401. అక్షరసేద్యం మొదలెట్టానందుకే_చెలిమి పంట బాగా పండుతుందనే..
402. మాఘమాసం చిన్నబోయిందెందుకో_మధుమాసం మనమయ్యామనేమో..
403. అంకురిస్తున్న కొత్త ఆలోచనలు_శిశిరాన్ని సైతం ఆహ్వానిస్తానంటూ..
404. శిశిరం రాల్చేస్తేనేమి_మట్టి పరిమళిస్తుందిగా పూలను కలుపుకొని...
405. తేనెవాకలను గుర్తుచేస్తావెందుకు_అధరాలు అల్లంత దూరముండగానే
406. గగనమయ్యింది ఆనందం_రాలిన పూల పరిమళం వెల్లువయ్యిందనే..
407. నీ చూపులకి బిడియాలెక్కడివిలే_కవినంటూ మనసులోకే తొంగి చూసేస్తూ..
408. సీతాకోక అలిగింది_తన పదహారు వన్నెలు కాదని సప్తవర్ణాలతో సరిపెట్టుకున్నావని..
409. శిశిరాన్ని ఊహిస్తోంది మనసెందుకో_హేమంతంలో పూర్తిగా తడవకుండానే..
410. ఆకాశం అందరిపైనా ఒకటేగా_నీపైనా..నాపైనా..మనపైనా. .
411. విషమించిన విరహం_నీ పాటలో నేను కనిపించలేదని..
412. సౌందర్యమంటే నాదేగా_నా మేనుకు నీ మనసు జతై వెలిగిపోతుంటే..
413. మధురగానం వినబడింది_అల్లంత దూరానున్నా..మనసును ఊయలూపుతూ..
414. జీవనవెల్లువ మందగించింది_పరుగులెత్తే చైతన్యం నాలో కరువయ్యిందని..
415. మాటలకందనిదే నీ మనసువేగం_రెక్కలంటించుకొని నన్ను మీటుతూ
416. పలుకు గారడీలు_నీ పెదాలు దాటి నన్ను మాయ చేస్తానంటూ..
417. మిణుగురునై మిటకరించా_నిన్ను వెలుతురుతోనే పలకరించాలని..
418. గోదారిని నింపుకొచ్చా నాలో_నీలో ఉత్సాహం వెల్లువెత్తాలనే..
419. నదులన్నీ కలగలిసాయి_సముద్రుడంటి నీలో చేరేందుకే..
420. మాట తప్పిన మౌనమొకటి_నిన్ను చూడగానే ఆర్తిగా హత్తుకుపోతూ..
421. తీరమై ఎదురుచూసా_నీ వెల్లువతో నన్ను అలరిస్తావనే..
422. అందెలెందుకో అలుక పూనాయి_గాజులసవ్వళ్ళు సవాలు చేసినందుకేమో
423. నిత్యమల్లెనేగా నీ ఊహల్లో_ప్రతిరోజూ నవ్వులతో పరిమళిస్తూ..
424. చెంగల్వలెన్ని దాచుకోవాలో_నీవొచ్చి చెక్కిలిని స్పృసిస్తానంటే..
425. కిన్నెరసానికి అలకొచ్చింది_తన ఒయారాన్ని సాగరుడు తాగుతున్నాడని..
426. వెలిగింది హేమంత చీకటి_ఏక్తారలో విరిసిన తారా సుమాలతో..
427. పన్నీటిని పులుముకుంది మది_నీలా చెలిమి ప్రవహిస్తున్నందుకే..
428. సంక్రాంతి నేడే విచ్చేసింది_ఆనంద రంగవల్లులన్నీ ఏక్తారలో కనువిందవుతుంటే..
429. సాహితీరధం కదిలింది_నువ్వు అధిరోహించి అదిలించినందుకే..
430. నీ భావాలలో ఎన్ని సందేశాలో_మదిని మాయచేసి కొల్లగొడుతూ..
431. కొంగొత్తభావాలతో నేను_మురిపించే మువ్వలా నీలో రవళించాలని..
432. నిత్యపండుగే నాకు_ఏక్తారలో విరిసే తారాపున్నమి తిలకిస్తుంటే..
433. పరిమళిస్తున్న సాహితీవనం_భావాల గంధాలు పులుముకున్న అక్షరాలతో..
