501. ఎండ కన్నెరుగని అందమే_తారలను మోహిస్తూ నేడు..
502. మురిసిన భావమాలిక_తారాపధంలో తానొకటైనందుకు..
503. తమస్సు తొలిగిపోయింది_వెలుతురైన నన్ను నువ్వాహ్వానించాక..
504. వెలుతురు బెదురుతోంది_తొలికిరణమై మెరిసే హేమంతం నాలో దాగుందని..
505. వేలకిరణాల పోగులా మారిపోయా_నువ్వొక్కసారి పలకరించగానే..
506. నీ చిరునవ్వులోనే వెతుకుతున్నా_నే కోరిన కిరణాలు దాగున్నవని..
507. రాతిరి కురచైనట్లనిపిస్తోంది_జంటజావళి లో జాగారం మరింత బాగుందంటూ..
508. సంతోషం ఉప్పొంగింది ఎదలో_ఆ'రాధని నేనని గుర్తించినందుకే..
509. సూర్యుని కిరణాలకే ఎదురుచూస్తున్న మది_హేమంతపు చలికి ఓర్వలేక..
510. సుస్వరాలహేలయ్యింది మది_ప్రేమరాగలతో నే పరవశమవుతుంటే
511. పులకింతలపర్వం మొదలెట్టానందుకే_అవకాశమిచ్చి నువ్వు రాయమన్నందుకే
512. అవకాశం అందుకున్న ఆనందమనుకుంటా_అంబరాన్ని దాటి ఎగిరింది కవిత్వం..
513. గోదారిగా మారిపోవాలనుకున్నా_ఏ దారిలో నువ్వొస్తావో తెలియలేదనే..
514. అంబరం గొడుగయ్యింది_తడిచిపోతున్న కవితావృష్టికి సాయమవ్వాలని..
515. కవిత్వం కురిసిన శబ్దమనుకుంటా_చడీచప్పుడూ లేక మనసు దోచేస్తూ..
516. మనసెంత మాయలమారో_నిన్ను రాయాలనే ఆరాటంలోనే ఏమారిపోతూ..
517. అక్షరాల ఆనందాలు_శరమై నిన్ను సంధించాలనే ఉత్సాహంలో..
518. నిరీక్షణలో యుగాలు గడుస్తున్నట్లుంది_గడుసరివై నువ్వు అగుపడలేదని..
519. గాలి అలలతో పోరాడుతున్నా_వచ్చింది అదృశ్యరూపంలో నీవని తెలియక
520. నిరీక్షణా శిశిరాలు_రాలే ఆశలను ఆగమని శాసించలేక..
521. అంతరంగం అద్దమై మెరిసింది_కలికితురాయిలా నువ్వు కనపడగానే..
522. అద్దంలో నన్ను చూసుకోవాలనుకున్నా_నువ్వే కనిపిస్తావని తెలియక..
523. నువ్వనే ఆరాటం పెరిగిపోతోంది నాలో_నువ్వే నేనని చెప్పి మెప్పించావనే..
524. నవ్వుతూనే మిగిలిపోవాలనుంది నీలో_నా నవ్వుకి నువ్వు దాసోహమని..
525. తలపుల తెరలు మూయలేకున్నా_నా ఊహలో నీవొచ్చి ఊయలూగుతుంటే..
526. నవ్వులు పూవులై పూస్తాయనుకోలా_నీవొచ్చి నన్ను నవ్వించేవరకూ
527. నే క్రీగంట చూస్తుంది నిన్నేగా_వాలుచూపులో తొంగిచూసేందుకేముందని..
528. నీ సేద్యం ఫలించిందిగా_నా పెదవుల్లో నవ్వులను పూయించి..
529. నయనాలకెందుకన్ని నవ్వులో_తనలో నీ రూపును దాచుకున్నందుకు..
530. నీ రూపులో అనురాగం కనిపిస్తోంది_వినిపించని కోయిల చాటయ్యిందేమో..
531. కలవరించిన కవనమొకటి_అక్షరాలను విత్తులుగా జల్లితే బాగుండునంటూ..
532. కలకలమవుతున్న కలలు కొన్ని_కన్నులు నిరాకరించాయనే అలుకల్లో..
533. నిన్నటి కలే తిరిగొస్తోంది_కలతనిద్రైందని నాకు గుర్తుచేసేందుకేమో
534. మురిపాల విందుకు మొహం మొత్తిందట_మొహమాటానికి తెరవేస్తూ మది..
535. మధురసాల మోహనమే మది_నీ మురిపాలు నెమరేసే కొద్దీ..
