూ కలబోసుకుంటున్నా_నీతో ఊసులకు అంతులేదంటూ..
707. ఊసులెతుక్కుంటున్నవి_కొత్తబంగా రు లోకపు విశేషాలు నువ్వు వివరిస్తావని..
708. జారిపోతున్నా నీ ఊహాలోకంలోకి_ఎదురై నన్ను ఆహ్వానించావనే..
709. తారకనైపోనా నీ లోకంలో_జాబిల్లికై ఎదురు చూడలేకున్నా..
710. అక్షరముత్యాలకై దోసిలిపట్టా_ఒంటరితనాన్ని భరించలేకే..
711. చిగురాకు పచ్చదనాలు పూసుకున్న నా అక్షరాలు_తారాలోకానికి ఊపిరవ్వాలని..
712. కెరటమై ఎగిసిన కల_తీరం చేరేలోపునే మేల్కొల్పుతూ..
713. ఋతురాగాలను మరచిందేమో_ఏకం చేసెను మది వసంతం..
714. హద్దెరుగని మనసు_ఆకాశం చుంబించే కెరటం తానవ్వాలంటూ..
715. వైద్యానికందని ముక్కల మనసులు_మూసుకుపోయిన గుండెకవాటాల సాక్షి..
716. మధుశృతులు మిగిలే ఉన్నాయి_నీ వియోగాన్ని ఆస్వాదించమంటూ..
717. మధువై రాల్చిన మధురోహలెన్నో_దోసిలిలో ఇమడలేనని జారిపోతూ..
718. లిపన్నదే లేకుండా పోయేదేమో_చూపులభాష్యమే చదవగలిగితే..
719. మనసు అభిరుచులు మరచింది_నీ ఆస్వాదనలో మునిగితేలి..
720. పేరెప్పుడో మరచిపోయా_నీతో కలిపి సంబోధిస్తుంటే నన్నంతా..
721. నీకు కానుకైనప్పుడే అనుకున్నా_మరో ఏడుజన్మలు నీతోనేనని..
722. పెదవులకి తప్పని రంగులు_వెతల్ని మింగలేని బ్రతుకులో..
723. పరిమళించని పువ్వులెన్నో_రంగుని మాత్రం రంగరించుకొని..
724. ముసుగేసుకున్న మనసులు కొన్ని_ఆత్మను ఆరాధించలేక సతమతమవుతూ..
725. అక్షరమొక అద్భుతమే_అందరి భావనల్లో అలవోకగా ఒదిగిపోతూ..
726. ఎలా కురిస్తేనేమిలే_నీ స్మృతులెప్పుడూ పన్నీటిజల్లులే నాకు..
727. ఏకాంతం బాగుంది_తొలి వేసవి తొలకరులు నాలో పులకరింతలు రేపుతుంటే..
728. వెంటాడుతూనే ఉంది వానెందుకో_నా కంటి అశృవులకు పోటీగా...
729. మధురమైనవి నీ జ్ఞాపకాలు_తీయని వెన్నెలను కలగలిపినందుకే..
730. ఆనందం ఆటవెలదైంది_జానపదంలా నువ్వు నన్ను పాడుతుంటే..
731. జీవితమో రహస్యమేగా_మౌనాన్ని అలంకరిస్తూ గడిపేస్తే..
702. నీ నవ్వుల్లో నెలవంకను గుర్తుపట్టాలే_నన్ను చూసి ఒంపు తిరిగినవని..
703. తుంటరి తనమంటే మనసవుతోంది_మనమిద్దరం ఒంటరిగా ఉన్నామని..
704. పొద్దులు కలవరించడంతోనే సరిపోతుంది_కలలో ప్రతిరేయీ నీవయ్యాక..
705. కలలోనూ పులకరింతలే_వేకువపువ్వై నువ్వు నిద్దురలేపుతావనే ఆనందానికి..
706. కలలోనూ కలబోసుకుంటున్నా_నీతో ఊసులకు అంతులేదంటూ..
