Wednesday, 6 July 2016

ఏక్ తారలు : 01801 నుండి 01900 వరకు

1801. అమ్మదే అసలు విజయం_బిడ్డలు సాధించిన సాధికారతలో..
1802. అమ్మ చూపులోంచీ ప్రవహిస్తున్న కరుణ_నన్ను ఓదార్చేందుకే..
1803. అమ్మను మించినదేముంది లోకంలో_వేల అనుభవాల పట్టుకొమ్మైతే
1804. వెతలన్నీ విసిరేసా_మౌనాన్ని ముక్కలు చేయాలనే
1805. సరికొత్తగా నిన్ను గెలవాలనుకున్నా_సంతోషాన్ని కానుక చేసి.
1806. అనుభూతులు గతమయ్యాయి_వియోగానికి నన్ను నువ్విడిచిపెట్టాక..
1807. కలలోనూ వెన్నెల దీపాలే_నీ చూపుల జలతారు మెరుపులతో..
1808. ఆపాత మధురాలేనవి_వెన్నెల్లో నేను విన్న సన్నాయి గీతాలన్నీ..
1809. తను కురిస్తే తేనెజల్లే_మాటలన్నీ మకరందాలై అభిషేకించినట్లు..

1810. అనుబంధం మూగబోయింది_నీ స్మృతులు కాలపు రెక్కలతో ఎగిరిపోయాక..
1811. ఆత్మీయతకూ కాలదోషమే_వేదనకే వేదన కలిగించే నీ నిర్లక్ష్యంలో..
1812. ఎద మాటున జ్ఞాపకాలే_నిన్నో కవితగా కూర్చమని ఆదేశిస్తూ..
1813. వెన్నెల్లో వెతుక్కోవాలనుకున్నా నిన్నే_నిశీధి నీడల్లో దాక్కున్నావని..
1814. పాడటం మొదలెట్టేశా_మన పెరడంతా కోయిలమ్మలు కూయాలని..
1815. నీ హృదయం చెవిటిదనేమో_మూగతనాన్ని అభినయిస్తూ నా మనసు..
1816. అతిగా ముస్తాబవుతున్న భావాలు_ఒక్క హృదయాన్నైనా గెలుపొందాలని..
1817. అనురాగానికి చోటివ్వు మరి_ఆప్యాయతలు గట్టిపడేలా
1818. వసంతానికొచ్చిన వన్నెలట_గగనాన్ని వల్లెవాటుగా మార్చేస్తూ..
1819. గతాన్ని విడిచేయమన్నానందుకే_వర్తమానం రమ్మని పిలిచిందనే
1820. చినుకులు గీసిన చిత్రమేననుకుంటా_హరివిల్లై మనసుని హత్తుకుంది..
1821. నిట్టూర్పు విడిచింది రాతిరి_నీరవంలో నీడను కని..
1822. హేమంతమందుకే అలుకపూనింది_వసంతంలో వీచే చలిగాలిని చూసి..
1823. అపురూపాలు మిగిలిందెక్కడని_అపార్ధాల వెల్లువలో కొట్టుకుపోయాక..
1824. గండుకోయిలై కూసినందుకేగా_వసంతమై నే విచ్చేసింది..
1825. చూపొక్కటీ చాలేమో_ప్రపంచయాత్రలన్నీ కన్నుల్లోనే చేయిస్తూ
1826. కన్నుల్లో చదివేందుకుందో మంత్రలిపి_నిన్ను నాలో మమేకం చేసేందుకే
1827. స్నేహితగానే ఉండిపోతా_నీ చెలిమి వెన్నెల నాదయ్యాక..
1828. ఎప్పుడూ పులకింతలే నీకు_వెన్నెల్లో పరవశానికి ప్రతినిధివన్నట్లు..
1829. నీ పిలుపుల కమ్మదనానికేమో_నా తలపులు వెచ్చబడ్డాయ్..
1830. ఊహవేననుకున్నా ఇన్నాళ్ళూ_ఊపిరివై నాలో ఒదిగేదాకా..
1831. ఆగమన్నా ఊపిరినలాగే_నీ ఊహల్లో చోటు దొరికేవరకూ..
1832. ఊపిరాగినట్లయ్యింది_నీ మమకారంతో ఉక్కిరిబిక్కిరైనందుకే..
1833. అడుగడుక్కీ వివశాలే_నీ ఊపిరి సోకిన వెచ్చదనాలకి..
1834. ఊపిరున్నందుకు తెలిసొచ్చింది_దేశానికి ప్రాణాలివ్వడం అదృష్టమని..