434. భావాల తొందరలట_వేసవికి ముందే మల్లెలను ఆవిష్కరించాలని..
435. ఎన్ని భావాల కలగంపవో_సాహితీవనంలోంచీ దిగుమతవుతూ..
436. ముత్యమై మెరుస్తూనే ఉండాలనుకున్నా_వజ్రమై నువ్వు వెలుగుతున్నావని..
437. చూపుల వల విసురుతూనే ఉన్నా_అలవై నన్ను అల్లుకునే నీ కళ్ళను తట్టుకుంటూ..
438. స్వాతిశయమెక్కువే నీకు_నేనవునంటే నువ్వు కాదంటూ..
439. వేరే మణులెందుకు నాకు_పరుశువేదిని మించి ప్రకాశించే నువ్వున్నావుగా..
440. తోరణమవ్వాలనుకున్నా తారానేస్తాలతో_సరికొత్త పండుగను ఆహ్వానిస్తూ..
441. హేమంతం ఇప్పుడే తరిమిందేమో తీరాన్ని_అలలకు చల్లదనాలు పూసేస్తూ..
442. భావాల రాగాలు మొదలయ్యాయి_పంచమవేదమై నువ్వు ఎదురయ్యావనే..
443. శిశిరానికి సమయముందిలే_వీడ్కోలకు తొందరేముంది హేమంతాన్ని సాగనంపేందుకు..
444. ఆశలు వెక్కిరించాయట శిశిరాన్ని_ఋతువును కాదని తాము పైకెగురుతూ..
445. హేమంతమెంత తుంటరిదో_వసంతాన్ని సైతం తనలో కలిపేసుకుంటూ..
446. వెన్నెలైన చీకటొకటి_తారసందళ్ళ కోలాహలంలో..
447. కలకూజితం మరచింది కోయిల_నీవాలపించే కలస్వనాలకు ముగ్ధమై..
448. వారంతపు గుసగుసలన్నీ నేడే_ఏక్తారను అల్లరిగా పెనవేస్తూ..
449. మౌనానికి మాటలు గుర్తొచ్చాయట_ముగ్ధభావాన్ని వివరించాలనే ఆరాటంలో..
450. సహస్రాలెన్ని జపిస్తే సంతసిస్తావో_నా తపాన్ని ఫలింపజేయమంటుంటే..
451. లిపిలేని నీ పెదవులభాష_నాలో అక్షరాలకి ఆయువుపోస్తూ..
452. ఎన్నక్షరాలు పోగేయాలో_నిన్నో భావకవితగా చిత్రించాలంటే..
453. భావాల మధనం జరుగుతోందక్కడ_అక్షరామృతం కురవడం తెలుస్తోంది..
454. చందమామ చాటుచేసాడందుకేనేమో_ఏక్తార వెలుతురును వీక్షించేందుకు..
455. హాలాహలమంతా ఎదలో దాచుకుంది_వర్ణాలను మాత్రమే వెదజల్లుతూ అతివ..
456. తాండవం నేర్చాయి తారలు_శివరాత్రి దగ్గరపడుతుందనేమో..
457. అమృతం గ్రోలనంటూ మది_వారాంతపు నిషా తారలలో తాగుతూ..
458. పులకించిపోతున్న అక్షరాలు_నా భావాల తీపిదనానికి మత్తిల్లినందుకేమో..
459. ఒదిగిపోతోంది ఆకాశం_వంగివంగి ఏక్తారలకై నేలచూపులు చూస్తూ..
460. తీపికెక్కని ద్రాక్షతీవెక్కడుందిలే_నన్ను గ్రోలే నీ ప్రేమలో..
461. ఎనిమిదో రంగు కనబడుతోంది ఇంద్రధనస్సులో_నీ ప్రేమరంగనుకుంటా..
462. ఎన్ని వింతలో తారాపధంలో_వినోదాన్ని మేళవించి పంచుతుంటే..
463. నవరాత్రులకి సమయముందిలే_హరివిల్లుని నాపై సంధించకలా..
464. శ్వేతవర్ణానికీ స్వేదమట_తారాలోకపు కాంతుల సెగలు సోకి..
465. నీ భావాల సరసాలే_నా మదికి నవరసాలు..