707. ఊసులెతుక్కుంటున్నవి_కొత్తబంగా
708. జారిపోతున్నా నీ ఊహాలోకంలోకి_ఎదురై నన్ను ఆహ్వానించావనే..
709. తారకనైపోనా నీ లోకంలో_జాబిల్లికై ఎదురు చూడలేకున్నా..
710. అక్షరముత్యాలకై దోసిలిపట్టా_ఒంటరితనాన్ని భరించలేకే..
711. చిగురాకు పచ్చదనాలు పూసుకున్న నా అక్షరాలు_తారాలోకానికి ఊపిరవ్వాలని..
712. కెరటమై ఎగిసిన కల_తీరం చేరేలోపునే మేల్కొల్పుతూ..
713. ఋతురాగాలను మరచిందేమో_ఏకం చేసెను మది వసంతం..
714. హద్దెరుగని మనసు_ఆకాశం చుంబించే కెరటం తానవ్వాలంటూ..
715. వైద్యానికందని ముక్కల మనసులు_మూసుకుపోయిన గుండెకవాటాల సాక్షి..
716. మధుశృతులు మిగిలే ఉన్నాయి_నీ వియోగాన్ని ఆస్వాదించమంటూ..
717. మధువై రాల్చిన మధురోహలెన్నో_దోసిలిలో ఇమడలేనని జారిపోతూ..
718. లిపన్నదే లేకుండా పోయేదేమో_చూపులభాష్యమే చదవగలిగితే..
719. మనసు అభిరుచులు మరచింది_నీ ఆస్వాదనలో మునిగితేలి..
720. పేరెప్పుడో మరచిపోయా_నీతో కలిపి సంబోధిస్తుంటే నన్నంతా..
721. నీకు కానుకైనప్పుడే అనుకున్నా_మరో ఏడుజన్మలు నీతోనేనని..
722. పెదవులకి తప్పని రంగులు_వెతల్ని మింగలేని బ్రతుకులో..
723. పరిమళించని పువ్వులెన్నో_రంగుని మాత్రం రంగరించుకొని..
724. ముసుగేసుకున్న మనసులు కొన్ని_ఆత్మను ఆరాధించలేక సతమతమవుతూ..
725. అక్షరమొక అద్భుతమే_అందరి భావనల్లో అలవోకగా ఒదిగిపోతూ..
726. ఎలా కురిస్తేనేమిలే_నీ స్మృతులెప్పుడూ పన్నీటిజల్లులే నాకు..
727. ఏకాంతం బాగుంది_తొలి వేసవి తొలకరులు నాలో పులకరింతలు రేపుతుంటే..
728. వెంటాడుతూనే ఉంది వానెందుకో_నా కంటి అశృవులకు పోటీగా...
729. మధురమైనవి నీ జ్ఞాపకాలు_తీయని వెన్నెలను కలగలిపినందుకే..
730. ఆనందం ఆటవెలదైంది_జానపదంలా నువ్వు నన్ను పాడుతుంటే..
731. జీవితమో రహస్యమేగా_మౌనాన్ని అలంకరిస్తూ గడిపేస్తే..
732. చందమామే చినబోయింది_చెలి చిరునవ్వుల వెలుగులలో..
733. తారగా మిగలాలనుకున్నానందుకే_నీ జ్ఞాపకాల్లో నిలిచుండాలని..
734. పువ్వులను సంధించినందుకేమో_నీ హృదయసవ్వడి రాగమై వినబడుతోంది..
735. వానవిల్లై కనికట్టు చేసేస్తుందనుకోలా_కన్నుల్లో కురిసిన అమృతవర్షం..
736. వేరే పరిమళమెందుకులే నీకు_నా స్మృతుల గుభాళింపు మత్తెక్కిస్తుండగా..
737. ఎన్ని వెన్నెల రేణువులో_పరిమళమైన నీ జ్ఞాపకాలలో ఒదిగిపోతుంటే..
