801. పాపలా పరిగెత్తుకొచ్చా_పాపాయిని చేసి లాలిస్తానన్నావనే..
802. తుమ్మెదరెక్కల రంగును రాసుకున్నా కురులకు_కాటుకపిట్టలను వెక్కిరిద్దామనే..
803. వెన్నెల్లో నీ ఊసు వింటున్నా_దూరమైనా చెంత ఉన్నట్లనిపిస్తుంటే..
804. చీకటిలో చంద్రుడే వాడు_పగటివేషంలో సూర్యుడిగా కనబడుతూ..
805. జాబిలి వన్నె కరుతుందేమో_తన సోకుపెట్టెలో సామానులు నే దొంగిలిస్తుంటే
806. చుక్కలతో సామీప్యమెందుకులే జీవితానికి_పక్కనో చుక్క ఉండనేఉండగా
807. తరగనంటున్న ఊసులు_వెన్నెల్లో నాతో నువ్వున్నట్లు ఊహిస్తుంటే..
808. వెన్నెల కరిగింది_వానై కురిస్తే ఎలా ఉంటానో చూసుకోవాలని..
809. వియోగమేనాడో వెనుదిరిగింది_విరహంలోనూ నిన్నే నే కప్పుకుంటుంటే..
810. వెన్నెల ఊగుతున్నప్పుడే అనుకున్నా_నీ మాటలతో మైకమిచ్చుంటావని..
811. తప్పదుగా వృద్ధాప్యం_జీవితాన్ని పండించుకున్నామని తృపి చెందాలంటే..
812. రాధనైన నావెంటనున్నాడు మాధవుడు_ఈకలతో బృందానంలో వెతుకుతావెందుకో
813. జాబిలివై నువ్వున్నావుగా_తారలను నీకు అంటు కట్టేస్తాలే
814. తారలన్నీ నీకు అంటుకట్టుకోవా_జాబిలివై నువ్వుండగా నీలిగగనంలో..
815. విచిత్రమైన సువాసనలు_నువ్వు కోసుకొచ్చిన తారలదనుకుంటున్నా..
816. మేఘాలకెందుకో కంగారు_భావాలను ఆకాశంలో నువ్వెతుక్కుంటుంటే..
817. మనిషే రాముడుగా మారతాడుగా_ధర్మాన్ని సక్రమంగా పాటిస్తే
818. మురుస్తూనే ఉన్నా మదిలో_నీలో అమృతమై కురిసిన అదృష్టమైనందుకు..
819. మరందాలు పూసా మనసుకందుకే_చేదు జ్ఞాపకాలు నిన్ను చేరకూడదనే
820. విచ్చుకున్న మల్లెనై నవ్వా_శీతాకాలాన్ని మాయ చేద్దామనే
821. బదులిస్తున్నా నీ పాటకు_మేఘమైన నన్ను పలకరించావనే
822. మదనమంత్రమెప్పుడు వినేసావో_నచ్చలేదన్నట్లు అలుగుతావు..
823. ముచ్చట్లు కరువైన ముద్దులసతిని నేనేగా_అలగడంలో అన్యాయమేముందని..
824. నటించలేకున్నా_నీ జగన్నాటకంలో నన్ను అసూయగా చేయమన్నావనే..
825. నిత్యసంక్రాంతులేగా నీతో నాకు_వేరే చిత్రాలెందుకులే చూసేందుకు..
826. ప్రేమందుకే వెనక్కు మళ్ళింది_అహమంటేనే తనకి మక్కువయ్యిందని..
827. కరిపోయిందిగా అహమంతా_నీ ప్రేమ సెగలు వెన్నముద్దను చేసి తగలగానే..
828. యుగాలవుతున్న క్షణాలెన్నో_వియోగాన్ని స్మృతులతో లెక్కించుకుంటూ..
829. ఒకటే ఆశ_నీ ఊహల డోలికల్లో అలా ఊగుతూనే ఉండాలని..
830. ఊయలూపుతోంది నీ ఊసు_ఊహలలో నే ఊకొడుతుంటే..
831. మొదలయ్యింది వలపుహేల_నీ మాటల్లో అంత్యాక్షరిగా చేరతానంటూ..
832. మరో కధ మొదలయ్యింది_నీ కలలోకి నేనొచ్చానన్నపుడే..
833. హేమంత కౌగిళ్ళవి_చూపుల వెచ్చదనంతో చలి కాచుకుంటే..
834. పిలిచావనే వచ్చేసా వెన్నెలనై_మొన్ననే పున్నమైందని గుర్తొచ్చినా..