536. కల కంచికి పోనంది_కాశ్మీరమై నువ్వెదురుపడి ఆహ్వానిస్తుంటే..
537. ఏ చిలిపి కలల కధానాయకుడివో..ప్రతిరేయీ నన్నే నాయికగా కోరుకుంటూ..
538. రెప్పల రహస్యంలో దాచేసుకున్నా_నీవే నా కలవన్న నిజాన్ని..
539. సుతిమెత్తని భావాల కదలికలు_కలలోని నిన్ను రాయాలని కలం పట్టగానే..
540. నేనే ప్రకృతినైపోయా_నీవొచ్చి సేదతీరే సమయం ఆసన్నమయ్యిందనే..
541. మంచు తెరలు మూస్తూనే ఉన్నా_హేమంతాన్ని చూడాలనుందని మనసు కోరిందని..
542. ప్రతిస్పందన కరువైన మనసు_నవనాడులూ సహకరించని నిస్సహాయతలో
543. వసంత నవరాత్రిని వేడుకుంటున్నా_తానొస్తే అక్షరయఙ్ఞం మొదలెడదామని..
544. అక్షర పూమాలలు కడుతున్నా_నీ హృదయాన్ని అలంకరించాలనే భావనలో..
545. మంచులా కరిగింది నా మౌనం_నీ పలకరింతల పులకరింతలతో..
546. భావుకతకు వందనాలంది మది_ఓలాలాడిస్తున్న తన చైతన్యానికి..
547. చైతన్యస్రవంతి నేనవుతున్నా_నీలో ప్రవహించమని మది కోరగానే..
548. చైతన్యస్రవంతి నేనవుతున్నా_నీలో ప్రవహించమని మది కోరగానే..
549. నీ చూపులెంత చురుకైనవో_ఏ మూలనున్నా హృదయంలో నన్ను కనుగొంటూ..
550. చూపుల సోయగంతో కట్టేయకలా_మనసు పరవశాన్ని అదిమిపట్టేలా
551. లలితగీతమైన గానమొకటి_నిన్ను పాడే నా పెదవులలో ప్రవహిస్తూ..
552. పెదవులకెన్ని ఒంపులో_నెలవంకలా మారి నిన్ను కవ్వించేందుకు..
553. నెలవంకలో ఎన్ని అందాలో_తారలను అనిమేషం చేసేస్తూ..
554. తారల తన్మయత్వం జాబిల్లి కోసమేమో_పరవశాన్ని నాకు అంటగడుతూ..
555. వెండి జాబిల్లిలా మెరుస్తోంది నీ మోము_నా రూపును దాచుకున్నందుకేమో
556. అపురూపమయ్యింది నీ రూపు_నన్ను వలచిన ఆనందం మోములో ప్రతిఫలించి..
557. విరహమేం తెలుసులే జాబిల్లికి_మబ్బులమాటున దాగి తారలతో సయ్యాటలాడుతూ..
558. అక్షరాలు సీతాకోకలే_అందుకోమని నన్ను సవాలు చేసి ఉడికిస్తూ..
559. అందుకోలేని అందమే కావాలనుంది_నీ చూపు చేరితే నన్ను చాలనుకుంటూ..
560. అందుకోలేని అందమే కావాలనుంది_నీ చూపు చేరితే నన్ను చాలనుకుంటూ..
561. మనసాపని దోబూచులాట_ముచ్చట్లను తారలుగా రాయమని ప్రేరేపిస్తూ..
562. అనుసరిస్తున్నా ఆనందాన్ని_నీలో దాగిందని తెలిసే మరి..
563. వెలిసిపోని వేకువపూలు_వివిధవర్ణాలతో ముచ్చటగొలుపుతూ..
564. ముద్రించుకున్నా నీ చెలిమిని_చెలివై నాకు సొంతమయ్యావనే
565. వర్ణాల వివర్ణాలు_హరివిల్లును మించి మెరిసిన ఆనందంలో..
566. వేకువ కువకువలే_తారలు కనుమరుగవుతుంటే ఆకాశంలో ఉదయానికి..
567. వేల వెలుతురులు దాచుకున్నా నాలో_నిశీధివై నీవొస్తే పంచుదామని..
568. రేయంతా పయనిస్తున్నా_నీవిచ్చే భావాల విందుకు హాజరవ్వాలని..
569. ప్రవాహవేగంతో నిన్ను చేరుకున్నా_నన్ను రమ్మని కబురంపావనే..
