Wednesday, 6 July 2016

ఏక్ తారలు : 01601 నుండి 01700 వరకు

1601. నీ రాకతో నేను_వెన్నెల వరించిన రాతిరినే..
1602. ప్రేమయుద్ధం ఆపేసానిక_కాలాన్ని పారేసుకోలేక..
1603. తెల్లని మల్లెలు మదితో గుసగుసలు_మండువేసవిలో రేయి సాయమవుతామంటూ
1604. పనులు వాయిదా మరోసారి_నీకన్నా చాలా విలువైనది వేరేదీ లేదనే
1605. తెల్లగులాబీలనే అనుకున్నా_నిన్ను తాకి ఎరుపును సంతరించుకుంటాయని తెలీక
1606. ప్రతిక్షణమూ పరవశమే_నీతో దోబూచులాడే మనసైన వేళ
1607. వసంతాన్ని వాయిదా వేయలేనంటావా_శ్రావణమంటే నీవు మక్కువన్నావని..
1608. నా కన్నులు మందారాలే_నీకై నిరీక్షణలో కాటుకను కరిగిస్తూ..
1609. శిశిరంలా ఆశలు రాల్చేస్తావెందుకు_హేమంతమై చల్లగా నే వస్తానంటున్నా
1610. దొంగతనమైనా నీతోనేగా_మనసెన్నిసార్లు పోగొట్టుకున్నా..
1611. పూలరాగాలెన్నో పాటగట్టా_నువెప్పుడు రమ్మనటే అప్పుడొద్దామనే
1612. నీ పిలుపుతో నేను_వలపందుకున్న మయూరంలా
1613. అరచేతిలో విశ్వం_అక్షరమై నీ కలంలో ఒదిగిపోవాలనే..
1614. గుండె గుట్టు చేస్తోంది_నన్ను మాయతో ఏమార్చేయాలనేమో..
1615. వలపును కొత్తగా రాస్తున్నవెందుకో_వరమై దరికొచ్చినా కూడా
1616. అనుభూతి గులాబీగా మార్చుకున్నా_ నీ ఎదసవ్వళ్ళను ఆలకిస్తూనే..
1617. నా వెలుతురంతా నీదేగా_హృదయంలో నవ్వులు నీవయ్యాక
1618. నిశీధికి చోటెక్కడుందిలే_అభావమంతా నీరవంలోకి నెట్టేసాక
1619. నీ జతగానే జీవిస్తున్నా_మన ఆత్మలు రెండూ ఏకమైనందుకే...
1620. రాగాలు మరచిన కోయిల_ఋతువుల తారుమారులో తప్పిపోయి..
1621. నీ పదాలకే పరవశిస్తున్నా_నన్నక్షరముగా రాసావనే
1622. జ్ఞాపకాలందించా_నా గుర్తుగా అప్పుడప్పుడూ పరిమళిస్తాయని..
1623. నీ నవ్వులలోనే చేరిపోయా_కలలోనూ నాకై ఎదురుచూస్తుంటావనే..
1624. అదో అక్షరాల విన్యాసం_తొలకరించిన ఆనందాల సందోహం
1625. నేనేగా వసంతం నీకు_అది హేమంతమైనా శరత్తైనా..
1626. ఒంటరితనమో శాపమే_శూన్యమైపోయే మనసుతో..
1627. ఏకమైనప్పుడే అనుకున్నా_నేనింక నీలోనే ఉండిపోదామని..
1628. ఒంటరితనమే చుట్టమయ్యింది_నిన్ను వెతికే దారిలో తోడుందని..!
1629. ఆలయం మెట్లూ చేరనివ్వలేమో_ఉరికొయ్య ఆదరించింది అతడిని పాపం..
1630. కలలన్నీ రాత్రి పరమయ్యాయి_పగటినిద్రకి తీరికే లేదంటే
1631. వసంత వెన్నెలకెందుకో విషాదం_ఏకాంతం దొరకని మన జంటను చూసిందేమో..
1632.  నిశీధిలో నీ జ్ఞాపకాలు_వెన్నెలను స్వప్నించే స్వర్గాలు..
1633. ఏకాంతంపై మనసయ్యింది_నీరవంలో వెన్నెల చిరునవ్వుతూ జాలువారుతుంటే..