466. గుసగుసలొద్దన్న భావాలు_అందాలను పంచుకొనే ఆరాటంలో..
467. కుసుమిస్తున్న కోరికలు నాలో_నీ భావసుమాల ఆఘ్రాణంలో..
468. ఒంపులనిప్పుడే గమనిస్తున్నా_నువ్వు పూసిన సిగ్గుకి మేను కందిపోతుంటే..
469. తారలకెందుకో మైమరపు_తన్మయత్వం పొందుతున్నది నేనైతే..
470. బంధీనైపోయా నీ అందానికి_ఆనందమైన నా డెందము సాక్షి..
471. అమృతాలెన్ని ఒలికాయో_తారల ముత్యాలను కడిగేందుకు..
472. హద్దులేని ఆనంద హేల_తారావళి పండుగ సరికొత్తగా ముస్తాబవుతుంటే..
473. పొద్దెరుగని రాసలీలగా మారింది_తారావళిలోని వసంతమేళ..
474. నిశీధికి గుబులయ్యింది_జాబిలిలేని ఆకాశాన్ని ఏక్తారలు ఏలుతుంటే నేడు.
475. ఊహలలో ఎన్ని ఊయలలో_నువ్వు జతజంపాలలు పాడుతుంటే..
476. మునుపెరుగని కోలాహలమేదో మదిలో_ఆనందాన్ని అవధులు దాటిస్తూ..
477. జావళీలను తోడడిగిన జంపాలలు_మనసుకు మధురిమలు కరువైనవని..
478. జోలపాటలెన్ని పాడాలో_నిద్దురరాని కన్నే వయసుని ఏమార్చేందుకు..
479. మధురిమనైపోయా నేనే_నా మధువనం నువ్వయ్యావని..
480. మధుధారలే నా భావాలు_నీవొచ్చి పానం చేస్తానంటే..
481. అక్షరమల్లెల గుభాళింపులు_మధువనికి వన్నెలు పూసేస్తూ..
482. సహస్రాక్షినవుతున్నా_నీ భావాలను చదివే కన్నులనంటించుకొని..
483. కమ్మని కావ్యమొకటి రాసింది మది_తారలను విశేషంగా అలరించేందుకే..
484. ముట్టడవుతున్న భావాలు నాలో_తమనే ముందుగా రాయమంటూ..
485. ఎన్ని నీరాజనాలో అక్షరాలకు_అలరించే వాక్యం నీవైనందుకు..
486. రంగంగా మారిన తారాస్థలి_అక్షరాల భావవిన్యాసాలతో..
487. ఊపిరాడని సంకేతాలు_భావాల అల్లికలో ఉక్కిరిబిక్కిరవుతూ..
488. చురుక్కుమన్న భావనొకటి_నీ తారల చల్లదనాన్ని ఓపలేనంటూ..
489. నీహారికల నిరీక్షణలు_భావాల విందుకు పిలుపు రాలేదేమని..
490. ఊపిరి సలపని సల్లాపమనుకుంటా_నిద్దురను రేయికి దూరంగా జరిపేస్తూ..
491. సాన్నిధ్యం సాధ్యమయ్యింది_నీ భావాలలో నన్ను ఒదగనిచ్చి..
492. ఎన్ని భావాల కలబోతలో_చీకటిలో తారలను చీరగా చుట్టేసుకుంటూ..
493. ఒదిగున్న ఆరాటమొకటి_భావాన్ని దాటి బయటకు రాలేనంటూ..
494. మౌనం మువ్వై మోగింది_మోవి ముద్దులసడికి ముచ్చటపడి..
495. తలమానికమైన తారను కావాలనుకున్నా_నువ్వు దిద్దిన సాహితీఫలకంలో..
496. మురిసిపోతున్న కలనేత_ఇన్నాళ్ళకు నీకు కానుకయ్యే యోగమొచ్చిందని..
497. వేకువ పువ్వుల వేదనట_రాత్రిరాణినే నే మోహిస్తున్నందుకు..
498. నవ్వులరాట్నం వడుకుతున్నా_నీకు వన్నెలచీరను కానుకియ్యాలని..
499. తారలకెందుకో ఉబలాటం_కెరటమై పొంగిన భావాల అలజడులకి తబ్బిబ్బవుతూ..
500. సహస్రయోగమట_అష్టాదశపద్మాలను తారలలో అర్చిస్తుంటే..