835. సంధ్యవేళ చిక్కిపోయింది_పదేపదే తూరుపునే నువ్వు హత్తుకుంటుంటే
836. భుజాలు తడుముకుంటున్న మదనుడు_ఆ ఘనకార్యం చేసింది తానుకాదంటూ..
837. కనుపాపలు సంబరపడ్డాయట_మరో కవలలకు కన్నుల్లో కానుపవుతుందని..
838. నెలరాజు నేలరాజవడని నమ్మకం_నీటిలో బింబాన్ని చూసి పొరబడుతూ..
839. కలువలున్నాయిగా కొంగిచ్చేందుకు_జలుబు చేసినా ముక్కు తుడిచేందుకు..
840. నా చెక్కిలి మెరుస్తోందిక్కడ_నీ కన్నీరు వరావర్తనమవుతుంటే..
841. జీవించే ఉన్నా_నీ భావాలలో నన్ను ఆవిష్కరించుకుంటూ..
842. దిగులెందుకో... నువ్వుంటే వసంతం తానే వస్తుందని మనసుకు తెలిసినా
843. మక్కువే వసంతానికి_నీతో తనని పోల్చి ఆహ్వానిస్తుంటే..smile emoticon
844. జడివాన మొదలయ్యింది_జాజులు జలజలా తారలై రాలుతుంటే..
845. మెరుస్తున్న నా మెద ఒంపు_ముత్యాలను మనసారా హత్తుకుంటుంటే
846. విరబూసిన నవ్వును నేనే_అలరించే తారా తీరాన్ని కెరటమై తాకి..
847. 'సన్న'జాజిని కాలేకపోతున్నా_అతిగా ఆకలి చంపేస్తుంటే
848. గల్లంతవుతున్న ఆశలు కొన్ని_హేమంతంలో నేనుంటే శిశిరమొచ్చి కాటేస్తుంటే..
849. కలల మాటెందుకులే ఇప్పుడే_నిద్రంటూ పట్టినప్పుడు చూడొచ్చుగా..
850. అలనై అల్లుకున్నానందుకే_ఒడ్డున నువ్వు నిలబడి ఊరిస్తున్నావనే..
851. కన్నుల కోలాటానికి విసుక్కుంటావే_రెప్పలు రహస్యం దాచలేక బెదిరిపోతుంటే..
852. చలికాలమంటే బెదిరిపోతున్నా_వసంతమొస్తే బాగుండనుకుంటూ..
853. వనితననే అనుకున్నా నిన్నటిదాకా_నన్నో కవితగా నువ్వు దిద్దేవరకూ..
854. గ్రీషమసెగలకేముందిలే_నిన్ను ఆదరించే నీరెండనై నేనుండగా
855. కోటి కోరికలూ కలానికందాయి_ఒక్క నీ ఊసు రాద్దామని మొదలెట్టగానే
856. అపరాజితనని ఆనాడే తెలుసులే_నీ మనసు గెలిచి అధిరోహించినందుకు..
857. అదే కలవరం_నువ్వొచ్చి నన్ను కవితగా రాస్తానంటే..
858. కలలన్నీ నువ్వు కావాలన్నాయి_కావ్యనాయికవై అలరిస్తుంటే..
859. వెన్నెల్లోనూ మంట రేపుతావు_ఏమని దాచుకోవాలో నేను..
860.
సప్తపదికి ఆనాడే సిద్ధమైపోయా_ఇష్టమది నీవని చేయిపట్టినప్పుడే..
861. మధూదయమవుతున్నా నేనే_నా కోసం నువ్వు మేల్కొంటావని..
862. మయూరినై వచ్చేస్తున్నా_నీవో నీలిమబ్బువై నాకు కనిపించగానే
863. తపనలను తోడు తీసుకొచ్చాలే_నీ వలపు రమ్మని పిలిచిందని..
864. మాఘమాసానికై ఎదురుచూస్తున్నా_మధురోహల్లో మది మునిగిందని..
865. తాపసం వీడింది మనసు_తమస్సు నీవొచ్చి తొలగించినందుకే
866. కలం పట్టి కూర్చున్నావుగా_కవితగా రాసుకుంటానంటే సాయపడతా
867. నీలిమబ్బు పాయని తీసిపారేస్తావే_తాపాని తీర్చే మేఘమదేనేమో..
868. చిటపట నవ్వులు నా పెదవుల్లో_నీ అల్లరి నవ్వులను చూసి..