1634. ఊసుల మాలెప్పుడో కట్టేసాను_స్మృతుల గులాబీలన్నింటినీ పోగేసి..
1635. వసంతాన్ని వెతకాల్సొస్తుంది_ఆరుకాలాలూ మండే గ్రీష్మ పత్రాలవుతుంటే..
1636. కొన్ని భావాలంతే_హృదయాన్నే ముంచే అపరిమిత భాష్పాలు
1637. మౌనమెప్పుడూ మంచిదే_స్పందించే మనసు కరువైతే
1638. ఆకాశమే తలొంచింది_నీ సంతోషంలో సగమైనా పంచిస్తావని..
1639. విజయమెప్పుడూ గొప్పదే_మరుగుజ్జు మనసులను వేరుచేసి చూపిస్తూ..
1640. వసంతం వెనుకబడింది_ నెలవుతున్నా  కోయిల కూతలు వినరాలేదనే..
1641. గమ్యం గోదారిగా కనిపిస్తోంది_రాదారి బాటే మరచిపోతుంటే..
1642. దారులన్నీ కనుమరుగయ్యాయి_ప్రతిదారిలోనూ అహం అడ్డుగా నిలబడితే
1643. కాకిగోలలే జీవితమంతా_కోయిల కలనైనా కానరాకుంటే
1644. విషాలు చిమ్ముతున్న మనసులు_మధురసాలనే పంచాలని చూస్తున్నా
1645. అవనెప్పుడూ నా పక్షమే_శుక్ల కృష్ణపక్షాలు నెలరేడుకిచ్చి..
1646. రాగం మార్చిన కోయిల_మేఘసందేశమొకటి కొత్తగా వినబడుతుంటే
1647. వసంతం నిలిచిపోదా_అలిగిన కోయిల అలుకను తీర్చేందుకైనా
1648. ఎంత అమృతం ఒలికిపోయిందో_ఆనందాన్ని వేరుచేసే ప్రయత్నంలో
1649. వర్షమందుకే హొయలు పోయింది_తన గొప్పదనాన్ని చూపిస్తూ..
1650. నాకూ కోయిలవ్వాలనుంది_నీ మనసులో చోటిస్తావని..
1651. గోదారి గంగైపోయింది_పాపాలను వద్దనుకోలేకనేమో
1652. అక్షరం చేయలేదు భావాలన్నీ_మదిలోనే దాగి ఉండిపోవాలని..
1653. ముత్యాలెందుకు ఘొల్లుమన్నాయో_నా నవ్వుల మువ్వలు నువ్వేరుకుంటుంటే..
1654. మువ్వల వాన కురిసినట్లుంది_నీ పదాలజల్లుకై నేనెదురుచూస్తుంటే..
1655. సంధిస్తూనే ఉన్నా_ఒక్కసారన్నా నీకు గాయం చేద్దామని..
1656. కలల వేదనది_విషాదమై ప్రవహిస్తూ..
1657. హృదయపు స్వరఝరి_మువ్వల కేరింతలకు తానూ జతపడి..
1658. అచ్చెరువే నా మది_చిత్తరువెక్కడ చిత్తంలో నువ్వు మెదలందే..
1659. నా మనసేమో చకోరమయ్యింది_నీ మాటలకెదురు చూస్తూ..
1660. అపురూపమే నీ కలం_నన్నెలా వర్ణించినా..
1661. స్మృతులెందుకు బరువెక్కినవో_నా తలపులోకి నీవొస్తుంటే
1662. అపూర్వమే నీ స్పందన_నన్నెలాగైనా గుర్తించేస్తూ..
1663. ఓటమే గెలుస్తోంది_నిన్ను మరవాలని ప్రయత్నించిన ప్రతిసారీ..
1664. అక్షరాలకెంత ఆనందమో_నాలా తమను దిద్దేస్తుంటే..
1665. అక్షరమాలొక్కటే సరిపోయింది_అచ్చులూ హల్లులే వాక్యాలుగా పేరుకుంటుంటే..
1666. హృదయానికెందుకో ఆరాటం_కోలాటమాడుతుంది కన్నులైతే
1667. పండుగ రావాలనుకున్నా కోలాటానికి_నువ్వొస్తే చాలని తెలియకమునుపు..