402. మాఘమాసం చిన్నబోయిందెందుకో_మధుమాసం మనమయ్యామనేమో..
403. అంకురిస్తున్న కొత్త ఆలోచనలు_శిశిరాన్ని సైతం ఆహ్వానిస్తానంటూ..
404. శిశిరం రాల్చేస్తేనేమి_మట్టి పరిమళిస్తుందిగా పూలను కలుపుకొని...
405. తేనెవాకలను గుర్తుచేస్తావెందుకు_అధరాలు అల్లంత దూరముండగానే
406. గగనమయ్యింది ఆనందం_రాలిన పూల పరిమళం వెల్లువయ్యిందనే..
407. నీ చూపులకి బిడియాలెక్కడివిలే_కవినంటూ మనసులోకే తొంగి చూసేస్తూ..
408. సీతాకోక అలిగింది_తన పదహారు వన్నెలు కాదని సప్తవర్ణాలతో సరిపెట్టుకున్నావని..
409. శిశిరాన్ని ఊహిస్తోంది మనసెందుకో_హేమంతంలో పూర్తిగా తడవకుండానే..
410. ఆకాశం అందరిపైనా ఒకటేగా_నీపైనా..నాపైనా..మనపైనా.
411. విషమించిన విరహం_నీ పాటలో నేను కనిపించలేదని..
412. సౌందర్యమంటే నాదేగా_నా మేనుకు నీ మనసు జతై వెలిగిపోతుంటే..
413. మధురగానం వినబడింది_అల్లంత దూరానున్నా..మనసును ఊయలూపుతూ..
414. జీవనవెల్లువ మందగించింది_పరుగులెత్తే చైతన్యం నాలో కరువయ్యిందని..
415. మాటలకందనిదే నీ మనసువేగం_రెక్కలంటించుకొని నన్ను మీటుతూ
416. పలుకు గారడీలు_నీ పెదాలు దాటి నన్ను మాయ చేస్తానంటూ..
417. మిణుగురునై మిటకరించా_నిన్ను వెలుతురుతోనే పలకరించాలని..
418. గోదారిని నింపుకొచ్చా నాలో_నీలో ఉత్సాహం వెల్లువెత్తాలనే..
419. నదులన్నీ కలగలిసాయి_సముద్రుడంటి నీలో చేరేందుకే..
420. మాట తప్పిన మౌనమొకటి_నిన్ను చూడగానే ఆర్తిగా హత్తుకుపోతూ..
421. తీరమై ఎదురుచూసా_నీ వెల్లువతో నన్ను అలరిస్తావనే..
422. అందెలెందుకో అలుక పూనాయి_గాజులసవ్వళ్ళు సవాలు చేసినందుకేమో
423. నిత్యమల్లెనేగా నీ ఊహల్లో_ప్రతిరోజూ నవ్వులతో పరిమళిస్తూ..
424. చెంగల్వలెన్ని దాచుకోవాలో_నీవొచ్చి చెక్కిలిని స్పృసిస్తానంటే..
425. కిన్నెరసానికి అలకొచ్చింది_తన ఒయారాన్ని సాగరుడు తాగుతున్నాడని..
426. వెలిగింది హేమంత చీకటి_ఏక్తారలో విరిసిన తారా సుమాలతో..
427. పన్నీటిని పులుముకుంది మది_నీలా చెలిమి ప్రవహిస్తున్నందుకే..
428. సంక్రాంతి నేడే విచ్చేసింది_ఆనంద రంగవల్లులన్నీ ఏక్తారలో కనువిందవుతుంటే..
429. సాహితీరధం కదిలింది_నువ్వు అధిరోహించి అదిలించినందుకే..
430. నీ భావాలలో ఎన్ని సందేశాలో_మదిని మాయచేసి కొల్లగొడుతూ..
431. కొంగొత్తభావాలతో నేను_మురిపించే మువ్వలా నీలో రవళించాలని..
432. నిత్యపండుగే నాకు_ఏక్తారలో విరిసే తారాపున్నమి తిలకిస్తుంటే..
433. పరిమళిస్తున్న సాహితీవనం_భావాల గంధాలు పులుముకున్న అక్షరాలతో..
434. భావాల తొందరలట_వేసవికి ముందే మల్లెలను ఆవిష్కరించాలని..