869. అక్షరాలనెంత లాలించానో_గారం చేస్తే తప్ప దగ్గర కానంటుంటే
870. చినుకుతో చిగులేస్తున్నా_చెలిమి నువ్వై చేయి చాపావనే
871. నీ భావాలెప్పుడూ గమ్మత్తే_నా అలుకలను పోగెట్టేందుకు..
872. కోయిల కూజిత వినబడ్డపుడే అనుకున్నా_హేమంతంలో కబురెట్టింది నువ్వేనని..
873. పుత్తడినని భావించినందుకేగా_రేయి అలుకలను రసవంతంగా మారుస్తూ..
874. కొత్త తీగల విపంచినయ్యా_నీ చేతిలో ఒయారంగా ఒదిగిపోవాలనే
875. కన్నుల్లో కలనై రావాలనుకున్నా_చూపుల్లో బొమ్మ నేనని నువ్వనగానే
876. కొత్తపూల గాలి వీచినందుకేమో_నాలో ఆనందరాగం హద్దులు దాటుతూ..
877. రెప్పలు దాచని రహస్యమొకటి_కన్ను మూసుకోనని నీవంటుంటే..
878. కాలం కలిసొచ్చింది_నీ వెంట రమ్మని పిలిచినందుకే
879. జాబిలి నింగి దిగనంది_నేను జాబిలిగా మారక తప్పలేదు నిన్నలరించేందుకు
880. ఎన్ని గానాలు కూర్చానో_లలితవై నువ్వు ఒదిగిపోతావనే
881. వేయి రంగుల నా చీర_ఇంద్రధనసుని సవ్వలు చేసే గర్వంతో
882. నా సౌందర్యమెంత విలువైనదో_నీ కన్నులకి మాత్రమే విందుచేస్తూ..
883. సౌందర్యనిధులన్నీ చూపుల్లో దాచిపెట్టా_నీ చూపును కలిసినప్పుడిద్దామని..
884. ఆ కన్నుల్లో ఎన్ని కలలో_నిద్దురరాని నా కళ్ళకెలా తెలిసేది..
885. ఆమె కలలతో పనేముంది నీకు_అస్తిత్వాన్నలా తాకట్టుపెడుతూ..
886. వేరే అస్తిత్వమెందుకులే_ఆమెనే జీవితమని హృదయం గెలుచుకున్నాక..
887. జీవితార్ధాన్ని మారుస్తున్నావే_ఆమెని ప్రేమించిన తాదాత్మ్యంలో..
888. మైమరపు అందరికీ అనుభకైకవేద్యం కాదు_అనుభూతించే మనసుంటేతప్ప
889. నవినిధులు నాలో ఉన్నవని చెప్పిందెవరో నీకు_నా వెంట పడ్డావు..
890. కట్టుబాట్లు తెంచడమెందుకు_సంప్రదాయాన్ని గౌరవించే మంచిమనసుంచుకోక
891. వెన్నెలవుతున్న ఆనందాలు_నీ కన్నుల్లో చోటు దొరికినందుకే
892. ఊహలో ఎన్ని ఉయ్యాలలో_ఉద్వేగాన్ని పెంచి నన్నూపేస్తూ..
893. కోయిలలై కూస్తున్న ఊహలు_వసంతామెంతో దూరం లేదని ఊరిస్తూ..
894. వసంతకోయిలతో పనేముందిలే నాకు_ఆమనికోయిలవై నువ్వు నా చెంతనుండగా
895. ఆకాశం నీలంగా మారినప్పుడే అనుకున్నా_చుక్కల్చీర బాగా నప్పిందని..
896. చుక్కలకదేమి ఆనందమో_నన్ను కాదని ఆకాశాన్నే చుట్టుకుంటూ..
897. చొరవ తీసుకోని చుక్కలు_ఆకాశంలో ముగ్గులేయడం తమకిష్టమని తప్పించుకుంటూ..
898. లెక్కించలేకున్నా చుక్కలని_ఆకాశంలో మిణుక్కుమని మురిపిస్తుంటే..
899. నిన్ను వీడని నీడనవ్వాలనుకున్నందుకే_నిద్దు రపొద్దులు మాని నిన్ననుసరిస్తుంది..
900. నీడే నా తోడని తెలుసుగా మనసుకి సైతం_అందుకే ప్రేమను కాదన్నది..

899. నిన్ను వీడని నీడనవ్వాలనుకున్నందుకే_నిద్దు
900. నీడే నా తోడని తెలుసుగా మనసుకి సైతం_అందుకే ప్రేమను కాదన్నది..
![]() | This email has been sent from a virus-free computer protected by Avast. www.avast.com |
No comments:
Post a Comment