738. ఆనందాల వెల్లువే_నీ స్మృతుల నిండు పున్నమి సయ్యాటల్లో..
739. కైవసమైన కన్నులు_నీ చూపుల లాస్యానికి చిక్కుకుంటూ..
740. వేడుకైన వేకువ_పొద్దుపొడుపు వెన్నెల్లో నవ్వింది నువ్వని..
741. ఆనందాన్ని పోగేసుకుంటున్నా_చిట్టాపద్దులా లెక్కెడతావని తెలీక..
742. మనసు తూట్లు పడుతోంది_నీ జ్ఞాపకాల ఆటుపోట్లకేనేమో..
743. అనుమతిచ్చావనే మదిలోనికొచ్చా_అనురాగాన్ని సాధన చేసుకుందామని..
744. చెలిమితో మీటినప్పుడే అనుకున్నా_చైత్రం నన్నల్లుకోబోతుందని..
745. దాసోహమయిపోయా_నీ పిలుపు వెల్లువై వినబడిందని..
746. గాలివాటానికే ఎగిరిపోతున్నా_నీ పరిమళంతో నన్నెత్తుకెల్తుందని..
747. పల్లవిస్తున్న ప్రాయమొక్కటి_నీ పాటకు అక్షరమై చేరాలని..
748. పులకింతలకర్ధం తెలుస్తోంది_భావామృతాన్ని విడువకుండా తాగుతూంటే..
749. నీ అడుగులో అడుగు కలపాలని_నా మదిలోని వలపు మాటొకటి..
750. తీయనయ్యింది తనువు_అమృతం చరియించిన ఆస్వాదనైపోతూ..
751. సౌదామినై వచ్చానందుకే_నీలో తటిల్లతనై మెరవాలనే..
752. సన్నజాజిలో నేను లేనా_నువ్వు జడలో తురుముకొని మురిసిపోతానంటే..
753. దారానికీ గంధం సోకింది_సన్నజాజుల సువాసనలాంటిది మరి..
754. నిశీధికన్య అలిగిందట_తనను కాదని నన్ను కౌగిలించావని..
755. ఎన్ని పారాణులు పూసుకుందో మావిచిగురు_వేసవికి ముందే నీళ్ళోసుకుందంటూ..
756. ఆకాశం అలంకరించుకుంటోంది_చుక్కల ముగ్గుల్ని నక్షత్రాలుగా మార్చుకుంటూ..
757. మెలకువొచ్చిందప్పుడే_నాలో ప్రేమ నువ్వై ఉదయించినప్పుడే..
758. ఆశలన్నీ నీవైపే ప్రవహిస్తున్నాయి_మంత్రమేసావేమో తెలియట్లేదు..
759. ఎంతకని ప్రేమించాలో నిన్ను_మనసింతలా గిల్లుతుంటే..
760. పరిమళిస్తూనే ఉంటా నీలో_గులాబీలా నన్ను దాచుకున్నందుకైనా..
761. గారాలు ఉడికిస్తావెందుకో..నాలోని నయగారాలు దోచుకుంటూ..
762. వేరే శీతలమెందుకు..నీ చూపుల చల్లదనాల మక్కువుండగా..
763. స్వరాల సల్లాపాలు..సారస్వత రాగాలూ_ఇంకేం కావాలి జీవితానికి..
764. పదాలెన్ని దాచానో_మాటగా నిన్నభిషేకించేందుకు..
765. కన్నులు అరనవ్వుతాయంటే నమ్మలేదు_నీ నిమీలితాలు చూసేవరకూ..
766. అంతులేని ఆనందకెరటాలు_నీ మదిలో ప్రతిబింబం నేనయ్యానని..
767. కానుకనై నేనొచ్చా_కన్నుల్లో నీ ఆకాంక్షను కనిపెట్టినందుకే..
768. ఆ జీవితం ధన్యం_మరో కంటికి వెలుగైనందుకు..