435. ఎన్ని భావాల కలగంపవో_సాహితీవనంలోంచీ దిగుమతవుతూ..
436. ముత్యమై మెరుస్తూనే ఉండాలనుకున్నా_వజ్రమై నువ్వు వెలుగుతున్నావని..
437. చూపుల వల విసురుతూనే ఉన్నా_అలవై నన్ను అల్లుకునే నీ కళ్ళను తట్టుకుంటూ..
438. స్వాతిశయమెక్కువే నీకు_నేనవునంటే నువ్వు కాదంటూ..
439. వేరే మణులెందుకు నాకు_పరుశువేదిని మించి ప్రకాశించే నువ్వున్నావుగా..
440. తోరణమవ్వాలనుకున్నా తారానేస్తాలతో_సరికొత్త పండుగను ఆహ్వానిస్తూ..
441. హేమంతం ఇప్పుడే తరిమిందేమో తీరాన్ని_అలలకు చల్లదనాలు పూసేస్తూ..
442. భావాల రాగాలు మొదలయ్యాయి_పంచమవేదమై నువ్వు ఎదురయ్యావనే..
443. శిశిరానికి సమయముందిలే_వీడ్కోలకు తొందరేముంది హేమంతాన్ని సాగనంపేందుకు..
444. ఆశలు వెక్కిరించాయట శిశిరాన్ని_ఋతువును కాదని తాము పైకెగురుతూ..
445. హేమంతమెంత తుంటరిదో_వసంతాన్ని సైతం తనలో కలిపేసుకుంటూ..
446. వెన్నెలైన చీకటొకటి_తారసందళ్ళ కోలాహలంలో..
447. కలకూజితం మరచింది కోయిల_నీవాలపించే కలస్వనాలకు ముగ్ధమై..
448. వారంతపు గుసగుసలన్నీ నేడే_ఏక్తారను అల్లరిగా పెనవేస్తూ..
449. మౌనానికి మాటలు గుర్తొచ్చాయట_ముగ్ధభావాన్ని వివరించాలనే ఆరాటంలో..
450. సహస్రాలెన్ని జపిస్తే సంతసిస్తావో_నా తపాన్ని ఫలింపజేయమంటుంటే..
451. లిపిలేని నీ పెదవులభాష_నాలో అక్షరాలకి ఆయువుపోస్తూ..
452. ఎన్నక్షరాలు పోగేయాలో_నిన్నో భావకవితగా చిత్రించాలంటే..
453. భావాల మధనం జరుగుతోందక్కడ_అక్షరామృతం కురవడం తెలుస్తోంది..
454. చందమామ చాటుచేసాడందుకేనేమో_ఏక్తార వెలుతురును వీక్షించేందుకు..
455. హాలాహలమంతా ఎదలో దాచుకుంది_వర్ణాలను మాత్రమే వెదజల్లుతూ అతివ..
456. తాండవం నేర్చాయి తారలు_శివరాత్రి దగ్గరపడుతుందనేమో..
457. అమృతం గ్రోలనంటూ మది_వారాంతపు నిషా తారలలో తాగుతూ..
458. పులకించిపోతున్న అక్షరాలు_నా భావాల తీపిదనానికి మత్తిల్లినందుకేమో..
459. ఒదిగిపోతోంది ఆకాశం_వంగివంగి ఏక్తారలకై నేలచూపులు చూస్తూ..
460. తీపికెక్కని ద్రాక్షతీవెక్కడుందిలే_నన్ను గ్రోలే నీ ప్రేమలో..
461. ఎనిమిదో రంగు కనబడుతోంది ఇంద్రధనస్సులో_నీ ప్రేమరంగనుకుంటా..
462. ఎన్ని వింతలో తారాపధంలో_వినోదాన్ని మేళవించి పంచుతుంటే..
463. నవరాత్రులకి సమయముందిలే_హరివిల్లుని నాపై సంధించకలా..
464. శ్వేతవర్ణానికీ స్వేదమట_తారాలోకపు కాంతుల సెగలు సోకి..
465. నీ భావాల సరసాలే_నా మదికి నవరసాలు..
466. గుసగుసలొద్దన్న భావాలు_అందాలను పంచుకొనే ఆరాటంలో..