1835. లయబద్ధమయ్యింది ఊపిరి_నీ ధ్యానంలో మనసు కుదిరినందుకే..
1836. నిశ్వాసల్ని బంధించేసా_ఊపిరిలోంచీ నువ్వు జారిపోరాదని..
1837. నాలో తమకం పెరిగిందెందుకో_గమకాలు మొదలయ్యింది నీ ఊపిరిలోనైతే..
1838. ఊపిరి కోల్పోయిన జీవనం_కృత్రిమత్వానికి బానిసయ్యాక..
1839. నీ ఊపిరిలో చేరి చానాళ్ళయ్యింది_నువ్వు గుర్తించలేదంతే
1840. ఊపిరాగిపోతున్న వైనం_నీ చూపుల సందేశాలకు సిగ్గుపడి..
1841. ఊపిరి బరువెక్కింది_ఆవిరవుతున్న నీ ఆలోచనల వెచ్చదనానికి..
1842. సన్నబడుతున్న శ్వాసలు_నా ఊపిరిలోంచీ నువ్వు జారుకోగానే
1843. నా ఊపిరి నీవేనంటే నమ్మవెందుకో_తారల సాక్షి సంతకాలు కావాలంటూ..
1844. మనసు చెమరించింది_ద్రవించిన నీ ప్రేమను తడముకోగానే..
1845. ఎన్ని నిశ్వాసలతో తడిపాడో పొలాన్ని_ఎండిన బీడు చల్లబడుతుందేమోనని..
1846. తనుంటే ఊపిరెప్పుడూ తేలికే_తను లేనప్పుడు కాలంతో పాటు బరువెక్కుతూ..
1847. కళ్ళతో నవ్వినా కనిపెట్టేస్తావెందుకో_మనసు కనికట్టు గుర్తించినట్లు..
1848. లయ తప్పిన జీవితమనుకున్నా_నీవొచ్చి శృతిలో పెట్టేవరకూ..
1849. నీ తలపు అనిర్వచనీయమే_వేసవిగాలి గంధాలను మోసినట్లు..
1850. ముఖచిత్రం నీదేననుకున్నాను_నా కలను రాసేందుకు అవకాశమిస్తే..
1851. పరిమళిస్తున్న ఆనందాలు_సంతోషం వికసించిన పువ్వుగా మారిందేమో..
1852. ఏకాంతాన్ని వలపిస్తున్న మది_నీ తలపులనే తోడుకోవాలంటూ..
1853. శూన్యాన్ని కప్పుకోక తప్పలేదు_ఆప్యాయత కరువైన హృదయామయ్యాక..
1854. చిలిపి చినుకు చిందులెక్కువేస్తోంది_పుడమితల్
లి పొత్తిళ్ళను చేరాలనేగా..
1855.కాలానికెంత కనికరమో_నీ కలాన్ని కనికట్టుగా చేస్తానంటూ..
1856. నీ చూపులు ఛేదిస్తున్నాయిగా_నా మనసు దాచే వలపునంతా..
1857. కలానికెప్పుడూ కంగారే_కాదనలేని అవాస్తవాల్ని ఖండించేందుకు..
1858. పన్నీరుగా మార్చేస్తా నీ కన్నీటిని_నీటిలో పంచదార కాస్త కలిపైనా..
1859. నిజాన్ని మాత్రమే నమ్ముకోవాలిక_అబద్ధాలకు దూరం జరుగుతూ..
1860.  ఇప్పుడే అవగతమయ్యావు నాకు_భావుకతకు నే దూరమయ్యాక..
1861. అపూర్వమయ్యానప్పుడే_నీ మదిలో దాగి చూపుని వెలిగించినందుకు
1862. అద్భుతమే_మాటలకందని మౌనాలను భావాలుగా కూర్చడం
1863. మల్లెలు నవ్వినప్పుడే అనుకున్నా_నీలా మారి కవ్విస్తున్నాయని..
1864. అందరాని అత్యాశే మరణానికి_ఎప్పుడూ గొప్పవారినే కబళించాలనుకుంటే
1865. భావాల మైమరపులు_అక్షరాలకు ఆశువుగా అమరాయని..
1866. హద్దులు చెరిగిన అందమనుకుంటా_నిశీధిని వెన్నెలగా వెలిగిస్తూ..
1867. మనసుకందుకే నచ్చావు_ముళ్ళను లెక్కచేయక గులాబీని మెచ్చావనే..