769. విజయం నవ్వుకుంటోంది_ఓటమి వెనుదిరిగి పోయిందనే..
770. విరహమొక్కటేగా మిగిలింది_నా నవ్వులు నీకు కానుకయ్యాక..

771. నిరవధిక పయనమే నాది_విజయాన్ని అందుకొనే దశలో..
772. దోసిలి మల్లెలిచ్చానప్పుడే_నీ మదిని చల్లబరచి సేదతీర్చేందుకు..
773. పరుగాపకనే ఉరకలేస్తున్నా_నా గమ్యం నువ్వని గుర్తించినందుకే
774. కరిమబ్బును కాటుక చేసావెందుకు_చూపుతో నిన్ను మత్తెక్కించొద్దనుకుంటే
775. అక్షర మెరుపులే ఏక్తారల్లోనూ_హేమంతంలో చిరుజల్లును కురిపించాలంటూ.
776. మబ్బులెందుకు నింపుకున్నాయో నీటిని_నిన్ను అభిషేకించేందుకు..
777. తొలకరై కురుస్తున్న వలపు_నిన్ను చూసిన తొందరలో.
778. శీతలమై గడ్డకడతావనుకున్నా_మలయసమీరమై నన్నల్లుకునేదాకా..
779. ఎన్నందాలో ఆమె నీలి కన్నుల్లో_నీలిగగనంతో తాము పోటీ పడినట్లు..
780. అనురాగం వినబడినప్పుడే అనుకున్నా_ఆకాశవీధిన చేరింది నువ్వేనని..
781. నీలాకాశం ఒంటరిదయ్యింది_పున్నమినాడు చుక్కలన్నీ ఏక్తారలో చేరినందుకు..
782. మౌనవించిన మేఘాలు_భావాలు అరువుకోసం భావకులు వెంటపడుతుంటే..
783. తీయగా కురుస్తోంది వెన్నెల_హేమంతానికి మదువును కానుకిస్తానంటూ..
785. జాబిలికెన్ని అలుకలో_జాలువారుతున్న వెన్నెల నన్ననుసరిస్తోందని..
786. జిలిబిలి వెలుగులేమిటొ నా మదిలో_పున్నమి పండుగ ఆకాశానికైతే
787. జావళీలను ఆలపిస్తున్న జాజులు_రాతిరి రాసలీలను నెమరేసుకుంటూ..
788. అమాసను అంటగడదామనుకోలేదసలు_రాతిరలా బాధపడుతుందనుకుంటే
789. కృష్ణపక్షానికొచ్చినందుకేమో_ది గులు మోములవుతున్నా తారలు..
790. ఎరుపెక్కిన తూరుపు బుగ్గలు_చీకటిని చీల్చుకొనొచ్చాయని..
791. అమాసకప్పుడే ప్రయాణమెందుకో_ప్రయాస పడుతూ అలసిపోతున్న తారలు..
792. శీతలమొచ్చింది ఆదిత్యం కోసం కాదట_హేమంతాన్నోమారు చూడాలనట..
793. తీతువుతో స్నేహాలెందుకో_తారల మెరుపులనూ మబ్బులు దాచుకునేట్టు..
794. శిశిరానికి పక్షముందిగా_హేమంతాన్ని పంపేందుకు సూడిదలెందుకప్పుడే..
795. అవే మేఘాలు_ఈరోజెందుకో సంధ్యారాగాన్ని పాడమంటూ..
796. రాలిపోతుందనేమో శిశిరం_షడ్రుచులను అప్పుడే ఆరగిద్దమనేమో..
797. అలరిస్తున్న ఆనందం_స్వేచ్ఛ విహంగమై ఎగురుతున్న విశ్వాసానికి..
798. వెన్నెలెప్పుడూ వృధా కాదు_నా చిరునవ్వులు నీకున్నంతవరకూ..
799. ఆకాశాన్ని చిన్నబుచ్చుతావెందుకో_నిత్యహరి విల్లు నీ పెదవుల్లో ఉందంటూ..