467. కుసుమిస్తున్న కోరికలు నాలో_నీ భావసుమాల ఆఘ్రాణంలో..
468. ఒంపులనిప్పుడే గమనిస్తున్నా_నువ్వు పూసిన సిగ్గుకి మేను కందిపోతుంటే..
469. తారలకెందుకో మైమరపు_తన్మయత్వం పొందుతున్నది నేనైతే..
470. బంధీనైపోయా నీ అందానికి_ఆనందమైన నా డెందము సాక్షి..
471. అమృతాలెన్ని ఒలికాయో_తారల ముత్యాలను కడిగేందుకు..
472. హద్దులేని ఆనంద హేల_తారావళి పండుగ సరికొత్తగా ముస్తాబవుతుంటే..
473. పొద్దెరుగని రాసలీలగా మారింది_తారావళిలోని వసంతమేళ..
474. నిశీధికి గుబులయ్యింది_జాబిలిలేని ఆకాశాన్ని ఏక్తారలు ఏలుతుంటే నేడు.
475. ఊహలలో ఎన్ని ఊయలలో_నువ్వు జతజంపాలలు పాడుతుంటే..
476. మునుపెరుగని కోలాహలమేదో మదిలో_ఆనందాన్ని అవధులు దాటిస్తూ..
477. జావళీలను తోడడిగిన జంపాలలు_మనసుకు మధురిమలు కరువైనవని..
478. జోలపాటలెన్ని పాడాలో_నిద్దురరాని కన్నే వయసుని ఏమార్చేందుకు..
479. మధురిమనైపోయా నేనే_నా మధువనం నువ్వయ్యావని..
480. మధుధారలే నా భావాలు_నీవొచ్చి పానం చేస్తానంటే..
481. అక్షరమల్లెల గుభాళింపులు_మధువనికి వన్నెలు పూసేస్తూ..
482. సహస్రాక్షినవుతున్నా_నీ భావాలను చదివే కన్నులనంటించుకొని..
483. కమ్మని కావ్యమొకటి రాసింది మది_తారలను విశేషంగా అలరించేందుకే..
484. ముట్టడవుతున్న భావాలు నాలో_తమనే ముందుగా రాయమంటూ..
485. ఎన్ని నీరాజనాలో అక్షరాలకు_అలరించే వాక్యం నీవైనందుకు..
486. రంగంగా మారిన తారాస్థలి_అక్షరాల భావవిన్యాసాలతో..
487. ఊపిరాడని సంకేతాలు_భావాల అల్లికలో ఉక్కిరిబిక్కిరవుతూ..
488. చురుక్కుమన్న భావనొకటి_నీ తారల చల్లదనాన్ని ఓపలేనంటూ..
489. నీహారికల నిరీక్షణలు_భావాల విందుకు పిలుపు రాలేదేమని..
490. ఊపిరి సలపని సల్లాపమనుకుంటా_నిద్దురను రేయికి దూరంగా జరిపేస్తూ..
491. సాన్నిధ్యం సాధ్యమయ్యింది_నీ భావాలలో నన్ను ఒదగనిచ్చి..
492. ఎన్ని భావాల కలబోతలో_చీకటిలో తారలను చీరగా చుట్టేసుకుంటూ..
493. ఒదిగున్న ఆరాటమొకటి_భావాన్ని దాటి బయటకు రాలేనంటూ..
494. మౌనం మువ్వై మోగింది_మోవి ముద్దులసడికి ముచ్చటపడి..
495. తలమానికమైన తారను కావాలనుకున్నా_నువ్వు దిద్దిన సాహితీఫలకంలో..
496. మురిసిపోతున్న కలనేత_ఇన్నాళ్ళకు నీకు కానుకయ్యే యోగమొచ్చిందని..
497. వేకువ పువ్వుల వేదనట_రాత్రిరాణినే నే మోహిస్తున్నందుకు..
498. నవ్వులరాట్నం వడుకుతున్నా_నీకు వన్నెలచీరను కానుకియ్యాలని..
499. తారలకెందుకో ఉబలాటం_కెరటమై పొంగిన భావాల అలజడులకి తబ్బిబ్బవుతూ..
500. సహస్రయోగమట_అష్టాదశపద్మాలను తారలలో అర్చిస్తుంటే..
No comments:
Post a Comment