1868. కెంపులుగా మారిన నొక్కులు_నీ స్పర్శకు సిగ్గులు తేలగానే..
1869. కన్నుల్లో కాపురానికొచ్చేస్తా_పున్నమిగా రమ్మని నువ్వు పిలవాలేగానీ
1870. మనసు నెమలై ఆడింది_వేవేల రంగులెన్నో పులుముకొని..
1871. అల్ప పీడనమైతే నాకేంటిలే_వానకారు కోయిలకు సంతోషము కానీ..
1872. కన్నులనందుకే ప్రేమిస్తుంటా_నీ కబురులు ఎప్పటికప్పుడు చేరేస్తుందని..
1873. వసంతం సైతం విస్తుపోవాల్సిందే_నా కన్నుల్లో నీ రూపు విస్తరిస్తుంటే
1874. అలలెన్ని దాచుకుందో కన్ను_కన్నీటిని చెంపలను చేరనివ్వకుండా
1875. ఒంటరితనంలోనూ ఆనందముంది_నీ తలపులతో జాగారం చేస్తుంటే..
1876. అక్షరానికందని భావాన్నే నేను_నీ మనసులో ఒదిగినప్పటినుండీ..
1877. మనసుపొరలు పరిమళిస్తూనే ఉన్నవి_నిన్ను చూసి సంతసించినప్పుడల్లా
1878. జాబిలినై నేనుండిపోతా_ప్రతినిత్యం పున్నమిగా నన్నే రమ్మంటే
1879. మరువపు సొదలు మొదలయ్యాయి_మల్లెలతో కలిపి తమను అల్లలేదంటూ..
1880. నా ఊహలన్నీ నువ్వేగా_మోవి మౌనాన్ని నటించాలని చూస్తున్నా
1881. నీ తలపు అమృతమయ్యింది_వేసవంటిన నా మదికెప్పుడో..
1882. చినుకులై కురుస్తున్న జ్ఞాపకాలు_ఒంటరిగా నేను కూర్చున్నపుడల్లా..
1883. ప్రకృతి రహస్యంలా చినుకు_ఎప్పుడు కురుస్తుందో మదిని తడిమేందుకు
1884. కలల శబ్దం తిలకిస్తున్న మనసు_చినుకులై కన్నీరలా జారుతుంటే..
1885. భావాల పారిజాతాలు_ప్రతినిత్యం నీ పూజకై పూస్తామంటూ..
1886. సొంతం చేసుకోవాలనే కోరికలు_కన్నులు కావాలనుకొనే ఆనందాలు..
1887. వసంతాన్ని మైమరపించావు_నీ సమక్షంలో నిశ్శబ్దానికీ నమ్మకమిచ్చి
1888. కవనంలో దాచుకుంటున్నా_అక్షరాలతో మనసు పడ్డానని
1889. సోయగపు చిత్రహింసలే ప్రతిరేయి_మల్లెలనూ మరువాన్నీ ముడేసి కట్టేస్తుంటే..
1890. మందారపు దరహాసాలన్నీ నావే_నీ తలపులో నన్ను చేర్చినందుకు..
1891.  నలుగురికీ తెలిసిన రహస్యమైందది_చెలికన్నుల వెలిగే చిలికానిరూపుతో..
1892. నాన్న చేయి విడిచేసాడట_వేరెవరికో ఆయన సాయమవుతాడని..
1893. భావాలకెన్ని పరుగులో_నీ చేతి కలంలో అనుభూతిగా ఒదగమంటే
1894. కన్నులతోనే కౌగిలిస్తున్నా_హృదయపు కారాగారంలోకి బదిలీ చేద్దామని
1895. ఆనందం ఆర్ణవమయ్యింది_నీ జతలో నన్ను మమేకం చేసి
1896. నీ స్మృతులకెంత కమ్మదనమో_గుర్తొస్తూనే గుండెను తడుముతూ
1897. ఏకాంతమే లోకమయ్యింది_నీ స్మృతులనే కావాలనుకున్నందుకు..
1898. నీ చూపుల సందేశాలు_నా మనసుని నియంత్రించే ఆనందాలు..
1899. చిటికెన వేలందుకున్నప్పుడే తెలిసింది_నీ ప్రేమంతా నాలోకి ప్రవహించిందని..
1900. ఎన్ని జన్మల ప్రతీక్షణో నాది_ఒక్కజన్మలోనైనా నీతో కలిసుండాలని..

No comments:

Post a Comment