800. సంధ్యలోని సింధూరాల్ని పూసుకొనొచ్చా_నా పరిమళం మెచ్చుతావనే..
772. దోసిలి మల్లెలిచ్చానప్పుడే_నీ మదిని చల్లబరచి సేదతీర్చేందుకు..
773. పరుగాపకనే ఉరకలేస్తున్నా_నా గమ్యం నువ్వని గుర్తించినందుకే
774. కరిమబ్బును కాటుక చేసావెందుకు_చూపుతో నిన్ను మత్తెక్కించొద్దనుకుంటే
775. అక్షర మెరుపులే ఏక్తారల్లోనూ_హేమంతంలో చిరుజల్లును కురిపించాలంటూ.
776. మబ్బులెందుకు నింపుకున్నాయో నీటిని_నిన్ను అభిషేకించేందుకు..
777. తొలకరై కురుస్తున్న వలపు_నిన్ను చూసిన తొందరలో.
778. శీతలమై గడ్డకడతావనుకున్నా_మలయసమీరమై నన్నల్లుకునేదాకా..
779. ఎన్నందాలో ఆమె నీలి కన్నుల్లో_నీలిగగనంతో తాము పోటీ పడినట్లు..
780. అనురాగం వినబడినప్పుడే అనుకున్నా_ఆకాశవీధిన చేరింది నువ్వేనని..
781. నీలాకాశం ఒంటరిదయ్యింది_పున్నమినాడు చుక్కలన్నీ ఏక్తారలో చేరినందుకు..
782. మౌనవించిన మేఘాలు_భావాలు అరువుకోసం భావకులు వెంటపడుతుంటే..
783. తీయగా కురుస్తోంది వెన్నెల_హేమంతానికి మదువును కానుకిస్తానంటూ..
785. జాబిలికెన్ని అలుకలో_జాలువారుతున్న వెన్నెల నన్ననుసరిస్తోందని..
786. జిలిబిలి వెలుగులేమిటొ నా మదిలో_పున్నమి పండుగ ఆకాశానికైతే
787. జావళీలను ఆలపిస్తున్న జాజులు_రాతిరి రాసలీలను నెమరేసుకుంటూ..
788. అమాసను అంటగడదామనుకోలేదసలు_రాతిరలా బాధపడుతుందనుకుంటే
789. కృష్ణపక్షానికొచ్చినందుకేమో_ది
790. ఎరుపెక్కిన తూరుపు బుగ్గలు_చీకటిని చీల్చుకొనొచ్చాయని..
791. అమాసకప్పుడే ప్రయాణమెందుకో_ప్రయాస పడుతూ అలసిపోతున్న తారలు..
792. శీతలమొచ్చింది ఆదిత్యం కోసం కాదట_హేమంతాన్నోమారు చూడాలనట..
793. తీతువుతో స్నేహాలెందుకో_తారల మెరుపులనూ మబ్బులు దాచుకునేట్టు..
794. శిశిరానికి పక్షముందిగా_హేమంతాన్ని పంపేందుకు సూడిదలెందుకప్పుడే..
795. అవే మేఘాలు_ఈరోజెందుకో సంధ్యారాగాన్ని పాడమంటూ..
796. రాలిపోతుందనేమో శిశిరం_షడ్రుచులను అప్పుడే ఆరగిద్దమనేమో..
797. అలరిస్తున్న ఆనందం_స్వేచ్ఛ విహంగమై ఎగురుతున్న విశ్వాసానికి..
798. వెన్నెలెప్పుడూ వృధా కాదు_నా చిరునవ్వులు నీకున్నంతవరకూ..
799. ఆకాశాన్ని చిన్నబుచ్చుతావెందుకో_నిత్యహరి
800. సంధ్యలోని సింధూరాల్ని పూసుకొనొచ్చా_నా పరిమళం మెచ్చుతావనే..
No comments:
Post a Comment