1668. క్షణాలతో పోరాటం మొదలెట్టా_చూపుల కోలాటానికి సమయముందనే..
1669. వేసవితో కోలాటమే క్షణాలకు_నిన్ను చేరే దారి వెతుకుతూ..
1670. చుక్కలతో కోలాటమాడుతూ అధిక ధరలు_పగలే నక్షత్రదర్శనమైనట్లు
1671. నిశి వెలిగినప్పుడే అనుకున్నా_ఆశల కోలాటమేదో మనసును కదిపిందని..
1672. కోలాటం మొదలయ్యింది ఎదలో_సంక్రాంతిలా నువ్వు రాగానే
1673. నేర్చేదేముంది కోలాటం_నీ కన్నులెప్పుడో చూపును ముడేసాక..
1674. మౌనం రాగరంజితమయ్యింది_మన మనసులాడుతున్న కోలాటానికే
1675. కోలాటమే నది_హృదయం చేస్తున్న ఆశల సవ్వడి..
1676. కోయిలెందుకో చిన్నబోయింది_చూపుల కోలాటానికి స్వరమందించలేనందుకేమో..
1677. ఎదలో తకధిమి ఏదోననుకున్న_నీ రాకతో కోలాటం మొదలయ్యాక
1678. అధరాలకెందుకో అలుక_కన్నుల కోలాటంలో చోటు దొరకలేదంటూ..
1679. కన్నీటికీ కోలాటం తెలుసేమో_బీడైన హృదయాన్ని తడిపేందుకు..
1680. అనుభూతి వెల్లువయ్యింది_నీ అడుగుల్లో జతచేరి కోలాటమాడుతుంటే..
1681. అరమోడ్పులైనప్పుడు అనుకోలా_నీ కన్నుల కోలాటం వల్లనేనని..
1682. అక్షరాల్లో దారెతుక్కున్నా_కవిత్వం కోలాటనికి రమ్మంటుంటే..
1683. మాటమాటకీ కోలాటమే_మనసులు కలవలేనందుకేమో..
1684. మది బృందావనమేగా_రాధారమణులమై కోలాటం మనమాడుతుంటే
1685. అడుగుల ఒయారాలు_మన్మధుడైన నువ్వు కోలాటానికి పిలిచినందుకే..
1686. చిరునవ్వుల వానలే పెదవుల్లో_ఎద కోలాటం మొదలవ్వగానే
1687. సంతోషాతిశయం_నీ కన్నులతో కోలాటమాడే భాగ్యం నాదయ్యిందని..
1688. ఆనందాల గుసగుసలు_అడుగుల కోలాటంతో జత కలుపుతుంటే
1689. ఆకాశమే హద్దయ్యింది_మది కోలాటపు సంతసానికి..
1690. అవే కలలు_కన్నుల కోలాటంలో పురుడోసుకుంటూ
1691. మరో కధ మొదలెట్టలేనింక_కన్నులు కోలాటానికి అలసిపోతుంటే
1692. భావాతీతమైంది ప్రేమ_చూపుల కోలాటంలో జనియించి
1693. కలతల కోలాటం_అపార్ధాలతో మనసు అతలాకుతలమవుతుంటే..
1694. అలసిపోతున్నా నేనెందుకో_నా ఊహల్లో ఉరకలేస్తుంది నువ్వైతే..
1695. ఆధారమైపోయావు_దారంలా మల్లెవంటి మదినల్లేస్తూ..
1696. పేరులోనే ఉందనుకున్నా పెన్నిధి_మాటలు తూటాలై పేలకముందంతా..
1697. గేయమెందుకో చిన్నబోయింది_మనసు గాయాన్ని ముచ్చటిస్తుంటే
1698. వేకువ వెన్నెలనప్పుడే కనుగొన్నా_జాబిలి కౌగిలిలో చుక్కలను చూడగానే..
1699. బృందావనమేగా తారావనం_నువ్వూ నేనూ ఏకమై నృత్యిస్తుంటే
1700. అక్షరాల రాశులన్నీ పోగేసుంచా_నిన్ను కవిత్వంగా కూర్చుకోవాలనే..

No comments:

Post a Comment