570. నీ చెలిమి రహస్యాలు_అడుగంటని ఊసుల సమాహారాలు..
571. అక్షరాలు నవ్వుకున్నాయి_నువ్వు రాసే ఒంపుల్లో తమను చూసుకుంటూ..
572. రాయని కావ్యమొకటి మిగిలింది_నీవొచ్చి పూర్తిచేస్తావనే నిరీక్షణలో..
573. వికసితమైన మధుకావ్యం_చాటువులో చేర్చుకున్న నీ చొరవకి..
574. మనసు దాహం తీరనంది_నీ నవ్వులపానం చేయనిదేనని..
575. ఏకాత్మగా నిలబడిపోయా_నీ నవ్వులకు ముగ్ధమైన నేను..
576. ఘడియలు క్షాణాలవుతున్నాయి_తారల సయ్యాటలో చేయి కదుపుతుంటే..
577. అందానికి కొదవేముందిలే_అక్షరాలను అలంకరించేది నీవైతే..
578. అక్షరాల మాలికలు_పరిమళిచాలనుందంటూ తారా గగనంలో..
579. తారలకెన్ని వన్నెలో_మురిపాలను రంగరించి మరీ రాసున్నందుకేమో..
580. తారాతీరానికి చేరిపోయా_భావాల గవ్వలేరుకొని మాల గుచ్చాలని..
581. అలసిపోని తారలు_మెరుపులీనుతుంటే హేమంతపు బిందువులో చేరి..
582. అమాస ఒంటరయ్యింది_తారల కాంతిలో దిక్కు తోచలేదంటూ..
583. సంగీతాన్ని మోసుకొచ్చిన అలవేగా నీవు_నాలో స్పందనను హెచ్చిస్తూ..
584. ఉదయించిన ప్రేమ నాలో_సంగీతం నీ ప్రాణమన్నావని..
585. అనురాగపు కాంతి చిందింది_నా ప్రేమను నువ్వు ఆమోదించగానే..
586. నీ పెదవుల గుసగుసలే_నేను పాడే సరస సరిగమలు..
587. ఎన్ని పదనిసలు గమకమయ్యాయో_నీ హృదయాన్ని పాడే వేళ
588. ప్రవహిస్తున్న ప్రేమ నది_శీతలమైన సంగీతంలా నువ్వు ఎదురుకాగానే
589. నీ ఆత్మీయత_నిశ్శబ్దాన్ని నింపిన పుష్ప పరిమళమేగా
590. వేరే సువాసనెందుకు మదికి_నువ్వే గంధమై నాలో పరిమళిస్తుంటే..
591. శృతికాని తారేముంది_నీవు మీటే ప్రేమాక్షరాలలో..
592. వెల్లువవుతున్న స్వరాలు కొన్ని_నిన్ను పాడుతుంటే తమను చేర్చుకోమంటూ..
593. అడుగేసా నీ హృదయంలోకి_శుభముహూర్తం ఇన్నాళ్ళకు కుదిరిందనే..
594. సుమగంధం నీవేగా_నన్ను తాకమనే నీ సంకేతాలు అందిస్తూ..
595. ప్రేమరాగమే అది_పంచమవేదమని పేరు మార్చుకుంది..
596. ప్రతిరాగంలో నిన్నే తిలకిస్తున్నా_అనురాగమై నన్ను అల్లుకున్నావనే..
597. అనురాగాలతో హరివిల్లట_హేమంతంలో హిమవర్షానికి కురిసిన కానుకేమో..
598. పరిమళిస్తున్న పుటలు_ఏక్తారలోని భావాల ఘుమఘుమలు సోకి..
599. గాఢాంధకారమైతేనేమి_తారలు తోడున్నవిగా నీరవంలో నాకు..
600. చెంగల్వగా పూసిన నా రూపం_ఒక్కమారు నీవు చెక్కిలి మీటగానే
502. మురిసిన భావమాలిక_తారాపధంలో తానొకటైనందుకు..
503. తమస్సు తొలిగిపోయింది_వెలుతురైన నన్ను నువ్వాహ్వానించాక..
504. వెలుతురు బెదురుతోంది_తొలికిరణమై మెరిసే హేమంతం నాలో దాగుందని..
505. వేలకిరణాల పోగులా మారిపోయా_నువ్వొక్కసారి పలకరించగానే..
506. నీ చిరునవ్వులోనే వెతుకుతున్నా_నే కోరిన కిరణాలు దాగున్నవని..
507. రాతిరి కురచైనట్లనిపిస్తోంది_జంటజావళి

No comments:
Post a Comment